కిట్టీ పార్టీ
కిట్టీ పార్టీ


అయినా సుధా! ఈ వయసులో బామ్మ గారికి
కిట్టీ పార్టీలు అవసరమంటావుటే. నా స్నేహితురాలు పద్మ అంది కాస్త వ్యంగ్యంగా.
లేదు సుధా. ఆవిడ కిట్టీ పార్టీ అని చెప్పి ఈ చుట్టు పక్కల ఇళ్లలో పని చేస్తున్న పని మనుషుల్ని ఒక్క చోటకు చేర్చి వాళ్ళకు కాస్త చదవడం వ్రాయడం నేర్పిస్తుందట.
నెలకు ఒక ఆదివారమే కదా అమ్మాయ్. వాళ్ళకి కొంత ఇంగ్లీషు నేర్పమని నన్ను కూడా రమ్మంది అని పద్మకు బామ్మ గారి మంచి ఆలోచనలన్నీ చెప్పాను.
సర్లేవే. నేను కూడా వస్తాను. ఆదివారమే కదా అని బామ్మ గారి ఇంటి వైపు మెచ్చుకోలుగా చూస్తూ అంది పద్మ.