Chintapalli SivaSanthosh

Inspirational

4.1  

Chintapalli SivaSanthosh

Inspirational

దిశ

దిశ

3 mins
258


దిశ(ఓ గీత కధ) 

            – విధుర

    బెంగుళూరు నగరం, మహారాజ్ విధి, ఇంటి నెం:4. 

ఎప్పుడు లేని కోలాహలం అక్కడ నెలకొని ఉంది. 

చాలా మంది జనం,మీడియా ఆ ఇంటి చుట్టూ గుమ్మిగూడి వున్నారు.

ఇంతకు ఆ ఇల్లు ఎవరిది.ఎందుకు హడావిడి వీధిలో????

వివరాల్లోకి వెళ్ళితే….

బెంగుళూరు నగరపాలక సంస్థ ఎన్నికలు ఉత్తర్వులు వెలువడ్డాయి. బెంగుళూరు నగరంలో ఎన్నికల వాతావరణం నెలకొని ఉంది. 

నామినేషన్ ప్రక్రియ మొదలయింది.ఆయా పార్టీల అభ్యర్థులు,స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు ఎన్నికల అధికారికి సమర్పిస్తున్నారు. 

ఒక అభ్యర్థి నామినేషన్ వేసేందుకు వచ్చ్జింది. తనను చూసి అందరూ ఆశ్చర్యపోయారు.

 ఇంతకీ ఆమె ఎవరు ఆమె కధ ఏమిటి?

గీతా బెంగులూరు నగరంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన అమ్మాయి. Software చేస్తూ కుటుంబానికి తోడుగా ఉంటున్నా అమ్మాయి. తండ్రి ఆరోగ్యం సరిగా లేక ఉద్యోగా లేక కుటుంబ భారం గీతా పై పడింది.తాను సంపాదనపైనే నడిపిస్తుంది.

అలా రోజులు గడుస్తున్నా తరుణంలో,అనుకోకుండా ఒక రోజు, బెంగుళూరు నగరం ఒక సామూహిక అత్యాచారం అన్న వార్తతో నిద్ర లేచింది. ఎవరో నాలుగు వ్యక్తులు ఒక అమ్మాయిని ఒక లారీ కంటైనర్ లో అత్యాచారం  చేశారు.కొన ఊపిరితో ఉన్న అమ్మాయిని పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

నగర కమిషనర్ కేసు వివరాలు తెలియజేస్తూ  అత్యాచారం చేయబడ్డ అమ్మాయి పేరు గీతా, software employee. నిన్న రాత్రి తన డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తెలిసింది. కేసు నమోదు చేశాం నిందితులను పట్టుకున్నాం వారిని రిమాండ్ లో ఉంచి విచారణ జరిపి న్యాయస్థానానికి అప్పగిస్తాం.అమ్మాయికి చికిత్స జరుగుతుంది అతిత్వరలో కోలుకుంటుందని వైద్యులు చెప్తున్నారు. మహిళా సంఘాలు,స్వచ్ఛంద సంస్థలు జరిగిగిన సఘంటనపై అందోళనలు నిరసనలు చేపట్టాయి.బాధితురాలికి న్యాయం జరగాలి అని కమిషనర్ కార్యాలయం ముందు నిరసనలు చేపట్టాయి. 

కొన్ని రోజులకు గీతా కోలుకుంది,కోర్టులో కేసు విచారణకు వచ్చింది.

జెడ్జిమెంట్ 

గీతా అత్యాచార కేసులో బెంగుళూరు కోర్టు తీర్పు ఏమిటి??? 

 విచారణ మొదలయింది పోలీసుల విచారణలో తేలిన విషయాలు, డాక్టర్ యిచ్చిన నివేదికల ఆధారంగా కోర్టు నిందితులకు మరణశిక్ష విధించింది. కోర్టు నుండి బయటకు వచ్చిన గీతా ను ఒక మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్న “ నిందితులకు కోర్టు విధించిన యావజీవశిక్ష పై మీ స్పందన ఏమిటి?" గీతా వాళ్ళు నాకు జీవితకాల శిక్ష విధించారు, నేను వాళ్ళ జీవితానికే శిక్ష విధించాను.సమాజంలో ఇలాంటి ఘటన జరగకుండా ఇది ఒక గుణపాఠం కావాలని కోరుకుంటున్నాను.

రెండు నెలల తర్వాత..   

గీతకు కోర్టు లో న్యాయం జరిగిన,సమాజంలో అన్యాయమే జరిగింది. 

తను పని చేసే చోట తన తోటివారే తోడేలై పిక్కుతినటంతో పనిచేయలేక ఉద్యోగం మానేసింది. తనకు న్యాయం జరగాలని కోరుకున్న వాళ్లే తనను వెలివేయటం మొదలు పెట్టారు.అడుగు అడుగున అవమానలే ఎదురువటంతో గీతా కృగిపోయి గదిలోకి వెళ్లి నిర్భంధ చేసుకుంది.

అలా కొన్ని రోజులు గడిచాక, 

కూతుర్ని ఇలాగే వదిలాస్తే ఎ మమైపోతుందోనన్ని భయపడి ఒకరోజు తండ్రి కూతురుతో మాట్లాడుతూ, ఇంకెన్నాళ్లు ఇలా గదిలో ఉంది బాధ పడతావు,బాధ పడి నువ్వు ఏమి సాధిస్తావ్.రా బయటకు వచ్చి మునుపటిలానే బతుకు. నీకు న్యాయం జరగాలని కోరుకున్న సమాజమే ఇప్పుడు ఎందుకు నీకు అన్యాయం చేస్తుందని అడుగు.

మొన్న కోర్టు దగ్గర చెప్పావు గురుతుందా,మళ్ళీ ఏ ఆమ్మాయికి ఇలాంటి ఘటన జరగకూడదని, దెబ్బ తగిలిన వాడికే నొప్పి తెలుస్తుంది,నిలా మరే ఏ ఆ మ్మాయికి ఇలాంటి దెబ్బ తగలకుండా ఉండా లంటే ఏమి చేయాలి? నువ్వు ఎంతవరకు అపగలవ్ ఆలోచించు? గది నుండి బయటకు రా నిలా ఏ ఆమ్మాయి బలి కకుండా చూసుకోడానికి నువ్వు ఎదో ఒకటి చేయాలి?

మహాభారతం లో ద్రౌపది కి అవమానం,అన్యాయమే జరిగాయి, కానీ వాటి వల్లే కురుక్షేత్రం జరిగి సమాజాని కి మంచి జరిగింది.

నీకు అదే జరిగింది ,నీ వల్లే సమాజానికి మంచి జరగాలన్న,నిలా ఏ ఆమ్మాయికి అన్యాయం జరగకూడద న్న నువు బయటకి రా, తర్వాత నీ ఇష్టం. రెండు రోజుల తర్వాత గీతా బయటకు రావటం,ఎన్నికలలో నిలబడి పోటీ చేయాలని నిర్ణయించుకోవటం జరిగింది.తన స్నేహితులతో కలిసి నామినేషన్ వేసింది. గీతా నామినేషన్ వేయటం బెంగుళూరులో ఒక హాట్ టాపిక్ అయింది.పది మంది తో కలిసి ప్రచారం చేసి అనేక విషయాలను ప్రస్తావించి అనేక మంది ఆమ్మాయి లకు స్ఫూర్తి గా నిలవడంతో గీతాతో నడిచేందుకు అనేక మంది మహిళలు గీతా నేతృత్వంలో నామినేషన్ వేసి ,దేశమంతా బెంగుళూరు ఎన్నికల వైపు చూసేలా చేశారు.బెంగుళూరు లో జనాల సమస్యలు తెలుసుకుంటూ,వాటి పరిష్కారాలును ప్రసావిస్తు గీతా ప్రచారం జరిగింది.

ఎట్టకేలకు బెంగుళూరు నగరపాలక సంస్థ ఎన్నికలు రోజు రానే వచ్చింది,ముందు ఎన్నడూ లేని విధంగా ప్రజలు ఓట్లు శాతం నమోదు అయింది.

ఎన్నికల ఫలితాల రోజు:

ఉదయం నుంచే ఓట్లు లెక్కింపు మొదలయింది.ఎవత్తు దేశం బెంగుళూరు ఫలితాల కోసం ఎదురుచూస్తాన్నాయి.

సాయంత్రం పూర్తి ఫలితం విడుదలయింది.గీతా తో పాటు అనేక డివిజన్ లో పోటీ చేసిన అభ్యర్థులు అందరూ విజయం సాధించారు. గెలిచిన వారందరు గీతా నే తమ పార్టీ మేయర్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఒకప్పుడు అత్యాచారానికి గురైన గీతా ఇప్పుడు బెంగుళూరు నగరానికి మేయర్.

ప్రమాణస్వీకారం రోజు…

ఎప్పుడు లేని కోలాహలం అక్కడ నెలకొని ఉంది. 

చాలా మంది జనం,మీడియా ఆ ఇంటి చుట్టూ గుమ్మిగూడి వున్నారు.

తన అమ్మ నాన్న ఆశీస్సులు తీసుకుని ప్రమాణస్వీకారాని కి బయలుదేరింది గీతా.

“బెంగుళూరు నగర ఆమ్మాయిలా రక్షణ,నగర ప్రజల సుఖసంతోషాలై ధ్యేయంగా పనిచేస్తానాని “ అంటూ ప్రమాణస్వీకారాన్ని ముగించింది.

తన తండ్రి చెప్పినట్టు, తనకు జరిగిన అన్యాయం మారె ఆమ్మాయికి జరగకుండా బెంగుళూరు నగరంలో ఆమ్మాయిల రక్షణ కు అనేక మార్పులు తేచ్చింది.కేంద్రం గీతాను నారిశక్తి పురస్కారం తో గౌరవవించింది.


    ప్రచండ శక్తిని నిలుపుకుని,

    ప్రపంచాన్ని నడిపిస్తున్న మగువుల అందరికి 

పాదాభివందనాలు….

- విధుర



Rate this content
Log in

Similar telugu story from Inspirational