Dinakar Reddy

Abstract Classics Inspirational

5  

Dinakar Reddy

Abstract Classics Inspirational

శంకరాభరణంలో..

శంకరాభరణంలో..

1 min
691


నా వెర్షన్ క్లైమాక్స్ సీన్ :

శంకరాభరణం శంకరశాస్త్రి గారు శంకరాన్ని ఆశీర్వదించినపుడు.. తులసి ఆయనను సమీపిస్తుంది. ఆయన కళ్లతోనే క్షేమ సమాచారాలు అడగడం, తులసి కళ్ళలోని వెలుగుతో సమాధానం చెప్పడం జరుగుతుంది.


ఆమెలో ఉన్న సరస్వతికి, కళను బ్రతికించాలి అనుకున్న ఆశయానికి ఆయన నమస్కరిస్తారు. తులసి అయ్యో అన్నట్టు ఆయన పాదాలపైన కన్నీటి బిందువులు విడుస్తుంది.


ఆ కంకణం పాదాలకు తొడిగి శంకరశాస్త్రి తుది శ్వాస విడుస్తాడు. తులసి కూడా ప్రాణాలు విడవడం అనేది ఒక క్లైమాక్స్.


లేదు అంటే ఆమె సంప్రదాయ సంగీతాన్ని బ్రతికించేందుకు శంకరం తో ప్రదర్శనలిప్పిస్తూ, త్యాగరాజ ఆరాధనోత్సవాలలో ఏ గుడిలో శంకరశాస్త్రి ని వీడి అందరూ వెళ్ళిపోతారో, అదే గుడిలో ఆయన ఫోటో ఉంచి శంకరం చేత ప్రదర్శన ఇప్పించి ఆ ఆనందంలో తులసి ప్రాణాలు విడుస్తుంది.


తులసి చెట్టుకు నీళ్లు పోస్తూ పాట పాడుతూ ఉన్న శంకరం ఆ పరమ పవిత్రమైన గురు శిష్యులను తలచుకుంటూ ఉన్నట్టు సినిమా ముగుస్తుంది.


(గమనిక : టాపిక్ ఇచ్చారు కాబట్టి వ్రాయడం కానీ, శంకరాభరణం అనే మహాసముద్రాన్ని గురించి వ్రాయడానికి నేనెవరిని)


Rate this content
Log in

Similar telugu story from Abstract