ఎగిరిపోతే ఎంతబావుంటుందీ....
ఎగిరిపోతే ఎంతబావుంటుందీ....
నీలాకాశంలో వెండి మబ్బుల్లా
తేలిపోవాలని
రివ్వున ఎగిరే రామచిలుకలా
ఎగిరిపోవాలని
ఝుమ్మని తిరిగే తుమ్మెదలా
తిరగాడాలని
చెంగు చెంగున ఎగిరే లేడిపిల్లలా
చిందులెయ్యలని
నీలాల నీళ్లల్లో చేపపిల్లలా
మునుగుతూ తేలుతూ ఈతలాడాలని
అప్పుడప్పుడు మనసు మారాం చేస్తుంది