sujana namani

Drama

3  

sujana namani

Drama

అమ్మ ఉత్తరం

అమ్మ ఉత్తరం

5 mins
624


                                


 ‘ఉమా...ఉమా....ఉన్నావా...’ కారు గారేజ్ లో పెట్టి లోని కోస్తూ పిలిచాడు శశిధర్.

‘ఎం కావాల్రా....’ మీనాక్షి అడిగింది.

‘ఉమ..లేదామ్మా...’

‘ఆమె ఇప్పుడే ఆఫీస్ నుండి వచ్చి స్నానం చేస్తుందిరా...ఏమైనా కావాలా...’ బట్టలు మడత పెడుతున్నదల్లా కొడుకు దగ్గర కోస్తూ అడిగింది.

షూస్ విప్పుతున్న శశిధర్ ,’ఎం లేదమ్మా...కాఫీ తెస్తుందేమోనని ...’ నసిగాడు.

‘నే తెస్తాలేరా..’

‘ఫర్లేదు...వచ్చాక ఇస్తుంది లేమ్మా....’ అంటూ బెడ్ రూమ్ లో కెళ్ళి పోయాడు.

చివుక్కు మనిపించింది మీనాక్షి కి. అంటే తనకు పెట్టడం రాదా.తను ఇవ్వకూడదా...


 నిన్న మొన్నటి వరకు ‘అమ్మా...అమ్మా...’ అంటూ నోట్లో అమ్మను తీయని వాడు ఇపుడు ఆ పేరు పిలవడమే తప్పు అన్నట్లు ఉండడం ఎందుకో జీర్ణించుకోలేక పోతోంది. భార్యను పిలవడం తప్పని తానూ అనడం లేదు. కాని నిన్న మొన్నటి వరకు తను కలిపి నోట్లో పెడితేనే తిన్న వాడు, ‘నీ చేతి ముద్ద అమృ తమమ్మా...’ అంటూ మెచ్చుకున్న వాడు ...తన ఒల్లో తలపెట్టుకుని ఎన్నో కబుర్లు, ఆఫీస్ విశేషాలు చెప్పిన వాడు ఇప్పుడు అలా పిలవడమే అపరాధంగా ఒకే ఇంట్లో ఉంటున్నా అపరిచితుల్లా మాట్లాడడానికి మాటలు రానట్లు , కేవలం భార్య నే లోకం అయినట్లు వ్యవహరిస్తుంటే...ఎందుకో చాలా ఇబ్బంది గా అ నిపిస్తుంది.  వారిద్దరు మంచిగా ఉండకూడదని అనడం లేదు కాని ఎందుకో తన ఉనికి తనకే ప్రశ్నార్ధకంగా అనిపిస్తోంది.  ఇంతక ముందు బయటకు ఎక్కడి కెళ్ళినా ‘అమ్మా...వెళ్ళొస్తా..’ అనేవాడు. ఇప్పుదు,’ఉమా వెళ్ళొస్తా..’ అంటున్నాడు. మనసులో బాధ సుళ్ళు తిరుగుతుంటే చెంప లపై జాలువారుతున్న కన్నీళ్ళని కొంగుతో అద్దు కుంది.

             ******************

  ‘ఏమండీ..ఏమండీ.... ఈ సీడీలన్నీ ఎవరు తీసారు....’ అరిచింది ఉమా.

‘బాబు బయట కేల్లాడమ్మా... ఏంటమ్మా....’ అడిగింది మీనాక్షి.

‘ఇవన్నీ ఎవరు సర్దారు...’

‘నేనే సర్డాను ....సీడీ లన్నీ కవర్ల నుండి చిందర వందరగా ఉంటె నేను ఎ సీడీ ఆ కవర్లో పెట్టి సర్దాను...’

‘ఓహ్...షిట్ ...అసలు మీరెందుకు ముడతారు..నా కిప్పుడు టైం లేదు....ఈ చివర్న రెండు సీడీ లు విడిగా పెట్టు కున్నాను. అందులో కలిపేసారు... ఇప్పుడవి ఇన్నింటిలో ఎక్కడని వెదకడం....’ విసుక్కుంటూ అంది ఉమా..

‘పేరు చెప్పమ్మా....నేను చూస్తాను....’

‘...........’ మౌనమే సమాధానమయ్యింది.

అక్కడింకా నిల్చోబుద్ధి కాలేదు. తనింట్లోనే తను పరాయిదయినట్లనిపించింది.

  

    ‘ఎందుకీ పని పెట్టుకున్నారు...నాలుగు రూపాయలు పడేస్తే....అన్నీ అవే దొరుకుతాయి బజార్లో....’ ఆఫీస్ నుండి రాగానే కారబ్బిల్లలు చేస్తున్న అత్తను చూస్తూ విసుగ్గా అంది ఉమా.

 ‘అయిపొయింది లేమ్మా.... పిండి దగ్గర పడింది. ఏమో ఆఫీస్ నుండి రాగానే రెండు తింటే ఓపిక వస్తుంది. బాబు కి ఇవ్వంటే చాలా ఇష్టం. బయట కొన్నవి అంత మంచివి కావు. అయినా మనం చేసుకుంటే సంతృప్తి...వాళ్ళు వీళ్ళు ఆశపడతారు..నాలుగు ఇవ్వొచ్చు. ఏముంది రెండు మూడు గంటలు కష్ట పడితే సరిపోతుంది. మీరోచ్చే వేళకి అయిపోతున్దనుకున్నా గాని కొంచెం ఆలస్య మయ్యింది...’ సంజాయిషీ ఇచ్చుకున్నట్లుంది.

  అత్త చేస్తుంటే చూస్తూ ఉండలేక తానూ కాల్వడానికి వచ్చింది.

‘వద్దు లేమ్మా... పోయి పోయి వచ్చావు...అదిగో ఆ చేసినవి తీ స్కెల్లు...వాడు వచ్చినట్లున్నాడు ..ఇద్ద్దరూ కల్సి తినండి....’ మీనాక్షి అంటున్నా వినకుండా ఆమె ఒత్తుతుంటే ఉమా కాల్చి అరగంటలో పని పూర్తవగానే బయటకొచ్చింది.

‘ఎం చేస్తున్నావు లోపల ...నే పిలుస్తున్నా రావేం...’ అడిగాడు శశిధర్..

‘ఏముంది....అత్తమ్మ కేం తోచదు. ఎప్పుడూ ఎదో ఒక పని పెట్టుకుంటుంది..... నాలుగు రూప్పాయలు పడేస్తే బయట దొరకనివెంటంటా ....ఎప్పటికీ ఎదో పని పెట్టుకుంటుంది. సేల్ఫులు సర్దుతానంటది, దేవుడి రూమ్ సర్దుతానంటది....’

‘ఇంట్లో ఒక్కటే ఉంటుంది కదా పైగా నీకు హేల్పేగా చేస్తుంది.....’

‘ఆ...నేను పెట్టినవి ఒక్కటీ ఒక చోట ఉండక వేదుక్కోలేక చస్తా...’

                            **********

‘అత్తయ్యా ....అన్నం తిందురు గానీ రండి....’

‘రాత్రి అన్నం తినను కదమ్మా....పండ్లు తిని పడుకుంటా....’

‘పళ్ళు...పళ్ళు ...పళ్లకు ఖర్చెంతవుతుందో ఆలోచించడు...ఈవిడ గారి కోసమని ఎంత దరైనా చూడకుండా తెస్తాడు.... గొణిగింది ఉమ.

ఎంత చిన్నగా గొనిగినా వినబడింది మీనాక్షికి. ఎంత కాంప్రమైజ్ అవుదామనుకున్నా రోజు రోజుకి ఆమె మాటలు ఈటే ల్లా మనస్సుని తూట్లు పొడుస్తున్నాయి. చిన్నప్పటి నుండి చాలా రేషంగా ఒక్క మాట పడకుండా పెరిగింది.  చేయని తప్పుకు చిన్నప్పుడు అమ్మ తిడితే అమ్మతో కొన్ని రోజులు మాట్లాడ లేదు. తానేపని చేసినా కోడలు కు నచ్చక పోవడం చాలా ఇబ్బందిగా ఉంది. మొన్న అన్నీ సర్దింది అని విసుక్కుందని , అడ్డదిడ్డంగా పడేసిన కాసెట్స్ సర్ధలేదు. వచ్చాక , ఇంట్లో ఖాళీగానే ఉన్నా , ఇవి సర్దుదామనైనా ఉండదు...పోయి పోయి వచ్చి నేనే చేసుకోవాలి...గునగడం తనకు వినబడుతూనే ఉంది . కొడుకుకు తనపై ఎంత ప్రేమ ఉంటుందో తెలుసు. అందుకే తన పరిస్థితి ఇంకా దిగజారక ముందే తన గౌరవం ఇంకా మిగిలి ఉన్నప్పుడే వారి మనస్సులు నొప్పించకుండా తానే దూరం వెళితే మంచిది.                                                    

 ‘నా బంగారు కన్నా ని దీవించి రాయునది...

           నాన్నా.....కొడుకు ఎంత ఎదిగినా కన్నతల్లి కళ్ళకు చిన్నగానే కనిపిస్తాడు. అది తల్లి దృష్టి లోపం. అందుకేనేమో,,,,,ఇంకా నువ్వు చిన్న వాడివే అనుకుని , చిన్న చిన్న ఇబ్బందులకు నిన్ను గురి చేసి నేను సంతోష పడ్డానేమో... నీ ఊహ తెలియనప్పుడే నాన్న పోయినా   నీకా బాధ తెలియకుండా అన్నీ నేనై పెంచాను. అప్పటి నుండి నువ్వే నా లోకం అయ్యావు... నువ్వు లేని నేను ఊహించలేనురా నాన్నా...

   నువ్వు నన్ను హత్తుకుని పాలు తాగుతూ జోల పాట వింటూ పోయిన నిద్ర, నా చేయి పట్టుకుని వేసిన తోలి అడుగు, వచ్చీ రాక ముద్దు ముద్దుగా పిలిచినా పిలుపు, నా కాళ్ళ మీద ఊగిన ఉయ్యాల, నా చేతులతో పైకేత్తగానే భయపడకుండా నా రక్షణ పై భరోసా తో నవ్విన కిలకిలా నవ్వు, అంత దూరాన నేను కనబడగానే విడిచిన బాణం లా, పరుగు పందెం లా పరుగెత్తుకుంటూ వచ్చి నా చీర కుచ్చిళ్ళు పట్టుకుని అల్లుకు పోయిన నువ్వు, మట్టి తిన్న కృష్ణున్ని చూసి కోపం తెచ్చుకున్న యశోదలా నువ్వు చేసిన చిలిపి పనులను చూసి కోపం తెచ్చుకున్న నన్ను నీ చిట్టి చేతులతో తడుముతూ నా మోము పై ముద్దిచ్చి ‘ఐస్ ‘ చేసే నువ్వు .....’ ఇలా చెప్పుకుంటూ పొతే స్కూల్ ఫస్ట్ వచ్చినప్పుడు స్కూల్ లో వేదిక పై ‘ఈ విజయానికి కారణం అమ్మ’ అంటూ వేదికపై నా కాళ్ళు మొక్కినప్పటి నుండి ఉద్యోగం లో జాయిన అవుతూ నా శీర్వాదం తీసుకుని నా ఇష్టమైతేనే నీవు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అనేంత వరకు అన్నీ నా కళ్ళ ముందు ఇంకా సజీవంగా నిన్న మొన్న జరిగినట్లు కదలాడుతున్నాయి...ఇప్పుడు కోడలు వచ్చాక ప్రస్తుతం నా అవసరం నీకు లేదనిపిస్తోంది... ఎందుకంటే నీ బాధ్యతలన్నీ తను తనపై వేసుకుంది. అందుకే గృహస్థాశ్రమం  తర్వాత వానప్రస్థాశ్రమం స్వీకరించాలని , నీకు చెబితే నువ్వు ఒప్పుకోవని తెలిసి నీకు చెప్పకుండా వెళ్ళిపోతున్నాను.... నేనింత కాలం కూడా బెట్టిన కొంత డబ్బు తీసుకుని వెళ్ళిపోతున్నాను. నా గురించి వెదక వద్దు. ఈ శేష జీవితం ఆ దేవుడి సేవలో గడపాలని వెళుతున్నాను. ఎవ్వరడిగినా తీర్ధ యాత్రలకేల్లా నని చెప్పు. నేనెక్కడ ఉన్నా నా ఆశీస్సులు మీ ఇద్దరికీ ఉంటాయి. మళ్ళీ నీ కడుపు లో నాన్న పుడితే అప్పటి వరకు నేను ఉంటె తప్పక వస్తాను...        

       ఆశీస్సులతో అమ్మ .

ఉత్తరం చదవగానే’అమ్మా....అమ్మా...’ అని గుండె లవిసేలా ఏడుస్తూ కుప్ప కూలి పోయాడు శశిధర్. కళ్ళ నుండి అశ్రువులు అతని ప్రమేయం లేకుండానే కారి పోతున్నాయి. అతని కళ్ళ ముందు చిన్నతనం లో నాన్న చనిపోయినా , తనను చంక లేసుకుని కూలి పనులకు, పాచి పనులకు వెళ్లి ,తనకు కష్టం కలక్కుండా ఎంత దూరమైనా తన భుజం పై కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళే అమ్మ, తనకు బలవర్ధకమైన ఆహారం పెట్టడానికి పస్తులున్నఅమ్మ...తన కంట్లో వెలుగులు చూడడానికి ,ఆమె కళ్ళ వెనక కన్నీటి సముద్రాలు దాచేసిన అమ్మ కనబడుతుంటే హృదయ విదారకంగా ఏడవసాగాడు. అతని చేతి లోని ఉత్తరం తీసుకుని చదివిన ఉమ కూడా కర్తవ్యమ్ మరిచి నట్లు నిశ్చేష్టు రాలయ్యింది. 

   కాలం ఎవరి కోసం ఆగదన్నట్లు రోజులు కరిగి పోతున్నాయి. శశిధర్ చైతన్యం కోల్పోయినట్లు పరధ్యానంగా ఉంటున్నాడు.

      ఉమ మనస్సు పరి పరివిదాల పోతోంది. అత్తయ్య తో తానూ కొంచెం దురుసుగా వ్యవహరించినా ,ఎదో పాతకాలం ఆవిడ అనుకుందే గాని పౌరుషంగా ఇలా చేస్తుందనుకోలేదు. శశిధర్.... తనకు తెలిసిన అన్ని రకాల ప్రయత్నాలు చేసాడు. బంధువుల ఇళ్ళల్లో వాకబు చేసాడు...దగ్గరలోని అనాధ శరనాలయాల్లో వాకబు చేసాడు. అమ్మ కోసం దాదాపు పిచ్చి వాడయ్యాడు. ఉమ కు మనస్సులో అపరాధ బావం రోజు రోజుకీ పెరుగుతోంది. అంతకు ముందు ఆమె ఇంట్లో తాము ఫ్రీ గా ఉండకుండా అడ్డు అని ఫీలయ్యిందల్లా , ఇప్పుడు ఆమె లేక పోయేసరికి ఇల్లంతా చిన్న బోయి, భర్త ఈ లోకం లో నే లేనట్లు ఉండడం, సరిగ్గా తినక పోవడం, నిద్ర పోక పోవడం ..తానూ మానసికంగా స్థిమితంగా ఉండలేక పోవడం...ఇవన్నీ ఆమె చేసిన పొరపాట్లకు పాశ్చాత్తాప పడేలా చేసాయి.

    ఈ లోగా జ్వరం వచ్చిన శశిధర్ ‘అమ్మా’ అని కలవరిస్తూ మూసిన కన్ను తెరవక రెండు రోజులయ్యింది. ఉమ వెంటనే అన్ని ప్రసార మాధ్యమాలలో భర్త విషయం తెలుపుతూ ఒక్కసారి రమ్మని అర్ధిస్తూ ప్రకటన లిచ్చింది. ఆ మరు రోజే ఏడుస్తూ వచ్చింది మీనాక్షి.

    ‘బాబూ...నా బంగారం  ....ఎలా ఉన్నావురా.....’ కన్నీళ్ళ పర్యంతం అయి పక్కనే దివారాత్రులు కూర్చుని సేవ చేసింది. అమ్మ ను చూసిన శశిధర్, అమ్మను పట్టుకుని తనను వదిలి వెల్ల వద్దని బాగా ఏడ్చాడు, ‘అమ్మా ఏమైనా తప్పు చేస్తే దండించం మ్మా .. కానీ ఇంత శిక్ష వేయకమ్మా .... నేనేమైనా నీ మనస్సు నొప్పించానా... నీకు కొంచెం శ్రమ తగ్గించాలనే నీకు ఎక్కువ పని చెప్పట్లేదమ్మా....ఎప్పటివరకు నువ్వు నా కోసం చాలా కష్టా లనుభవించావు ... ‘ అంటూ. ఉమా , తనను క్షమించమంటూ కన్నీళ్ళతో కాళ్ళు కడిగింది.

 ‘బిడ్డ పనులేపుడూ తల్లి బారంగా బావించదు . ఇష్టంగా చేస్తుంది... ఎ బాధ లేదురా...నా బిడ్డ బంగారం ‘

  ఇద్దరినీ చెరో వైపు హత్తుకుంటూ తృప్తిగా కళ్ళు మూసుకుంది మీనాక్షి. తానెంత తప్పుగా ఆలోచించింది. పెళ్ళయ్యాక కొడుకు మారాడనుకుంది. కానీ తన కొడుకు ఎప్పుడూ బంగారమే... పెళ్లి కాగానే ఎవరికైనా ఆ మాత్రం భార్య పై ప్రేమ చూపించడం సహజమే. కానీ దానిని తను అపార్ధం చేసుకుని , రెండు కళ్ళలో ఎ కన్ను గొప్పది అని అడిగితె ఎం చెబుతాడు. తానూ పెళ్లి చేసుకున్నపుడు తన అత్త కూడా ఇలాగే బాధ పడిందా... ఏమో...తనకు మాత్రం వాళ్ళిద్దరూ రెండు కళ్ళు... తధాస్తు అన్నట్లు దూరంగా ఉన్న గుడి లోని జే గంటలు శుభప్రదంగా మోగాయి.

                                                  **************************


                                             


Rate this content
Log in

Similar telugu story from Drama