sujana namani

Inspirational

4  

sujana namani

Inspirational

స్నేహితురాలి లేఖ

స్నేహితురాలి లేఖ

2 mins
672


                         స్నేహితురాలి లేఖ (నేస్తానికో లేఖ)


ప్రియమైన నేస్తానికి,


   ఎలా ఉన్నావే శిరీ.....నీ కిప్పటికే తెల్సి ఉంటుంది మన రాధ అత్తింటి పోరు పడలేక ఉరేసుకున్న సంగతి, మనమెప్పటికీ ధైర్యస్తురాలు అని మెచ్చుకునే సుధ బాస్ హరస్స్మేంట్ భరించలేక తనువు చాలించిన సంగతి. ఎక్కడికెళ్ళినా నలుగురం ఉండే మనమిప్పుడి ఇద్దరం అయినాం. అసలెందుకిలా చేసారు , కనీసం వారి బాధ మనతో పంచుకున్నా ఏదైనా పరిష్కారం ఆలోచిన్చేవాళ్ళం కదా....ఎన్నిసార్లు మనం ‘స్నేహితురాలికి లేఖ ‘ అని మెయిల్స్ పంపించుకోలేదు. అది చదువుకుని ఎంత మురిసిపోఎవాళ్ళం. అలా బాధ చెప్పినా బావుండేది.

    వీళ్ళిద్దరే కాదు పేపర్ తెరవగానే రోజూ ఎలాంటి వెన్నో చూస్తున్నాం... కొన్నయితే చిన్న చిన్న కారణాలకే, అమ్మ కోప్పడ్డదనో, నాన్న మందలించాడదనో, అక్క తిట్టిన్దనో...డబ్బులివ్వలేదనో... ఎలా చెప్పుకుంటూ పొతే కోకొల్లలు...చాలా వరకు క్షణికావేశం లో ప్రాణం తీసుకున్న వారే ఎక్కువ. నిజానికి జీవితం ఒక యుద్ధం. దేవుడు సృష్టించిన నాటకం. ఇందులో గెలుపోటములు, జయాపజయాలు అన్నీ దైవలీలలు.


    నీకు తెలుసా సాధారణంగా ఒక మనిషి ఎక్కువలో ఎక్కువ del(units) నొప్పి మాత్రమె భరించగాలాడట. కానీ ఒక బిడ్డకు జన్మ నివ్వాలంటే అమ్మ 57 del(units)  భరిస్తుందట. ఇది 20 ఎముకలు ఒకేసారి విరిగే నొప్పికి సమానమట. అలాంటి జీవితాన్ని క్షణం లో అంతం చేసుకోవడ మెంత అమానుషం.


   భయంకరమైన పక్షవాతపు స్ట్రోక్ తో స్పృహ తప్పి 20 రోజుల తర్వాత కళ్ళు విప్పిన జీన్ డామ్నిక్ తన ఎడమకన్ను తప్ప మిగతా శరీరమంతా అచేతనమైపోయిందని తెలుసుకుని, కదిలే ఒక్క కనురేప్పతో జీవితాంతం పక్క మీద అలా పది ఉండకుండా పుస్తకం రాయాలనుకుని అసిస్టెంట్ ఒక్కో ఆల్ఫాబేట్ చెబుతుంటే , సరైన అక్షరం వచ్చినప్పుడు రెప్ప అల్లాదిన్చేవాదట. ఆ విధంగా రెండు మిలియన్ కనురెప్పల కదలికలతో తయారైన ‘ద డైవింగ్ బెల్ అండ్ ద బటర్ ఫైయ్’ మార్కెట్లో విడుదలై సంచలనం సృష్టించింది. చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్య చేసుకున్దామనుకునేవారు ప్రేరణ పోడాల్సిన యదార్ధ గాధఇది. ఇలా చెప్పుకుంటూ పొతే వికలాంగులు, మానసిక వికలాంగులు....ఎందఱో....వాళ్ళ కన్నా మనకి దేవుడు ఎన్ని రెట్లు మేలు చేసాడు....

 అసలు మానవ ప్రవృత్తే చిత్రమైనదేమో నీళ్ళల్లో మునిగితే నీల్లది, రాయి తగిలితే రాయిడి తప్పంటాడు. ఆఖరికి ఏమీ చెయ్యలేని, చేవలేని, చేతగాని చవతైనా తనను పుట్టిచిన దేవుదినో లేదా తలరాతనో తప్పు అంటాడుగాని అసలు తన తప్పులను మాత్రం ఎప్పుడు ఒప్పుకోడు.

చావు అన్ని సమస్యలకు పరిష్కారం కాదని వీరికి చాటి చెప్పాలి. ప్రతి సమస్య కోక పరిష్కారం ఉంటుంది. ఇటీవల ఎవరో ఇలా ఆత్మహత్య చేసుకోవాలి అనుకునే వాళ్ళు వారిని కలిస్తే వారికి కౌన్సిలింగ్ ఇస్తారని విన్నాను. అలా ప్రపంచంలో ఎందఱో ఉన్నారు. అందరికీ ఈ సౌకర్యం అందాలంటే మనలాంటి వారమేవరమైనా మన చేతులోని సహాయం చేస్తే ఒక జీవితాన్ని నిలబెట్టిన వారమవుతాం. మానవ జన్మ కొక్కదానికే ఆలోచించే శక్తి, మాట్లాడే శక్తి లాంటి ఎన్నో అద్భుత శక్తులిచ్చ్చాడు దేవుడు. అందుకే ఇకముందు రైతు ఆత్మహత్యలేగానీ ఎటువంటివి లేకుండా మనమొక సంఘం గా ఏర్పడి మనవంతు ప్రయత్నం చేద్దాం. దీనికి నీ సహకారాన్ని ఆశిస్తూ...


నీ ప్రియనేస్తం  


   


Rate this content
Log in

Similar telugu story from Inspirational