STORYMIRROR

VENKATALAKSHMI N

Abstract Fantasy Others

4  

VENKATALAKSHMI N

Abstract Fantasy Others

Iమంచుతెరలు

Iమంచుతెరలు

1 min
373


రెప్పల తలుపులు తెరిచీ తెరవగానే

మంచు తెరల దొంతరలు కనువిందు చేయగా..

అలసట తీరని దేహం ముసుగు దుప్పటి

కప్పి మూడంకేసి నానాయాతనలు పడుతుంటే..

మంచు తెరలకు ముసుగు దుప్పటి కి

జరుగుతున్నది చిన్న అంతర్యుద్ధం..

అప్పుడొచ్చాడు సూర్యభగవానుడు

సురసుర చూపులతో ఉత్సహ శరాలు

సంధించి మొద్దు బారిన మస్తిష్కాలను మేల్కొలపడానికి..

అంతే.. ఒక్క ఉదుటున

మంచు తెరలు తరలిపోయాయి

ముసుగు దుప్పటి తొలగిపోయింది

యుద్ధం వీడింది..

జీవన చక్రం శుభోదయమంటూ

స్వాగత గీతం పలికింది..


Rate this content
Log in

Similar telugu poem from Abstract