Srinivasa Bharathi

Comedy

4.2  

Srinivasa Bharathi

Comedy

సెల్ భాగోతం ..8 శ్రీనివాస భార

సెల్ భాగోతం ..8 శ్రీనివాస భార

2 mins
571


"సెల్ సంగతి చూద్దాం..గొడుగుందేమో కనుక్కోరా?"

"అలాగే" అని ఫోన్ చేసాడు.

"ఉంది. ఈ గొడుగు ఆనందరావుది అని ఎర్రరంగు అక్షరాలతో చెక్కారు.."

"ఆ .అవును.."అనుకొంటూ పళ్ళు కోరుక్కొన్నాడు.."గొడుగు మీద రాసిందంతా చదవాలా..గొడుగుందంటే చాలదూ.. అయినా దానికి బుద్ధి ఉండాలి.గొడుగంతా నింపేయాలా..ఇంకా నయం సెల్ ఐతే...ఇంకేం చేసుండేదో...".

"నా వైపు చూడొద్దురా.నేను ఇటునుండిటే మా అమ్మాయి ఇంటికి వెళ్తున్నా. నువ్వు మా ఇంటికి వెళ్లి నీ గొడుగు తెచ్చుకోరా ఆనందం"

"అలాగేలే. ఎందుకైనా మంచిది.. అమ్మాయి కి ఫోన్ చేసి వచ్చేదాకా కాస్త భద్రం గా ఉంచమనరా."

"సరేలే. ఫోన్ చేసి చెప్తాలే..."

"వస్తారా..."

ఇద్దరూ ఎవరి దారిన వాళ్ళు వెళ్లిపోయారు. 

"నాల్రోజులు పోయినా ఫర్వాలేదు కానీ గొడుగు జాగ్రత్త గా ఉంటే చాలు." అనుకున్నాడు ఆనందరావు.

"ఇప్పటికే రెండయింది. సెల్ ఆచూకీ ఏమాత్రం చిక్కలేదు. దొరికే అవకాశం ఏమాత్రం ఐనా ఉన్నట్టేనా లేకపోతే నీళ్ళోదులుకోవాల్సిందేనా?'

గట్టిగా ప్రయత్నిస్తే మరో 6 లేదా 8 గంటలు..ఇప్పటికే ఇది రెండో రోజు.

"ఆవేళ డెంటిస్ట్ దగ్గరికి, కళ్ళద్దాల షాపుకి వెళ్లినట్టు గుర్తు.

బహుశా అక్కడేమైనా... ఓ ప్రయత్నం చేయాలి..

అక్కడనుండి ఆటోలో వెళ్లాల్సిందే..మరో మార్గం లేదు.ఎన్ని విధాలా చూసినా ఖర్చు, మానసిక వ్యధ.

అసలావేళ గ్రహ ఫలం ఎలా రాసారు...అన్ని అనుకూలంగా ఉంటాయి అన్నా రందులో. ఈ రోజు అనుకోని పరిణామాలు ఎదురౌతాయి. నూతన వ్యక్తుల్ని కలుస్తారు. కొందరికి ధనలాభం ఉంటుంది. కొత్త వ్యక్తుల తో పరిచయాలు.. వివాహ ప్రయత్నాలకు శుభారంభం.

వివాహం జరిగిన వారికి దాంపత్య సుఖం. ప్రయాణాలు అనుకూలం. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి..."అని అన్నీ శుభాలే.

"ఇంతకీ అది సెల్ పోయిన రోజు సమాచారమేనా?

లేదా తానే పొరపాటు పడ్డాడా. అది ఆరోజుదే ఐతే నష్టం జరగకూడదుగా." అనుకున్నాడతడు.

లీలగా గుర్తొస్తోంది...

"'అవును...

ఈరోజు ప్రశాంతంగా గడుస్తుంది.కొందరికి నష్టం సంభవించే అవకాశం ఉన్నప్పటికీ తృటిలో తప్పించుకోగలరు. ఇంట్లో ఘర్షణ వాతావరణం కలగొచ్చు. నింద పడే అవకాశాలు మెండు. దైవదర్శనం లభిస్తుంది. ప్రయాణాలు సంభవిస్తాయి. కొందరికి మిత్రులు శత్రువులు కావచ్చు. ఆశించిన ఫలితం పొందక కొందరు నిరాశకు గురయ్యే ప్రమాదం ఉంది. లాటరీ లాభించవచ్చు. విద్యార్థులు అతి ప్రయత్నం మీద విజయాలు సాధిస్తారు. ..".

"అవును . ఇదే ఉంది... నష్టం తప్పించుకోవచ్చు అంటున్నారు..ఇదే కాబోలు.."

"సెల్ పోవడం నష్టమే కదా మరి. అంటే సెల్ దొరుకుతుందా..ఈరోజుల్లో పోయింది తిరిగిచ్చేoత గొప్పోళ్ళు ఎవరున్నారు? ఉంటే ఇంతవరకు తనకు చేరకుండా ఉంటుందా?'

ఆటో దిగింది శరీరం ఆనందరావు రూపంలో.

"డాక్టర్.".. అరిచాడు ఆనందరావు.

ఎవరూ ఓ ముసలిగొంతు సమాధానం.

"నేను.."ఎవరని చెప్పాలో తెలియక పేషేంట్ ని అన్నాడు.

"ఆయన కాంప్ వెళ్లారు. అర్జెంటా?"

"నిన్నొచ్చాను. ఇక్కడే సెల్ మర్చిపోయాను. డాక్టర్ గారు భద్రం గా ఉంచుంటారని వచ్చానిలా"

లేదే. ఏమైనా ఉంటే నాకే ఇచ్చేవారు.."

"మీకు ఇవ్వనంత మాత్రాన...?"

"సరే ఉండండి.. దేవుడి గదిలో చూసొస్తాను."

ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు..కాసేపు

అట్నుండి "లేదని" సమాధానం రావడం తో ఉసురుమంటూ కదిలాడు..ఎందుకైనా మంచిదని తన భార్య ఫోన్ నంబర్ ఇస్తూ...

ఆటో ఎక్కాడు..ఐదు నిముషాలు దాటాక ట్రాఫిక్ సిగ్నల్స్ పడ్డాయి. అదే అదనుగా రెండు రకాల యూనిఫామ్ లు

రోడ్డు దాటే ప్రయత్నంలో పడ్డాయి...

ఒకర్నొకరు నెట్టుకొంటూ జైలు ఖైదీల్లా దూసుకొస్తున్నారు పిల్లలు. హనుమంతుడి తోకలా జీబ్రా గుర్తుల మీద పాదముద్రలు వేస్తూ.

"సెలవురోజు కూడా సందడి తప్పదా...ఒక్కరోజు కూడా, ఒక్క గంట కూడా రెస్ట్ ఇవ్వకుండా పసిమనసుల్ని అలిపించుకొంటూ పోయే వారికి శిక్షలు లేవు..పైపెచ్చు ఉత్తమ బోధన అన్న గుర్తింపు కూడాను.

చదివే వారిని ఎవరైనా ఎలాగైనా తయారు చెయ్యొచ్చు. చదవని, ఇష్టపడని , కాలక్షేపం బ్యాచ్ ల్ని పాస్ చెయ్యడం అంత సులభమేం కాదు.

ప్రైవేటు రంగంలో బోధన విధానం వేరు. తక్కువ జీతాలు ఎక్కువ పనిగంటలు. అంతేకాక పైవాళ్ళు ఏది చెప్తే అది ఎలా చేయమంటే అలా..చేయాల్సిందే.. కుదరదు అంటే ఉద్యోగానికి నీళ్లొదిలేయాలి....బావమరిది అనుభవం గుర్తొచ్చింది అతడికి.

అదే ప్రభుత్వం లో అయితే..బోధనా కాలం తక్కువ. పేరుకే 8 గంటల పని. కానీ నిజంగా పని మాత్రం మించితే 3 గంటలు. మామూలుగా ఐతే రెండు గంటలే.

పిల్లల చదువు బలవంతం కాదు.ఏ అధికారి మరి కాస్తా సేపు పనిచేయమనడు. అంటే యూనియన్ జిందాబాద్.

అందులోనూ ఇంగ్లీష్ మీడియం అసలే ఉండదు. ఎక్కువ పని చేయమంటే వాడో నర రూప రాక్షసుడు మరి. పిల్లలకు చదువు పట్ల శ్రద్ధ తక్కువ. ..మిగిలిన వాళ్లూ.. అంతే.అధికారి తో సహా..."

అక్కడనుండి కళ్ళద్దాల షాపుకు వెళ్ళాడు. ఫ్రేమ్ మార్చమని అన్నప్పుడు అక్కడ వదిలేసి ఉండొచ్చనుకొన్నాడు.                                                    

.........సశేషం.....ఇంకా ఉంది..సెల్.భాగోతం 9 లో.....

...............0000000000000000000000.................


Rate this content
Log in

Similar telugu story from Comedy