స్నేహం
స్నేహం


ఓ అర్థం కానీ నేస్తమా,
ఇది కాదా చీకటి స్నేహము
ఓ దూరపు మధుర మేఘమా,
ఇది కాదా చిరుఝాల్లుల మాసము.
ఓ సున్నిత సూర్య కిరణమా,
ఇది కాదా పుష్పించే ప్రాణము.
ఓ లవణపు కంటి థారమా,
ఇది కాదా వేచిచూసే సాయంకాలం
ఓ దరిచేరే కమ్మని అనురాగమా
ఇది కాదా నీ సుందర గుణము.
ఓ గమ్యం లేని పడవ ప్రయణమా,
ఇది కాదా నీ సాగర అంతిమ గట్టు.
ఓ ప్రవహించే కష్టపు కాలమా,
ఇది కాదా నీ సంతోషపు దశము
ఓ చీకటి అపురూప స్నేహమా
ఇది కదా చక్కటి బంధము..
ఓ చీకటి స్నేహమా......చక్కటి బందమా