sujana namani

Drama

4  

sujana namani

Drama

అనగనగా ఒక రోజు

అనగనగా ఒక రోజు

7 mins
778


      అనగనగా ఒక రోజు


        మార్చి నెల కావడం తో ఆఫీస్ లో పని ఎక్కువగా ఉంది. అఫ్ఫెస్కి వెళితే ఇల్లు గురించి మర్చిపోతాను. కాని బాబుకి జ్వరంగా ఉండడంతో ఒక్కడినీ ఇంట్లో వొంటరిగా వదిలేసి వచ్చినందుకు ఎ మూలో సిగ్గుపడ్డ మాతృహృదయం మేలుకుందేమో.....అనారోగ్యంగా ఉన్నా వాడి దగ్గర ఉండలేని ణా నిస్సహాయతను నన్ను నేను తిట్టుకుంటూ , వచ్చాక రెండు గంటలకు ఫోన్ చేసాను. ‘కన్నా... లంచ్ అవర్ లో వస్తాను... ఇఇలోగా ఫ్లాస్క్ లోని పాలు తాగి, ఫ్లాస్క్ పక్కన పెట్టిన టాబ్లెట్ 12 గంటలకు అంటే ఇంకో పావుగంటకు వేసుకో...నాన్నా...బంగారం జాగ్రత్త నాన్నా... నేనొచ్చి తినిపిస్తాను. అప్పటివరకు పక్కన పెట్టిన బిస్కెట్లు గానీ, పండ్లు గానీ ఏది తినాలనిపిస్తే అది తిను... జాగ్రత్త నాన్నా...’ అని పెట్టేసాను.

   ఉద్యోగరీత్యా అత్తగారింటికి, తల్లిగారింటికీ దూరంగా ఉండవలసి రావటాన.... ఇక్కడ చాలా ఇళ్ళల్లో లాగానే మేము కూడా ముగ్గురమే ఉంటున్నాము. ప్రతీ రోజు అయితే ఆయన ఆయన ఆఫీసుకు వెళుతూ బాబును స్కూల్ లో దించి వెళ్ళేవాడు. నేను అఫీసు కి వచ్చ్సుసేదాన్ని. కానీ వాడికి జ్వరంగా ఉండటం తో ముఖ్యమైన పనులు ఆఫీస్ లో ఉన్నా తప్పనిసరి లీవ్ పెట్టి నిన్న ఉంది పోయాను. ఈ రోజు జ్వరం కొచెం తక్కువగా ఉంది. అయినా బాగా నీరసంగా ఉన్నాడు. నిన్నటి టాబ్లెట్స్ కి ఎక్కువగా నిద్ర లో ఉంటున్నాడు. కాబట్టి వాడికి చెప్పి వాడు, ఫరవా లేదమ్మా.... నేను ఇంట్లో ణా పుస్తకాలు చదువుకుంటూనో, టీవీ చూసుకుంటూనో, గేమ్స్ ఆడుకుంటూనో ఉంటాను. నాకు బాలేక పొతే ఫోన్ చేస్తాను.. నువ్వు వెళ్ళమ్మా...’ అనడంతో . ణా కళ్ళల్లో నీల్లోచ్చ్సినా వాడిని నుదుటిపై ముద్దిచ్చి అన్నీ అమర్చి వచ్చేసాను. 


   లంచ్ అవర్ కాగానే హడావుడిగా బయల్దేరాను. ఇల్లు ఆఫీస్ కి దగ్గరే. కావాలనే ఎక్కువ డబ్బులైనా సౌకర్యంగా ఉంటుందని అలా తీసుకున్నాము. ఒక పది నిమిషాలలో వెళ్ళొచ్చు.  వాడికిష్టమైన పదార్దాలు ఏవి చేసినా, జ్వరం మీద వాడి నోటికి రుచించడం లేదులా ఉంది. తీపాయి పై నేను పెట్టిన బిస్కెట్స్, పండ్లు, వాడికిష్టమైన దోశ , చేగోడీలు అన్నీ అలాగే ఉన్నాయి. ఉస్సూరనిపించింది. మనం దగ్గరుండి బలవంతాన ఏవో మాటలు చెబుతూ తినిపిస్తేనే తినడం గగనమైన ఈ రోజుల్లో , వాడినే తినమంటే ఎం తింటాడు. అదీ జ్వరం ఉన్నప్పుడు... అనుకుంటూ వేడి వేడిగా ఇడ్లీలు వేసి వాడికిష్టమైన చట్నీ చేసి నెమ్మదిగా తినిపించాను. తిమవడం తో హడావుడిగా ఇంట కుక్కుకుని సాయంత్రం వేసుకోవాల్సిన మందులు విడిగా తీసి వాడికి చూపించి టీపాయ్ పై పెట్టాను. పండ్లను శుబ్రంగా కడిగి ఫ్రూట్స్ బాక్ష్ లో పెట్టాను. వేడి పాలు బూస్ట్ బాగా వేసి ఫ్లాస్క్ లో పోసి ఉంచాను. గంటకొకసారి మొగేలా అలారం పెట్టి, అలా మోగినప్పుడల్లా కొబ్బరి బొండం తాగడమో , పళ్ళు తినడమో చేయాలని వాడిని బుజ్జగించి బయట పాడాను. వస్తుంటే వాడు దీనంగా మొహం పెట్టి ఐదో సారి ‘అమ్మా ఆఫీస్ కి తప్పకుండా వెళ్ళాలా ... ఒక్కరోజు ఉండిపోకూడదూ..’ అంటుంటే నాపి నాకే అసహ్యం వేసింది. మార్చ్ అయినా, పని వొత్తిడి ఉన్నా నిన్న లీవ్ పెట్టాను. అక్కడి ఇంపార్టెన్స్ తెలిసీ భాద్యతా యుతమైన పదవి లో ఉండి , భాద్యతారహితంగా లీవ్ అడగలేను. అలాగని ఆఅరొగ్యాలెమైనా రాకుండా ఉంటాయా....పరీక్ష పెట్టదానికన్నట్లు అప్పుడే అనారోగ్యాలు, అప్పుడే పిల్లలకి పరీక్షలు, అప్పుడే ఆఫీస్ లో ఆర్ధిక సంవత్సర క్లోజింగ్ పనులు....ఛీ.. ణా లాంటి ఉద్యోగినుల కడుపులో పుట్టడం వాడి దురదృష్టం, తల్లిగా ణా బాధ్యతలు నిర్వహించలేని ణా దౌర్భాగ్యం .... కంట తడి తెప్పించినా, కనురేప్పలమాటున అడిమేసాను. ణా బాధ తెలుసుకున్నాదేమో....’పోనీలేమ్మా....త్వరగా రా... ఎంత రెండు మూడు గంటలేగా ..’ అన్నాడు తనకు తాను సర్ది చెప్పుకుంటూ.... ఇలా ఉద్యోగినులకు పిల్లలు కూడా ఇలా అర్ధం చేసుకునే వాళ్ళే పుడతారేమో.... అనిపించి, వాడి నుదుటిన ముద్దిస్తూ, ‘ణా బంగారు తండ్రివి కదూ...పని ఎక్కువగా ఉందిరా కన్నా.... త్వరగా వచ్చేస్తాగా...జాగ్రత్తగా తలుపులు దగ్గరకు వేసుకుని పడుకో... అప్పుడప్పుడూ ఓనర్ ఆంటీ వచ్చ్చి చూస్తానంది... ఎ అవసరమైనా ఫోన్ చేయి... నేను గంటకోసారి ఫోన్ చేస్తాను...బై నాన్నా...’ అంటూ వచ్చేసాను.


  రాత్రి ఆరు దాటింది. వాడి బేల మొహం కళ్ళ ముందు పడే పడే మెదలుతుంటే , ఇక పనిపై మనస్సు లగ్నం కాలేదు.  ఇంట్లో చేయగలిగిన వర్క్ ని బాగ్ లో పెట్టుకుని, మేనేజర్ తో చెప్పి బయట పడ్డాను.


     వడివడిగా నడుస్తున్నాను. చలికాలం కావడం తో ఆరుగంటలకే చీకటి పది పోయింది. మనస్సంతా ఎంత తొందరగావాడి దగ్గరకు చేరదామనే. దారిలో కొన్ని పండ్లు తీసుకుని వేగాన్ని పెంచాను. అయినా అది గాజువాక కూడలి కావడంతో రద్దీగా ఉంది. అందరినీ తప్పించుకుంటూ వడివడిగా వెళుతున్నాను.


  ఒకావిడ గుడ్డి వెలుతురులో దారి ప్రక్కగా చంకలో దాదాపు మూడు సంవత్సరాల అబ్బాయిని ఎత్తుకుని, ఆ ఎత్తుకున్న ఎడమ అరచేయిలో చిన్న ప్లాస్టిక్ సంచీ వెల్లకి తగిలించుకుని, కుడి చేతిని ణా ముందుకు చాపుతూ, ణా దారికడ్డం వచ్చింది.

  ‘అమ్మా.... బాబుకు బాగా జ్వరంగా ఉంది. మందులకు డబ్బులు తక్కువ పడుతున్నాయమ్మా... బస్సుక్కూడా చార్జీలు లేవమ్మా.. దయ చేసి సహాయం చేయన్డంమా... ‘ దీనంగా అర్దిస్తోంది. మనిషి బక్కపలుచగా ఉంది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా బాబు దగ్గరకు వెళ్ళాలనే ఆలోచనలో ఉన్న నేను అడ్దోచ్చిన అవాన్తరానికి చికాగ్గా చూసాను. అడుక్కోవడంలో ఇదో రకమైన వేషం. అసలు వీళ్ళు నటించే నటనకు ఆస్కార్ అవార్డ్ ఇవ్వొచ్చు... అనుకుంటూ విసుగ్గా ఆమెను తప్పుకుని మున్డుకేల్లిపోయాను. వేల్లదమైతే వెళ్లాను కాని ఎపుడు ణా ఆలోచనలు ణా కొడుకు పై లేవు. వాడి ఆలోచనల స్థానే చిత్రంగా, తాజాగా జరిగిన ఈ సంఘటన లోని ఆబాబు, ఆ తల్లినే ణా కాళ్ళ ముందు మెదిలారు. నిజంగానే బాబు కళ్ళు మూసుకుని తల్లి భుజంపై పడుకుని ఉన్నాడు. ఆమె ఎడమ చంకలో, అతని చుట్టూ వేసిన ఎడమ చేతి వెల్లకి తగిలించిన తెల్లని, పల్చని ప్లాస్టిక్ కవర్ లో నుండి మందులు అస్పష్టంగా బయటకు కనబడుతున్నాయి. ఆమె కోడా దీనంగా ఉంది. ఎ తల్లి అయినా కొడుకు అనారోగ్యం గురించి అబద్ధం చెబుతుందా... పైగా చేతిలో ప్లాస్టిక్ కవర్లో ఉన్న మందులు అబద్ధం చేబుతాయా.. తానూ ఒక అమ్మగా అందులో అనారోగ్యం తో ఉన్న కొడుక్కి తల్లిగా ఒక వేల పట్టించుకోకుండా వెళ్ళినా, మనస్సులో ,’అయ్యో...నేను సహాయం చేయగలిగే స్థాయిలో ఉందీ చేయకుండా వచ్చానే అనే ఆలోచనతో ప్రశాంతంగా ఉండగలనా... నిజానికి నాకు ఆమె అడిగిన డబ్బు ఇవ్వడం పెద్ద విషయం ఏమీ కాదు. ఒక్కరోజు ఇంటికి పెట్టె ల ఖర్చు కాదు. పైగా ఒక వేల మా బాబుకి జ్వరం తగ్గక పోయినా, ఆమెకు సహాయంసహాయం చేయక పోవడం వల్లనేమోననే బాధ నన్ను కలచి వేస్తుంది. ఇదంతా నిమిషం లో నడుస్తున్న ణా మస్తిష్కం లో తిరగడంతో కొంచెం దూరం వరకు నడిచి వచ్చిన దాన్ని మళ్ళీ వెనక్కి పరుగెత్తాను.


   పర్స్ లో నుండి చేతికి అందిన డబులు తీసి, ‘అమ్మా...ఇదిగో ‘ అంటూ ఆమె చేతిలో పెట్టి, అప్పటికే ఆలస్యం అయిందని త్వర తరిగా వచ్చేసాను. అప్పుడు ణా మనసెందుకో ప్రశాంతంగా అనిపించింది.


  ఇంటికొచ్చాక చూస్తె ఎప్పటి పరిస్థితే..... బాబు బూస్ట్ మాత్రమె తాగాడు. నేను ఫోన్ లో గుర్తు చేయబట్టి మందులు వేసుకున్నాడు. మిగాతాయన్నీ ఎలా పెట్టానో అలా ఉన్నాయి. ఓనర్ ఆవిడ వచ్చి కాసేపు మాట్లాడి, ఆపిల్ ఇచ్చి వెళ్లిందట.  జ్వరంలో ఉన్న వాడిని తిట్టలేక త్వరగా రాణి నన్ను నేను తిట్టుకున్నాను. నేను రాగానే వాడి మొహం వెయ్యివోల్తుల బల్బ్ లా వెలిగింది. పనంతా పక్కకు పడేసి ఫ్రెషప్ ఐ వాడికీ మొహం అదీ వేడి నీళ్ళతో కడిగి వాడి పక్కనే కూర్చున్నాను వాడి చుట్టూ చేయి వేసి వాడు చెప్పేది వింటూ. వాడిన మందులకో, నాతోనే గడిపిన వాడి సంతృప్తి కో గాని వాడి జ్వరం ఆ రాత్రే తగ్గిపోయింది. తెల్లవారి యధాప్రకారం ముగ్గురం మూడు చోట్లకి వెళ్లి పోయాం. బాబుకి మందు లిచ్ద్చి పంపాను. స్కూల్ కెళ్ళి వాడి క్లాస్ టీచర్ని కల్సి విషయం చెప్పాను. ఆవిడ ఫోన్ కి ఫోన్ చేసి చెప్పినప్పుడు అంటే లంచ్ అవర్లో బాబుకు కొంచెం మందులు వేయించే బాధ్యతా మాత్రం తీసుకొమ్మని రిక్వెస్ట్ చేసాను. సరేనంది.


    ఆరోజు తో పూర్తిగా రికవర్ అయ్యాడు బాబు. తర్వాత పూర్తిగా క్లోజింగ్ వర్క్ లో మునిగిపోయాను. ఆ సంఘటన పూర్తిగా మర్చిపోయాను.


    దాదాపు రెండు నెలల తర్వాత ఒక రోజు షాపింగ్ చేస్తూ బాబు, మా వారితో కల్సి, ఫుట్ పాత్ పై నడుస్తూ వస్తున్నాము. రాత్రి 8 గంటలు దాటింది. ఆ సమయం లో ఎప్పటికీ రద్దీగా ఉండే ఆ ప్రాంతం ఇంకా రద్దీగా ఉంటుంది. ఒక షాప్ లో బయట వేలాద దీసిన డ్రెస్ ఒకటి నన్ను ఆకర్షించడంతో, పళ్ళు కొంటున్న మా వారు, బాబు దగ్గర నుండి విడివడి, ఆ డ్రెస్ ను కొంచెం దగ్గర నుండి చూడదానికన్నట్లు ఆ షాప్ వైపు నడిచి బయట నుండే ఆ డ్రెస్ ను పరిశీలిస్తూ ఉంది పోయాను .


  ‘అయ్యా.... సారూ నా కొడుకు కు జ్వరం .... మందులకు డబ్బులు తక్కువయ్యాయి. వూరికేల్లదానికి డబ్బులు సరిపోవు. దయచేసి సాయం చేయండి సారూ....’ కంఠం విని షాప్ లోని వస్తువులను ఆసక్తి గా చూస్తున్న నేను తల తిప్పి చూసాను, షాక్ తో, ఆశ్చర్యంగా మా వారి మున్డుకోచ్ద్చి అంటున్న ఆమె ఆరోజు నన్ను అదే మాటలతో, అదే సెంటి మెంట్ తో నిరోధించిన ఆమెనే, నాకు బాగా గుర్తు. అదే అబ్బాయి. చం కాలో ఆ రోజులాగే ఆమె భుజం పై తల పెట్టి పడుకుని ఉన్నాడు. అప్పటిలాగే ఆమె ఎడమ చేతి లో అదే పల్చని ప్లాస్టిక్ కవర్ లో మందులు అస్పష్టంగా కనబడుతూ..... ఆ రోజు నే చూసినట్లే ఆ కవర్ లో ఎదో టానిక్ ఉన్న అత్తదబ్బా, మిగతావి టాబ్లెట్లు..... ఆ రోజు నేను చూసిన బక్కపలచగా ఉన్న ఆమెనే. ఆమె ముఖం లో అదే దీనత్వం.... మహా అయితే కేవలం అద్దా మారింది. ఆ రోజు నా కాళ్ళ ముందే షాప్స్ ముందు వెహికిల్స్ పార్క్ చేసే మగ వాళ్ళు డబ్బులివ్వడం చూసాను. ఆ ఒక్క రోజు అంటే అది నిజమేననిపించింది. కాని ఇప్పుడు కూడా అదే తరహాలో, అదే మందుల కవర్ తో, అంట బరువును..... అదే ౩ సంవత్సరాల కొడుకును చంక లో మోస్తూ .....అడుక్కోవడం....ఖచ్చితంగా మోసమని తెలుస్తోంది. కొంచెం దూరం నుండి చూస్తున్న నాలో కోపం నశాలానికంటింది. చ... పేదరికం మనిషిని ఎంతగా దిగజారుస్తుంది. అయినా బాబు ఆరోగ్యం తో ఆటలా ఎ తల్లీ అలా చేయదు. ఆనుకొన్న ణా మంచి తనానికి ఎక్కడో బలంగా తాకినా దెబ్బ... కోపంతో పాటూ బాధగా కూడా అనిపించింది. ‘ఇంకా ఎంత ఎంత మందిని ఎన్నిసార్లు మోసం చేస్తావు. నీ కొడుకు గురించి అలా అబద్ధాలు మాట్లాడడానికి నీకు నోరెలా వచ్చింది. అసలేం తల్లివి నువ్వు. మాతృ ప్రేమ కే కళంకం తెస్తునావు....’ అని ఆవేశంగా కడిగేద్దామని దగ్గరకొచ్చాను. కాని మొదటి నుండి ణా అన్ని గుణాలను పుణికి పుచ్చుకున్న ణా కొడుకు అప్పటికే ‘అబ్బా...పాపం కదూ నాన్న ఎప్పటికీ ఆపదలో ఉన్న ఎవరికైనా సహాయం చేయాలని అంటుంటారు కదా... నేను ఇంటికెళ్ళాక, కిద్దె బాంక్ లో దాచుకున్న ణా డబ్బులు తీసిస్తాను గానీ, పాపం వాళ్లకి డబ్బులివ్వవూ....’ అంటున్నాడు.


   వాడిని తృప్తిగా చూసిన మా వారు, వాడి భుజం తట్టి ‘గుడ్’ అంటూ. అప్పటికే పర్స్ తెరిచి పెద్ద నోటు, ఆమె చేతి లో పెట్టబోతున్నాడు. వారించడానికి దగ్గరకొచ్చాను. నేను చూసిన ఒకానొక సినిమాలోని, సరిగ్గా ఇలాంటి సంఘటన కాళ్ళ ముందు కదలాడింది.


  అందులో ఒకతనికి ఎదురైనా ఎలాంటి ఒక తల్లి తన పాపకి గుండెలో రంధ్రమున్నాడని డబ్బులడుగుతుంది. ఆటను దయార్ద్ర్హ హ్రుదయుదవడంతో, తన వ్యక్తిగత ఖర్చు మానుకుని ఆమెకు డబ్బులిస్తాడు. కాని తర్వాత ఆమె మోసం చేసిందని తెలిసినప్పుడు, ఆమెను తిట్టకుండా,’పోనీలే... ఆ పాపకి గుండె జబ్బు లేదు. ఆ విషయం చాలా సంతోషం ఉంది..’ అంటాడు. అప్పుడు అతని మానవత్వానికి ప్రతి ఒక్కరూ అభినందించినవారే.... గాంధీజీ ని ఒక చెంప పై కొడితే, మరో చెంప చూపెవారట. కాని మనకు అంతటి సహనం లేదేమిటి.... అనుకునేదాన్ని. లోకం లో మనం మంచివాల్లమైతే అందరూ మంచివాళ్ళే.. ఎవరికైనా అన్నార్తులకు, దీనులకు మనకు చేతనైనంత సహాయం చేయాలి అని ప్రతిరోజూ బాబుకు నీతి కధలు చెబుతూ భోధించే నేను, వాడి మనస్సులో ప్రపంచం లో ఇలాంటి మోసాలు కూడా ఉంటాయని చెప్పడానికి వెనకాడాను. అలా చెప్పడానికి మనస్కరించలేదు. న్యాయస్థానంలో ధర్మం ప్రకారం వంద మంది దోషులు తప్పించుకున్నా ఒక్క నిర్దోషి కి అయినా శిక్ష పడకూడదని. అలా కల్లా కపటాలు తెలియని నిర్మలమైన వాడి మనస్సులో, మోసం, బూటకం అంటే అర్ధం తెలియని వాడి పసి హృదయానికి, ఇలా మోసం గురించి తెలియజెప్పడానికి నోరు రాలేదు. ఒక వేల ఆ బాబుకి ఇంకేమైనా జబ్బు ఉందేమో.... అందుకు ఎక్కువ డబ్బులు కావాలేమో... అలా అయితే ఎవరూ డబ్బులివ్వారని ఇలా అడుక్కున్తుందేమో... ఏమో ఇలా రక రకాల ఆలోచనలు ఏకకాలంలో రాగా , వారించడం ఆపేసాను.


  అయితే మరో విషయం కూడా గమనించాను. ఎప్పుడూ దరిదాపుగా అదే రాత్రి సమయంలో వెలుతురూ ఎక్కువగా పాడనీ అలాంటి ప్రదేశాలలోనే అడుక్కున్తోంది. అంటే ఆమె ఉనికిని ఎక్కువగా ఎవరికీ తెలపడం ఆమెకు ఇంష్టం లేదులా ఉంది.


   మరేం మాట్లాడకుండా మా వారిని, బాబుని తీసుకుని వచ్చేసాను. నేను చేసింది మంచి పనో కాదో నాకు తెలియదు. కాని ఇప్పటికే మంచిపై మన నమ్మకం సడలుతున్న ఈ రోజుల్లో అలా అది మోసమేమో అని తెలుసుకోవడానికి కూడా నా మనస్సు అంగీకరించలేదు. అది తట్టుకునే శక్తి నాకు లేదేమో అనిపించింది. ఆ సంఘటనను తప్పుకు పోవడానికే ప్రయత్నించాను.


  ఆ భగవంతుడిని మాత్రం ‘ఆ అబ్బాయికి మంచి ఆరోగ్యం ఇవ్వు తండ్రీ ‘ అని మాత్రం ప్రార్ధించాను.


           **********************************


నామని సుజనాదేవి

ఆంధ్ర వాణి మాసపత్రిక లో ప్రచురించ బడింది.


Rate this content
Log in

Similar telugu story from Drama