STORYMIRROR

Dinakar Reddy

Abstract Romance

4  

Dinakar Reddy

Abstract Romance

ఇది ప్రేమేనేమో

ఇది ప్రేమేనేమో

1 min
330

వసంతమో శిశిరమో

వలపు వెన్నల రేపే జ్వాలలలో

ఇది సిగ్గు విడిచిన సమయమో

ఏమో ఏమో

ఇది ప్రేమేనేమో


తలపులలో తలుపులలో

ఊపిరి సయ్యాటలో

ఆమె జూకాల చప్పుడే

ఏమో ఏమో

ఇది ప్రేమేనేమో


కన్నుల్లో కలల్లో

శ్రావణ మేఘాల్లో

శరత్కాలపు సమీరాల్లో

ఆమె నవ్వుల వదనమే

ఏమో ఏమో

ఇది ప్రేమేనేమో


ఆమె నుదుటిన కుంకుమ దిద్దాలని

కలిసి నడుస్తూ కబుర్లు చెప్పాలని

ఆమె కౌగిలిలో బందీ కావాలని

ఏమో ఏమో

ఇది ప్రేమేనేమో


Rate this content
Log in

Similar telugu poem from Abstract