sujana namani

Drama

4.7  

sujana namani

Drama

అనగనగా ఒక రోజు

అనగనగా ఒక రోజు

7 mins
2.7K


                            

  రైలు బయలుదేరడానికి సిద్దంగా ఉన్నట్లు కూత పెట్టింది. భార్య ఉమను కూపే లోకి ఎక్కించి కిటికీ నుండి మాట్లాడుతూ....

‘చెబితే వినవుకదా ...నీ మొండి పట్టు నీదే ఒక్కదానివి రాజస్థాన్ నుండి చెన్నై ఎలా వెడతావు? ఆవిడ ఎలాగూ మరో నాలుగు రోజుల్లో చనిపోయే దే. అప్పుడే వెడితే అయిపోయేది గా చెబితే అర్ధం కాదు..జాగ్రత్త....వీరనారిలా ప్రవర్తించకు...’ అన్నాడు గణేష్ కోపంగా.

 అప్పటికి స్టేషన్ కి వచ్చిన దగ్గరనుండి పదోసారి అతనలా ఆమెపై విరుచుకు పడడం . నిట్టూర్చింది ఉమ.

 తోబుట్టువు అక్కడ మృత్యువుకు చేరువలో తమతో బంధాలన్నీ తెంచుకునే పరిస్థితి లో ఉంటె వెళ్లి తానేమీ చేయలేకపోవచ్చు గానీ అలా అనుకుని దూరంగా చనిపోయాక వెళ్ళమన డం ఎంత కర్కశం?...ఛీ..ఛీ.. మనుషులంటేనే అసహ్యం వేస్తుంది.

 రైలు వేగం పుంజు కుంటుంటే చేయి ఊపింది ఉమా. అక్కడేమైనా అవసరం వస్తుందేమోనని భర్త కు తెలియకుండా తెస్తున్న పర్సులోని ఇరవై వేల రూపాయలను మరోసారి తడిమి చూసుకుంది. ఆయన కంట పడతాయని జాకెట్ లోపల పెట్టుకుంది. తానూ ఉద్యోగం చేస్తుంది కాబట్టి ఆయనకు తెలీకుండా దాచుకున్న ఈ మాత్రమయినా డబ్బులు తీసుకు రాగలిగింది.

 లేకుంటేనా ..అమ్మో...తలచుకోవడానికే భయపడింది. కిటికీ నుండి బయటకు చూస్తూ వెనక్కు వెళుతున్న చెట్టు చేమల్ని చూస్తూ ఆలోచనల్లో పడింది.

   పెళ్ళయిన దగ్గర నుండి అతనితో తను సుఖపడింది లేదు. ఎప్పుడూ వాళ్ళ అమ్మ, అక్కలు, వారి పిల్లలు తప్పితే తానెప్పుడూ వాళ్ళింట్లో పనిమనిషి లానే త ప్ప మరోలా గుర్తించబడలేదు.

 మనసులో మాటలు పంచుకోవాలనుకున్నా అతను వారితోనే తప్ప తనతో ఆత్మీయంగా మాట్లాడిందే లేదు. ఇక అతనే తనతో అలా ప్రవర్తిస్తే ఇంట్లో వారు ఇంతకన్నా మంచిగా ప్రవర్తిస్తారనేది కలలోని మాట.

 అసలాయన తనకి గౌరవం, విలువ, ప్రేమ , అభిమానం, అనురాగం ఇస్తేనే కదా వేరెవరైనా ఇవ్వడానికి? పెళ్ళయి నాలుగు సంవత్సరాలైనా పిల్లలు కలగలేదని తన దగ్గర నసుగు తుంది అత్తయ్య. డాక్టర్ దగ్గరకు వెళితే తన దగ్గరేం తప్పు లేదన్నారు. ఆయనకు కూడా పరీక్ష చేయాలి తీసుకు రమ్మన్నారు. కానీ ఆయన ససేమిరా రారు. పరీక్షకు ఒప్పుకోరు. అత్తయ్యేమో పూజలు, ఉపవాసాలు చేయాలంటారు. తనకు తెలుసు అసలు తప్పు ఆయన దగ్గరుందని. దానిని కప్పి పుచ్చుకోవడానికి తననే ఎదో ఒకటి అంటుంటారు.

 ఎం మాట్లాడాలన్నా భయమే. వారందరి సమక్షం తనకు ఊపిరాడనట్లు ఉంటుంది. ఇంత కాలం అందరూ వరంగల్ లోనే ఉన్నారు. గత రెండు నెలల క్రింద ఆయనకు ఉద్యోగరీత్యా రాజస్థాన్ ట్రాన్స్ ఫర్ కావడంతో ఆయన, తను అక్కడకు వెళ్ళిపోయారు.

 అయినా రోజూ ఆయన ఫోన్ చేస్తూ సలహాలు వాళ్ళ అమ్మా వాళ్ళ నుండి తీసుకుంటూనే ఉంటారు. తానేమీ సమిష్టి కుటుంబానికి వ్యతిరేకి కాదు. చాలా ఇష్ట పడుతుంది, అందరూ కలిసి ఉండడాన్ని. కానీ మాట మాటకు, ప్రతీ చిన్న పనికి తప్పును వెదికి సహనాన్ని పరీక్షించేలా మాట్లాడే వారి ధోరణిని జీర్ణించుకో లేక పోతోంది.

 అక్క మాధవికి బ్రెయిన్ కాన్సర్ వచ్చి అమ్మా వాళ్ళు, అక్కా బావా వాళ్ళు చాలా బాధ ప్వడుతున్నారు. గత కొద్ది కాలంగా అది చాలా ఎక్కువ అయ్యింది. నిన్న నాన్న ఫోన్ చేసి ‘అక్క కోమాలో ఉంది కేవలం రోజులే అన్నారు డాక్టర్లు ‘ అని ఏడ్చాడు.

 ఈ విషయం విన్నాక తన ప్రాణం ఎలా నిలుస్తుంది? కనీసం అక్క కడగంటి చూపుకైనా నోచుకోవద్దా . చిన్నప్పుడు ఎన్ని ఆటలాడుకున్నారు..ఎన్ని కల లు కన్నారు. బావ చాలా మంచి వాడు. అప్పటికే ట్రీట్ మెంట్ కోసం లక్షలు లక్షలు ఖర్చు పెట్టాడు. ఎం లాభం?

 దాక్తలు ఎప్పుడో చెప్పారు ‘బ్రతికే కాలాన్ని కొంచెం పోదిగించాగాలమే గాని పూర్తిగా నయం చేయలేమని” బావను చూస్తె బాధనిపిస్తుంది. కనీసం ఓదార్పు మాట లైనా మాట్లాదవడ్డా, ఏకంగా చనిపోయాక వెళ్ళమన్నాడు భర్త. ఎంత అమానుషం..తనే కనుక ఇలా ఉంటె ‘ఎంత డబ్బు పోసినా పోఎదే కదా? దానికింత ఖర్చేందుకు?’ అని చనిపోగానే పాతరేసేవారేమో?

 ఇప్పుడు వెళతానని తానూ పట్టుబట్టే సరికి ఆయనకు సెలవు దొరకలేదని వద్దన్నారు. సెలవు దొరికినా ఆయన రారని, సెలవు దొరకకపోవడం కేవలం ఉత్తి మాటనేనని తనకు తెలుసు. అందుకే ధైర్యం చేసి ఒక్కదాన్నయినా వెళతానని పట్టుబట్టి వచ్చింది.

  కనీసం ఏడ్చే అమ్మానాన్నలను, బావను, అక్క పిల్లలను సముదాయించడానికి, మోరల్ సపోర్ట్ ఇవ్వడానికి , తెలిసాక తానూ వెళ్ళకుండా ఎలా ఉండగలదు?

 అయినా ఆప్యాయతలు, అనురాగాలు ఆయనకేం తెలుసు? భార్య అంటే కేవలం వేరే ఇంటి నుండి జీవిత కాలం ఎన్నో సమకూర్చడానికి వచ్చే జీతం లేని పని మనిషి అనే తెలుసు. ఏనాడైనా ఏవైనా అనుభూతులు తనతో పంచుకున్నారా? ప్రేమగా ప్రవర్తిన్చారా? అసలు పెళ్లి అనగానే ఎన్ని మధురోహలతో అడుగు పెట్టింది అత్తవారింట్లోకి. ఎన్ని ఆశలు ఎన్ని ఊహలు.... అన్నీ ఆయన ప్రవర్తన తన మనసులో చేసిన గాయానికి పేక మేడల్లా కూలి పోయాయి. వద్దనుకున్నా కళ్ళ నుండి నీళ్ళు ఉబికుబికి వస్తున్నాయి ఆమెకు.

 ‘బెహన్ జీ క్యోం ..రో రహీహో...క్యా హువా...?’ ఎదురు సీట్లో కూర్చున్న ఇద్దరు యువకుల్లో ఒక యువకుడు అడుగుతున్నాడు.

 అప్పటికి గాని తెలీలేదు ఉమకు తనకు తెలియకుండానే తన కళ్ళు ఆవేదనను అసృబిండువులుగా వర్షిస్తున్నాయని. తల అడ్డంగా ఏమీ లేదన్నట్లు ఊపుతూ కన్నీళ్లు తుడుచుకుంది. కానీ కన్నీళ్ళ ప్రవాహాన్ని మాత్రం ఆపలేక పోయింది. కాసేపయ్యాక మాటల్లోకి దించి మళ్ళీ అడిగారు వాళ్ళు.

 పొడి పొడి మాటలతో సమాధానమిచ్చింది. ఆ కూపేలో తన పక్క సీట్లో ఉన్నవాళ్ళు అటువైపు ఉన్నవాళ్ళు అందరూ మాలయాలీళలా ఉన్నారు. అందరూ ఒకే కుటుంబంలా ఉన్నారు. అర్ధం కాని వారి భాషలో వారు మాట్లాడుకుంటున్నారు. తన ఎదురుగా ఉన్న ఇద్దరు యువకులు స్వచ్చమైన హిందీలో మాట్లాడుతున్నారు.

 వేష భాషలు వారు మర్యాదస్తులని తెలియజేస్తున్నాయి. వారిని వారు పరిచయం చేసుకుని ఎన్నో స్వాంతన వచనాలతో ప్రయత్నించిన మీదట పెదవి విప్పింది ఉమా. ఆమెకూ మనసు లోని బాధ ఎవరితోనైనా పంచుకుని బిగ్గరగా ఏడవాలనుంది . అక్క చావు బ్రతుకుల్లో ఉంటె ఊరడించాల్సిన భర్త ఇంకొంచెం బాధను ఎక్కువ చేసాడు.

 అందుకే వేగిపోతున్న మనస్సు , వారి మాటలతో కొంత ఊరట చెందింది. కష్టాలు మనుషులకు కాక మరొకరికి వస్తాయా? అప్పుడే ధైర్యంగా ఉండాలి. మీ బాద చెప్పండి. మీ తోడబుట్టిన వాళ్లనుకుని చెప్పండి.మేం తీర్చలేకపోయినా మీ బాధ తగ్గుతుందని ఏంతో ఊరడించిన మీదట మాట్లాడింది ఉమా.

 అక్కకు ఆరోగ్యం బాగాలేదని చావు బ్రతుకుల మధ్య ఉందని తానూ అక్కడికే వెళుతున్నానని, అందుకే బాధనిపించిందని చెప్పింది, భర్త విషయం దాచిపెట్టి.

‘చిన్న వయసులో ఏమిటీ బాధ?’ అంటూ అడిగారు మళ్ళీ.

 అన్నింటికీ వారు బెహన్ జీ అన్నారు కాబట్టి భయ్యా అనే సంభోదిస్తూ మాట్లాడింది ఉమ. బ్రెయిన్ కాన్సర్ గురించి చెబితే వారికి తెలిసిన కేసుల గురించి వారు చెప్పారు.

 మాటల్లో మాటగా, రైలు వరంగల్ వరకే కదా చెన్నై ఎలా వెళతారని వారడిగితే కాజీపేటలో తెల్లవారి అంటే పొద్దున్న దిగితే అక్కడ ఆడబడుచు, అత్తయ్య వాళ్ళు రిసీవ్ చేసుకుంటారని, ఆ రాత్రి చెన్నై వెళతానని చెప్పింది.

 ఎలాగూ చాలా సుదూర ప్రయాణం కనుక ఒకరి తోడూ ఒకరికి అవసరం మరీ తను ఒక్కర్తే అంటే కనీసం వాష్ రూమ్ కి వెళితే కూడా సామాన్లు కనిపెట్టడానికి ఒకరు అవసరం. అందుకే తను మాట కలిపింది. రైలు ఎక్కినా దగ్గర నుంచీ అందరు అన్ని తింటున్నా ఉమ మాత్రం మనస్సు బాగాలేక ఏమీ తినలేదు. మలయాళీ కుటుంబం వారు వారి గోల వారిదే అన్నట్లు గొడవ గొడవ గా ఎదో మాట్లాడుకుంటూ న్నారే తప్ప ప్రక్కవారిని పట్టించుకోవడం లేదు.

 ఆ యువకులు కూడా మంచివారిలా ఉన్నారు . చాలా మర్యాదగా ప్రవర్తిస్తున్నారు. వారి వెంట తెచ్చుకున్న టిఫిన్ బాక్స్ లు తింటూ ఉమను కూడా తినమంటూ బలవంత పెట్టారు. తానూ తెచ్చుకుందనీ, కాని తినాలనిపించడం లేదని మృదువుగా తిరస్కరించింది. కానీ వారు ఊరుకోలేదు. బయట నుండి ఏమైనా తేవాలా అంటూ అడిగారు. వారి అభిమానానికి సంతోషమనిపించినా వద్దంది. తరువాత మధ్యాహన్నం మూడుగంటలకు వారు తెచ్చుకున్న ఫ్లాస్క్ లోని టీ వారు తాగుతూ ఆమె కిస్తే మాత్రం కాదనలేకపోయింది.

 ఇక రాత్రికి వారు తింటూ ఆమెను ఎంత తినమన్నా తినకపోవడంతో అలా అయితే మీ ఆరోగ్యం ఎం కావాలి? మీ అక్కను చూడడానికి మీకు ఓపిక యినా ఉండాలిగా..మీరలా ఉంటె మేం ఊర్కొం ‘ అంటూ బలవంతాన బిస్కెట్ పాకెట్, టీ ని మళ్ళీ ఇచ్చారు. వారు చూపే అభిమానానికి కళ్ళల్లో నీల్లోచ్చాయి.

‘థాంక్యు భయ్యా’ అంటూ వారు విడిచేలా లేరని, తనకి కూడా తీసుకోచ్చుకున్న బాక్స్ తినాలనిపించక వారన్న మాటలు కూడా సబబుగానే ఉండడంతో టీ లో ముంచుకుని బిస్కెట్స్ తిని టీ తాగింది. వారితో మాట్లాడుతూ మలయాళీ కుటుంబం వారు దిగడా నికో ఏమో హడావుడి పడుతూ సర్డుకుంటున్నారు .

 తినగానే నిద్ర ముంచుకొచ్చింది. ఆమె ప్రమేయం లేకుండానే మత్తుగా నిద్రపోయింది.

 ***********

 ఆమెకు మెలకువ వచ్చేసరికి హాస్పిటల్ లో బెడ్ పైన ఉంది. ఒకవైపు చేతికి గ్లూకోస్ ఎక్కుతోంది. కనురెప్పలు కేజీల కొద్దీ బరువులు వేసినట్లు బరువుగా ఉన్నాయి. కళ్ళు బలవంతాన తెరవగానే డాక్టర్ ఆడబడుచు, అత్తయ్య, పోలీసులు కనిపించారు.

‘ఎలా ఉంది?’ అంటూ అత్తయ్య, ‘ఎం జరిగింది?’ అంటూ పోలీసులు అడుగుతున్నారు.

 ఏమీ అర్ధం కాలేదు ఉమకు. అంటా అయోమయంగా ఉంది. ఆలోచించడానికి మెదడు సహకరించడం లేదు. మత్తుగా ఉంది. కళ్ళు మూసుకుపోతున్నాయి.

 ఇంకా నిద్రపోవాలనిపిస్తోంది. ఏమైనా చెప్పడానికి, ఆలోచించడానికి మెదడు, శరీరం ఏదీ సహకరించడం లేదు. మత్తుగా నిద్రపోవాలనిపిస్తోంది.

 డాక్టర్ ‘దయచేసి ఆమెకు కొంచెం విశ్రాంతి ఇవ్వండి..చాలా పవరఫుల్ మత్తుమందు ...’ అంటున్నాడు.

మాటలు అలా లీలగా వినబడుతుండగా మళ్ళీ కళ్ళు మూతలు పడ్డాయి.

 ఆరోజంతా కూడా అలా మత్తులోనే ఉంది ఉమా. మెలకువ వచ్చాక తెలిసిన విషయం ఏమిటంటే ఎదురుగా ఉన్న యువకులు తనకు మత్తు మందున్న బిస్కెట్లు టీ ని ఇచ్చారని, దానితో తను స్పృహలో లేకపోతె తన దగ్గరున్న డబ్బు, మెళ్ళో బంగారం గొలుసు, చేతికి ఉన్న గాజులు, తన బ్యాగ్ అన్నీ తీసుకుని తనను కాజీపేట స్టేషన్ లో చివర ఒక చెట్టుకు ఆనించి కూర్చోబెట్టి వెళ్ళారని, తనను రిసీవ్ చేసుకోవడానికి వచ్చ్సిన ఆడబడుచు రైలు వచ్చి వెళ్ళిపోయినా తన జాడ ఎంతకూ కానరాకపోవడం, సెల్ స్విచ్ ఆఫ్ అని వస్తుండటంతో వెదకుతూ ఫ్లాట్ ఫాం చివర చెట్టు దగ్గర తనను చూసి తన అవతారానికి ఆశ్చర్య పోయి భయంతో రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసిందనీ, వారి సహాయంతో స్త్రేచార్ పై హాస్పిటల్ లో చేర్చారని, చేర్చి ఇప్పటికి రెండు రోజులయ్యిందని, మనుష్యులపై ఉన్న నమ్మకం ఆమెకు ఈ సంఘటనతో పూర్తిగా తుడిచి పెట్టుకు పోయింది.

 ***********

 ఆ నాలుగురోజులూ పోలీసుల ఇన్వెస్టిగేషన్ లు, అత్తయ్య ,ఆడబడుచుల ఆరాలు, ఫోన్లో భర్త ఈసడింపులు, డబ్బు తీసుకెళ్ళిన విషయం తెలిసి తిట్లు అన్ని బ్రతుకుపై విరక్తిని కలుగ జేసాయి. ఈ మత్తు నుండి, షాక్ నుండి తే రుకోకముందే అక్క చనిపోయిందన్న వార్త తెలిసింది. గుండెల్ని పిండినట్లయింది. అంతకన్నా విరక్తి కలిగే సంఘటన తరువాత జరిగింది.

 ‘డబ్బులు పర్స్ లో పెట్టుకుని జాకెట్ లోపల పెట్టుకున్న సంగతి ‘ ఉన్నదున్నట్లుగా చెప్పింది ఉమా పోలీసులకు.

 భర్త తరువాత ఫోన్ లో మాట్లాడుతూ,’చేతి గాజులు, కాలిపట్టాలు, బాగ్ తో పాటు జాకెట్ లోపల వేసుకున్న మంగళ సూత్రం గొలుసు, డబ్బులు అన్నీ తీసుకెళ్ళారు వాళ్ళు. అంటే వారు జాకెట్ లోపల చూసారు. పైగా నిన్ను చెట్టు దగ్గర కూర్చోబెట్టినప్పుడు రేగిన జుట్టు, చెదిరిన బొట్టు, అస్తవ్యస్తమైన బట్టలతో ఉన్నావు. కనుక వాఋ నిన్నే మైనా చేసారేమో? అసలు నిన్ను అనాలి, ఎవరితోనైనా ఇష్టం వచ్చినట్లు మాట్లాడతావు. ఎవరేమిస్తే అది తింటావా’ వద్దంటే వెళ్లావు... కొంచెం భయం లేదు..’ ఇంకా అలా మాట్లాడుతుంటే అప్రయత్నంగా రిసీవర్ వదిలేసింది. ఊహించని షాక్ కు లోనైంది.

 తరవాత ఆడబడుచు వాళ్ళు ‘గణేష్ చెబితే డాక్టర్లతో చెప్పి ఆ టెస్టు కూడా చేయించాము..ఏమయినా అయిందేమో నని..ఇంకా నయం ..ఏమీ కాలేదు ‘ అంటుంటే అసహ్యమేసింది ఉమకు.

 మానసిక ధైర్యాన్నిచ్చి అండగా నిలవాల్సిన భర్త, సూటిపోటి మాటలతో మనస్సు నొప్పించడమే కాకుండా టెస్టు చేయించామని ఏంతో మామూలు విషయంలా చెబితే జీర్ణించు కోలేక పోతోంది. అసలు అంత నమ్మకం లేనిది, ఇక ముందు అతనితో కాపురం ఎలా చేయగలుగుతుంది? ఇంత కాలం ఎన్నిరకాలుగా బాధపెట్టినా ఈ విషయాలతో అమ్మానాన్నలకు బాధ పెట్టలేక, ఈ వయసులో వారిని కష్ట పెట్టడం ఇష్టం లేక ఏమీ చెప్పలేదు.మనస్సుకే సర్ది చెప్పుకుంది.

     ఇప్పుడు అణువణువునా అతనిపట్ల అసహ్యం పేరుకుపోయింది. అక్క చనిపోవడంతో అన్యమనస్కంగానే చెన్నై వెళ్ళింది. కానీ మనస్సంతా విరక్తిగా నిర్వేదంగా మారిపోయింది.

   ***********

 అక్క చనిపోయిన పద వరోజున తనను తీసుకెళ్ళడానికి వచ్చిన భర్త, అక్క పోయిన దుఖ్ఖంలో ఎలా ఉన్నావని అడగడం మరచి, ‘వీరనారిలా బయల్దేరావు. ఎవడు పడితే వాడితో రాసుకు పూసుకు మాట్లాడతావా? ఛీ ఛీ..అంతా మా కాలేజీలో,’ఇలా జరిగిందట కదా’ అంటూ పేపర్లలో చూసి అడిగితె తలెత్తుకోలేక పోయాను. వాళ్ళు నీ శరీరంలో ఇంకా వేటిని ముట్టుకున్నారో..’ ఇలా మాట్లాడుతుంటే ఇంకా ఆవేశాన్ని ఆపుకోలేక పోయింది.

 ‘ఇంకా ఆపండి...ఛీ.. మీరు మనుషులేనా? అక్క పోయిన దుఖ్ఖంలో ఉన్నవారిని ఓదా ర్చాల్సిన విధానం ఇదేనా? నేను ముందే చెప్పాను, నేను బాధలో ఉంటె వాళ్ళు బెహన్ జీ, అంటూ మాట్లాడుతుంటే మంచివాళ్ళను కున్నాను. ఏమీ తినలేదని టీ ఇస్తే తాగాను. అంటే.. దాన్ని ఇంత ఘో రంగా చిత్రీకరించుకున్నారు. ఒకవేళ నిజంగా ఏమైనా జరిగినా మీకు ప్రేమే కనక ఉంటె, అందులో నా ప్రమేయం లేదు కాబట్టి మీ అనురాగం తో స్వాంతన ఇవ్వాలి..ఇదే మీ చెల్లెలికి అయితే ఇలాగే అనే వారా... అనుక్షణం చిత్రవధ చేసే మీతో ఇక ముందు సంసారం కూడా చేయలేను. ఎదో నా కోసం మీరు త్యాగం చేస్తున్నట్లు ఉదారంగా, నన్ను ఏ లుకోనక్కర్లేదు. ఇప్పుడే విడాకులకు అప్లై చేస్తాను. గుడ్ బై” అంటూ చర చరా వెళ్ళిపోయింది ఉమా.

 ఈ రకమైన తిరుగుబాటు ఊహించని గణేష్ నిశ్చేష్టు డ య్యాడు.

 ఎప్పటిలా ఎన్ని మాటలన్నా వాళ్ళ అమ్మానాన్నల కోసమైనా తనను బ్రతిమిలాడి, తన తప్పును క్షమించమంటుందని , తనూ ఉదార స్వభావుడిలా చేరదీస్తున్నట్లు ఫోజు కొట్టవచ్చని ఆశపడ్డాడు.

  ఎందుకంటే ప్రతి నేలా ఆమె తెచ్చే జీతం విడా కులైతే రాదు. పైగా కోర్టు భరణం ఇవ్వమంటుంది. మళ్ళీ పెళ్లి చేసుకోవాలన్నా ఇంతటి అందగత్తె, విద్యావంతురాలు, గుణవంతురాలు, ఉద్యోగస్తురాలు తనకు దొరకదు. తనకు పిల్లలు పుట్టే యోగం లేదు. కనుక తన తప్పుకు చెంప లేసుకుని ఇక నుండైనా ఆమెను నొప్పించవద్దని నిర్ణయించుకుని ప్రాధేయ పడి ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి ఆమెను వెదుకుతూ బయల్దేరాడు గణేష్.

 ‘సారీ ..నీ మనసు నొప్పించాను...నన్ను క్షమించు ఉమా... నువ్వింతలా బాధపడ తావనుకోలేదు.. ఇక ముందెప్పుడూ నీ మనస్సు నొప్పించను..నా మీదొట్టు ...’ అంటున్న భర్తను సాలోచనగా చూసింది ఉమ. అతని భయం చూసి ఆమెకు నవ్వొచ్చింది.

అలనాటి ‘క్షమయా ధరిత్రిలా’ నేటి మహిళా క్షమిస్తుందా ?..కాని ఆమె సాలోచనగా తలపంకించింది. వీస్తున్న గాలి కూడా ఆమె సమాధానం కోసం చెవులు రిక్కించింది.  ‘లేచింది మహిళా లోకం..దద్దరిల్లింది పురుష ప్రపంచం ...’ దూరంగా మైక్ నుండి పాట వినబడుతుంటే , గుడిలోని జే గంటలు శుభం అంటూ మంగళకరంగా మోగాయి .

                              *************



Rate this content
Log in

Similar telugu story from Drama