దైవం మానుష రూపేణా సంతోష్
దైవం మానుష రూపేణా సంతోష్


హైదరాబాద్, కొల్లాపూర్ ను కలిపే జాతీయ రహదారిపై,
చీకటి పొద్దు మొదలవుతున్న సమయంలో,
ఒక కుటుంబం – భార్య, భర్త, ఇద్దరు పిల్లలు లగేజీ మోసుకుంటు నడుచుకుంటూ వెళుతున్నారు.
ఒక ఇంటి వద్ద ఒక పెద్దమనిషి ఆరుబయట కు వచ్చాడు,ఆ కుటుంబాన్ని చూసాడు.
ఆ పెద్దమనిషి ఆ కుటుంబ పెద్ద తో ఇలా అన్నాడు…
“ ఇద్దరు పిల్లలు, ఇంత లగేజీ తో ఎక్కడ నుండి వస్తున్నారు ? “
కుటుంబ పెద్ద , “ అయ్యా! మాది కొల్లాపూర్. హైదరాబాద్ లో కూలి పని చేసుకుంటూ బతుకుతున్నం. అనుకోని ఈ కోరోనా కారణంగా పని లేదు.అడనే ఉంటే అద్దె కట్టాలె, తినడానికి తిండి దొరకటమే కష్టం అయిన మాకు అద్దె ఎలా కట్టగలం.అందుకే మా ఊరికి వెళ్లిపోతున్నాం అన్నాడు.”
పెద్దమనిషి, “ కానీ ఎండలు మండుతున్నాయి,నడవలసిన దూరం చాలా ఉంది. అది తలుచుకుంటే వెళ్ళడానికి భయం వేయడం లేదా ?
కుటుంబ పెద్ద,
” మేము మోసే లగేజీ మాకు భారం కాదు,
మండే ఎండలు మాకు భయం కాదు,
మేము నడుస్తున్న దూరం మాకు కష్టం కాదు, అయ్యా!
మా కడుపున పుట్టిన వీళ్లకు(పిల్లలకు) పుట్టే ఆకలే మాకు భారం,భయం,బాధ,కష్టం.
అని కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పాడు.
అది విని చలించిపోయిన ఆ పెద్దాయన, వాళ్ళ ని ఇంట్లోకి తీసుకెళ్లి భోజనం పెట్టించి,ఆ రాత్రికి బస ఏర్పాటు చేశాడు.
ఆ కుటుంబం ఆ రాత్రికి అక్కడే బస చేశారు.
మరునాడు ఉదయం వాళ్లకు టిఫిన్ పెట్టి,మధ్యాహ్నానికి, సాయంత్రానికి భోజనం ఏర్పాట్లు చేసి,కొంత సొమ్ము ఇచ్చి వారి తిరుగు ప్రయాణానికి ఏర్పాట్లు చేసా డు.
ముక్కుమొహం తెలియని ఆ పెద్దాయన చేసిన సహాయానికి ఆ కుటుంబం చాలా సంతోషించింది.
అందుకే పెద్దలు అంటారు “ దైవం మానుష రూపేణా “ అని…