ఆవేకళ్ళు
ఆవేకళ్ళు


అందమైన కలువ కళ్ళు
ఆహ్లాదాన్నిస్తాయి
కోపంలో ఎర్రని కళ్ళు
భయాన్ని కల్పిస్తాయి
కన్నీళ్లు నిండిన కళ్ళు
కరుణ కురిపిస్తాయి
ఓరచూపుల కళ్ళు
ఒయ్యారాన్నిస్తాయి
తటపటాయించే కళ్ళు
తత్తరపాటునిస్తాయి
ఒక కనురెప్ప మూసిన కళ్ళు
హాస్యాన్ని అందిస్తాయి
రెండు కనురెప్పలు మూసిన కళ్ళు
నిశ్శబ్దాన్నిస్తాయి