యుద్ధం
యుద్ధం


మొట్ట మొదట పల్లీలు రోట్లో పడ్డాయి. రోకలి రోలుతో యుద్ధం చేసినట్లే ఉంది. పచ్చి మిర్చి, కాస్త చింత పండు, కాసిన్ని నీళ్ళు వచ్చి చేరాయి.
యుద్ధం ముగిసేసరికి పల్లీ పచ్చడి తయారయ్యింది. రాజు పొట్టలో ఆకలి యుద్ధం జరుగుతోంది. వాళ్ళ అమ్మ వేసవి వేడికి పోటీగా మండుతున్న పొయ్యి మీద పెనం పెట్టింది.
మరో చిన్నపాటి యుద్ధం తరువాత రాజు కంచంలోకి అట్టు, పచ్చడి చేరాయి.
ఆలోచిస్తే యుద్ధం అన్నిటిలో కనిపించింది రాజుకు. మధ్యాహ్నం ఆకలి యుద్ధం మొదలయ్యే వరకూ నిద్ర ఏమరుపాటు ఇచ్చేస్తుంది..