కాకర-కీకరా
కాకర-కీకరా


చదవక ముందు కాకర చదివాక కీకరా అన్నది ఎవరో తెలియదు కానీ అది వినాయక ఉత్సవాల్లో మాత్రం కళ్లకు కట్టినట్లు కనబడుతుంది .చక్కగా మట్టితో చేసిన విగ్రహాన్ని పూజించి నిమజ్జనం చేయాలని చెప్పేవారు .ఎందుకంటే వానల వలన నదులలో పైన ఉన్న మట్టి అంతా ప్రవాహంలో కొట్టుకు పోతుంది ఇలా విగ్రహాలను మట్టితో చేసి నిమజ్జనం చేయడం వలన నదులపైన మళ్లీ కొంత మట్టిని చేరచేర్చవచ్చు అనే ఉద్దేశంతో. ఆ ఉద్దేశంతో మట్టిని తాగడం వలన భూమి మీద ప్రేమ పెరుగుతుందని ఆ వాసన పీల్చడం వల్ల మనకి మంచి జరుగుతుందనే ఉద్దేశంతో కానీ భూమి దాన్ని వదిలేసి బొమ్మల కి అందాన్ని అమరుస్తున్నారు. .కన్నుల ఆనందానికి ప్రాముఖ్యత ఇస్తున్నారు.
వినాయక విగ్రహం చూస్తే మనకు ఎంతో జ్ఞానాన్ని తెలుపుతుంది. భూమి మీద అన్నిటి కైనా పెద్ద జంతువు ఏనుగు అన్నిటికంటే చిన్న జంతువు ఎలుక ఎంత పెద్దదైనా చిన్నదైనా మట్టిలో కలవాలి అన్నది వినాయక విగ్రహం నిమజ్జన ఉద్దేశం. ఈ సూక్ష్మ జ్ఞానం జనులు తెలుసుకోవాలని కానీ నేటి తరానికి అర్థం కావడం లేదు.
వినాయకుడి పెద్ద తల విశాల దృక్పథం తో ఆలోచించమని చెబుతోంది. వివేకాన్ని పెంచుకుని ప్రయోజనకరమైన ఆలోచనలు అని చెబుతోంది. పెద్ద పెద్ద చెవులు కొత్త సలహాలను సూచనలను శ్రద్ధగా ఓపిగ్గా వినమని చెబుతున్నాయి. చిన్ని కళ్ళు లక్ష్య సాధనకై సూటిగా దృష్టి కేంద్రీకరించాలని చెబుతున్నాయి. కదలాడుతున్న పొడవాటి తొండం అన్ని కోణాల్లో అన్వేషణ సాగించడం అని చెబుతోంది .చిన్న నోరు తక్కువ మాట్లాడమని చెబుతోంది. ప్రసన్న వదనం పరిసరాల్లో ప్రశాంతతను ఆనందాన్ని కలిగిస్తుంది. ఒ
క్కసారైనా నా ఈ నాటి జనం అన్ని సార్లు దర్శనం చేసుకున్నా ఈ రూపం యొక్క అర్థం తెలుసుకోవడం లేదు.
ఒక్క వినాయకుడికి అన్ని రకాల ఆకులతో పూజిస్తారు. 21 రకాల ఆకులతో పూజ చేస్తాము ఆ 21 ఆకుల మొత్తం మనకు శ్వాసకోశ సంబంధిత రోగాలను దూరం చేస్తాయి ప్రతి ఒక్కరూ ఆ ఆకులను తెలుసుకోవడం కోసం అలా పెట్టారు. ఎంతమంది చెట్టు దగ్గరికి వెళ్లి తెలుసుకుంటున్నారు. కనీసం మార్కెట్ కూడా వెళ్లి తెలుసుకోవడం లేదు ఈ రోజుల్లో.
11 రోజులు కొలవడం అంటే మనకి ఇంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఐదు మనసు 1 అన్ని కలిపి రోజుకు ఒకటి చొప్పున అర్పిస్తూ దేవుని స్మరించడం.వినాయకుని పెట్టే నైవేద్యాలు మనకి సేవించడం వల్ల ఆరోగ్యాన్నిస్తాయి .కలియుగంలో నామస్మరణ మోక్ష మార్గం కానీ వీళ్లు ఏంటి వినాయక విగ్రహం దగ్గర అ రకరకాల పాటలతో చెవుల్లో హోరెత్తిస్తున్నారు. నృత్య గానాలు అంటే కోలాటం, భజన, తప్పెటగుళ్ళు అని అర్థం.
నాకు తెలిసిన విషయాలు చెప్పాలని ప్రయత్నిస్తుంటే నాకేమీ తెలియదని ఊరుకో మంటున్నారు. అన్న సంతర్పణ అంటే అందరూ కలిస ఉన్నదానిని పంచుకుంటూ ఒకే చోట భోజనం చేయాలని కానీ ఈ రోజుల్లో చందా పేరుతో దందా చేస్తున్నారు. ఎంత మంది కలిసి తిన్నామని కాకుండా ఎన్ని రకాల వంటలు పెట్టాము అన్న దానికి ప్రాముఖ్యత ఇస్తున్నారు.
నేను జ్ఞానం తో చెబుతున్నాను అని అంటే ఎవరికీ నమ్మకంగా లేదు. వీరి అజ్ఞానాన్ని దూరం చేసి కాకర నీ కాకర లా చదివే జట్టు ప్రతి విషయం వెనుక ఉన్న అంతర్ దాన్ని అర్థం చేసుకునే తట్టు విజ్ఞానాన్ని ఇవ్వు వినాయక ఈతరం పిల్లలకి.