Chintapalli SivaSanthosh

Others

4.4  

Chintapalli SivaSanthosh

Others

రుధిరం

రుధిరం

6 mins
238


కారంచేడు, ప్రకాశం జిల్లా

జులై 16,1978 అర్ధరాత్రి 1.45 సమయం

కారంచేడు లో చెరువుకు పక్కాగా ఉన్న మల్లన్నపాడు పైకి దాడి చేయడానికి ప్రణాలికను సిద్ధం చేస్తున్నాడు గోవిందారామయ్యా.గోవిందారామయ్యా చుట్టూ సుమారు వంద మందికి పైగా మద్దతుదారులు గోవిందారామయ్యా చెపుతున్న విషయాలు జాగ్రత్తగా వింటున్నారు. ఇప్పుడు వాళ్ళు మల్లన్నపాడు పైకి దాడి చేయబోతున్న రూ.గోవిందారామయ్యా వర్గం చేతుల్లోకి మరణ ఆయుధాలు తీసుకుని మల్లన్నపాడు లోకి ప్రవేశించారు.

నలబై ఇల్లులు కూడా లేని మల్లన్నపాడు పై ఒక్కసారిగా దాడి చేశారు. ఇళ్లలోకి చేరి మగవాళ్ల పై దాడి చేయడం, వారి చంపేయడం మొదలుపెట్టారు. ఆడవాళ్ళు భయంతో బయటకు పరుగులు తీశారు.ఒక్కసారిగా మల్లన్నపాడు లో ఏమి జరుగుతోంది వారికి అర్ధం కావడం లేదు.అందరూ పరిగెత్తడం మాత్రమే చేస్తున్నారు అంతే.

మల్లన్నపాడు అంతా ప్రాణభయంతో పరుగులు తీస్తూ పరుగులు తీస్తూ మల్లన్నపాడు కు పది కిలోమీటర్లు దూరంలో ఉన్న ఒక చర్చ్ లోకి చేరారు. అందరూ ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ చర్చ్ లో ఎప్పుడు తెల్లారు తుందో అని ఎదురుచూస్తున్నారు.


కేంద్రకారగారం,రాజమహేంద్రవరం

జనవరి 19,2018 ఉదయం 10 సమయం


జైల్ అధికారి వెంకటేష్ తన రూమ్ లో వున్నాడు. ఈరోజు విడుదల చేయబోతున్న ఖైదీ సూరీడు కి సంబంధించిన కేసు వివరాలు మరియు విడుదల చేయడానికి కావలసిన పత్రాలను సిద్ధం చేస్తున్నాడు. సిద్ధం చేసిన తర్వాత కానిస్టేబుల్ ను పిలిచి ఖైదీ 765 ను ఈరోజు విడుదల చేయబోతున్నాం కదా అతన్ని తీసుకురండి అని ఆదేశించాడు.కానిస్టేబుల్ వెళ్లి సూరీడు దగ్గరరీ కి పోయి చెప్పినాడు. సూరీడు తన తోటి ఖైదీ లకి వీడ్కోలు పలికి జైలు అధికారి కాడికి పోయినాడు.

జైలు అధికారి,సూరీడు ఈ రోజు నువ్వు విడుదల కాబోతున్నాయావ్ తెలుసుగా,ఇదిగో ఇడ సంతకం పెట్టు అన్నాడు,

సూరీడు సంతకం చేసి తనకు రావలసిన డబ్బులు తీసుకుని ,బయలుదేరే ముందు అధికారికి నమస్కారం చేసి, తన ఊరి కి బయలుదేరాడు.

మల్లన్నపాడు,సూరీడు ఇల్లు

తన పెనివిటి జైలు నుండి విడుదలవుతాడాని తెలిసిన సూరీడు భార్య పద్మ ఉదయనే లేచి ఇల్లు అంతా శుభ్రం చేసి,వాళ్ళ బిడ్డ రామయ్య లేపి వాడ్ని రెడీ చేసి,ఇంటికి తాళ్ళం వేసి తన కొడుకుని తీసుకుని బయలుదేరింది.దారిలో రామయ్య ఎన్నిసార్లు అడిగిన ఎక్కడికి అనేది చెప్పలేదు పద్మ.

చివరికి ఇద్దరు ఒక ప్రదేశానికి వచ్చి ఆగారు.

ఆ ప్రదేశం పేరు. “ రుధిర క్షేత్రం “

అక్కడ వాళ్లిద్దరూ కూర్చున్న కొద్దిసేపటికి రామయ్య అడిగాడు అమ్మని, ఇక్కడ ఎందుకు కూర్చున్నాం అమ్మ అని,

పద్మ, బిడ్డ ఈరోజు మీ నాయనా వస్తుండు బిడ్డ జైల్ నుండి అందుకే ఇక్కడ ఎదురుచూస్తున్నాం బిడ్డ అంది.

రామయ్య,అమ్మ! నాయనా జైలు ఎందుకు పోయినాడు, ఏమైనా తప్పు చేసినాడా ఏంది

పద్మ,తప్పు చేయలేదు బిడ్డ, అంటూ వాళ్ళ వెనుక ఉన్న అమరవిరులా స్తూపం వైపు చూస్తూ

“ యుద్ధం చేసి,మాదమెక్కిన రాక్షసులను సంహరించాడు బిడ్డ “


జూన్ 18, 1978


మల్లన్నపాడు, కారంచేడు లో ఒక చిన్న భూభాగం.ఇక్కడ నివసించేవాళ్ళు దళితవర్గానికి చెందినవాళ్ళు.తరతరాలుగా నివిసిస్తున్న కుటుంబాలు అవి.మల్లన్నపాడు అనుకుని ఒక చెరువు అనుకుని ఉంటుంది.

మిగిలిన కారంచేడు లో అగ్రవర్ణానికి చెందిన ఒక సామాజికవర్గానికి చెందినవారే ఎక్కువే.వాళ్ళు వంద కుటుంబాలకు పైనే.మల్లన్నపాడు చెందిన వాళ్ళు కొంత మంది వీళ్ళ దగ్గర పని చేసుకుని బతికే వాళ్ళు.మిగిలిన వాళ్ళు వాళ్లకు తరతరాలుగా వస్తున్న పంట భూమిని నమ్ముకుని బతికే వాళ్ళు.

అందులో ఒక కుటుంబం రామయ్య కుటుంబం, భార్య సరోజా,కొడుకు సూరీడు.

రామయ్య చెల్లెలు నారాయనమ్మ కూడా మల్లన్నపాడు లొనే ఉంటుంది.నారాయనమ్మ భర్త మరణించాడు. కొడుకు యేసయ్య,కూతురు పద్మ.

చెల్లెలు కోరిక మేరకు పద్మను ఇంటి కోడల్ని చేసుకున్నాడు రామయ్య.

యేసయ్య,సూరీడు మధ్య స్నేహం చాలా బాగా ఉండేది.వీరిద్దరు మల్లెన్నపాడుకి కృష్ణార్జునాల ఉండేవారు.రెండు కుటుంబాలు కూడా వ్యవసాయం చేసుకుని బతుకు తున్నారు. సుఖసంతోషాలతో రెండు కుటుంబాలు మరియు మల్లన్నపాడు జీవనం గడుపుతున్నా వారి జీవితాల్లో కి వచ్చాడు గోవిందారాములు.

గోవిందారాములు కారంచేడు కి పెద్ద మనిషి. ప్రెసిడెంట్. వందల ఎకరాలు ఉన్న అసామి.మల్లన్నపాడు లో చాలా మంది గోవిందారాములు వద్దే పనిచేస్తున్నారు.

గోవిందరాములుకి ఆత్మగౌరవం తోపాటు పరువుని కూడా ప్రాణాంతో సమానంగా చూసుకునే వ్యక్తి. గోవిందారాములుకి రాజకీయంగా కూడా పలుకుబడి ఉన్న వ్యక్తి.

కారంచేడు లో ఈ సంవత్సరం వర్షాలు లేక కరువు వచ్చింది.త్రాగు నీరు,సాగు నీరు దొరకక మల్లన్నపాడు అల్లాడుతున్న సమయం అది.

గోవిందారాములు రాజకీయ ప్రవేశం చేయాలని ఆలోచనలో ఉండగా,అధికార పార్టీకి చెందిన ఒక నాయకుడిని కారంచేడు కి వచ్చేలా చేసి తన బలాన్ని చూపించాలని అనుకున్నాడు.అనుకున్న ట్టుగానే అధికార పార్టీ ప్రతినిధి ఆహ్వానించాడు.

నీరులేక కష్టాలు పడుతున్న మల్లన్నపాడు ప్రజలు ఒకరోజు రాత్రి సమావేశం అయ్యారు. మల్లన్నపాడు కి పెద్దగా వ్యవహరించే రామయ్య ఆ సమావేశాన్ని మొదలుపెట్టారు.

రామయ్య, ఈ సంవత్సరం వర్షాలు లేక మనకు గడ్డుకాలం నడుస్తుంది.

మనకి దాహం తీరాలన్న, 

కడుపు నిండాలన్న,

పంట పండలన్నా, మనకి నీరు కావాలి.కాబట్టి మన మల్లన్నపాడుకి అనుకుని ఉన్న చెరువులో నీటిని వాడుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను.ఎన్నో తరాలు నుండి మన వాళ్ళు ఇక్కడే వున్నప్పటికి ఏనాడు చెరువు నీటి వాడుకోలేదు.ఇప్పుడు మనం వాడుకుందాం.తప్పు ఏముంది.నాకు ఇదే సరి అయిన ఉపాయం అనిపిస్తుంది.

యేసయ్య , కానీ మామ ఆ చెరువు నీరు కారంచేడు వాళ్లే వాడుకుంటూరు,మనకి అంటే వాళ్ళు ఇస్తారో లేదో మామా???

సూరీడు,అదేంటి బావ అలా అంటివి, నాయనా చెప్పినాడు మనం ఏనాడు ఆ చెరువు నీటిని వాడుకోలేదు అని,అంటే అప్పటి సంది వాళ్లే వాడుకుంటి రి.మనకి ఈ సారి దాని అవసరం వచ్చింది కాబట్టి మనకి చెరువు నీటి వాడుకోవచ్చు. దాని కాదు అనే అధికారం ఎవరికి లేదు.చెరువు వాళ్ళు ఒక్కరిదే కాదు.అందరిదీ.

రామయ్య , సూరీడు అన్ని చోట్లా దూకుడు పనికిరాదు, ఎంత అయిన వాళ్ళు ఉన్నోళ్లు వాళ్ళతో మనకెందుకు రా,

రేపు నేను పోయి వాళ్ళతో మాట్లాడి చూస్తా,

సూరీడు, నాయనా వాళ్ళు ఒప్పుకున్న లేకున్నా నీళ్లు మనకు గావాలి అంటూ అక్కడ నుండి పోయినాడు.

మరునాడు ఉదయం, గోవిందారాములు ఇల్లు

గోవిందారాములు ఆరుబయట కుర్చీలో కూర్చుని ఉన్నాడు.

రామయ్య గోవిందారాములు వద్దకు వచ్చాడు.అయ్యా అని నమస్కరించాడు.

గోవిందారాములు, ఏమిరా రామయ్య ఇట్టా వచ్చినావ్?

రామయ్య, మీకు తెలవంది కాదు , ఈ యేడు వర్షాలు లేవు , త్రాగడానికి నిరులేక,పంట లేక పస్తూలు ఉంటున్నాం.

గోవిందారాములు, అయితే 

రామయ్య, ఏమి లేదు అయ్యా మా మల్లన్నపాడుకి అనుకుని ఉన్న ఆ చెరువు నీరు వాడుకోవాలని అనుకుంటున్నాం,

గోవిందారాములు, ఏట ఏ ట్టా చెరువు నీరు గావాలన మీకు ఎంత ధైర్యం ఉంటే నా కాడికి వచ్చి మేము త్రాగే చెరువు నీరు మీకు గావాలన మీకు అంటూ కాలితో తన్ని బయటకు నెట్టి వేసాడు.

తన తండ్రికి జరిగిన అవమానం తెలుసుకున్న సూరీడు,గోవిందారాములు వద్దకు పోయి చెరువు నీరు ను మల్లన్నపాడు కూడా వాడుకుంటుందని ఎవ్వరికి కాదు అనే అధికారం లేదని హెచ్చరించాడు. దానితో కోపంతో ఊగిపోయిన గోవిందారాములు సూరిడీని తన మనుషులతో కొట్టించి,అన్యాయం గా సూరిడీని పోలీస్ స్టేషన్లో పెట్టించి పోలీసులు తో కొట్టించాడు.

వారం రోజులు తరవాత సూరిడీని పోలీసులు విడిచిపెట్టారు.


ఇది జరిగిన మరుసటి రోజు గోవిందారాములు మల్లన్నపాడులో ఒక దండో రా వేయించాడు, “ రేపు ఉదయం , అనగా 10 గంటలకు ప్రెసిడెంట్ గారు గోవిందారాములు అభ్యర్ధన మేరకు అధికార పార్టీ ప్రతినిధి ఒకరు మన కారంచేడు గ్రామానికి విచ్చేయుచున్నారు.కావున కారంచేడు తో పాటు మల్లన్నపాడు ప్రజలు కూడా రేపు వచ్చి సమావేశాన్ని విజయవంతం చేయాలని ప్రెసిడెంట్ గారు ఆదేశించారు రోహో…. “

మల్లన్నపాడు సమావేశం అయ్యంది.

సూరీడు మాట్లాడుతూ, ఇది తన రాజకీయ ప్రవేశం కోసమే తప్ప మనకు ప్రయోజనం చేకూర్చాలని కాదు అని.మనల్ని అడ్డు గా ఉంచుకుని తన బలంగా చూపించాలని తప్ప మనకు మంచి చేయలనికాదు. కాబట్టి మనం ఎవరు రేపు జరగబోయే సమావేశానికి వెళ్లకూడదని తన అభిప్రాయం అని చెప్పాడు.

యేసయ్య, బావ చెప్పింసి అక్షర సత్యం,మనకు మేలు చేయాలని అనుకునే వారు అయితే మనకి చెరువు నీటి విషయంలో చేసేవాడు గాని ఇంటి వెళ్లిన రామయ్య మామతో అలా ప్రవర్తించే వాడ.ఇప్పుడు మాన అవసరం వచ్చింది కాబట్టి మనం ఎందో మనం కూడా చూపించాలంటే రేపు మనం ఎవరు పోవద్దు. గోవిందారాములు తమ పట్ల అమానుషంగా ప్రవర్తించిన కారణంగా కొన్ని కుటుంబాలు సమావేశాన్ని బహిష్కరించాలని తీర్మానించాయి.అయితే కారంచేడు పనిచేసుకుని బతికే కొన్ని కుటుంబాలు మాత్రం తమకు తప్పదు అని మాకు బతుకు దేరువు పోతుందేమో అన్న భయంతో వెళ్లాలని నిశ్చయించుకొన్నారు.దానికి రామయ్య కుటుంబం గాని మిగిలిన కుటుంబాలు గాని అడ్డు చెప్పలేదు.

మరునాడు ఉదయం…

కారంచేడు మొత్తం హదావీడా కోలాహలంగా ఉంది.గోవిందారాములు ,అధికార పార్టీ ప్రతినిధిని ఊరేగింపు గా మల్లన్నపాడు మీద గా కారంచేడు లోని తన ఇంటికి తీసుకుపోయినాడు.సమావేశం జరిగింది గాని జనాలు ఎవరు పెద్ద సంఖ్యలో లేకుండానే సమావేశం ముగిసింది.

గోవిందారాములు ,మల్లన్నపాడు పై ఆగ్రహంతో రగిలిపోయాడు.దీనికి కారణం అయిన సూరీడు,యేసయ్య పై ప్రతికారం తీర్చుకోవాలని అనుకున్నాడు.

ఇది జరిగిన రెండు రోజులు తర్వాత అధికార ప్రతినిధి నుండి గోవిందారాములు కు ఫోన్ వచ్చింది. తనను కలవడానికి హైదరాబాద్ రమ్మని.గోవిందారాములు వెళ్ళాడు.ప్రతినిధితో సమావేశం అయ్యాడు గోవిందారాములు.

ప్రతినిధి, చూడండి గోవిందారాములు గారు మీ నియోజకవర్గంలో మీ పలుకుబడి పట్ల

మొన్న జరిగిన పార్టీ సమావేశంలో పార్టీ పెద్దలు ఆసక్తిగా లేరు.దానికి కారణం మీఊరు లో జరిగిన పార్టీ మీటింగుకి జనాలు రాకపోవడమే.

గోవిందారాములు, అయ్యా! అదేమి లేదు అయ్యా , ఇంకో అవకాశం ఇస్తే

ప్రతినిధి, లేదు గోవిందారాములు గారు, అదంతా నేను చూసుకుంటా కానీ నాకు ఒక పని చేసిపెట్టాలి.

గోవిందారాములు, చెప్పండి అయ్యా ,నా వల్ల అవుతుంది అంటే చేసి పెడ తా

ప్రతినిధి, మన పక్క దేశం వాళ్ళు ఒకరు మందులు తయారుచేసే కర్మాగారం ఒకటి మన రాష్ర్టంలో పెట్టడానికి ఆసక్తిగా వున్నారు. అయితే వాళ్ళకి ఒక ప్రదేశం కావాలి.

మీ ఊరు లో ఉన్న మల్లన్నపాడు , వాళ్ళకి సరి అయిన ప్రదేశం.మీరు గాని మల్లన్నపాడు ని ప్రభుత్వానికి అప్పగిస్తే పార్టీకి చేకూరే లాభం పక్కన పెడితే, మీకు జరిగే లాభం యం.ల్. ఏ సీటు. మీరు ఆలోచించి నాకు చెప్పండి.

గోవిందారాములు, అయ్యా రెండు రోజుల్లో మీకు ఫోన్ చేస్తాను.

అని చెప్పి తిరుగు ప్రయాణం అయ్యాడు.

ఊరికి తిరిగి వచ్చిన తర్వాత తన అనుచరుడు రంగడు తో సమావేశం అయ్యాడు.

గోవిందారాములు, రంగ మనకి రాజకీయం గా ఎదిగే అవకాశం వచ్చింది.ఎట్టి పరిస్థితుల్లో ఏ అవకాశాన్ని వదులుకోకూడదు.

రంగడు, అయ్యా! ఏమి చేయాలో చెప్పండి, చేసేద్దాం

గోవిందారాములు, మల్లన్నపాడు ఇక పై కారంచేడు లో ఉండకూడదు. ఒక్క కారంచేడు మాత్రమే ఉండాలి.

రంగడు, అర్ధమైంది అయ్యా మారణహోమం జరగాలి అంతేనా

గోవిందారాములు, మనం చేసినట్టు మల్లన్నపాడు కు మాత్రమే తెలియాలి బయట ప్రపంచానికి కాదు.దానికి కావలిసిన ఏర్పాట్లు నేను చేసాను.రంగా,ఒకే దెబ్బకు రెండు పిట్టలు నన్ను ఎదిరించిన మల్లన్నపాడు ఉండదు, వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటే నన్నే ఎదురిస్తారు.వాళ్ళకి ఇదే సరి అయిన శిక్ష,

రెండు నా రాజకీయ ఎదుగుదల. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ తప్పు జరగకూడదు, అనుకున్న ది అనుకున్నట్టు జరిగిపోవాలి.

రంగడు, ఈ మారణహోమానికి ముహూర్తం ఎప్పుడు

గోవిందారాములు, వచ్చే 16 అర్ధరాత్రి, మల్లన్నపాడుకి కాలరాత్రి.

గోవిందారాములు పన్నిన పన్నాగం ప్రకారం మల్లన్నపాడు పై దాడి చేసి అనేక మందిని చంపారు.సూరీడు యేసయ్య తో పాటు మరికొంత మంది ఆ మారణహోమం నుండి తప్పించుకుని చర్చి లో తల దాచుకున్నారు.

 గోవిందారాములు అందరూ చనిపోయారు అనుకుని ,తెల్లవారుజామునకు ముందే పోలీసులు సహాయంతో శవాలను చెరువుకు పక్కాగా ఒక గుంత తవ్వి దానిలో పూడ్చిపెట్టాడు.ఇల్లు అన్నింటికీ నిప్పు పెట్టి అగ్ని ప్రమాదం జరిగినట్టుగా నమ్మించాడు.

చర్చలో తలదాచుకున్న వాళ్ళకి ఈ విషయం తెలిసి, దేనికి కారణం గోవిందారాములు అనుకుని వాడ్ని ఎలాగైనా చంపి అలాగే మారణహోమం లో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ చంపి ప్రతీకారం తీర్చుకోవాలని శపథం చేసుకున్నారు.

అదే రోజు రాత్రి,

ఆడవాళ్ళు ను చర్చ్ లొనే ఉంచి మగవాళ్ళు అందరూ బయలుదేరారు. 

గోవిందారాములు ఇంటిపై దాడి చేశారు, కాపలా కాస్తున్న అనుచరులు పై దాడి చేయడం చూసిన గోవిందారాములు వెంటనే ఇంటి నుండి బయటకు పరుగులు తీశారు ,అది చూసిన సూరీడు గోవిందారాములు వెనుక పడ్డాడు.

చేతిలో గొడ్డలితో గోవిందారాములు వెనుకే వస్తున్నాడు,

ఇంతలో పోలీస్ స్టేషన్లలో కి పరిగెడుతూ ఒక్కసారిగా పడిపోయాడు గోవిందారాములు

సూరీడు గోవిందారాములు దగ్గర నిలబడి, పోలీసులు చూస్తుండగానే గోవిందారాములు మెడ పై గొడ్డలితో ఒక వేటు వేసి చంపాడు.

పోలీసులు సూరీడు ని పట్టుకు ని సంకెళ్లు వేసి జైళ్లలో వేశారు.

పోలీసులు కేసు నమోదు చేశారు. 

ఇది తెలుసుకున్న యేసయ్య, భార్య పద్మ దళితులు కోసం పోరాడుతున్న శివయ్య ను కలిశారు. జరిగిన విషయం తెలుసుకున్న శివయ్య ,వారు తరుపు వాదించా డానికి వకీల్ సాబ్ ను నియమించాడు.


జిల్లా కోర్టు,ప్రకాశం


కేసు కోర్టుకు వచ్చింది.ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం మారణహోమం లో పాల్గొన్న కొంతమంది కి జీవిత ఖైదు విధిస్తు, ఆవేశంలో హత్య చేసిన సూరీడు కి పది సంవత్సరాలు సాధారణ శిక్ష విధిస్తు , మల్లన్నపాడు ప్రజలు తగిన సౌకర్యాలు కల్పించి వారిని సాధారణ జీవితంలో తీసుకువచ్చే విద్ధంగా తగిన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.


ప్రస్తుతం….


బస్సు హారన్ తో గతం నుండి బయటకు వచ్చింది పద్మ.బస్సు నుండి దిగాడు సూరీడు.సూరిడీని చూసిన పద్మకు కంట నీరు ఆగలేదు.సూరీడు భార్యను,కొడుకుని దగ్గరకి తీసుకున్నాడు.యేసయ్య ను హత్తుకున్నాడు.తర్వాత

రుధిర క్షేత్రం దగ్గరకు వెళ్ళాడు.కన్నీళ్లు తో నివాళి ఆర్పించాడు.

ఇంటికి బయలుదేరాడు. 



Rate this content
Log in