Kuppili Jagadesh

Inspirational

4.6  

Kuppili Jagadesh

Inspirational

చేయూత

చేయూత

7 mins
3.4K


ఉదయం నుంచి ఆహారం లేకపోవడం వల్ల నీరసంగా రోడ్ పక్కన కూర్చున్నాడు అరుల్ (వయసు 8 ఏళ్ళు అనాథ) ఇంతలోనే ఒక కార్ తనకి ఎదురుగా రోడ్ కి అవతలి వైపు ఆగింది. అందులో నుంచి ఒక యువకుడు మందు తాగుతూ భయటకు వచ్చాడు తాగింది ఎక్కువగా కావచ్చు కారు దిగగానే రెండు అడుగులు వేశాడో లేదో కిందపడి పోయాడు. చీకటిలో అతని ముఖం సరిగ్గా కనిపించట్లేదు. కార్ పక్కకి ఆపడం వల్ల ఇండికేటర్స్ బ్లింక్ అవుతున్నాయి వాటి వెలుతురులో అతని ముఖం చూసాడు అరుల్. తను చిన్నవాడే అయిన ఆత్మాభిమానం ఎక్కువ కష్టపడి పనిచేసే వాడే కానీ ఇప్పటి వరకు ఎవరినీ చేయిచాచి అడుక్కోలేదు. కానీ ఇప్పుడు అవసరంవచ్చింది బాగా ఆకలి వేస్తుంది. ఏదైతే అదే అయింది అతన్ని సహాయం అడగాలని అతని దగ్గరకు వెళ్ళి నిలబడి చూస్తుంటాడు. మధ్యం మత్తులో ఉన్న అతను పక్కన ఉన్న అరుల్ ని చూసి ఏంటి అన్నట్లు కనుబొమ్మలు ఎగరేస్తాడు. అప్పుడు అరుల్ ఆకలి గా ఉంది మీరేదన్న పని ఇప్పించండి చేస్తాను ఆకలిగా ఉంది పనిచేసి భోజనం చేస్తాను అని అడుగుతాడు. ఆ మాట విన్న అతనికి ఒక్కసారిగా మత్తు దిగిపోయెంత పనైపోయింది కాసేపు ఎదో ఆలోచించి.

సరే నేను నడిచే స్థితిలో లేను ఇదుగో ఈ డబ్బు తీసుకుని ఏదైన కొనుక్కో అని ఇస్తాడు. దానికి అరుల్ అంగీకరించడు పని చేసాకే ఇవ్వండి ముందు పని చెప్పండి అంటాడు. 

రేపు నువ్వు ఇదే టైం కి ఇక్కడే వెయిట్ చెయ్ నీకు పని ఇప్పిస్తానని ఈరోజు భోజనం చేయి అని అతను చెపుతాడు. సరే అని డబ్బులు తీసుకొని అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు.


భోజనం చేస్తూ మనసులో అతనికి థాంక్స్ చెప్పుకుంటాడు. మరుసటి రోజు సాయంత్రం ఆతని కోసం ఎదురు చూస్తుంటాడు ఎంత సమయం అయిన అతను రాకపోవడంతో చేసేదేమిలేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.


మరునాడు ఉదయం ఎవరైన పనిస్తారేమో అని దగ్గర్లోని లేబర్ అడ్డాకి వెళ్లి నిల్చుని చూస్తుంటాడు ఇంతలో అరుల్ ముందుకు ఒక కారు వచ్చి ఆగుతుంది. అతను బయటకు వచ్చి కారెక్కు అని అంటాడు. సరే అని ఇద్దరు వెళ్తుండగా ఒక షాపింగ్ మాల్ దగ్గర ఆపి అరుల్ చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకుని వెళ్తాడు.

లోపలికి వెళ్లిన అరుల్ షాపింగ్ మాల్ ని ఎప్పుడు బయట నుంచి చూడటమే కాని ఎన్నడూ లోపలికి వెళ్ళలేదు దానివల్ల ఆశ్చర్యంగా చూస్తూ అలాగే ఉండిపోయాడు. ఇంతలో అతను వచ్చి తనకి బట్టలు మార్చుకో అని చెప్పి కొత్తవి ఇస్తాడు ఎందుకు అంటాడు అరుల్. నీకు సమాధానం కావాలా పని కావాలా అని అతను అంటాడు సరే అని మార్చుకుని వస్తాడు. మళ్ళీ ఇద్దరు కార్లో పోతుండగా రెస్టారెంట్ దగ్గర ఆగి లంచ్ చేస్తారు.అతని మాటలు చేతలు ఆశ్చర్యం కలిగిస్తోంది అరుల్ కి కానీ మౌనం గా అంతా గమణిస్తుంటాడు.

లంచ్ అయిపోయాక అరుల్ ని అతని ఫ్లాట్ కి తీసుకొని వెళ్తాడు. అసలు తాను ఏం చేయాలో ఏమి అర్థంకాలేదు అన్నట్టు మొహం ఆశ్చర్యంగా మొహం పెడతాడు అరుల్. ఆ విషయం అర్ధం అయ్యింది అతనికి నువ్వు రెస్ట్ తీసుకో నీకు రేపు ఒకదగ్గరికి తీసుకెళ్తాను అని చెప్పి అతను ఆఫీస్ కి వెళ్ళిపోతాడు. ఇంద్ర భవనం లాంటి ఇంట్లో అరుల్ ఒక్కడే ఎం చెయ్యాలో తెలీక ఇల్లంతా తిరుగుతూ చూస్తూ రోజంతా గడిపేస్తాడు ఇంతలో అతనికి ఒక బుక్ కనిపిస్తుంది..... చదవాలి అనిపించినా కానీ చదవడు గుర్తుగా ఉంటుంది అని ఆ బుక్ ని తీసుకుని తన బ్యాగ్ లో పెట్టుకుంటాడు. చీకటి పడటంతో అతనికోసం ఎదురుచూస్తూ కూర్చున్న చోటే నిద్రలోకి జారుకుంటాడు.

............................................


మార్నింగ్ 5 Am అలారం మొగుతుంది భద్దకంగా అప్పుడే తెల్లారిందా అనుకుంటూ లేస్తాడు అభి అమ్మ కాఫీ అంటు బెడ్ మీద నుంచే అరుస్తుంటాడు. ఆహ్ తెస్తున్న అని అమ్మ గొంతు వినిపించడంతో అమ్మ వచ్చాకే లేద్దాం అని మళ్ళీ కళ్ళు మూసుకుని అలా నిద్ర మత్తులో ఉండిపోయాడు.

ఒక్కసారిగా పెద్ద శబ్దం భూకంపం వచ్చినట్టు ఇల్లంతా ఊగిపోయింది నిద్రలో ఉన్న అభి ఉలిక్కిపడి లేచి చూసే సరికి ఇల్లంతా మంటలు ఎదురు గా అమ్మ నాన్న మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. అది చూడగానే ఒక్కసారిగా గుండె బరువెక్కింది తాను కూడా స్పృహతప్పి పడిపోతాడు. ఆ షాక్ నుంచి తేరుకుని చూసే సరికి తను హాస్పిటల్లో ఉంటాడు కళ్ళ ముందు తల్లిదండ్రులను అలా చూసి ఏమి చెయ్యలేక పోయానని గుండెలవిసిపోయేలా ఏడ్చాడు. అలా కొన్ని రోజుల తర్వాత పోయినవాటిని తిరిగి పొందలేము, దక్కుతుంది అనీ ఆశ ఉన్నప్పుడు దక్కించు కోడానికి ప్రయత్నించాలి.

అని తనకు తానే సర్ది చెప్పుకొని జరిగింది అంతా ఒక పీడకల అనుకుని తన జీవితం గురించి ఆలోచనలు మొదలు పెట్టాడు అభి. చదువు మీద ఆసక్తితో కష్టపడి చదివి ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీ లో జాబ్ సంపాదిస్తాడు. జాబ్ కి తగ్గట్టుగానే బాగా సంపాదించి ఇల్లు కొనుకుంటాడు. తను సాధించింది చూసి ఆనందించేందుకు తల్లిదండ్రులు లేకపోవడంతో ఆ భాదలో మద్యానికి బానిస గా అయిపోతాడు అది ఎవరో కాదు అరుల్ ని సహాయం చేస్తున్న యువకుడే.


నాకు పని ఇప్పించండి అని అరుల్ అడిగిన తీరు అభి కి బాగా నచ్చింది. ఎలాగూ తాను ఒంటరిగా ఉన్న వాడే అరుల్ నా లాగా కాకూడదని అభి ముందే నిశ్చయించుకొన్నాడు.

.......


ఉదయాన్నే అరుల్ కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా నిలబడి ఉన్నాడు అభి. మనం ఒక ప్లేస్ కి వెళ్తున్నాం తొందరగా ఈ డ్రెస్ వేసుకొని రెడి అవ్వు అని చెప్పి డ్రెస్ బెడ్ మీద పెట్టి బయటకు వెళ్ళిపోతాడు. అరుల్ రెడి అయ్యి హాల్ లోకి వచ్చేసరికి. కుర్చీలో కూర్చున్న అభి అరుల్ ని చూసి రెడి అయ్యవా ఇంక పద అని భయలు దేరుతారు కారు తిన్నగా ఒక పెద్ద రెసిడెన్షియల్ స్కూల్ వద్ద ఆగింది అది చూసిన అరుల్ కి ఏం అర్థం కాలేదు నువ్విక్కడే ఉండు ఇప్పుడే వస్తాను అని చెప్పి స్కూల్లోకి వెళ్తాడు అభి. సరిగ్గా గంట సమయం తర్వాత బయటకు వచ్చి అరుల్ ని లోపలికి తీసుకుని వెళ్తాడు ఇక పైన నువ్వు పని చెయ్యాల్సిన అవసరంలేదని. అయినా నీది పని చేసే వయసు కాదు చదువుకునే వయసు ఇక్కడే ఉంటూ 

చక్కగా చదువుకో. నీ బాగోగులు నేను చూసుకుంటా అని అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటాను. ఏదైనా అవసరం ఉంటే ఆఫీస్ వాళ్ళకి నా నెంబర్ ఇస్తాను వాళ్ళకి చెప్తే నాకు ఫోన్ చేస్తారు... అని చెప్పి అక్కడి సిబ్బందికి అరుల్ ని అప్ప్పగించి అభి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు.. 

.............................................


ఒకవైపు అరుల్ క్రమంగా ఎదుగుతున్నాడు.

చదువులో మిగిలిన అన్ని ఆక్టివిటీస్ లో చురుకుగా ఉంటున్నాడు. ఇదిలా ఉండగా అభి మాత్రం తన చెడు వ్యాసనాలు, కోపం, అసహనం కారణంగా ఉద్యోగాన్ని కోల్పోతాడు.. 

కంపెనీ మేనేజ్మెంట్ పేరు పరపతితో ఉపయోగించి అతడి కెరీర్ మీద దెబ్బ కొట్టింది. వేరే కంపెనీలు కూడా అతడికి ఉద్యోగం ఇచ్చేందుకు ముందుకు రాకుండా చేసింది. అలా అతను జీవితంలో ఓడిపోతున్నాడు

మధ్యలో అరుల్ ని చూసేందుకు వెళ్తూ వస్తుంటాడు ఒకరోజు డ్రిల్ల్ పీరియడ్ లో దూరంగా చూసి చేయి ఊపుతాడు అరుల్ తను అభిని చూడటం అదే ఆఖరుసారి. మళ్ళీ అతను కనిపించలేదు.


..................................................


కొన్ని సంవత్సరాలు తర్వాత.... 


అరుల్ కారులో ప్రయాణిస్తూ ఉండగా సడన్ గా కారు ట్రబుల్ రావడంతో బండి దిగి చూస్తుంటాడు ఎదురుగా పెద్ద బంగ్లా చూస్తాడు దాన్ని చూడగానే అతని ఇంతకు ముందెప్పుడో చూసినట్టుంది అని అనుకుంటాడు. దూరంగా అభి అనే పిలుపు వినబడటంతో ఠక్కున గుర్తుకు వచ్చింది అది అభి ఇళ్లు. తనకు జీవితం ఇచ్చిన వ్యక్తిని ఇన్నాళ్లుగా చూడ్డానికి కాదు కదా కనీసం అతని వివరాలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు అని సిగ్గుతో కుమిలిపోతాడు అక్కడి చుట్టుపక్కల వాళ్ళని అడిగి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు కానీ అభి గురించి ఎవరిని అడిగినా తెలీదు అంటున్నారు. అరుల్ మాత్రం ఎలాగయినా అతన్ని వెతకాలి అని నిశ్చయించుకున్నాడు. కానీ ఎక్కడి నుంచి మొదలెట్టాలి అని ఆలోచిస్తూ ఉండగా.. తను చిన్నప్పుడు అభి ఇంట్లో నుంచి తీసుకున్న బుక్ గుర్తుకు వస్తుంది. నిజానికి అది అభి డైరీ వెంటనే దాన్ని తీసుకుని చదువుతుంటాడు.

అతని ఫ్యామిలీ జాబ్ ఇష్టాయిస్టాలు తెలుసుకుంటాడు.

చివరి పేజీ లో "నేను ఒక అబ్బాయిని చూసాను చాలా ఆకలితో ఉన్నా కూడా ముందు పని అడిగాడు. వాడు అడిగిన తీరు నాకు బాగా నచ్చింది నా జీవితంలో నేను కోల్పోయినవి వీడికి అందించాలి". అని రాసుంది అది చదివేలోపే అతని కళ్ళలో నీరు కప్పేసింది...

మరునాడు ఉదయాన్నే తిన్నగా అభి డైరీ లోని ఆఫీస్ అడ్రస్ కి వెల్లి అతని గురించి అడుగగా... అందరూ అతణ్ణి వింతగా చూస్తూ మాకు అతని వివరాలు తెలియవని. ప్రస్తుతం ఇక్కడ వాళ్ళం అంత కొత్తగా చేరినవాళ్ళమే ఒక్క క్లర్క్ తప్ప అతను కాసేపట్లో వస్తాడు అతన్ని అడిగితే తెలియొచ్చు అని చెప్తారు

అలాగే అని అతని కోసం ఎదురుచూస్తుంటాడు కొంతసేపటికి అతను రావటం గమనించిన అరుల్ అతని వద్దకు వెళ్తాడు అతను అరుల్ ని వింతగా చూస్తుంటాడు. అభి గారి గురించి డీటెయిల్స్ కావాలి ఇంటికి వెళ్ళాను ఆయానక్కడ లేరు మీకేమైనా తెలుసా..అని అడుగుతాడు అతను అందుకుని అభి సార్ ఇక్కడ లేడు ఆయన జాబ్ మానేసి చాలా ఏళ్ళు అయ్యింది అంటూ.. జరిగింది అంత చెప్పాడు.. ఆయన చాలా మంచివాడు కానీ ఆయన చెడు వ్యసనాల వల్ల చేతులరా జీవితం చెడగొట్టుకున్నారని చెప్పాడు..

ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలీదు అని చెప్పాడు. నిరాశతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు అతని వివరాలు పూర్తిగా తెలిసిన ఎలా వేతకడం అనే విషయాన్ని అరుల్ అర్థం చేసుకోలేకపోయాడు...నిరాశతో కారులో కూర్చుని ఆలోచిస్తు కూర్చున్నాడు ఇంతలో ఎదురుగా ఒక వ్యక్తి రోడ్ దాటుతుండటం గమనించి సహాయం చేద్దాము అని అతని దగ్గరకు వెళతాడు అతను రోడ్ దాటుతుండగా స్పృహ తప్పిబోల్తా పడతాడు... అది చూస్తున్న అరుల్ వేగంగా వెళ్లి అతన్ని ఒడిలో పెట్టుకుని 108 కి కాల్ చెయ్యబోతుండగా ఆ వ్యక్తి మొహాన్ని చూస్తాడు గత మూడు రోజులుగా అరుల్ వెతికింది ఆ వ్యక్తికోసమే అతనే అభి వెంటనే అతన్ని తన కార్లో హాస్పిటల్ కి తీసుకెళ్తాడు....

డాక్టర్ అతనికండిషన్ క్రిటికల్ గా ఉంది అని కొలుకోడానికి కొంత వ్యవధి పడుతుంది అని చెప్తారు.. సరే నేను కూడా ఇక్కడే ఎదురుచూస్తాను అని చెప్పి వెయిటింగ్ హాల్ లో వెళ్లి కూర్చుంటాడు .. అతన్ని దగ్గరుండి చూసుకుంటాడు అలా రెండురోజులు గడిచిపోయాయ్ మూడవరోజు ఉదయం అభికి స్పృహవస్తుంది అది గమనించిన నర్స్ సినిమాల్లోచూపించేవిధం గా పరిగెత్తుకుంటు రిసెప్షన్ దగ్గరికి వచ్చి అరుల్ కి విషయాన్ని సీజీపీ డాక్టర్గారికి ఇన్ఫోర్మ్ చేస్తాను అంటూ వెళ్ళిపోతుంది. అరుల్ పరిగెత్తుకుంటూ వెళ్లి అభి ముందు నిల్చుంటాడు అప్పుడే బలవంతంగా కళ్లు తెరుస్తున్న అభిని చూసి అరుల్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.. కానీ అభికి తనేవారో ఇంకా చెప్పలేదు. మౌనంగా బయటకు వెళ్లి నిల్చున్నాడు. డాక్టర్లు నర్సు అందరూ అభి దగ్గరకువచ్చి హౌ అర్ యూ ఇప్పుడెలా ఉంది.. అంటూ ప్రశ్నించారు వాళ్ళందరిని అయోమయంగా చూస్తూనే అభి నేను ఇక్కడికి ఎలా వచ్చాను.. అని డాక్టర్ని తిరిగి ప్రశ్నిస్తాడు దాంతో భయట ఉన్నడే ఆ కుర్రాడే మిమ్మల్ని ఇక్కడకు తీసుకువచ్చాడు మూడురోజులు గా ఇక్కడే ఉంటూ మీ సేవలన్నీ చేస్తున్నాడు అని చెప్పి అవన్ని తర్వాత మీకుఇంకా ట్రీట్మెంట్ అవ్వాలి మాకు కొంచెం సహకరించండి అని చెప్పి డాక్టర్ వెళ్లిపోతాడు.. కొద్దీ సేపటికి అరుల్ లోపలికివచ్చి అభి ముందు నిల్చుంటాడు డాక్టర్లు చెప్పిందినీ గురించెన అని అడుగుతాడు అవునుఅంటాడు అరుల్ ఇంతకీ ఎవరునువ్వు నాకోసం ఎందుకు ఇంతలా తపనపడి సేవలు చేస్తున్నావ్ అని అంటాడు దానికి చిన్నగా చిరునవ్వు నవ్వుతూ అరుల్ ఒక పుస్తకం, ఒక ఫొటో తన బ్యాగ్ లోనించి తీసి అభి ఎదురుగా టేబుల్ మీద పెట్టి కిటికి దగ్గరకు వెళ్లి నిల్చుంటాడు...ఆ బుక్ అభి డైరీ.. అరుల్ని స్కూల్ లో జాయిన్ చేసేటప్పుడు అక్కడి రూల్ ప్రకారం ఒక ఫోటోగ్రాఫ్ ఇవ్వాల్సివచ్చింది అది అభి అరుల్ కలిసిదిగిన ఫోటో అది చూడగానే అభి ఆశ్చర్యంతో కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. తను ఎన్ని కోల్పోయిన అరుల్ విషయం తాను కోరుకున్న విధంగా తను జీవితంలో గెలిచాడు అని ఆనందంగా వెంటనే అరుల్ దగ్గరికి వెల్లి గట్టిగా కౌగలించుకుంటాడు.


ఆరోజు నుంచి వారిద్దరు ఆనందంగా జీవించసాగారు.


ఈ కథ ద్వారా నేను చెప్పాలనుకున్నది మనం చేసే సహాయం అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు కానీ ఏదో ఒక రోజున మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనం చేసిన సహాయాన్ని ఎదో ఒకరూపంలో తిరిగి పొందుతాం.


ఈ కథ మీకు నచ్చుతుంది అని ఆశిస్తున్నా, మీ విలువైన సలహాలు సూచనలు తెలుపగలరు.


Rate this content
Log in

More telugu story from Kuppili Jagadesh

Similar telugu story from Inspirational