దేవరకొండ ఫణి శ్యామ్

Drama Crime Thriller

4.1  

దేవరకొండ ఫణి శ్యామ్

Drama Crime Thriller

చేసింది ఎవరు…?

చేసింది ఎవరు…?

10 mins
24.7K


రాత్రి సర్రిగా 12.00...


ఫోన్ కి ఒక కొత్త నెంబర్ నుంచి మెసేజ్ వచ్చింది....


"Happy Birthday Sweet Heart..."


అలా ఇంకా కొన్ని మెసేజెస్ వచ్చాయి....


మంచి నిద్రలో ఉన్న మౌనిక లేచి ...మెసేజెస్ చూసింది...అదేంటీ ఇవాళ నా పుట్టినరోజు కాదు కదా..మరి ఈ మెసేజెస్ ఎవరు , ఎందుకు పంపిస్తున్నారు...అని అనుకోని...ఫోన్ సైలెంట్ లో పెట్టేసి పడుకుంది...


పొద్దున లేచి చూసేసరికి..15 missed కాల్స్ ఉన్నాయి...


ఏంటి ఇంత మంది నాకు కాల్ చేసారా...అని ఆశ్చర్యంగా చూసింది....అన్ని కొత్త నంబర్స్ నుంచే వచ్చాయి ఆ కాల్స్...


లేచి ఫ్రెష్ అయ్యాక కాఫీ తాగుతూ , న్యూస్ పేపర్ చవుదువుతున్న సమయంలో కాలింగ్ బెల్ మోగింది...


తలుపు తెరిచి చూడగా , పోలీసులు...


ప్రకాష్ ఎక్కడ?


ప్రకాష్ అ అతను ఎవరు...నాకు తెలీదు...


తెలీదా , అతని మొబైల్ సిగ్నల్ ఇక్కడే చూపిస్తుంది...


ఇక్కడ నేను తప్ప ఇంకెవరు లేరు...కావాలంటే చూసుకోండి...


కానిస్టేబుల్ వెళ్లి లోపల వెతుకు...


అంతా చూసా సర్ ఎవ్వరు లేరు ఇక్కడ...


సరే తన నెంబర్ కి ఫోను చేయి...


సరే సార్...రింగ్ అవుతుంది...కానీ లిఫ్ట్ చేయట్లేదు సార్..


అదేంటి...


సారి అమ్మ తప్పుగా వచ్చినట్టు ఉన్నాం...


ఏమి పర్లేదు సార్...


మళ్ళీ కొత్త నెంబర్ నుంచి కాల్ వచ్చింది... అయ్యో అమ్మ కూడా చేసినట్టు ఉంది...


ఏంటి చిన్ని...ఎన్ని సార్లు కాల్ చేసినా తీయట్లేదు...


అయ్యో సారి అమ్మ, నా ఫోన్ సైలెంట్ లో ఉండిపోయింది...రాత్రినుంచి ఏవో కొత్త నంబర్స్ నుంచి మెసేజ్ లు , కాల్స్ వస్తున్నాయి...బాగా డిస్టర్బ్ అవుతుంది అని ఫోన్ ని సైలెంట్ లో పెట్టి పడుకున్నా...


అవునా...


ఇంకో విషయం అమ్మ...ఇప్పుడే పోలీసులు వచ్చి వెళ్లారు...


పోలీసులా..దేనికి...


నువ్వు ఏమి ఖంగారు పడకు..వచ్చి ఎవరో ప్రకాష్ కావాలి అని ఆడిగారు.. అలాంటి వాళ్ళు ఎవ్వరూ లేరు అని చెప్తే....తప్పుడు అడ్రస్ కి వచ్చాం అని సారీ చెప్పి..వెళ్లారు...


అవునా సరే జాగ్రత్త...


ఇంతకీ మీరు ఎప్పుడు వస్తున్నారు...


ఇంకో రెండు మూడు రోజుల్లో వస్తాం...


సరే అమ్మ...


ఫోన్ సైలెంట్లో ఉండడం వల్ల..నేను అమ్మ చేసిన కాల్స్ మిస్ అవుతున్నా...


పెద్దగా సాంగ్స్ పెట్టుకొని మౌనిక స్నానానికి వెళ్ళింది...


వచ్చిన వెంటనే మళ్ళీ కొన్ని missed కాల్స్ ...


ఏంటి ఈ టార్చర్ నాకు....ఎవరివి ఈ నంబర్స్...చూద్దాం అనే లోపు...ఒక కాల్ వచ్చింది....లిఫ్ట్ చేసింది...


హలో , ప్రకాష్...ఎక్కడికి వెళ్లావు ఇన్నిరోజులు....నిన్నటి వరకు నీ రెండు ఫోనులు స్విచ్ ఆఫ్ లో ఉన్నాయి...నువ్వు కనబడట్లేదు అని తెలిసి...మీ అమ్మ వాళ్ళు చాలా టెన్షన్ పడుతున్నారు...త్వరగా ఇంటికి వచ్చేయి...


హలో , అని మాట్లాడేలోపు ఫోన్ కట్ అయ్యింది...


ఈ ప్రకాష్ ఎవడు...వాడి కోసం ఇంటికి పోలీసులు వచ్చారు...ఇప్పుడు ఎవరో ఫోను చేశారు..ఏమిజరుగుతుందో...నాకు అర్ధం కావట్లేదు...


అవును ఇంతకీ నా ఫోన్ కి ఇన్ని messages, కాల్స్ ఏంటి...ఇది నా ఫోనేనా...


అరె మర్చిపొయా....రాత్రి కరెంట్ పోయినప్పుడు...నా ఫోన్ కింద పడి పాడైపోయింది కదా...అప్పుడు..ఇంట్లో నాన్న వాళ్ళ రూంలో వెతికినప్పుడు... ఈ ఫోను దొరికింది...ఇది డ్యూయల్ sim ఫోన్...sim1 లో ఆల్రెడీ ఒక sim  ఉంది..అందుకు నేను...sim2 లో నా sim వేసాను...


ఇంతకీ...ఈ ఫోన్ ఎవరిది...మా ఇంట్లో ఎందుకుంది...


దీంట్లో ఏమైనా ప్రకాష్ అనే వాడి గురించి క్లూ దొరుకుతుందేమో చూద్దాం...


ఫోన్ మొత్తం చూసినా ...ఏమి దొరకట్లేదు....కొత్త ఫోను లాగా ఉంది...ఎవరిని అడిగితే తెలుస్తుంది...అని సోఫాలో కూర్చొని ఆలోచిస్తుండగా...


గాలికి న్యూస్ పేపర్ పేజీలు తిరగబడుతున్నాయి...సడన్ గా ఒక చోట......కిడ్నాప్ అయ్యి..10 రోజుల గడుస్తున్నా...ఇంకా జాడ లేని ప్రకాష్....


అది చదివి...ఆ ప్రకాష్ ఈ ప్రకాష్ ఒక్కడేనా...ఒక్కడే అయితే...ప్రకాష్ ఫోన్ ఇక్కడ ఎందుకుంది....ఎవరు కిడ్నాప్ చేయించి ఉంటారు...అని ఆలోచించడం మొదలు పెట్టింది...


హలో నాన్న...ఎలా ఉన్నారు...ఇందాకే అమ్మ చేసింది...


ఏంటి చిన్ని...పోలీసులు వచ్చారంట... దేనికోసం


ఏమి లేదు నాన్న...ఎవరో ప్రకాష్ కోసం అంట..


ప్రకాష్ ఆ...అతనెవరో తెలీదు అని చెప్పకపోయావ..


చెప్పా...తన ఫోన్ సిగ్నల్స్ ఇక్కడే చూపిస్తున్నాయి...అని చెప్పారు...


ఫోన్ సిగ్నల్స్...ఆ...ఆ..ఆ. ...తరువాత ఏమి జరిగింది...


ఇల్లంతా వెతికి...తప్పుగా వచ్చాం..అని వెళ్లిపోయారు...


హమ్మయ్య(మనసులో అనుకోని) పోనీ లే...నువ్వు జాగ్రత్త...


అవును నాన్న...ఇంట్లో నాకొక ఫోన్ దొరికింది.....ఇది ఎక్కడిది...నీకేమైన తెలుసా...


అది అది...నాకు తెలీదు చిన్ని...


పని పైన బయటకి వెళ్తున్నా...మళ్ళీ ఫోన్ చేస్తా...


సరే నాన్న...


ఇంట్లో ఉండేది  ముగ్గురే..అమ్మకి..తనకి ఫోన్ల గురించి పెద్దగా తెలీదు...నాన్నని అడిగా..తనకి తెలీదు అన్నాడు....మరి ఇక్కడికి ఈ ఫోన్ ఎలా వచ్చింది....ఈ ప్రకాష్ ఎవరు...


హలో , బాబు ప్రకాష్ ...నువ్వు ఎక్కడ ఉన్నావు..త్వరగా రా నాన్న ఇంటికి....నేను మీ నాన్న చాలా బెంగ పెట్టుకున్నాం...


హలో అమ్మ...హలో...హలో...నేను చెప్పేది..మీకు వినిపిస్తుందా...చ...మళ్ళీ ఫోన్ కట్ అయ్యింది...


ఈ నెంబర్ కి బాలన్స్ లేనట్టువుంది..పోనీ రీఛార్జి చేద్దాం అంటే..నెంబర్  ఏంటో నాకు తెలీదు...


ఎలా చేద్దాం ఇప్పుడు...


పోనీ నా ఫ్రెండ్..రవి కి కాల్ చేసి రమ్మని చెప్తా...


ఏంటి శ్రీనిక ఇలా ఫోన్ చేశావ్....


నాకు భయంగా ఉంది...నువ్వు ఇక్కడికి వెంటనే రావాలి...


సరే ఇంకో 15 నిమిషాల్లో అక్కడ ఉంట...

**************************************************


ఏమైంది మౌనిక...దేనికి భయపడుతున్నావ్..


......అది రవి జరిగింది....


అవునా...ఇంత జరిగిందా...ఇప్పుడెలా చేద్దాం...


దానికోసమే నిన్ను ఇక్కడికి రమ్మన్నా...నువ్వు నన్నే అడుగుతున్నావ్...నువ్వు ఇంకా ఈ కోతి పనులు మానుకోలేదా..


సరే ఆలోచిద్దాం


***************************************************

అదిగో ఎవరో కాలింగ్ బెల్ కొట్టారు....


వెళ్తున్నా...


మళ్ళీ మీరా ...దేనికోసం వచ్చారు...


ఎవరు మౌనిక...


పోలీసులు...


ప్రకాష్ ఫోన్ సిగ్నల్ ఇక్కడే చూపిస్తుంది...మళ్ళీ ఒక సారి వెతుకుదాం అని వచ్చాం...


ఇందాక చూసారు కదా...


ఇంకోసారి చూస్తాం...


సరే చూసుకోండి...


కానిస్టేబుల్ లోపలకి వెళ్ళు...


సార్...ఇక్కడ...ప్రకాష్ దొరికాడు....


నువ్వు ఇక్కడ ఏమి చేస్తున్నావ్....


ప్రకాష్ కాదు నా పేరు రవి....


అవును...తన పేరు ప్రకాష్ కాదు.....తను నా ఫ్రెండ్..రవి


వీడి గురించి నీకు తెలీదనుకుంటా... వీడు పెద్ద ఖిలాడి...


పద పద....


అవును కానిస్టేబుల్...ప్రకాష్ నెంబర్ సిగ్నల్ ఇక్కడే చూపిస్తుంది కదా...


అవును సార్...


ఒక్క సారి ఇప్పుడు కాల్ చేయి...


సరే సార్....


మౌనిక నీ ఫోన్ రింగ్ అవుతుంది...ఇక్కడ ఇవ్వు...


అదేంటి..ప్రకాష్ ఫోన్ నీ దెగ్గర ఉంది...ఎందుకు ...ఈ ఫోన్ ఎక్కడిది...


ఏమో నాకు తెలీదు....నిన్న రాత్రి నా ఫోన్ పాడయ్యిందని...ఇంట్లో వేరే ఫోన్ కోసం వెతికితే ఈ ఫోన్ దొరికింది...అంతే...అంతకు మించి నాకు తెలీదు...


నువ్వు పద పోలీస్ స్టేషన్ కి....


అదేంటి ప్రకాష్ దొరికాడు కదా....నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు....


మేము వెతికే ప్రకాష్ వేరు...మాకు దొరికిన ప్రకాష్ వేరు...


అదేంటి..


ఇతను ఖిలాడి ప్రకాష్, మేము వెతికేది కిడ్నాపైన ప్రకాష్...కోసం...


ప్రకాష్ గురించి నాకు ఏమి తెలీదు... నన్ను వదిలేయండి....


ఎమున్నా స్టేషన్లో చెప్పుకో...పద ముందు...


**************************************************


అయ్యగారు..వచ్చారా...మీకే ఫోన్ చేద్దాం అనుకుంటున్నా... అమ్మాయిగారిని పోలీసుకు తీసుకెళ్లారు...


అవునా...ఈ సామాన్లు లోపల పెట్టు నేను ఇప్పుడే వస్తాను...


మా అమ్మాయిని ఎందుకు అరెస్ట్ చేశారు...


ఎందుకా...ప్రకాష్ అనే వాడిని కిడ్నాప్ చేసినందుకు....


కిడ్నాప్ మా అమ్మాయి చేయటం ఏమిటి....తను అమయకురాలు...


దొరికెంతవరకు అందరూ అమాయకులె…


తను ఇండియాలోనే లేదు...నిన్న రాత్రే వచ్చింది...


పైగా ప్రకాష్, ఎవరో కాదు మా అమ్మాయికి  శ్రీనికకి కాబోయే భర్త…….


శ్రీనికా తను ఎవరు…


శ్రీనిక నా ఇంకో కూతురు….శ్రీనిక, మౌనిక ఇద్దరు కవల పిల్లలు….


నేను మా అమ్మాయి శ్రీనిక, మా ఆవిడ..

ముగ్గురం...ఏవో జాతక దోషాలు ఉన్నాయి అందుకే ఇలా జరిగింది..పూజలు చేయిద్దాం.. అని వేరే ఊరు వెళ్ళాం...ఇందాకే వచ్చాము...మా అపార్ట్మెంట్ సెక్యురిటి గార్డ్..మాకు మీరు వచ్చి మా అమ్మాయిని అరెస్ట్ చేశారు అని చెప్తే ఇక్కడికి వచ్చా…


మీకు కంప్లెయింట్ ఇచ్చింది మా అమ్మాయి శ్రీనికనే…అదిగో మాటల్లో రానే వచ్చింది...రా అమ్మ..


ఏంటి ఇన్స్పెక్టర్ గారు మా చెల్లి ని ఎందుకు అరెస్ట్ చేశారు…


మొన్న మీరు కంప్లెయింట్ ఇచ్చిన రోజు ..నేను స్టేషన్లో లేను అందుకే గుర్తు పట్టలేకపోయా...సారి అమ్మ మౌనిక...ఎదో తెలీక పొరపాటు చేసాం...అవును , ఇంతకీ , ప్రకాష్ ఫోను మీదెగ్గర ఎందుకు ఉంది...శ్రీనిక -మేము షాపింగ్ చేస్తున్నపుడు..నా ఫోన్ తన ఫోన్ ఒక్కటే ఉండాలి అని..  ప్రకాష్ కి నేనె ఆ ఫోన్ తో పాటు కొత్త నెంబర్ ఉన్న sim కొనిచ్చా.. తన దెగ్గర ఉండే ఫోనుతో పాటు ఈ ఫోన్ కూడా వాడేవాడు... వారం రోజుల తరువాత ఒక రోజు ఇద్దరం హోటల్లో లంచ్ చేస్తున్నపుడు తనకి ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది...అర్జంట్ పని ఉంది రమ్మని….హడావుడిగా ప్రకాష్ వెళ్లి పోయాడు...ఫోన్ నా దెగ్గర మర్చిపోయాడు…తరువాత ఇద్దాంలే అని నేను ఇంట్లో పెట్టేసా….


మరుసటి రోజు నుండి తను కనపడలేదు...వెంటనె మీకు కంప్లెయింట్ ఇచ్చా….కానీ ఇచ్చేటప్పుడు...మీకు తన దెగ్గర ఉన్న మొబైల్ నెంబర్ బదులు ఈ మొబైల్ నెంబర్ ఇచ్చా..


ఇప్పుడు తీసుకోండి ఇన్స్పెక్టర్ గారు...తన దెగ్గర ఉన్న ఫోన్ నెంబర్...ఈ నెంబర్ ఆ రోజు నుంచి స్విచ్ ఆఫ్ వస్తుంది….


సరే శ్రీనిక...ఈ నెంబర్ తో ట్రేస్ చేయడానికి ట్ర్య్ చేస్తాం…


మౌనిక: ఇన్స్పెక్టర్ గారు...మరి మా ఫ్రెండ్ రవిని.....ప్రకాష్ అని ఎందుకు అన్నారు..తనని  ఎందుకు అరెస్ట్ చేశారు...


వాడి పూర్తి పేరు రవి ప్రకాష్...వాడు పని చేసే బ్యాంకుకే కన్నం వేసాడు...అందుకే అరెస్ట్ చేసాం...


**************************************************

ఇంటికి వచ్చాక...అవును అక్క...బావ పెరు సూర్య అన్నావ్..మరి ఈ ప్రకాష్ ఎవ్వరు…


తన మొత్తం పేరు సూర్య ప్రకాష్...కానీ తన సర్టిఫికెట్స్ లో ఉత్తి ప్రకాష్ అనే ఉంటుంది...అందుకు ప్రకాష్ అని కంప్లెయింట్ ఇచ్చా...


ఇంతకీ ప్రకాష్ ని ఎవరు ఎందుకు కిడ్నాప్ చేయించి ఉంటారు…


ఏమో అదే నాకు అర్ధం కావట్లేదు…


ఆయనకి ఎవరైనా శత్రువులు ఉన్నారా…?


నాకు తెలిసి ఎవ్వరూ లేరు…


నువ్వు ఏమి ఖంగారు పడకు...తప్పకుండా దొరుకుతాడు…


**************************************************

మౌనిక: నీకు ఫోన్ చేయొద్దు అని చెప్పాకదా...ఎందుకు చేస్తున్నావ్…


అది కాదు నీకో విషయం చెప్పాలి…


అక్క వస్తుంది...మళ్ళీ మాట్లాడుతా…


(అవతలి వ్వ్యక్తి)హలో హలో...నేను చెప్పేది విను…


అక్కా.. పోలీసులు ఏమైనా ఫోను చేసారా...బావగారి గురించి...ఏమైనా తెలిసిందా..


లేదు...నాకు ఖంగారుగా ఉంది...ప్రకాష్ కి ఏమైనా హాని తలపెట్టి ఉంటారేమో అని భయంగా ఉంది…


అలా ఏమీ జరిగి ఉండదు...తప్పకుండా బావగారు..తిరిగి వస్తారు...మీ పెళ్లి జరుగుతుంది…


నేను అదే కోరుకుంటున్నా…


**************************************************


శ్రీనిక: నాన్న...ఎవరైనా ..మినిస్టర్ తో పోలీసులకి చెప్పించి...త్వరగా ప్రకాష్ ని వేతకమని చెప్పు నాన్న…


నేను అన్ని రకాలుగా...ప్రయత్నిస్తున్నా తల్లి…ఏమి లాభం లేదు…


ఎవరో కాలింగ్ బెల్ కొడుతున్నారు చూడు మౌనిక…


సరే నాన్న…


మౌనిక: నువ్వా...నిన్ను ఫోన్ చేయోదన్నా అని…నేరుగా ఇంటికే వచేస్తావ...ఎంత ధైర్యం...వెళ్లిపో..


(అవతలి వ్యక్తి)ముందు నేను చెప్పేది విను….


ఏంటి వినేది…


ఎవరమ్మా వచ్చింది….


ఎవరో సేల్స్ బాయ్ నాన్న….మాకెమి వొద్దు...వెళ్లి పొమ్మంటున్నా…


సరే పంపించేసి తలుపు వేసేయ్…అసలే మనకి ఉన్న తల నొప్పి చాలు…


అలాగే నాన్న…**************************************************


రెండు రోజుల తరువాత 


అమ్మ శ్రీనిక...ఎవరో కాలింగ్ బెల్ కొడుతున్నారు...వెళ్లి చూడు….


సరే నాన్న…


నాన్న...ప్రకాష్ వచ్చాడు….


(శ్రీనిక) హలో ...ఇన్స్పెక్టర్ గారు...ప్రకాష్ ఇంటికి వచ్చేసాడు...మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావట్లేదు…


అవునా, నేను మీ ఇంటికి వస్తున్నా…


ప్రకాష్ , ఎలా ఉన్నావ్ బాబు..నీకు ఏమి హాని చేయలేదు కదా కిడ్నాప్ చేసిన వాడు…


నేను బానే ఉన్నా మామయ్య.....వాడు నన్ను ఏమి చేయలేదు...ఇవాళ పోదున్న దారిలో పడేసాడు...నాకు కట్టిన కట్లు...కళ్ళకి కట్టిన గంతలు..అక్కడ ఉన్న వాళ్ళు విప్పారు.....


అంటే పోలీసులు వచ్చి పట్టుకోలేదు….


లేదు...ఎవరైతే కిడ్నాప్ చేసాడో వాడే వదిలేసాడు..


శ్రీనిక, ఇన్స్పెక్టర్ గారు వచ్చారు కాఫీ తీసుకురామ్మ..


(ఇన్స్పెక్టర్) ప్రకాష్, మిమ్మలి కిడ్నాప్ చేసినవాడు ఎలా ఉంటాడో మీకు తీలుసా…


లేదు తెలీదు...నా కళ్ళకి గంతలు కట్టేశారు...ఎక్కడ ఉన్నానో కూడా తెలీదు…


మాములుగా అయితే కిడ్నాప్ చేస్తే...ఎవరికో ఒకరికి ఫోన్ చేసి...ఇది కావాలి...అది కావాలి అని అడుగుతారు...కానీ వీడు...అలా అడగలేదు…


(ఇన్స్పెక్టర్): నాకు తెలుసు ఎందుకు అడగలేదో…


ఎందుకు ఇన్స్పెక్టర్ గారు…


(ఇన్స్పెక్టర్)ముందు మీకు కిడ్నాప్ చేసింది ఎవరో చూపిస్తా...మీ ఇంట్లో వాళ్ళు అందరూ బయటకు వచ్చి కూర్చోండి….


(శ్రీనిక)దేనికి ఇన్స్పెక్టర్ గారు…


(ఇన్స్పెక్టర్): చెప్పా కదమ్మ, కిడ్నాపర్ ని చూపిస్తా అని…


సరే, అందరూ వచ్చారు...ఇప్పుడు చెప్పండి…


ఇదిగో ఇతనే….


ఎవరితను….


మీకు ఎవ్వరికి తెలియక పోవచ్చు కానీ..మౌనికకి బాగా తెలుసు…ఏంటి మౌనిక ఏమంటావు…


(మౌనిక): అది అది...నాకు ఇతను తెలుసు…


(శ్రీనిక) : అంటే ఇదంతా చేయించింది మౌనిక నా..నేను నమ్మను…


(ఇన్స్పెక్టర్)..మౌనికకి ఈ కిడ్నాప్ కి ఎటువంటి సంబంధము లేదు…


(శ్రీనిక) మరి ఇతనికి మౌనికకి ఏంటి సంబంధం...ఇతను ప్రకాష్ ని ఎందుకు కిడ్నాప్ చేసాడు…


(ఇన్స్పెక్టర్) అక్కడికే వస్తున్నా...ఇతను..మీ చెల్లిని(మౌనిక) ని ప్రేమించాడు....ఇతని..పెరు కుమార్...వీళ్లయిద్దరి కామన్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నాడో వాడే రవి ప్రకాష్...ఆట పట్టిద్దాం అని...కుమార్ కి ఫోన్ చేసి...మౌనికకి పెళ్లి కుదిరింది ..అతని పేరు ప్రకాష్ అని చెప్పాడు...అప్పుడు కుమార్ కి కోపం వచ్చి...ఈ పెళ్లి ఎలాగైనా చెడగొట్టాలి అని..ప్లాన్ చేసి ప్రకాష్ ని కిడ్నాప్ చేసాడు…


మధ్య లో మౌనికకి ఫోన్ చేసి జరిగిందంతా చెపుదాం అనుకునే లోపు...మౌనిక ఫోన్ కట్ చేసింది..


(మౌనిక): మరి కుమార్ మీకు ఎలా దొరికాడు..


(ఇన్స్పెక్టర్): మొన్న ఒక రోజు, జైల్లో ఉన్న రవి ప్రకాష్ ని కలవడానికి స్టేషన్ కి వచ్చినప్పుడు...రవి జరిగిందంతా కుమార్ కి చెప్పాడు...అప్పుడు వాళ్ళిద్దరి మధ్య చిన్న గొడవ జరిగింది...అక్కడి నుంచి వెళ్ళిపోయాడు..ఎందుకో అనుమానం వచ్చి...రోజు తనని ఫాలో అవ్వమని కానిస్టేబుల్ చెప్పా…


ఇవాళ పోదున్న ప్రకాష్ ని దాచిపెట్టిన చోటుకి వెళ్లడం..ప్రకాష్ ని దారిలో దిపేయటం… ఆక్కడినుంచి పారిపోదాం అనుకునే లోపు మావాళ్ళు పట్టుకోవటం...అంతా అలా జరిగిపోయింది...పోనిలెండి...


(ఇన్స్పెక్టర్)మొన్న ఒకటి అడుగుదమని మర్చిపొయా....తన పేరు ప్రకాష్ మరి కంప్లెయింట్ ఇచ్చినప్పుడు...ప్ర"క్రష్" అని రసావెందుకు...


(ప్రకాష్)నేను తన క్రష్ అంటే ఇంగ్లీష్ లో a strong feeling of love అని అర్ధం...తన ఫోన్లో కూడా అదే పేరు ఉంటుంది నా నెంబర్ కి....


(ఇన్స్పెక్టర్)హాహాహా అవునా...మీ పైన క్రష్ సంగతి ఏమో కాని..మేమందరం క్రష్ అయ్యాము....అదే తెలుగు మీనింగ్ ఇబ్బంది పడ్డాం..


సరే ఏదైతే ఏంటి...కథ సుఖాతం...

Rate this content
Log in

Similar telugu story from Drama