చీకట్లో రహస్యం
చీకట్లో రహస్యం


ఇప్పుడే కరెంట్ పోయింది. మంచం దిగి కాళ్ళు నేలకు తాకించి అడ్డుగా ఏమైనా ఉన్నాయా అని కదిలించాను. ఏమీ అడ్డు లేవని తెలిసి మెల్లిగా గోడ వైపు వెళ్ళాను. అనుకున్నట్టే మొన్న గోడకు తగిలించిన ఫోటో ఫ్రేమ్ నా ముక్కుకు తగిలింది. అక్కడి నుంచి పది అడుగులు వేసి తలుపుకు ఉన్న గొళ్ళెం తీసి బయటికి నడిచాను.
చిత్రం ఏంటంటే రోజూ ఈ టైం కి కరెంట్ పోతుంది. నేను కొవ్వొత్తి వెలిగించకుండా ఇల్లంతా తిరిగి హాల్లో ఉన్న కొవ్వొత్తిని వెతకడం. ఇదే పని.
పోనీ పగలు వెతికి పెట్టుకుందాం అంటే గుర్తుండదు.
ఏదో రహస్య నిధి కోసం వెళ్తున్నట్లు వెళుతూ ఉన్నాను.