బడి గురుతులు
బడి గురుతులు


బడి గంట పవిత్రమైన
పసిహృదయాల నిలయం
ఏమీ వ్రాయని నల్లబల్ల లాంటి
వారి మస్తిస్కంపై అ ఆ దిద్దడంతో
మొదలవుతుంది జీవితంలో
దిద్దుబాటుకు తొలి అడుగు
అచ్చులుతోబాటు అల్లరితనం
హల్లులుతోబాటు పిల్లరితనం
గుణింతాలతోబాటు తుంటరితనం
వాటంతట అవే తోడైపోయి
అయ్యవార్లచే గుంజీలు లెంపకాయలు
లెక్కపెట్టిస్తాయి గుక్కపట్టిస్తాయి
గోడకుర్చీలు మొకాళ్ళకుర్చీలు
చెవినులుపులు బొడ్డుగిల్లుడులు
చెంపచెల్లుళ్లు చింతవారిపెళ్లి
వారెవ్వా నాటి బడిగురుతులు
చెరగని తరగని జీవన స్మృతులు