కొన్ని సార్లు నాకు అనిపిస్తుంది
కొన్ని సార్లు నాకు అనిపిస్తుంది
కొన్ని సార్లు నాకు అనిపిస్తుంది
ప్రశాంతత సముద్రంలో ఈత ఆడుదామని,
అస్పష్టతతో నిశ్చయంగా శోదించాలని.
కొన్ని సార్లు నాకు అనిపిస్తుంది
శనిగ్రహ వృత్తాలపై ప్రదక్షినాలు చెయ్యాలని,
ఆధ్యాత్మిక దూరాన్ని ఆస్వాదించి ఆ పై తిరిగి ఏకం కావాలని.
కొన్ని సార్లు నాకు అనిపిస్తుంది
నన్ను కోల్పోయిన నన్ను మరింతగా కోల్పోవాలని,
నీ ఎదలోని ప్రేమ గ్రంధాలను చదవాలని.
కొన్ని సార్లు నాకు అనిపిస్తుంది
ఇంద్రధనస్సులో రంగురంగుల తీగలను ,
మరిచిన వాగ్దానాలను చెరిగిన రుణాలను గ్రహించాలని.
కొన్ని సార్లు నాకు అనిపిస్తుంది