చిరునవ్వు
చిరునవ్వు

1 min

327
అది ఒక భోగం
పెంచుతుంది ముఖ సౌందర్యం
పరులలో స్ఫూర్తి నింపే సాధనం
నవ్వడం
జీవితం లో సంతోషం ఉంటే.. సమస్యలూ ఉంటే..
అన్నిటి కంటే.. ప్రతిదానికి పరిష్కారం ఉంటే..
దాన్ని అన్వేషిస్తుంటే.. సమస్యలకు నువు బెదరకుంటే..
అన్నిటిని అధిగమిస్తే.. సంతోషం నీ తలుపు తడితే..
ప్రపంచం లో ఏదైనా శాశ్వతంగా ఉందా అని అనుకుంటే..
నీ చిరునవ్వు ఎల్లవేళలా నీ తోడుగా ఉంటే..
సమస్యైనా.. సంతోషమైనా..
నువ్వు నవ్వడం మరిచేనా...!!!