STORYMIRROR

Dinakar Reddy

Abstract Classics

4  

Dinakar Reddy

Abstract Classics

గోదా కళ్యాణం

గోదా కళ్యాణం

1 min
301

అచ్చెరువొందిరట ప్రజలు

హర్షించిరట ఆకసమున దేవతలు

గోదా కళ్యాణ కథ విని

పులకించెను నా మనసు


తులసీ వనమున వసుధయే బాలికగా విరిసినదట

విష్ణు చిత్తుని భక్తిని పుణికి పుచ్చుకున్నదట


ధనుర్మాసమున వ్రతమును చేసి

పాశురములు పాడినదట


కృష్ణుడు తనవాడిగా

తానున్నది రేపల్లెగా

తన ప్రేమే భక్తిగా

భక్తే ప్రేమగా


ముడిచిన కురులను ముకుందునికి వదిలి

తానే కృష్ణుడుగా కృష్ణుడే తానుగా

పూమాలలు తాను ధరించి

పిదప శ్రీ రంగనాథునిచే ధరింపజేసి


భగవంతుని భక్తితో కొంగుకు ముడివేసుకుని

శ్రీరంగనాథుని పెండ్లాడి

స్వామిలో ఐక్యమైనదట 

గోదా దేవి( ఆండాళ్)

భక్తులు భగవంతుని చేరు మార్గము చూపెనట


కమనీయం రమణీయం

ఆ గోదా కళ్యాణ కథ విని

నా మనసు పులకించెను



Rate this content
Log in

Similar telugu poem from Abstract