కూలికోసం
కూలికోసం


అది ఒక మహానగరం
ప్రధాన రహదారిపై
బైకులు, కార్లు, బస్సులు
గమ్యస్థానాలకు పరుగెడుతున్నాయి
రోడ్డుకు ప్రక్కగా ఒక సమూహం
కూలి పిలుపుకోసం ఎదురుచుఊపు
మెస్త్రి ఫోన్ కాల్ కొసం పడికాపు
బాబూ కూలికి రమ్మంటారా
అమ్మా పనికి రమ్మంటారా
వారి వైపు ఎవరొచ్చినా
వారి వైపు ఎవరుచూసినా
ఆ కళ్ళలో , కాళ్ళల్లో
ఆకలి ఆత్రుత ఆవేదన
స్పష్టంగా కనిపిస్తోంది వినిపిస్తోంది
ARJI.GOVIND