మృగమా
మృగమా


ఈరోజు ఇక్కడే ఉండి, రేపు ఉదయం వెళ్ళండి. హోటల్ మేనేజర్ నిర్లిప్తంగా చెప్పాడు.
ఈ హోటల్ చెత్తగా ఉంది. నేనిక్కడ ఒక్క నిముషం కూడా ఉండలేను అన్నాడు వాసు.
తిలక్ కూడా అదే అనడంతో రాజుకి కారు స్టార్ట్ చేయక తప్పలేదు.
అడవి మార్గంలో కారు వెళుతూ ఉంది.
ఆ హోటల్ మేనేజర్ ఎందుకురా మనల్ని వెళ్ళొద్దన్నాడు అని వాసు అన్నాడు. ఎందుకేముంది, డబ్బులు కోసం. అంతే అన్నాడు తిలక్.
లేదురా. ఈ అడవి మార్గంలో రాత్రి పూట ఓ భయంకరమైన మృగం తిరుగుతుందని హోటల్ కి వచ్చిన వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను అన్నాడు రాజు.
తొక్కలో మృగం. ఇదంతా కట్టు కథ అన్నాడు వాసు. అప్పుడే కారు ఆగిపోయింది. చుట్టూ చీకటి. ఎవరో దగ్గరగా వస్తున్నారు. ఆ ముగ్గురూ స్పృహ కోల్పోయారు.