kavi voleti. Prahaasin

Comedy

4.3  

kavi voleti. Prahaasin

Comedy

మిస్టర్. చార్వాక.

మిస్టర్. చార్వాక.

4 mins
1.2K


సెలవులు ఉంటేనే ఏమీ తోచదు పైగా ఆ సెలవుల్లో ఎవరి ఇంటి దగ్గరైనా ఉంటే ఇక అంతే సంగతులు. ఇప్పుడు నా పరిస్థితి అదే .

పూర్తిగా చెప్పాలంటే అమలాపురం నుంచి హైదరాబాద్ వచ్చి ఏమీ తోచక

 ఖాళీగా ఉన్న గాదెలో తిరిగే ఎలుక లాగా తయారైంది నా పరిస్థితి. టిఫిన్ పొట్లం కట్టిన కాగితం మీద చిన్న న్యూస్.. కరుణానిధి జీవితం ఆఖరి లో భక్తి తో రామానుజుని చరిత్ర చదివారని సారాంశం.. నవ్వుకున్నాను..

 అలా రీడింగ్ రూమ్ లోకి వచ్చి టెలిఫోన్ డైరెక్టరీ కనిపిస్తే పేజీలు తిప్పడం మొదలెట్టాను. హఠాత్తుగా ఒక చోట నా కళ్ళు ఆగిపోయాయి వెనుకే బుర్ర కూడా.


 "మిస్టర్ చార్వాక"

 ఆ పేరు చదవగానే బొల్డంత సంతోషం. ఒక్కసారిగా మనసు గతంలోకి వెళ్లి పోయింది. అక్కడ కాలేజ్ తలుపు తట్టింది. చార్వాక అనే పాత స్నేహితుణ్ణి మోసుకొచ్చింది.. దానికన్నా ముందు వాడు వీడు ఒకటేనా ఒకటేనా అని మూడు సార్లు అడిగింది ..

 నేను డిగ్రీ చదువుతున్నప్పుడు నా క్లాస్ మేట్ చార్వాక పేరుకు తగ్గట్టే అతడు గొప్ప నాస్తిక శిఖామణి. పుట్టిన పిల్లలు అందరూ చనిపోతుంటే ఎవరో ఇచ్చిన సలహా తో ఆ పేరు పెట్టాడు వాళ్ల నాన్న. ఆ తండ్రి ఏ నమ్మకంతో ఆ పేరు పెట్టాడో కానీ వీడికి మాత్రం నిజంగానే ఏ నమ్మకాలు లేవు.

 మతానికి ఎదురు మంచానికి అడ్డం అని ఎక్కువమంది ఈసడించినా తిన ఫాలోయింగ్ కి ఏం తక్కువ లేదు. కొంతమందికి అయితే వీడొక ఐకాన్.

 నాకైతే ఖచ్చితంగా ఆంధ్రాలో కాకపోయినా ఏ రాష్ట్రంలో నైనా కరుణానిధిలా ముఖ్యమంత్రి అయిపోతాడు అనిపించేది.

 అలాంటి గొప్ప నాస్తికుడు తను.

 డిగ్రీ పూర్తయ్యాక మళ్లీ నేను కలుసుకోలేదు. నేను అక్కడే ఉండి ఏదో తంటాలుపడి ఉద్యోగం తెచ్చుకున్నాను.

 ఈ చార్వాకుడు మాత్రం హైదరాబాద్ వెళ్లిపోయాడని తెలిసింది. ఆ తరువాత చాలాసార్లు పేపర్లలోనూ పుస్తకాల్లోనూ నాస్తిక సంఘం గురించి హేతువాదులు గురించి ఏ న్యూస్ వచ్చినా వీడి పేరు కోసం వెతికే వాడిని ఎక్కడా దొరకలేదు.

 అలాంటిది హఠాత్తుగా టెలిఫోన్ డైరెక్టరీ లో ఆ పేరు కనిపించింది. ఇంకేం వెంటనే ఫోన్ తీశాను ఆ నెంబర్ కి ఫోన్ చేశాను.

 హలో అన్నాను.


 "జైశ్రీరామ్"

 అవతల నుంచి...

 ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టింది. వీడు కాదేమో అనుకున్నా.ఈ పేరు వేరెవరో పెట్టుకునే అవకాశం కూడా లేదు అనుకున్నాను. వెంటనే ఫోన్ పెట్టేసాను కానీ ఖచ్చితంగా వాడు కాదు అని అర్థమైంది.

 కాసేపటి తర్వాత అటునుంచి ఫోన్ వచ్చింది.

 మళ్లీ జైశ్రీరామ్ అని ఎవరండీ మీరు ఫోన్ చేసి మాట్లాడరు అని అడిగింది ఆ గొంతు.

చార్వాక ఉన్నారా? అని అడిగాను.


 బయటికి వెళ్లారు మీరెవరు?

 అడిగాడు .

 నేను ఆయన స్నేహితుడిని. పేరు సీతారామం అని చెప్పండి.

 మీరెవరో తెలుసుకోవచ్చా?


" నేను ఆయన కారు డ్రైవర్ ని"

 సరే చెప్తాను. జైశ్రీరామ్.


 అని ఫోన్ పెట్టేసాడు.


 ఓహో కార్ డ్రైవర్ అన్న మాట వీడు శ్రీ రామ్ అన్న విషయం వాడికి తెలిస్తే ముక్కు చెవులు కోసేసే వాడు. అనుకున్నాను మళ్లీ 10 నిమిషాల్లో ఫోన్ వచ్చింది ఈసారి చార్వాక మాట్లాడాడు. హాయ్ సీతారామం. ఎక్కడున్నావ్ రా ..

నా వివరాలన్ని చెప్పాను అతను నన్ను సాయంత్రం అబిడ్స్ లో మూడో నెంబరు జంక్షన్ కి రమ్మన్నాడు అక్కడినుంచి తనే తీసుకెళ్తా అన్నాడు.

 సరే అన్నాను అనుకున్నట్టే సాయంత్రం మూడు గంటలకి జంక్షన్ దగ్గర నిలబడ్డాను ఆలస్యం లేకుండానే తను వచ్చేసాడు ప్రయాణం మొదలైంది నాకు ఆశ్చర్యం అనిపించింది.


 డ్రైవర్ ఉన్నాడు కదా నువ్వెందుకు నడుపుతున్నావు అడిగాను .

తను ఈరోజు గుడికి వెళ్ళాడు మంగళవారం కదా నవ్వుతూ చెప్పాడు.


 అదేంట్రా నీ కన్నా వాడికి గుడి ఎక్కువా? ఇంకా ఆశ్చర్యం నాలో.


 ఏం చేస్తాం బాసూ. ఇక్కడ అ డ్రైవర్ దొరకడమే గొప్ప.

 సీరియస్ గా అన్నాడు.

 వాడి బాధ నాకు అర్థమైంది.

 అవును ఈ కారులో ఇవేంటి దేవుడి బొమ్మలు ?

స్టీరింగ్ ముందున్న బొమ్మలు చూస్తూ అడిగాను.

 అవన్నీ డ్రైవర్ ఖాతాలోవే.

అవి ఉంటేనే కారు నడుపుతాడు..

 నేను పెద్దగా నవ్వబోయి ఆపు ఆపుకున్నాను.

 మళ్లీ అడిగాను ఏం చేస్తున్నావ్ జాబ్ ఏంటి డిగ్రీ తర్వాత నేను మళ్ళీ కలవలేదు..


 అవును అన్నీ చెప్తాను.. ముందు ఇంటికి వెళదాం అన్నాడు..ఇంతలోనే వాళ్ళ ఇంటికి వచ్చేసాం. కార్ పార్క్ చేసాడు. గేటు కి ఉన్న నేమ్ బోర్డ్ నన్ను తికమకకి గురిచేసింది.

ఇదేంట్రా నీ పేరు charvaka కదా..ఇక్కడ Tcharwaka అని ఉంది..

 అదా నీకు తెలీదా న్యూమరాలజీ..


నువ్వు నమ్ముతావా నాకు కోపం కట్టలు దాటింది

లేదు..మొన్న బిజినెస్ లో లాస్ వస్తే..మా కంపెనీ లో అకౌంటెంట్ చేసిన పని ఇది..

నేను మరి మాట్లాడలేదు.


 గేటు తీశాడు . 

నాకు ఆశ్చర్యం ఎదురుగుండా పెద్ద అద్దం అందులో నేను. అది నేనే నిర్ధారణ అయ్యాక దాని గురించి అడిగాను .కోలనీ లో

 ఇల్లు అన్నీ ఒకే బిల్డర్ కట్టాడు. వాస్తు లో చిన్నా తేడా ఉందని ఈ వీధిలో అందరూ గేటు ఎదురుగా అద్దం పెట్టుకున్నారు.

 నేను పెట్టుకొనని చెప్పాను.

 కానీ పెట్టుకోవాల్సి వచ్చింది .

నిర్లిప్తంగా అన్నాడు.

 నాకు పెద్ద నవ్వు రాబోయి ఆగిపోయింది.

 సరే లోపలికిరా అంటూ లోపలి కి తీసుకెళ్లబోయాడు.నేనె ముందుకు నడిచాను.

 హఠాత్తుగా ఆగు అన్నాడు ఏమైంది రా అన్నాను .

 పక్క సందులోంచి వెళదాం రా అని తీసుకెళ్లాడు.

 ఏంట్రా పెద్ద సింహద్వారాన్ని వదిలేసి.. అన్నాను నిన్న మా అంకుల్ వచ్చారు ఆయన

 చైనాలో ఉంటారు ఆయన చెప్పింది ఏంటంటే మొన్న నాకు అనారోగ్యం చేసింది కాబట్టి పూర్తిగా తగ్గేవరకు దారి మార్చమని చెప్పారు ఏదైనా అనారోగ్యం వస్తే రోజూ ఉపయోగించే దారి మారుస్తారట చైనా లో.. చెప్పాడు గొప్పగా.

 ఓహో నువ్వు వినేశావా కాస్త వెటకారంగా అన్నాను.

 నేను వినలేదు కానీ వినవలసి వచ్చింది..


 సింహద్వారం కి వేసిన తాళం చూపిస్తూ అన్నాడు.

 నాకు వెంటనే ఈ చార్వాకుడి సతీమణి ని కలుసుకోవాలనే ఉత్సాహం కట్టలు తెంచుకుంది.

 సరే పద అన్నాను. ఈలోగా ఆవిడ వచ్చింది నమస్కారమండి అబ్బా చిన్నప్పుడు కాలేజీలో ఎవరైనా నమస్కారం పెడితే చంపేసేవాడు మావాడు మనసులో అనుకున్నాను. ఇక తర్వాత ఆమె చీర కట్టు నాకు దాదాపు చాలా విషయాలు అర్థమైపోయాయి. ఇంకేమీ మాట్లాడకూడదు అనుకున్నాను లోపలికి వెళ్ళాం ఈలోగా ఆవిడ సూప్ పట్టుకు వచ్చింది. కొంచెం నోట్లో పెట్టుకున్నాను అమ్మో ఇది ఏంట్రా సూప్ ఇంత చేదుగా ఉంది ఏదైనా ఆయుర్వేదం మందా అడిగాను లేదురా మా ఆవిడ నిజానికి కొరియా దేశం నుంచి వచ్చింది తనకి అక్కడ కొత్త వాళ్ళని పరిచయం చేసుకున్నప్పుడు ఇలాంటి సూప్ ఇస్తారు. అప్పుడు ఆ పరిచయం ఎప్పటికీ నిలిచి ఉంటుందని వాళ్ళ నమ్మకం ..


ఓహో ఇంకా నయం మొహానికి పేడ రాసుకుంటారు కాదు. అని అనబోయి అనుకుని నాకు నేనే నవ్వుకున్నాను.

ఈలోగా గోడమీద ఉన్న పిల్లిపిల్ల బొమ్మ నన్ను ఆకర్షించింది .

దానికింద ఉన్న కోటేషన్ మాత్రం అర్ధం కాలేదు.అది కూడా కచ్చితంగా కొరియా దే కదా అన్నాను.కాదు థాయిలాండ్ లో పిల్లి బొమ్మ ఇంట్లో ఉంటే శుభం అని నమ్ముతారు. అది థాయ్ భాష అర్ధం అందరూ బాగుండాలి అని అన్నాడు అది నీకు ఎలా? అడిగాను.

 మా అత్తగారు థాయిలాండ్ లే అన్నాడు .

అద్భుతం మనసులోనే మెచ్చుకున్నాను.

 రా అంటూ లోపలి కి తీసుకెళ్లాడు చాలా అద్భుతంగా ఉంది ఇల్లంతా అవును రెండు బెడ్రూంలు సమానంగా లేవు అన్నాను..

 అంటే కొలతలు సరిపోక అలా చేశాను లే అన్నాడు..

 అది ఎలా?అన్నాను 

ఇల్లు సగం కట్టిన తర్వాత మామగారు వచ్చారు.

హాలు వెడల్పు 13 అడుగులు ఉంది. ఆయనకు 13 నెంబర్ సెంటిమెంట్. కాబట్టి 13 రాకూడదు అన్నారు. అందుకని సగంలో మళ్లీ మార్చాం హాలు వెడల్పు పెంచి గది తగ్గించాము. అందుకు ఆ బిల్డర్ కి ఓ లక్ష ఎక్కువ ఇవ్వవలసి వచ్చింది.. అన్నాడు.

 నాకు అర్థమైంది మీ మామగారు అమెరికన్ కదా ..

 సరిగ్గా చెప్పావు వెరీగుడ్ అంటూ నవ్వాడు .


అది సరే మీ ఆవిడ కొరియన్ అన్నావు కానీ కట్టుబొట్టు చూస్తే అచ్చమైన భారతీయత కనిపిస్తోంది ..

నాకు కడుపు నిండా సంతోషం ..

అదే అన్నాడు వాడుకూడా.. నీలో సంతోషం కనిపిస్తోంది..  అని

ఏమీ లేదురా తాను పుట్టింది కొరియా లొనే..మా కంపెనీ లొనే పని. అనుకోకుండా ఒక రోజు ఆమె కంపెనీ పని మీద ఇండియా వచ్చింది. మేము అనుకోకుండా కలుసుకున్నాం. తరువాత ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. తర్వాత ఒక రోజు ఆమె కాశీ వెళ్ళింది మరి ఏ సమయంలో అక్కడ గంగలో మునిగిందో కానీ హఠాత్తుగా ఇలా అయిపోయింది. నాలో సంతోషం తో కూడిన బాధ.. 

 ఆమె టీవీలోనూ బయట జరిగే ఉత్సవాల్లో పాల్గొని అన్నీ నేర్చుకుంది వాటికి తోడు మా అత్తగారు మామగారు కలిసి నన్ను ఇలా చేశారు.

 కానీ నేను మాత్రం నాలాగే ఉన్నాను...


 వాడైతే అలా అన్నాడు గానీ నాకలా అనిపించలేదు...

కానీ ఒక్కటి మాత్రం అర్ధం కాలేదు..వీడిలో మార్పు తెచ్చింది డబ్బా లేక ప్రేమా లేక ఇంకేదైనా నా..


Rate this content
Log in

Similar telugu story from Comedy