SAMYUTHA CHANDRA

Inspirational


4.7  

SAMYUTHA CHANDRA

Inspirational


ప్రేరణ

ప్రేరణ

3 mins 716 3 mins 716

                                                                         ఒక ఊరిలో తేజస్వి అనే ఒక అమ్మాయి ఉండేది. అమ్మాయి 5వ తరగతి చదువుతోంది. ఆ అమ్మాయి వాళ్ళ నానమ్మ , తాతయ్య ,పెద్దనాన్న, పెద్దమ్మ,అమ్మ, నాన్నతో కలిసి ఆడుకుంటూ ఉండేది. వాళ్ళ తాతయ్య బయటకి వెళ్ళినప్పుడు తేజస్వినిని కూడా తీసుకుకు వెళ్లి ప్రకృతి అందాల గురెంచి ,వాతావరణం ఎలా కాలుష్యం అవుతుంది దాని వలన కలిగే నష్టాలు అన్ని చూపిస్తూ చెప్పేవాడు. ఇంట్లో నానమ్మ మంచిమంచి కథలు చెప్పేది. తేజేస్వినిని ఇంట్లో అందరూ గారాబంగా చూసేవారు. ఏమి అడిగిన కాదు అనకుండా చేసేవారు. ఐన కూడా తను సంతోషంగా ఉండేది కాదు. తనకు ఆదుకోవడానికి చుట్టుపక్కల ఎవరు స్నాహితులు లేరని భాధ పడుతూ ఉండేది. తనకి చెట్లన్నా , పువ్వులన్నా , పక్షులన్నా చాల ఇష్టం. వాటితో స్నేహం చేసి మాట్లాడుతూ ఉండేది. ఒక రోజు రాత్రి నానమ్మ దేవదూత గురించి కథ చెప్పుతూ ఉంటే తేజేస్వికి నిద్ర పట్టేసింది. దేవదూత, తాను కలసి ఆడుకుంటున్నట్టు కల వచ్చింది. వారిద్దరూ కలసి పార్కులో పువ్వులు,సీతాకోకచిలుకలతో సంతోషంగా ఆడుకుంటుంటే అక్కడ చెట్లు అన్ని బాధ పడుతుంటే వారిద్దరూ వెళ్లి ఎందుకు బాధ పడుతున్నారు అని అడుగుతారు. అప్పుడు చెట్లు మనుషులు మమ్మల్ని నరికేస్తున్నారు . కొన్ని రోజులకి చెట్లే లేకుండా అవుతాయేమోనని భయం వేస్తోంది. అయినా మమల్ని నరకడం వల్ల వర్షాలు పడక వాతావరం కాలుష్యం పెరిగి వారికే నష్టం కలుగుతుంది కదా. అని అంటాయి. అవన్నీ విన్న తేజస్వి చెట్లు నరకకుండా చూడాలని అనుకొంటుంది. పార్కులో అందరు చిప్స్, చాకోలెట్స్ తిని వాటి కవర్లను ఎక్కడ పడితే అక్కడ పారేస్తున్నారు. దానివల్ల నీరు భూమిలోకి ఇంకక భూమి వేడెక్కుతోంది. చెట్ల వేర్లకి కూడా నీరు అందడం లేదు అని అంటాయి చెట్లు. ప్రజల్లో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించదానికి కృషి చెయ్యాలని అనుకొంటుంది. వారిద్దరూ ఆడుకొంటూ ముందుకి వెళ్లారు. అక్కడ కొన్ని పక్షులు పంజరంలో బందించి ఉంటాయి. దేవదూతని చూసి వాటి బాధను చెప్పు కొంటాయి . స్వచగా ఎగిరే ముమ్మల్ని ఇలా పంజరంలో బందించి ఉంచితే మేము ఉండలేక పోతున్నాము అంటాయి. అది విని తేజేస్వికి ఏడుపు వస్తుంది. వాటికీ స్వేచ్ఛ కలిగిస్తే బాగుంటుంది అనుకొంటుంది.                          

 వారిద్దరూ చెరువు దగ్గరికి వెళ్లి ఈత కొట్టాలని అనుకొంటారు. చెరువులో దిగగానే చేపలు చనిపోయి ఉండడాన్ని గమనిస్తారు. కొంచం ముందుకు వెళ్లి చూస్తే అక్కడ ఫ్యాక్టరీ నుండి వదిలే చెత్త మరియు పొగ  వలన అని తెలిసింది. అప్పుడు దేవదూత వీటి వలన గాలి,నీరు కాలుష్యం అయ్యి ప్రజలు లేని పోనీ అనారోగ్యం పలు అవుతున్నారు అంటుంది. అది చూసి వారిద్దరూ అక్కడి నుండి వెళ్లిపోతారు. ఇంతలో తేజేస్విని వాళ్ళ అమ్మ నిద్ర లేపుతుంది. అప్పుడు తేజేస్వికి అది కల అని తెలుస్తుంది. వెంటనే వెళ్లి వాళ్ళ ఇంటిముందు పంజరంలో వున్నా పక్షులను బయటకు వదిలేస్తుంది. వాళ్ళ నాన్న వచ్చి ఎందుకు ఆలా చేసావు అని అడిగితె నా కలలో ఒక దేవదూత వచ్చింది. మేమిద్దరం ఆదుకొంటుంటే పంజరంలో పక్షులు స్వేచ్ఛగా ఎగర లేక పోతున్నాయని బాధపడ్డాయి. నాకు బాధ అనిపించి పఖులను హింసించడం తప్పు అని ఆలా చేశాను అంటుంది. వాళ్ళ నాన్న తేజేస్విని దగ్గరకు తీసుకొని నీది ఎంత మంచి మనసు తల్లి అని అభినందిస్తాడు. ఆరోజు తన పుట్టిన రోజు కావడం వల్ల నీకు ఏమి కావాలని అడుగుతాడు. నాకు 10 మొక్కలు కావాలని అడుగుతుంది. ఎందుకంటే నా పుట్టినరోజు నాడు నేను ఒక మొక్కను నాటి నా స్నేహితులకు కూడా అందరికి ఒక్కొక్కటి ఇచ్చి నాటమని చెపుతాను అంటుంది  వాళ్ళ నాన్న అదేంటి అంటే చెట్లను నరికేస్తున్నారు . దాని వలన కాలుష్యం పెరుగుతోంది అందు వలన అందరు చెట్లు నాటాలి అంటుంది .అప్పుడు వాళ్ళ నాన్న మంచి ఆలోచన చేశావమ్మా నువ్వు చెయ్యడమే కాకుండా పది మందితో చేయించడం వాళ్ళ వాతావరణ కాలుష్యం తగ్గి వర్షాలు బాగా పడి పంటలు బాగా  పండుతాయి అని అంటాడు నేను నీకు తప్పకుండా మొక్కలను తెచ్చి ఇస్తాను అంటాడు . తేజస్వి తన పుట్టిన రోజునాడు తన స్నేహితులకి మొక్కలు ఇచ్చి నాటామని చెప్తుంది . తన పుట్టినరోజని వాళ్ళ పెద్దనాన్న ప్లాస్టిక్ కవర్లో బిస్కట్లు తీసుకువచ్చి తేజస్వికి ఇస్తాడు అప్పుడు తేజస్వి పెద్దనాన్న ప్లాస్టిక్ కవర్లు వాడకూడదు అవి భోమిలో కరంగా దానికి వేల సంవత్సరాలు పడుతుంది వాటి వల్ల భూమిలోకి నీరు ఇంకక భూమి వేడెక్కుతుంది అందుకే ప్లాస్టిక్కుకవర్లూ వాడకూడదు ఎవరైనా వాడు తున్నప్పుడు మనం చూస్తే వాటి వాళ్ళ జరిగే నష్టాలు చెప్పి వారిని కూడా వాడద్దని చెపుదాం అంటుంది వాళ్ళ పెద్దనాన్న తేజస్విని మెచ్చుకొని చిన్నదానివైనా మంచి మాట చెప్పావు అని అక్కునచేర్చుకుంటాడు. తేజస్వి పెరిగి పెద్దయ్యాక జిల్లాకలెక్టర్ అయ్యి కొన్ని కొత్త నిబంధనలు విధించింది అవేంటంటే ఒక చెట్టునరికితే పది చెట్లు నాటాలి లేకపోతె నజరిమానా విధిస్తారు పక్షులను బంధిస్తే జరిమానా ఫ్యాక్టరీ నుండి వచ్చే చెత్త నీటిలో వదిలేస్తే జరిమానా . ఇలాంటి నిబంధనలవల్ల ఆ జిల్లాని బాగు చేసింది మిగితా వారికి కూడా ఆదర్శంగా నిలిచింది తాను కలలో చెయ్యాలనుకున్న పనులన్నీ చేసింది .                                                                                 అందరం కలిసి ప్రకృతిని కాపాడుదాం                        


 కలిగొట్ల సంయుత చంద్ర 

5 వ తరగతి 

తేజ ఇంటర్నేషనల్ స్కూల్,

పరిమళ కాలనీ హనంకొండ వరంగల్. 

ఫోన్ నో-9866074006

 


Rate this content
Log in

More telugu story from SAMYUTHA CHANDRA

Similar telugu story from Inspirational