దేవరకొండ ఫణి శ్యామ్

Comedy Drama

4  

దేవరకొండ ఫణి శ్యామ్

Comedy Drama

Lockషాడం

Lockషాడం

11 mins
381


సుబ్బరావు : ఏమోయి, ఇదిగో నీకు, పిల్లలకి టికెట్స్ తీసుకొని వచ్చా, 


వంటిట్లో ఉన్న భార్య చేతులు తుడుచుకుంటూ హాల్లోకి వచ్చింది,


కాంతం: అదేంటండి, ఏంటి ఈ దెబ్బలు, ఆ మురికి,, 


సుబ్బారావు:ఏమి చెప్పమంటావ్, రేపటి నీ ప్రయాణానికి టికెట్స్ కావాలి కదా, అందుకే బాగా కష్టపడి తీసుకువచ్చా, 


కాంతం:  ఇదేదో నన్ను పిల్లల్ని ఇంట్లో నుంచి తరిమివేయాలి అని బాగా ఆతృతగా ఉన్నటుఉంది.


సుబ్బారావు:  ఆబ్బె అదేంలేదు మీరు వెళ్తున్నారు అనే బాధతో తీసుకువచ్చా, నీకు తెలుసుగా మిమ్మల్ని వదిలి ఉండలేను అని. 


కాంతం: తెలుసు తెలుసు, ఏదైనా పిచ్చి వేషాలు వేశారంటే అప్పుడు చెప్తా మీ పని. 


సుబ్బారావు: నా మొహానికి అంత ధైర్యం కూడానా.


మరుసటిరోజు, సిటీలో మొత్తం బస్సు స్టాండ్స్ , రైల్వే స్టేషన్స్ అంతా నిండిపోయి ఉన్నాయి, ఒక పక్క కొంత మంది ఆడవాళ్లు ఇంకా కొంత మంది మొగవాళ్ళు ఏడుస్తూ కనిపించారు, కానీ వాళ్ళు నిజంగా ఏడుస్తున్నారా లేక నటిస్తున్నారా అని అనుమానం వస్తుంది.  ఎందుకు అంటే ఆచారం ప్రకారం పెళ్లి అయినా తరువాత ప్రతి భార్య తప్పకుండ పుట్టింటికి వెళ్ళాలి, అది కొత్తగా పెళ్లిఅయిన లేదా పెళ్లి అయి 50 సంవత్సరాలు అయినా కూడా తప్పదు. పిల్లలు ఉంటె వాళ్ళని కూడా వెంట తీసుకుని వెళ్ళాలి.  


ప్రతి సారి లాగే ఈ సారి కూడా పెళ్లి అయినా ప్రతి మగాడు ఆషాడ మాసం కోసం ఎదురు చూస్తున్నారు. స్కూలు పిల్లలకి వేసవి సెలవులు ఎలాగో పెళ్లిఅయిన ప్రతి మొగుడికి ఆషాడం అలాగన్నమాట.  


మొత్తానికి అష్టకష్టాలు పడి సుబ్బారావు, భార్య పిల్లల్ని బస్సు ఎక్కించేసి, మెల్లగా ఇంటికి వచ్చాడు, వాళ్ళ కాలనీ లో కొంత మంది ఆనందం లో బాణాసంచా కాలుస్తున్నారు, కొంతమంది రోడ్ పైన డాన్సులు వేస్తున్నారు, వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి, దేశానికీ స్వాత్రంత్య్రం వచ్చాక ఎలా ఉండిందో ఆలా ఉంది అందరి మొహాల్లో. 


సుబ్బారావుకి కూడా సంతోషంగా ఉన్న బయట పడలేక తనలోతానే ఆనందిస్తున్నాడు, తలుపు కి వేసి ఉన్న తాళం తీస్తుండగా పక్కింటి అతను పలకరించాడు. 


ఏంటి సుబ్బారావు మొత్తానికి పెళ్ళాం పిల్లలని ఊర్లకి పంపించాం, మరి ఏంటి నీ ప్లాన్ అని అడిగాడు, అబే ఏమి లేదు ఎదో చిన్న చిన్న కోరికలు ఉన్నాయ్ అంతే. 


అంతేలే పెళ్ళైనవాళ్ళని మొగ్గుళ్ళు అనడం కన్నా మూగోళ్ళు అనడం బెటర్ ఏమో, బయట ఎంత సింహం అయినా ఇంట్లో పిల్లే కదా, మరి రేపు కలుద్దాం నాకు చాలా పనులు ఉన్నాయి. ప్రతి సెకండ్ చాలా ముఖ్యం, లేదంటే మళ్లీ వచ్చే సంవత్సరం వరకు ఆగాలి అంటే నా వల్ల కాదు. 


ఇంట్లో కి వెళ్ళగానే, ఇల్లంతా చూసి స్వర్గం అంటే ఎక్కడో ఉంది అంటారు కానీ నా మటుకు నాకు ఇప్పుడు ఈ ఇల్లే స్వర్గం లాగ కనిస్పిస్తుంది. అని అనుకోని తనకి నచ్చిన టీవీ ఛానల్ పెట్టుకొని, సౌండ్ పెద్దగా పెట్టి, డాన్సులు వేయడం మొదలు పెట్టాడు, ఎదో తెలియని సంతోషం, మరుసటిరోజు ఆఫీస్ ఉన్నా ఆ రోజు రాత్రంతా నిద్రపోలేదు. 


పొద్దున్నే మంచి కాఫీ పెట్టుకొని, దారిలో వెళ్తూ వెళ్తూ టిఫిన్ చేసి ఆఫీస్ కి వెళ్ళాడు, ఆఫీస్ లో అంతా కూడా ఇదే హడావుడి, ముందురోజు రాత్రి ఎవరు ఏమి చేసారు, ఎంత ఎంజాయ్ చేసారు అని. ఆఖరికి సుబ్బారావు వాళ్ళ బాస్ కూడా అందరితో కలిసిపోయి, తెగ మాట్లాడేస్తున్నాడు. ఆలా కొన్ని రోజులు గడిచిపోయాయి. రోజు రాత్రి ఇంటికి రాగానే కాంతం కి ఫోన్ చేసేవాడు, ఆ రోజు తాను ఏమి చేసాడు, ఏమి తిన్నాడో అన్ని చెప్పాలి భార్యకి. 


అలా ఆలా ఆ వారం గడిచిపోయింది, మొదటి ఆదివారం రానే వచ్చింది. ఆ రోజు ఉన్నట్టుండి , కొంత మంది పాత స్నేహితులు సుబ్బారావు ఇంటికి వచ్చారు, చేతిలో ఏవో కవర్లు ఉన్నాయి, వాళ్ళని చూసి సుబ్బా రావు చాలా సంతోషించాడు, రండి లోపలకి అని పిలిచాడు, ఎప్పుడో పెళ్లి కాక ముందు కలిసాము మళ్ళి ఇప్పుడు ఇలా కలవడం సంతోషంగా ఉంది అన్నాడు సుబ్బారావు. అవును మేము అమెరికాలో ఉండడం వల్ల ఇన్ని రోజులు కలవలేదు, ఈసారి ఇక్కడికి  మకాం మార్చాము అందుకే మాకు కలసి వచ్చింది. 


పాత రోజులు తలచుకొని తెగ నవ్వుకున్నారు, సుబ్బారావు, సుందరి అనే ఒక అమ్మాయి పైన ఉన్న ప్రేమ ఆ అమ్మాయి కూడా మొదట ఇష్టపడ్డా తరువాత అనివార్య కారణాల వల్ల దూరం అవడం గురించి చెప్పగానే సుబ్బారావు భళ్ళున ఏడవడం మొదలు పెట్టాడు, అక్కడ ఉన్న బల్లి అరవడం మొదలు పెట్టింది, ఏంట్రా మీ భార్య లాగ ఇది కూడా ఊరికే అరుస్తుంది, ఈ ఆనంద సమయంలో దాన్ని ఎందుకు తలచుకుంటావు.. పైగా బల్లిని ఎందుకు అవమానిస్తావు అని ఏడుస్తున్నాడు, అప్పుడు స్నేహితులు ఓదార్చడంతో కొంచెం శాంతిచాడు, ఇలా ఆరోజంతా వాళ్ళతోనే సరదాగా గడిపాడు సుబ్బారావు.


ఇలా ఒక పది రోజులు గడిచిపోయాయి, మెల్లగా సుబ్బారావు కి పిల్లలు గుర్తుకు రావటం మొదలయింది, రోజు వీడియో కాల్ లో మాట్లాడి, సంతృప్తి చెందేవాడు. మొదట్లో ఉన్న జోష్ ఇప్పుడు లేదు, అయినా తప్పదు ఇంకో 12 రోజులు గడిపేస్తే సరిపోతుంది అని మనసులో అనుకున్నాడు. రోజు బయట తిండి తిని ఆరోగ్యం పాడైపోతుంది సుబ్బారావుకి, అప్పుడే భార్య కాంతం విలువ తెలిసి వస్తుంది, ఎప్పుడెప్పుడు తను వస్తుందా అని ఎదురుచూస్తున్నాడు.  స్వర్గం లాగ అనిపించిన ఆ ఇల్లు ఇప్పుడు అతనికి ఒక నరకం లాగ ఉంది. 


ఇంకా ఒకరోజు గడిస్తే చాలు, మళ్ళి తన భార్య పిల్లలు తిరిగి వస్తారు, పిల్లలతో ఆడుకోవచ్చు, ఇంటి భోజనం చేయొచ్చు అనుకోని ముందురోజు రాత్రి పడుకున్నాడు. పొద్దునే పక్కింటి అతను గట్టి గట్టిగా పిలుస్తున్నాడు,  ఇంకా నిద్రపోతున్న సుబ్బారావు ఉల్లిక్కి పడిలేచాడు, ఏమయిందో అని పరుగెత్తుకుంటూ వెళ్ళాడు. పక్కింటి అయన చాలా సంతోషంగా ఉన్నాడు, ఏమైంది అని అడిగాడు సుబ్బారావు, నువ్వు వార్తలు చూడలేదా, ఇవాళా రాత్రినుంచి ఇండియాలో లొక్డౌన్ పెడుతున్నారంట, ఎన్ని రోజులు ఉంటుందో చెప్పలేరంట అన్నాడు, అది వినగానే గుండె ఆగినంత పని అయింది. 


పరిగెత్తుకుంటూ ఫోన్ చేసాడు భార్యకి, ఇప్పుడు సంతోషమేనా, మీరు ఒక్కరే హాయిగా ఉండండి, సుందరిని తలచుకొని, మందు తాగుతూ, స్నేహితులతో  బాగా గడపండి, నాతో మాట్లాడి ఎన్నిరోజులో అవుతుంది తెలుసా మీకు అని చెప్పి ఫోన్ కట్ చేసింది. 


అదేంటి ఇవ్వని తనకి ఎలా తెలుసు అని చాలా ఖంగారు పడుతున్నాడు. వెళ్లి సోఫాలో కూర్చొని ఆలోచించడం మొదలు పెట్టాడు, తనకి ఎంతకీ అర్ధం కావటం లేదు, ఇక్కడ జరిగింది అక్కడ ఎలా తెలిసింది అని అనుకుంటూ ఉండిపోయాడు, అప్పుడే గోడ మీద బల్లి అరుస్తుంది, తూ పాడు బల్లి అనుకుంటూ లోపలకి వెళ్లి పడుకున్నాడు.. 


కొద్దీ సేపటి తరువాత కాలింగ్  బెల్ మోగింది, వాళ్ళ ఫ్రెండ్ ఒక మహిళని తీసుకొచ్చాడు.. ఏంటి ఇలా వచ్చావు,  ఎవరు ఈమె ఇక్కడకి ఎందుకు తీసుకొచ్చావు, అని అడిగాడు సుబ్బారావు, తిన పేరు పింకీ ఒక పనిపైన ఊరి నుంచి ఇక్కడకి వచ్చింది , మా ఇంట్లో నే దిగింది, ఇవాళ అర్ధరాత్రి నుంచి లొక్డౌన్ కదా, తన పని ఇంకా ఉంది ఏరోజైతే లొక్డౌన్ ఏతేస్తారో అప్పుడు తన పని పూర్తి చేసికొని ఊర్లువెళ్తుంది అప్పటి దాకా కొంచం ఇక్కడే ఉంటుంది, ఎలాగో మీ భార్య ఊర్లో లేదు కదా. 


మీ ఇంట్లోనే పెట్టుకోవచ్చు కదా, ఇక్కడే ఎందుకు అని అడిగితే, నా భార్య దెగ్గరికి వెళ్తున్నా తనకి ఒంట్లో  బాలేదంట అని ఫోన్ వచ్చింది అని చెప్పి వెళ్ళిపోయాడు. 


పోనిలే ఎంచక్కా ఇంటి భోజనం చేయొచ్చూ అని మనసులో అనుకోని, రా అమ్మ లోపలకి రా, ఇది మీ ఇల్లే అనుకో, నీకు నచ్చినట్టు గా ఉండు, అని చెప్పి ఆఫీస్ కి వెళ్ళిపోయాడు. 


సాయంత్రం ఆఫీస్ నుంచి రాగానే, మంచి వంట చేసి పెట్టింది, అది చూసి నోరూరి, త్వరగా భోజనం చేసాడు. ఒక్క సారి కాంతం తో మాట్లాడుదాం అని చెప్పి కాల్ చేస్తే కట్ చేసింది. ఎన్ని సార్లు చేసిన కూడా కట్ చేస్తున్నారు, వాళ్ళ ఇంట్లో ఎవరికి ఫోన్ చేసిన అదే సమాధానం. లొక్డౌన్కి ఇంకా కొన్ని గంటలు ఉన్నాయి పోనీ ఊరెళదాము అనుకుంటే, ఇంట్లో ఈ మహిళాని వదిలి వెళ్లడం కుదరదు. ఇప్పుడు ఎలా అని ఆలోచించడం మొదలు పెట్టాడు. 


ఆలా ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు. మరుసటి రోజు పొద్దున్నే ఆఫీస్ కి  వెళ్దాం అని హడావుడి చేస్తుంటే పింకీ వచ్చి ఎక్కడి వెళ్తున్నారు అని అడిగితే ఆఫీస్ కి అని చెప్పగానే, పక్కున నవ్వి, ఇంకెక్కడి ఆఫీస్, లొక్డౌన్ పెట్టారు, అన్ని మూసేశారంట ఇందాకే టీవిలో చూసా, అని చెప్పగానే, ఆఫీస్ ని మెసేజ్, ఇవాల్టినుంచి ఆఫీస్ కి సెలవులు ప్రకటించారు, మళ్ళి చెప్పేదాకా ఆఫీస్ ఉండదు అని ఆ మెసేజ్ సారాంశం. 

      

ఆఫీస్ కి వెళ్లే పని లేదు, ఇంట్లో ఉండి ఏమి చేయాలో అర్ధం కాదు, పైగా ముక్కు మొహం తెలియని మహిళ తో, ఇలా ఎన్ని రోజులు గడపాలో, ఎలా గడపాలో అర్ధం అవ్వట్లేదు సుబ్బారావుకి..ఇంతలో పక్కింటి అతను పిలిచాడు, ఏంటి ఆఫీసులకి సెలవంట , ఇంట్లో ఒక్కడివే ఏమి చేస్తావు, మా ఇంటికి వచ్చేయి నీకు అసలు లైఫ్ అంటే ఏంటో చూపిస్త. 


ఆబ్బె నాకొద్దు లెండి, నా మానాన నేను ఎదో గడుపుకుంటా, అనుకుంటుండగా, పింకీది చీర కొంగు గాలికి కొంచెం బయటకి కనిపిస్తుంది, అది చూసిన పక్కింటి అయన, అవును లే, ఇన్ని రోజులు ఎదో అమాయకుడువి అనుకున్నా, సర్లే నీ ఇష్టం అని చెప్పి లోపలకి వెళ్ళిపోయాడు. 


కాంతం కి ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడాలి అనుకుంటున్నా అని పింకీ కి చెప్పి. ఫోన్ చేస్తాడు, కానీ మునుపటి లాగే లిఫ్ట్ చేయలేదు, పోనీ ఊరువెళ్దాం అనుకుంటే, అని బందున్నాయి, పోనీ ఫోన్ లో మాట్లాడుదాం అనుకుంటే ఎన్ని సార్లు ఫోన్ చేసినా కట్ చేస్తున్నారు తప్ప మాట్లాడట్లేదు, కాంతం ఇంకా పిల్లలు ఎలా ఉన్నారో ఏమో అని ఖంగారు పడుతుండగా. పింకీ వచ్చి, వాళ్ళు ఆనందంగానే ఉంటారు, మీరేమి ఖంగారు పడొద్దు, నేను మిమల్ని చూసుకుంటా అని చెప్పేగానే, సుబ్బారావు కళ్ళలో నీళ్లు తిరిగాయి. 


పింకీ ఇంకా సుబ్బారావు, ఇద్దరు బాగా దెగ్గరయ్యారు, పింకీ చాలా బాగా చూసుకుంటుంది అని మనసులో అనుకున్నాడు సుబ్బారావు, రోజు ఒక కొత్త రకమైన ఆట ఆడడం మొదలు పెట్టారు, ఎవ్వరు వాళ్ళ వాళ్ళ హద్దులు దాట లేదు, ఆలా కొన్నిరోజులు హాయిగా గడచిపోయాయి, చిన్నప్పట్టి సెలవు రోజులు గుర్తుకు వచ్చాయి. 


ఇన్ని రోజులు ఒకొరికి ఒకరితో సంబంధం లేకుండా గడిపాము కదా, ఇప్పుడు ఒకరి గురించి ఒకరం తెలుసుకుందామా అని పింకీ అడగగా, సరే అన్న సుబ్బారావు. అయితే ఒక ఆట ఆడుకుందాం అని పింకీ అనగానే నేను రెడీ నేను రెడీ అని గెంతులువేసాడు, ఆటేంటంటే, నేను ఒక న్యూస్ anchor ని మీరు ఒక సెలబ్రిటీ అన్న మాట, నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తా అన్న మాట అనగానే, అబ్బా చాలా బావుంది గేమ్ నాకు అప్పుడప్పుడు టీవిలో కనిపిస్తే బావుంటుంది అనిపిస్తుంది అన్నాడు,  సరే నేను రెడీ అయ్యి వస్తాను మీరు సమాధానాలు చెప్పండి సుబ్బారావు గారు అని లోపలకి వెల్లేంది, పౌడర్ పూసుకొని, సెంట్ కొట్టుకొని, సుబ్బారావు రెడీగా ఉన్నాడు. పింకీ లోపలనుంచి వచ్చి, మొదలుపెడదామా అనగానే, సరే అన్నాడు సుబ్బారావు. కొంచెం ఇటుపక్క కుర్చీ వేసుకోండి, మంచి గాలి వెల్తురు వస్తాయి అని సుబ్బారావు కుర్చీని అటు పక్కకి జరుపుతుంది, 


పింకీ: సుబ్బారావు గారు, మీరు పెద్ద సెలబ్రిటీ అని అందరికి తెలుసు కానీ మీ నచ్చిన విషయాలు, నచ్చని విషయాలు, మీ ఇష్టాయిష్టాలు, వాగేయర మా ప్రేక్షకులతో పంచుకుంటారా.. 


సుబ్బారావు: అందరికి నా నమస్కారాలు, ఇవాళ నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే అది నా కృషి నా పట్టుదల, నా వెనుకనుండి నడిపించిన నా ఆత్మీయులు.. 


పింకీ: మీకు పెళ్లి అయ్యిందా? అయితే మీ భర్య పేరు, పిల్లల పేరు. 


సుబ్బారావు: అయ్యిందండి, తన పేరు కాంతం  ఎదో భార్య ఉంది అంటే ఉంది అంతే, అదొక పెద్ద గయ్యాళి, నేను కాబట్టి భరిస్తున్నాను. 


ఉన్నట్టుండి, బల్లి మళ్ళి అరవడం మొదలు పెట్టింది. తూ ఈ పాడు బల్లి రోజు ఇదో పెద్ద తలనొప్పి తయారయ్యింది, అని దాన్ని తరిమేసి వచ్చి మళ్ళి చైర్లో కూర్చున్నాడు. 


పింకీ : అదేంటి కాంతం గారి గురించి ఆలా మాట్లాడుతున్నారు, మీ భార్య గురించి చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. 


సుబ్బారావు: తనతో నేను పడే బాదేంటో నాకే తెలుసు, ఇప్పటి దాకా నేను ఎవ్వరికి చెప్పలేదు, చెప్పుకోలేను.. మీరు తనని కాంతం అని పిలిచారు కదా, తన పూర్తి పేరు సూర్యకాంతం, ఆ పేరుకు తగ్గట్టే మహా గయ్యాళి. 


పింకీ : అంతలా ఏమి ఇబ్బంది పెట్టింది?


సుబ్బారావు:ఒకటా రెండా, ఎన్నని చెప్పాలి, ఎప్పుడూ తన జపం చేయాలి అనుకుంటుంది, తనని పొగడాలి, సంపాయించిన జీతం తన చేతులలో పెట్టాలి, నేను ఒక రూపాయి కావాలన్నా తనని చేయి జాచి అడగాలి, స్నేహితులతో మాట్లాడొద్దు, ఎవ్వరితో చాట్టింగ్ చేయొద్దు, నాకు  నా అన్నవాళ్ళు ఎవ్వరు లేకపోవడం తో నన్ను ఒక ఆటాడిస్తుంది. 


పింకీ: పోనీ తనకి మీరంటే ఇష్టమా?


సుబ్బారావు: ఏమి లేదు, ఎదో కట్టుకున్న మొగుడు కదా ఊర్లో వాళ్ళు ఏమనుకుంటారో, అని ఎదో ఇంట్లో ఉండనిస్తుంది, అంతే తప్ప నా మీద పెద్దగా ప్రేమ లేనట్టు ఉంది. 


 పింకీ: పైకి ఎంత గయ్యాళిది అయినా కూడా, ఏ భార్య తన భర్తని ప్రేమించకుండా ఉండదు, ఒక్కసారి మీరు ఇద్దరు ప్రేమగా గడిపిన రోజుల్ని గుర్తుతెచ్చుకోండి. 


వేళ్ళు లెక్కట్టడం మొదలు పెట్టాడు, అదేంటి అని పింకీ అడిగితే, మేము ప్రేమగా గడిపిన రోజులు ఎన్ని ఉన్నాయో లెక్కేసుకుంటున్నా.. అని చెప్పగానే వింతగా చూసింది పింకీ. 


పింకీ :  అంత ఇష్టం లేని వాళ్ళు పెళ్లి ఎందుకు చేసుకున్నారు. ఎవరినైనా ప్రేమించి పెళ్లి చేసుకోలేక పోయారా?

సుబ్బారావు: ఆ ప్రయాతనము అయ్యింది, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, తనకి నేనంటే చాలా ఇష్టం, కొన్ని అనివార్య కారణాల వల్ల ఇద్దరు ఒకటవ్వలేకపోయాం. ఇక పెళ్లి విషయానికి వస్తే, ఒక మాట్రిమోనీ లో నా డీటెయిల్స్ చూసి, నన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను అని మొండిపట్టు పట్టింది అని వాళ్ళ ఇంట్లో వాళ్ళు నా వెంట పడితే, చేసుకోక తప్పలేదు. 


పింకీ: చూసారా ఎంత ప్రేమ లేకపోతే మాత్రం మిమ్మల్ని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకొని ఎన్ని చెప్పింది. 


సుబ్బారావు: ప్రేమ పాడా, తనకి అత్త మామల పోరు, ఆడపడుచుపోరు ఉండదు అని పెళ్లి చేసుకుంది అంతే.

      

పింకీ: మీరు చాలా తప్పుగా ఆలోచిస్నట్టు ఉన్నారు?


సుబ్బారావు: అదేంలేదు, రోజు తనతో వేగేది నేనే, నాకే తెలుసు తాను ఎలాంటిదో అని.


పింకీ: చివరగా ఒక ప్రశ్న, ఇన్ని రోజులలో ఎప్పుడైనా తనని మిస్ అయ్యాను అన్న ఫీలింగ్ కలిగిందా. 


సుబ్బారావు: తను నా మిస్సెస్ అయ్యాక నేను చాలా మిస్ అయ్యాను కానీ ఎప్పుడు తనని మిస్ అయ్యాను అనిపించలేదు.. ఆలా కొద్దీ సేపు ఆగాక, ఆ అనిపించింది, మొన్న ఆషాడ మాసం ఆచారం ప్రకారం వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా, మొద్లట్లో బాగానే ఉండేది, కానీ కొన్ని రోజులు గడిచాక తను ఇంకా పిల్లలు ఇక్కడ ఉంటె బావుండు అనిపించింది. మొదటి సారి తన విలువ ఏంటో తెలిసింది. కానీ మీరు వచ్చాక ప్రపంచాన్నే మర్చిపోయా. 


నన్ను చాలా ప్రశ్నలు అడిగారు కదా ఇప్పుడు నేను anchor ని మీరు సెలబ్రిటీ అని అనగానే. 


పింకీ: ఇప్పుడే నాకు వంటింట్లో పని ఉంది అని చెప్పి లోపాలకి వెళ్లిపోతుంది.. 


సుబ్బారావు: మనసులో ఇలా అనుకుంటున్నాడు,  ఈ ఆడాళ్ళంతా ఇంతే వాళ్ళకు నచ్చిందే చేస్తారు, ఎదుటివారిగురించి అస్సలు ఆలోచించరు. 


 ఆలా ఆలా ఒక 15 రోజులు గడిచి పోయాయి లొక్డౌన్కి పెట్టిన సమయం అయిపొవస్తుంది, తరువాత పరిస్థితి పై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రోజు రాత్రి ఒక ప్రకటన చేయపోతున్నాడు అని తెలిసి, అందరు టీవీ ముందు కూర్చున్నారు, సుబ్బారావు ఇంకా పింకీ కూడా టీవీ చూస్తున్నారు, అప్పుడే సీఎం, పరిస్థితి అదుపులోకి వచ్చింది అని చెప్పి, కానీ ఇంకో వారం లొక్డౌన్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసాం అని చెప్పి ప్రకటించారు. అందరు ఊపిరి పీల్చుకున్నారు, ఒక్క సుబ్బారావు తప్ప, ఎందుకు అంటే పింకీ తనని వదిలి వెళ్ళిపోతుంది, మళ్ళి తన గయ్యాళి కాంతం తిరిగి వస్తుంది.. ఆ ఇల్లు కాస్త జైలు లాగ తయారు అవుతుంది అని మనసులో అనుకుంటుండగా, కాంతం ఫోన్ చేస్తుంది, వారంలో లొక్డౌన్ తీసేస్తారు అప్పుడు బయలుదేరి వస్తా అని చెప్పి పెట్టేస్తుంది.  


 

ఆ రోజు రాత్రంతా నిద్ర పట్టలేదు సుబ్బారావుకి, వారంలో ఎలాగైనా కాంతం ని వదిలించుకొని ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటాడు.  ఏమి చేయాలా అని అనుకుంటూ అలానే పడుకుంటాడు, పొద్దున్నే లేవగానే, పింకీ గారు కాఫీ అని అడగానే తెచ్చిచ్చేది, లేచి ఇంత సేపు ఐన రావట్లేదు అనుకుంటుండగా,  బయట  ఏవో మాటలు వినపడి బయటకి వెళ్తాడు, అక్కడ ఉన్న మనుషులని చూసి ఖంగు తింటాడు, వచ్చింది పోలీసులు, పింకీ ని అరెస్ట్ చేసుకొని తీసుకువెళ్తుండగా, ఎందుకు అన్న విషయం కనుకుంటాడు, ఆది విని ఆశ్చర్యపోతాడు, సుబ్బారావు స్నేహితుడు ఇంకా పింకీ పెళ్లిచేసుకోవాలి అనుకున్నారని, ఇద్దరు కలిసి తన స్నేహితుడి భార్యని చంపేసి, తనేమో ఊరెళ్ళిపోయి దాక్కొని , పింకీని ఇక్కడ ఉంచి, అంత సద్దుమణిగాక పెళ్లి చేసుకుందాం అనుకునేలోపే అంత బట్ట బయలు అవుతుంది.


ఇదంతా విన్నా సుబ్బారావు, లోకంలో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా , గయ్యాళిదయినా నా కాంతంమే నా అయస్కాంతం అని మనసులో అనుకోని తన పని తానుచేసుకుంటాడు. 


ఇంతలో వారం గడిచిపోయి లొక్డౌన్ ఏతేసాక కాంతం తన పిల్లలతో ఇంటికి తిరిగి వస్తుంది, రాగానే మంచి కోపం మీద ఉంటుంది. ఇంతకీ మీతో ఇన్ని రోజులు ఉన్న ఆ అమ్మాయి ఎవరు అని అడుగుతుంది, ఏ అమ్మాయి గురించి నువ్వు మాట్లాడేది, అదేం లేదు ఇన్ని రోజులు నేను ఒక్కడినే ఉన్నా, నీ మీద ఒట్టు కాంతం అనగానే బల్లి అరవడం మొదలు పెడుతుంది, దీన్ని ఇలా కాదు అని చెప్పి ఒక కర్ర తీసుకొని కొట్ట పోయేలోపు అక్కడ ఒక కెమెరా కనిపిస్తుంది. అమ్మ నా కాంతం ఏకాంతంగా ఉన్న అనుకున్న కానీ నువ్వు అయస్కాంతం లాగ నన్ను వెంబడించావన్న మాట.. పాపం ఆ బల్లి ముండని రోజు తిట్టుకున్నా, అది ముందునుంచే నాకు హింట్ ఇస్తున్నా నేను పట్టించుకోలేదు. 


అని మొత్తం జరిగిందంతా చెప్తాడు, చెప్పాక అప్పుడు సుబ్బారావుకి  ఒక అనుమానం వస్తుంది, నేను తాను ఆడిన ఆటల్ని కూడా చూసావా అని అడిగితే హా చూసా..నా గురించి చాలా బాగా మాట్లాడారు కదా.. ఉండండి మీ పని చెప్తా అని.. ఇద్దరు పరుగులు పెట్టడం చూసి పిల్లలు గట్టిగా నవ్వడం మొదలు పెట్టారు.. 


ఇంతలో పక్కింట్లో ఏవో అరుపులు వినిపించడం మొదలు అయ్యాయి, తన భార్య కూడా పక్కింటి అతన్ని ఉతికి ఆరేస్తుంది.. అవును నువ్వు అంటే కెమెరా పెట్టావు, మరి తన భార్యకి ఎలా తెలిసింది అంటే.. తనేగా నాకు ఈ ఐడియా ఇచ్చింది అనగానే.. 


సుబ్బారావు మొహం చిన్నబోయింది..    


  


  


Rate this content
Log in

Similar telugu story from Comedy