SATYA PAVAN GANDHAM

Abstract Classics Inspirational

4.8  

SATYA PAVAN GANDHAM

Abstract Classics Inspirational

తనతో ప్రయాణం (తన ఊహ) పార్ట్ 5

తనతో ప్రయాణం (తన ఊహ) పార్ట్ 5

6 mins
417


పాఠకులకు గమనిక:

టైటిల్ కవర్ పేజీలో పొరపాటున టైటిల్ పేరు తప్పుగా పడింది, దయచేసి మన్నించగలరు.

తనతో ప్రయాణం (తన వీడ్కోలు) పార్ట్ 4.. కి

కొనసాగింపు....

తనతో ప్రయాణం (తన ఊహా) పార్ట్ 5

ఆ సంఘటనతో తనకి దూరమయ్యానే కానీ, నా ఊహల్లో తను ఎప్పుడూ నాతోనే ఉంది...

తను నాతో ఉన్నప్పట్టి కంటే, తను దూరమయ్యాకే తెలిసింది తనని నేను ఎంత కావాలనుకుంటున్నానో...??

"Atleast I want to know the fact behind her sudden change of opinion over me"

ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకూ తన ఆలోచనలే...

ఇంతలో హైదరాబాద్ లో జాబ్.. 

వెంటనే జాయిన్ అవ్వాలని ఆఫర్ లెటర్ వచ్చింది.

నాకు ఉద్యోగంలో చేరుతున్నాననే సంతోషం కన్నా, అక్కడికి వెళ్ళి వాళ్ల అక్కని కలిసి జరిగిందంతా చెప్తే నాలో నేను పడుతున్న ప్రయాసలకు ముగింపు లభిస్తుందన్న ఆరాటమే నాలో ఎక్కువైంది..

హైదరాబాద్ రాగానే వాల్లక్కని కాంటాక్ట్ అయ్యాను(ఫోన్లో మెసేజ్), కానీ తను పట్టించుకోలేదు ...

అప్పుడే అర్ధం అయ్యింది...!!

ఆ రోజు నాతో డైరెక్ట్ గా కలిసి మాట్లాడతానని చెప్పిందంతా కేవలం బుజ్జగింపు లాంటిదని.

వాళ్లక్క నాతో కటినంగా మాట్లాడడం వల్లే నేను భయపడి తనకి దూరమయ్యానని, ఆ తర్వాత వాళ్ళక్కకి నాకు మధ్య కుదిరిన రాజీ గురించి కానీ, ప్రేమ కోసం, ప్రేమించిన అమ్మాయి సంతోషం కోసం భారమైన దూరంగా వుంటున్నానని..

ఇవన్నీ తనకి చేరలేదని అర్థమవుతుంది.

(నన్ను మోసగాడిలా భావిస్తూ తను పెట్టే పోస్ట్ చూస్తే అర్థమయ్యింది. అదే తన దగ్గర నుండి నాకు చేరిన చివరి పోస్ట్ కూడా)

ఎంతైనా వాళ్ళక్క సాఫ్ట్వేర్ ఇంజినీర్ కదా!! బహుశా ఆ తెలివితేటలు చూపించారనుకుంటా!!

ఏ సామాజిక మాధ్యమాలు ఉపయోగించినా తన తలపే, కొన్ని రోజులు వాటికి పూర్తిగా దూరంగా కూడా ఉండాల్సి వచ్చింది నన్ను నేను నియంత్రించుకోవడానికి.

ఆఖరికి ఆఫీస్ కి వెళ్ళేదారిలో ఎవరైనా స్పెట్స్ పెట్టుకుని కనిపిస్తే, తనేనేమో అనుకుని తదేకంగా అలానే చూస్తూ ఉండిపోయేవాడిని. అసలు ఒకప్పుడు అమ్మాయిల వంక కన్నెత్తి కూడా చూసేవాడిని కాదు, కానీ వాళ్ళ దృష్టిలో ఒక పోకిరినయ్యా!!

ఎంతైనా నా గతం వాళ్లకు తెలియదు కదా!!

జాబ్ లో జాయిన్ అయినా ... వర్క్ మీద సరిగా ఫోకస్ పెట్టలేకపోయాను..

ఒక నెల రోజులు ఏదోలా నెట్టుకొచ్చానో లేదో ఇంతలోనే కరోనా కాటు, ఇక్కడే వుంటే ఒంటరిగా తన ఆలోచనలతో సతమతమవుతాననే భయంతో మళ్ళీ ఇంటి బాట పట్టాను.

రోజంతా కాలిగానే ఉండడం వల్ల అనుకుంటా , తన ఆలోచనలు నన్ను వదలడం లేదు, తన ఎందుకు వెళ్ళిపోయిందో తెలియక మనసు మదన పడుతూనే ఉండేది.

వీటి నుండి బయటపడడానికి నేను చెయ్యని ప్రయత్నాలంటూ లేవు..

బొమ్మలు గీయడం, కవితలు రాయడం, నన్ను నేను మోటివేట్ చేసుకునే కొటేషన్స్ కూర్చడం, ఆఖరికి న్యూస్, స్టాక్ మార్కెట్ లాంటి నాకు కష్టమనిపించే వాటిపై అవగాహన పెంచుకోవడం.

ఇలా ఒకటా.. !! రెండా...!! లెక్కలేనన్ని...

(విసుగు పుట్టిస్తున్నాననుకోవద్దు... సహజంగా ఇలాంటి ప్రేమ వ్యవహారాల్లో చిక్కుకున్న వాళ్ళు, ఆ బాధ నుండి బయట పడడానికి ధూమపానం, మద్యపానం చేస్తారని విన్నాను. కానీ, నేను అల చేయలేదనే చెప్పే ఉద్దేశ్యం. పైగా అమితంగా ప్రేమించే అమ్మకి, అమ్మాయికి ఇద్దరికీ మాటిచ్చాను కదా మరీ.!!)

తన ఆలోచనల నుండి బయట పడడానికి చేసిన ప్రయత్నాలన్నీ తన ఆలోచనలతోనే మొదలయ్యేవి.., కొనసాగేవి, చివరకి వాటితోనే పూర్తయ్యేవి.

తన గురించి రాయని కవిత లేదు, గియ్యని చిత్రం లేదు...

నా స్టేటస్ లను చూస్తూ తనంతా గమనిస్తూనే ఉన్నారన్న ధైర్యంతో...

కానీ, తన స్టేటస్ లను మాత్రం నన్ను బ్లాక్ చేసారు. (బహుశా తన ఆక్టివిటీస్ నాకు తెలియకూడదనుకున్నారో? ఏమో..?)

కానీ అంతలా అసహ్యించుకుంటూ కూడా నా కవితలు కోసం తను నన్ను ఫాలో అవ్వడం, నాకు కొంచెం అవకాశం ఇచ్చినట్టే అనిపించింది. లేనిపోని ఆశలని కూడా రేకెత్తించాయి. నా కవితా పదాలకి కొత్త ఉత్తేజాన్ని ఇచ్చాయి.


తన పై నేను రాస్తున్న కవితలు అర్ధం చేసుకుని ఏ రోజైనా స్పందించక పోతారన్న ఆశా నాలో సహజమాయ్యింది.

ఏం చేస్తాం..? ఒక్కప్పుడు నన్ను పిలిచి మరీ మాట్లాడే తను, ఇప్పుడు నేను పిలుస్తున్నా పలకరించడం మానేశారు.

ఒక ప్రత్యేక వ్యక్తిగా నన్ను పరిగణిస్తున్నాన్నన్న తను ఒక్కసారిగా పరాయి వాడిని చేసేశారు,

ఒక్కప్పుడు ప్రతీది పంచుకునే తను, ఇప్పుడు అన్ని దాస్తున్నారు (ఓడలు బళ్ళు అవుతాయి అంటే ఇదే కాబోలు..) 

గతం తలుచుకుంటుంటే కళ్ళు చెమర్చేవి.

నిద్ర పట్టక మెళుకువతో గడిపిన రాత్రులెన్నో..!

ఆ మెళుకువ లలో రాలిన కన్నీటి బొట్లు మరెన్నో!!

(ఇదంతా నాకు.., ఆ వేదనలో నన్ను ముసిరిన ఆ చీకటికి, బుజ్జగించిన ఆ మంచానికి , నాకు తోడున్న ఆ నాలుగు గోడలకి మాత్రమే తెలుసు)

నేను ఎదుర్కుంటున్న ఈ సమస్యలన్నింటికి పరిష్కారం.. నాకు ఆప్తులు, కవితా మిత్రులైన మా స్కూల్ టీచర్ గారి వద్ద లభిస్తుందనిపించింది.

"మా స్కూల్ ఇంగ్లీష్ టీచర్...

దాదాపు పదేళ్ల క్రితమే మమ్మల్ని విడిచి వెళ్ళినా... ఆమె మాతో గడిపిన ఆ మూడున్నరేళ్ళ జ్ఞాపకాలను ఇంకా మర్చిపోలేదు. నా ప్రతి సమస్యకి పరిష్కారం ఆవిడే... ఆవిడకి నా కవితలన్నా, నా ఆలోచనలన్న చాలా ప్రీతి. నా కవితా వాహిని కూడా ఆవిడ రచనల వాకిట్లో ఎదుగుతున్న ఓ మొక్కే.

తను , వాళ్ళ అక్క కూడా మేడం గారి వద్దే స్టూడెంట్స్ అవ్వడం వలన, తానెవరో వివరించి చెప్పడానికి ఎక్కువ సమయం పట్టలేదు..పైగా వాళ్ళ అక్కతో మేడం గారికి బాగా చనువు కూడాను.

నిరాశలో మునిగి ఉన్న నాకు ఆ సమయంలో ఆవిడ నింపిన స్ఫూర్తి , పంచిన దైర్యం వెలకట్టలేనిది.

భౌతికంగా కాలంతో పాటే పరుగెడుతున్నా కానీ, మానసికంగా నా ఆలోచనలు తన వద్దే ఆగిపొయాయి.

ఆఖరికి తనని మర్చిపోదామన్న ఆలోచనలో కూడా తనే గుర్తొస్తున్నారు.

ఒంటరిగా నాలో నేనే, నాకు నేను గా చేస్తున్న ఆ అంతర్యుద్ధంలో పడినప్పుడు నేను అపజయుడిని, తిరిగి లేచినప్పుడు విజయుడిని.

ఆరు నెలల తర్వాత మళ్లీ ఇంకో జాబ్ (హైదరాబాద్) లో జాయిన్ అయ్యాను...

అంతకు ముందు రోజే తను నన్ను ఫేస్ బుక్ ఫ్రండ్ లిస్ట్ నుండి రిమూవ్ చేశారు...

ఒకప్పుడు అదే ఫేస్ బుక్ లో నాతో టైం స్పెండ్ చేయడానికి రకరకాల గేమ్స్ ఆడిన తను, ఇప్పుడు అసలు కనీసం ఫ్రెండ్ గా కూడా భావించడం లేదనే ఆవేదన నాలో... కానీ, అది పైకి తెలుపలేనిది.

ఇది జరిగిన దాదాపు నెల రోజులు తర్వాత, తన జాబ్ కోసం వాళ్ళ అక్క పెట్టిన ఫేస్బుక్ పోస్ట్ నా కంట పడింది.

తనకి కూడా ఈ కోవిడ్ ఇంపాక్ట్ వల్ల జాబ్ పోయిందేమో?? ఇప్పుడు జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారేమో??

ఇలా అయితే తన కెరీర్ సంగతేంటి??

తను తన కెరీర్ కోసం కన్న కలలు...??

ఇలా ఎన్నో ఆలోచనలు మదిలో మెదులుతూనే ఉన్నాయి...

ఇక అనుకుందే తడవుగా ఎక్కడో మరుగున పడిన నా ఫ్రెండ్స్ లిస్ట్ వెతికాను. ఎవరెవరో తెలిసిన వాళ్ళు , తెలియని వాళ్ళు ఇలా ప్రతీ ఒక్కరినీ జాబ్ కావాలని ప్రాధేయపడ్డాను... కొంతమంది కష్టం అన్నారు.. ఇంకొంతమంది చూద్దాం అన్నారు. కానీ నా ప్రయత్నం ఆపలేదు.(నాకు నేను జాబ్ సంపాదించుకోవడానికి కూడా ఇంతలా కష్ట పడలేదు, అంతా తన కోసమే కదా!!) చివరికి ఎవరో ముక్కూ.. మొహం తెలియని వాళ్ళు (తర్వాత వాళ్ల డీటైల్స్ తెలుసుకున్నాను, మంచి స్థితిలోనే ఉన్నారని కన్ఫర్మ్ చేసుకుని, వాళ్ళతో కాంటాక్ట్ అయ్యాను) జాబ్ ఉంది తన రెజ్యూమే కావాలని అడిగారు.

ఒకవేళ రెజ్యూమే కోసం తనని అప్రోచ్ అయితే, ఈ వంకతో దగ్గర అవ్వడానికి ప్రయత్నిస్తున్నాననుకుంటారేమో?? 

ఇవన్నీ తనకి దగ్గరవ్వడానికి నేను ఆడుతున్న నాటకాలని భావిస్తే??

అసలే తనకి నా మీద ఇప్పుడు మంచి అభిప్రాయం లేదు! , పైగా వాళ్ళ అక్కకి ఇచ్చిన మాటోకటి!!

కానీ, ఎలాగైనా తనకి జాబ్ సంపాదించి పెట్టాలి...

ఆ సమయంలో నాకొచ్చిన ఆలోచన, వాళ్ళ సిస్టర్ ని కాంటాక్ట్ అవ్వడం..

అనుకున్నట్టు గానే తనని కాంటాక్ట్ అయ్యా... (ఫేస్బుక్ చాటింగ్ లో... ) కానీ తన రెస్పాన్స్ సరిగా లేదు.

అయినా జాబ్ డీటైల్స్ , మెయిల్ ఐడీ తనకి షేర్ చేశాను..

ఏమైందో తెలియదు, రెండ్రోజుల తర్వాత కొంచెం కొంచెం దూరం పెడుతూ వచ్చిన తను , నా నంబర్ కూడా తన కాంటాక్ట్ లిస్ట్ నుండి డిలీట్ చేసి, నాకు పూర్తిగా దూరం అయ్యారు..

అప్పుడు అర్థమయ్యింది వాళ్ళ అక్కే నా ప్రేమ కథలో ప్రతినాయికని. సదుద్దేశ్యంతో జరిగిందంతా నేను చెప్పినా, తను అర్ధం చేసుకోలేదన్న విషయం నేను గ్రహించగలిగాను.

ఇక నా కవితలు, నా అభిప్రాయాలు , నా ఆలోచనలు, తనపై నేను చూపించే ప్రేమ ఇవేం తనకిక చేరవన్న నిజం నేను జీర్ణించుకోలేక పోయాను.

రోజులు కాదు, వారాలు కాదు, నెలలు కాదు, సంవత్సరాలు గడుస్తున్నాయి...

ఒక్కో క్షణం.. ఒక్కో యుగం..

(సినిమా డైలాగ్ కాదండోయ్!!!... స్వయంగా నేను అనుభవించిన నా యద కోత..)

తనకి నాకు మధ్యనున్న ముచ్యువల్ ఫ్రెండ్స్ ని పదే పదే తన గురించి అడిగేవాడిని.. దాని వల్ల ఒకప్పుడు నన్ను అభిమానించిన వాళ్ళే, చులకనగా చూడడం, ఆఖరికి నన్ను పక్కన పెట్టేలా తెచ్చుకోవడం, నాలో ఉన్న బాధని రెట్టింపు చేశాయి. అయినా ఇదంతా తన గురించే కదా! తప్ప లేదు.

ప్రతిక్షణం తన ఊహే..

కవిత రాసిన , చిత్రం గీసిన, పెయింటింగ్ వేసినా అన్నింటిలో తన తలపే.

ఈ తరుణంలోనే నా ఆలోచనలు, ఆశయాలు నచ్చిన ఒక అమ్మాయి! పరిచయమయిన రెండు రోజుల్లోనే నన్ను తను ఇష్ట పడుతుందని, నాకు కూడా ఇష్టం ఉంటే ఇంట్లో చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకోవాలని ప్రపోజల్ పెట్టారు. నేను సున్నితంగానే తన ప్రోపోసల్ని తిరస్కరించాను.. కారణం ఏంటో చెప్పాలని బలవంత పెట్టారు. నేను ఆల్రెడీ నా లైఫ్ లో జరుగుతున్న వాటి (నేను ప్రేమిస్తున్న అమ్మాయి) గురించి చెప్పాను. ఈ అమ్మాయికి తనెవరో బాగా తెలియడం వల్ల వెంటనే అర్ధం చేసుకోగలిగారు.

 

వదిలి వెళ్లిపోయిన వాళ్ళ గురించి ఆలోచించడం మాని, తన ప్రపోజల్ అక్సెప్ట్ చెయ్యాలని.. ఇప్పటికీ ఆ అమ్మాయి తాపత్రయ పడుతున్నారు. ఈ అమ్మాయి దగ్గర నెగటివ్ ఇంప్రెషన్ పెంచుకోవడం కోసం నా సహజత్వానికి దూరంగా ఒక ఆడపిల్లతో ఎలా ప్రవర్తించకూడదో అలా ప్రవర్తించాను. అప్పటికీ ఇదంతా నేను తనని దూరం పెట్టడానికి ప్రయత్నిస్తున్నాని గ్రహించి, తను ఇంకా దగ్గరౌతున్నారు.

కానీ, నాకు మాత్రం తనకేం చెప్పాలో, ఎలా చెప్పాలో తెలియడం లేదు. "తను వెళ్ళిపోయినా.. తన ఆలోచనలు ఎప్పుడూ నన్ను వెంటాడుతూ వేధిస్తున్నాయని, మళ్ళీ జీవితంలో రిస్క్ తీసుకోవాలి అనిపించడం లేదని."


......



సమ్మర్ సీజన్ , కరోనా సెకండ్ వేవ్ కావడంతో వర్క్ ఫ్రమ్ హోం అని ఇంటికి వెళ్లి అక్కడే నెల రోజులున్న...

ఇంటికి వెళ్ళిన ప్రతిసారీ వాళ్ళ ఇంటి వైపు చూడని చూపంటూ లేదు తన రాక కోసం....

(నిజం చెప్పాలంటే నిజానికి తను ఉంటే అసలు కన్నెత్తి కూడా చూడను. సిగ్గో, భయమో లేక గౌరవమో అమ్మాయిలంటే)

ఆ టైం లోనే తెలిసింది తను కొన్నాళ్ళ క్రితమే మంచి జాబ్లో సెటిల్య్యారని, తనకి మ్యాచేస్ కూడా చూస్తున్నారని.

(నన్ను పూర్తిగా దూరం పెట్టడానికి కారణలు ఇవే కాబోలు).

"మిస్టర్" అన్నా... "మహానుభావా" అన్నా...

"స్టుపిడ్" అన్నా... "ఇడియట్" అన్నా...

ఆ పిలుపులో తియ్యదనం వర్ణించలేనిది!!

తన పిలుపులో ఆ ప్రేమకి ఇక శాశ్వత ముగింపేనా??

అప్పటివరకూ నాతో టెస్ట్ మ్యాచ్ ఆడుకున్న విధి కాస్తా, అకస్మాత్తుగా దాని దారి మళ్లించి ట్వెంటీ ట్వెంటి గేమ్ స్టార్ట్ చేసినట్టు అనిపించింది.

నా గురించి బాగా తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్ ఇప్పటికైనా మౌనాన్ని వీడి నన్ను తొందర పడాలని సూచించారు...

ఇంకొంతమంది తనని వదిలి, నన్ను కావాలనుకున్న వాళ్ల వైపు నా మనసుని మల్లించమన్నారు.

కానీ, నా మనసుని మార్చుకోలేను.

అలా అని ఇప్పుడు సడెన్ గా వెళ్లి "నీకోసం నేను ఇంకా ఎదురు చూస్తున్నానని" తనకి చెప్తే, తను ఏమనుకుంటుందోనన్న భయం, చెప్పకపోతే తను ఇంకెపట్టికీ దక్కరనే బాధ,

నన్ను.. నా మనసుని ఉక్కిరి బిక్కిరి చేశాయి.

"ప్రేమంటే ప్రేమించిన వ్యక్తిని పొందడం మాత్రమే కాదు, వాళ్ళు మనకి దూరమైనా వారిపై ప్రేమ అనే అనుభూతిని కడవరకూ ఆస్వాదించడం."

అని నా మనసు నాకు సర్దిచెప్పినా.. నా చుట్టూవున్న ప్రపంచం దాన్ని అర్థం చేసుకోవడంలో విఫలం చెందింది.

ఇక ఇంటి దగ్గర ఉండలేకపోయాను మళ్ళీ తిరిగి హైదరాబాద్ ప్రయాణం అయ్యాను.

వెన్నెల వెక్కిరిస్తోంది !!!

నీతోడుకై... వెతుకులాటలో విసిగిపోయానని

చీకటి ఛీదరించుకుంటోంది !!!

నీఊహలో... చేరువవుతూ చితికిపోయానని

నల్లమబ్బు నవ్వుతుంది !!!

నీజాడకై ...నలుదిక్కులను నమ్మి నలిగిపోయానని

పిల్లగాలి పగపడుతుంది !!!

నీప్రేమలో... పరితపిస్తూ ప"గిలి"డిపోయానని

ఊగే చెట్టు, కూసే పిట్ట

వీచే గాలి, పారె ఏరు

పొడిచే పొద్దు, ముగిసే రేయి

తొంగి చూసే నింగి, వంగి తిరిగే పుడమి

ప్రతీ ప్రకృతి సృష్టి

నిన్నటి తుదకు నా నేస్తాలా!!

నేటి మొదలు నా శత్రువులా??

కాలంతో నా కల చెదిరినా...!

కలం తో నాలో కళని తెలపనా...?

ఆదరిస్తావో..!! ఆక్షేపిస్తావో..!!

ఆలోచిస్తావో..!! అసహ్యించుకుంటావో..!!

అందుకే ...,

తనతో ప్రయాణంలో...

తన ఊహా ... "ఓ గతం"

                            -సత్య పవన్✍️



Rate this content
Log in

Similar telugu story from Abstract