Chintapalli SivaSanthosh

Inspirational

4.3  

Chintapalli SivaSanthosh

Inspirational

నేటి భారతం

నేటి భారతం

5 mins
520


ఒక పాతబడిన ఇల్లు ఉంటుంది.ఇంటి బయట ఇద్దరు వ్యక్తులు కాపలా ఉంటారు.

ఒక వ్యక్తి బండి మీద అక్కడికి వచ్చాడు.అతను పోలీసు ఆఫీసర్ కౌశల్.

బయట నిలబడి ఉన్న ఇద్దరు వ్యక్తులు అతనికి సెల్యూట్ చేశారు.వాళ్ళిద్దరూ కానిస్టేబుల్స్.

కౌశల్: మనం చేసిన కూబింగ్ గురించి ఎట్టి పరిస్థితుల్లో బయటకి రాకూడదు.

కానిస్టేబుల్: ఎస్ సార్!

కౌశల్: ఎక్కడ మన క్రామేడ్?

కానిస్టేబుల్: లోపల సార్!

కౌశల్ లోపలికి వెళ్ళగానే గది తలుపులు మూసివేస్తాడు కానిస్టేబుల్.

ఆ గదిలో కామ్రేడ్ ను కుర్చీలో కట్టేసి ఉంచుతారు.

లోపలికి వెళ్లిన కౌశల్…

కౌశల్: హాయ్ హాయ్ మావాళ్ళు ఏమైనా ఇబ్బంది పెట్టారా?

కామ్రేడ్: (నవ్వుకుంటాడు)

కౌశల్: అయితే ఇబ్బంది పెట్టలేదు?

కామ్రేడ్: 250 మంది కానిస్టేబుళ్లు,100 సర్కిల్ ఇన్స్పెక్టర్లు, 1 కమిషనర్

నన్ను పట్టుకోవాడానికి మీరు ఏమి ఇబ్బంది పడలేదుగా!

కౌశల్: బాగా ఇబ్బంది పెట్టావ్(నవ్వుతూ) కానీ ఇది నా ఆపరేషన్, ఇక్కడ నుండి నువ్వు తప్పించుకోలేవ్.తప్పించుకోవడానికి ప్రయత్నం చేయకు,మా తుపాకీ లకి పని చెప్పకు.

కామ్రేడ్: మీరు నన్ను ఎన్ కౌంటర్ చేయాలి అనుకుంటే నిన్నే జరిగిన కూ బింగ్ లొనే చేసే వాళ్ళు, కానీ నన్నుమీరే తప్పించి ఈ రోజు మీ ముందు ఇలా కూర్చోబెట్టుకున్నారు.

కౌశల్: కామ్రేడ్ జార్జ్ అలియాస్ జాగర్ల రాధాకృష్ణ, గోల్డ్ మెడల్ ఇన్ న్యూక్లియర్ సైన్స్.

2010 లో కామ్రేడ్ శంకరం దళంలో సభ్యునిగా జాయిన్ అయ్యి,

మాధవపట్నం పోలీస్ స్టే షన్ పేల్చివేత లో కీలకపాత్ర పోషించావ్,

తొర్రెకుర్రు mro చంపి కమాండర్ గా మరి,ఆ పై నల్లమల దళానికి కామ్రేడ్ అయ్యావు.

What a journey? కానీ ఏమీ సాధించావ్? ని తలపై 25 లక్షల రివార్డు తప్ప.

కామ్రేడ్: మీరు కాల్చే తూటా విలువకి విలువ కొన్ని లక్షల రూపాయిలు,

మా తూటా విలువ సామాన్య ప్రజాలా శ్రేయస్సు,

ఇందుకు ముందు చెప్పారే మాధవపట్నం పోలీస్ స్టే షన్ పేల్చివేత అని దానికి కారణం మీ పొలీస్ లే ఒక MLA తప్పు చేస్తే ,వాడ్ని వదిలేసి ఎందుకు అని అడిగినందుకు పది మంది రైతులుని కనీస దయ లేకుండా లాఠీ చార్జి చేశారు అందుకే స్టేషన్ ను లేపేసాం.

కౌశల్: అయితే మీరు చేసేది ప్రజల కోసం అంటావ్?

కామ్రేడ్: ఒక జాతి స్వేచ్ఛ వాయువులు కోసం పోరాడితే తిరుగుబాటు అన్నారు.

ఒక జాతి తమ హక్కుల కోసం పోరాడితే ఉద్యమం అన్నారు.

సమస్త జాతి సంరక్షణ కోసం మేము చేస్తున్న ఈ యుద్దాన్ని విప్లవం అన్నా రు. ఎందరో కామ్రేడ్ లు వారి ప్రాణాలు ఈ ప్రజల కోసం , దేశం కోసం త్యాగం చేస్తే మీ పోలీసులు,ప్రభుత్వాలు రివార్డు పేరు చెప్పి డబ్బులుగా చూస్తున్నారు.

మేము ప్రాణాలకు తెగించి ఇందులోకి దిగం సార్, ప్రాణాలు వదులు కునే దిగుతాం.

కౌశల్: అంటే మీ దృష్టిలో మీరు చేసే విప్లవం మీరు ప్రజల కోసం చేసే యుద్ధం అంతేనా?

కామ్రేడ్: అవును మేము చేసేది యుద్ధమే…

అవినీతి ప్రభుత్వాలు నుండి, నీచమైన రాజకీయ నాయకులు నుండి సామాన్య ప్రజలును రక్షించడమే దాని లక్ష్యం.

కౌశల్: మీరు చేసే యుద్దం ప్రజల కోసమే అయితే , అదే యుద్దలో ఎందరో అమా యకులు ప్రాణాలు కోల్పోతుంటే మీరు చేసే యుద్దానికి విలువ ఏమి ఉంది.

కామ్రేడ్: సార్! మేము చేసే పనికి విలువ, ఒక అర్ధం లేకపోయి ఉంటే మీరు ఎప్పుడో నన్ను ఎన్ కౌంటర్ చేసి ఉండే వారు.

కౌశల్: ఎన్ కౌంటర్ ….. అన్నిసార్లు ఎన్ కౌంటర్ నే కరక్ట్ అని నేను నమ్మను అందుకే నిన్ను ఎన్ కౌంటర్ నుండి తప్పించాను. మనిషి చేసే ప్రతి పని వెనుక బలమైన కారణం ఉంటుంది. నేను నీ వెనుక ఉన్న కారణం తెలుసుకోవాలి అనుకుంటున్న.

కామ్రేడ్: ఏంటి సార్ ఇంటరాగేషనా???

కౌశల్: కాదు చెప్పు

కామ్రేడ్: అగ్గిసముద్రం,శ్రీకాకుళం జిల్లా, ఒడిస్సా రాష్ట్ర సరిహద్దు.

సత్యమూర్తి మా నాన్న జర్నలిస్ట్, మహాలక్ష్మి మా అమ్మ.

సార్ మా ఊరికి వైద్యం ఇరవై మైళ్ళ దూరం,

చదువు రెండు ఊర్ల దూరం,

నీళ్లు బావులు ఎండనంత దూరం, కానీ చావులు ఒక వాకిలి దూరం అంతే

మా ఊరు mla రంగనాయకులు, సర్కార్ నుండి మా ఊరికి వచ్చే నిధుల న్నీ వాడి ఖాతాకే పోతాయి, రేషన్ బియ్యం వాడి గుడామ్ కి పోతాయి, ప్రభుత్వ పథకాలన్నీ వాడి పెరట్లో కి పోతాయి.ఇంకా పేదలకు ఏమి అందుతాయి. అందుకే మా నాన్న పేపర్లు లో అనేక సార్లు ఈ దౌర్జనాలు గురించి రాసిన వాటి వల్ల పెద్ద ఉపయోగం ఉండేది కాదు. కానీ ఒక సారి ఎన్నికల్లో అధికారం జన్ కాంగ్రెస్ పార్టీ నుండి ప్రజాదేశం పార్టీకి మారింది. ప్రజాదేశం పార్టీ అధికారంలోకి రాగానే మా నాన్న రాసిన వార్తలు వల్ల , ప్రతి పక్ష నికి చెందిన రంగనాయకులు మీద చట్ట పరమైన కేసులు నమోదు చేయించి జైల్ కి పంపించింది.కొన్ని రోజులకు బెయిల్ మీద బయటకు వచ్చిన రంగనాయకులు మా నాన్న మీద కోపంతో అమ్మ నాన్నని ఇద్దరిని చంపించాడు.ఎందుకు చంపించావ్ అని ఆడిగింనందుకు. ఆస్తి కోసం నేనె మా అమ్మ నాన్న ని చంపనాన్ని నా మీద తప్పుడు కేసులు పెట్టి, దొంగ సాక్ష్యాలు పుట్టించి నన్ను జైల్ కి పంపించాడు.

అపుడే జైల్ లో పశ్చిమ నల్లమల దళం కమాండర్ కామ్రేడ్ రాజన్న పరిచయం జరిగింది. నా గురించి తెలుసు కుని, నీకు జరిగిన అన్యాయం కాదు ఇది,నిలాగే చాలా మందికి ఇటువంటి అన్యాయమే జరుగుతుంది.అలాంటి వాళ్ళకి న్యాయం చేయడానికి నల్లమల అడవుల్లో ఒక చీకటి సైన్యం ప్రజలు కోసం యుద్ధం చేస్తోంది.నువ్వు కూడా ఆ సైన్యంలో చేరు.నీకు కలిగిన బాధని ధైర్యంగా, తెగింపుగా మార్చుకో,అమాయక ప్రజల కోసం పోరాడు.రాజాన్నే నాకు బెయిల్ ఏర్పాటు చేయించి నన్ను జైలు నుండి బయటకు తీసుకువచ్చారు.బయకు వచ్చిన మరుక్షణమే అడవు లకి పోయిన కామ్రేడ్ శంకరన్న దళంలో చేరా,మా mla ని చంపినా,మా ఉరుకి రావాల్సిన అన్ని సర్కార్ సంక్షేమ పధకాన్నింటిని మా ఊరికి తీసుకొచ్చినా. ఈరోజు లో కాలుపట్టుకుని అయ్యా బాబూ అంటే ఎవడు పట్టించుకోడు, అదే ఒక తుపాకీ తలకి పెడితే ఐదే ఐదే నిమిషాల్లో మొత్తం పని జరిగిపోతుంది అని తెలుసుకున్న అప్పుడు నుండి మొదలు పెట్టాయి ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ,ఎక్కడ దౌర్జన్యం జరిగితే అక్కడికి పోయిన సామాన్య ప్రజలకు సాయం చేశా అంతే.

కౌశల్: అయితే ఇది నీకు జరిగిన అన్యాయం కోసం చేస్తున్నావు అంతేనా?

కామ్రేడ్: అవును

కౌశల్:అలా అయితే ఇది ని స్వార్ధం కోసం చేస్తున్నావు గాని,సమాజం కోసం అని ఎలా అంటున్నావు?

కామ్రేడ్: చరిత్రలో జరిగిన ఎన్నో యుధ్ధాలు వారి వ్యక్తిగత గానే జరిగాయి కానీ వాటి ఫలితాలు మాత్రం లోకకల్యాణం కోసమే వచ్చాయి. ఇప్పుడు మేము చేసేది అదే…

కౌశల్: ఒకే ఓవర్, ఇప్పుడు మేము నిన్ను చంపుతాం, నీ చావు కూడా ప్రజల కోసమే అనుకుంటావ్ అంతే నా,

కామ్రేడ్: కాదు నా చావు ప్రజలకు ఉపయోగపడ కపోవచ్చు,కానీ నా చావు మరో కొంత మందికి ఆదర్శంగా నిలిస్తే మరో వందేళ్ళపాటు ఈ విప్లవం కొనసాగుతుంది అది చాలు నాకు….

విప్లవం వర్ధిల్లాలి…జోహార్ కామ్రేడ్….

కౌశల్:ఇక నీకు వీడ్కోలు పలకవసిన సమయం వచచ్చింది. కామ్రేడ్,నా ఈ బుల్లెట్ తో నువ్వు కోరుకున్న విరమరణాన్ని పొందు.

తుపాకీ శబ్దం మొగుతుంది….

రాష్ట్రం అంతా ఒకటే వార్తా

ఆంధ్ర ఒడిస్సా సరిహద్దులో పోలీస్ కుబింగ్,నక్షలైట్ లు పోలీస్ ల మధ్య కాల్పులు, నల్లమల దళం కమెండర్ కామ్రేడ్ జార్జ్ ఎన్ కౌంటర్ ,మృతదేహం లోయలో పడిపోయింది.మృతదేహం కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు.

అగ్గి సమముద్రం అంతా విషాదఛాయలు అల్లుకున్నాయాయి.

మిగిలిన దళాలు కామ్రేడ్ జార్జ్ కు సంతాపాన్ని తెలియజేస్తూ జిల్లా మొత్తం కరపత్రాలు అంటించాయి.

పోలీస్ ఆఫిసర్ కౌశల్ ఆఫీస్:

కౌశల్ ఎదో పనిలో ఉంటాడు.జార్జ్ కాపలాగా ఉన్న కానిస్టేబుల్స్ వస్తారు.

కానిస్టేబుల్: సార్! మాకు ఒక సందేహం నిన్న మీరు వాడ్ని చంపలేదు.కానీ మీడియాకు ఎందుకు అలా చెప్పారు సార్.ఎన్ కౌంటర్ చేసేసాం అని మాకు అర్ధంకాలేదు సార్

కౌశల్:అవును వాడ్ని మనం ఎన్ కౌంటర్ చేయలసిందే కానీ వాడ్ని ఎందుకు విడిపెట్టాను ఎందుకంటే

మనం జనాల మధ్య ఉంటూ , జీతాలు తీసుకుంటు రాజకీయ నాయకులు చెప్పినట్టు చేస్తాం.కానీ వాళ్ళు జనాలకు దూరంగా ఉంటూ ,జీతాలు తీసుకోకుండా ప్రజాలు కోసం పనిచేస్తున్నారు,వాళ్ళకి న్యాయం చేస్తున్నారు.అటువంటి వాళ్ళు ఉండాలి ఈ భూమి మీదా,

కానిస్టేబుల్: కానీ మనం మాములుగా వదిలేయచ్చుగా,ఎం కౌంటర్ అని చెప్పడం ఎందుకు సార్?

కౌశల్: వాడి మీద రివార్డు ఉంది , ఈ రోజి మనం వాడ్ని వదిలేసిన ,మనలో ఒకడు ఆ డబ్బు ల కోసం వెతికి మరి ఎన కౌంటర్ చేసే అవకాశం ఉంది.అదే మనం ఎన్ కౌంటర్ చేసాం అని చెప్పాం కాబట్టి ,వాళ్ళు వాడ్ని వెతికే ప్రయత్నం అపుకుంటారు.

విచక్షణ లేకుండా చంపితే అది హింసా అవుతుంది,విచక్షణ తో చేస్తే అది న్యాయం అవుతుంది.

ఇంతలో మరో కానిస్టేబుల్ అక్కడికి వస్తాడు….

సార్ మనం కుబింగ్ చేసిన నల్లమల దళం వాళ్ళ నూతన కామ్రేడ్ ను నియమించుకున్నట్లు కరపత్రాలు వదిలి వెళ్లారు సార్…

కౌశల్: ఎవరు ఆ కొత్త కామ్రేడ్

కామ్రేడ్ రాధాకృష్ణ అలియాస్ (లేటు) కామ్రేడ్ జార్జ్

ఎందరో అమరవీరులు… అందరికి జోహార్లు…..Rate this content
Log in

Similar telugu story from Inspirational