పెళ్లి గోల
పెళ్లి గోల


"నా మనసుకేమయింది... నీ మాయలో పడింది...నిజమా కలా.. తెలిసేదెలా" అంటూ మనసుపడ్డ మరదలికి ప్రేమలేఖ ఇచ్చాడు మురళి.
మనసున వున్నది...చెప్పాలనున్నది ... మాటలు రావే ఎలా? మాటున వున్నది ...ఓ మంచి సంగతి ...బయటికి రాదే...ఎలా?...అంటూ కొంటె మరదలు వీణ రిప్లై.
ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే...చాలే...ఇది చాలే...నీకై నువ్వే వచ్చి వాలావే ...ఇక పై తిరునాళ్ళే... హడావిడిగా మామయ్య కాళ్ళమీద పడిపోయాడు మురళి.
నీకాళ్ళను పట్టుకు వదలనులే... చూడూ మామయ్యా...నీ కూతురినిచ్చివేయవయ్యా...దయలేదా అసలు...
తెలిసిందిలే... తెలిసిందిలే...జామాత మీ గుట్టు తెలిసిందిలే... కట్నాలు కానుకలు నేనివ్వను... మోటారు సైకిళ్ళే అసలివ్వను...ఆఆఆ...ఓఓఓ...
పెళ్ళంటే పందిళ్ళు... సందళ్ళు తప్పట్లు 🎷🎼🎻 కాదు కట్నాలు కానుకలు... అంటూ పాడేశాడు ఆవేశంగా...
అయితే ఇచ్చేస్తా నా బిడ్డను తీసుకో...ఎదలోపల పదిలంగా దాచుకోమని మామ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
అహా నా పెళ్ళియంట...ఓహో నా పెళ్ళియంట...అని సంబరపడుతూ మురళి, వీణలు మనసుకు నచ్చిన పాటలు పాడుకుంటున్నారు.