స్వీటు షాపు
స్వీటు షాపు


ప్రసాదానికి స్వీటు చేయాలి అన్నాను నేను.
మొత్తం కలిపి ఆరు వందలు అవుతుంది అన్నాడతను.నేను అక్కడే ఉంటే పని తొందరగా జరుగుతుంది అని స్వీటు షాపు వెనుక స్థలంలోనే ఉండిపోయాను.
కట్టెల పొయ్యికి అటు వైపు అతను.వేడి తగులుతుందని దూరంగా నేను.
ఒక్కడే చకచకా చేసుకుపోతున్నాడు. నేనే అతని కుటుంబం గురించి అడిగాను.వాళ్ళ అమ్మగారి నుంచే స్వీట్లు చేయడం నేర్చుకున్నట్లు చెప్పాడు.
స్వీటు చేస్తూ నాకు రకరకాల ఆహార పదార్థాల గురించి చెప్పాడు.
మొత్తం స్వీటు చేశాక మొదటిది మాత్రం వినాయకుడి పటం ముందు పెట్టి మిగతాది ప్యాక్ చేశాడు.
డబ్బులిచ్చి వస్తుంటే అన్నాడు మళ్ళీ మళ్ళీ వస్తూ ఉండండి అని.
తిరిగి వచ్చేటప్పుడు గమనించాను అతని కాళ్ళలో ఏదో మార్పు.ఒక కాలు జైపూర్ ఫూట్ అని అర్థమయ్యింది.
ఆ అపరిచితుడి నుండి నేను నేర్చుకోవలసింది ఏదో ఇంకా బాకీ ఉందనిపించింది.
తప్పకుండా వస్తాను అని చెప్పి గుడి వైపు కదిలాను.