Dinakar Reddy

Abstract

4  

Dinakar Reddy

Abstract

ఇన్సూరెన్స్ డబ్బులు

ఇన్సూరెన్స్ డబ్బులు

2 mins
432


సార్! 5 నిమిషాలు టైం ఇస్తే నేను పాలసీ గురించి పూర్తిగా చెప్తాను సార్. మీకు ఇష్టమైతేనే చేయండి. గోవర్థన్ వినోద్ కి లైఫ్ ఇన్సూరెన్స్ గురించి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు.


వినోద్ మొత్తం విని ఏదో నా ఫ్రెండ్ మీతో మాట్లాడమన్నాడని మీకు టైమ్ ఇచ్చాను. నాకు ఈ పాలసీల మీద నమ్మకం లేదు అన్నాడు.


సార్. ఇది చాలా మంచి పాలసీ. మీరు ఆలోచించుకొని నాకు కాల్ చేయండి అని బయల్దేరబోయాడు గోవర్థన్. 


ఇలా చనిపోయిన వాళ్ళ పేరు మీద వచ్చే డబ్బును మా ఇళ్లలో అసలు ముట్టుకోరు అని విసురుగా అన్నాడు వినోద్.


గోవర్థన్ తనలో తాను నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు.


రెండేళ్లు గడిచాయి. వినోద్ వాళ్ళ నాన్నగారు కాలం చేశారు.వాళ్ళ నాన్న చేసే వ్యాపారం నష్టాల్లో ఉంది. అయినా తన దగ్గర ఉన్న డబ్బుతో చేయవలసిన కార్యక్రమాలు అన్నీ బాగానే జరిపించాడు వినోద్. 


ఇక తర్వాత మొదలయ్యింది ఆస్థి పంపకాల సమస్య. వినోద్ తన అక్కా తమ్ముళ్ళ గురించి ఆలోచించాడు.


అమ్మ చెప్పినట్టే ఇంట్లోని బంగారం అక్కకూ, ఊర్లోని ఇల్లు తమ్ముడికీ వ్రాసి ఇచ్చి తన పెద్దరికాన్ని కాపాడుకున్నాడు. 


తండ్రి చేసిన వ్యాపారం గొడవలు పూర్తిగా వదిలించుకుని తన జాబ్ తను చేసుకుంటున్నాడు. నిన్న మొన్న జాబ్ లో చేరిన వాళ్ళు కారు వేసుకుని ఆఫీసుకి వస్తున్నారు.

తండ్రి చనిపోయి మూడు నెలలు దాటింది. 


తనకేం మిగిల్చాడు తండ్రి. అంతా అక్కకూ తమ్ముడికీ ఇచ్చి మంచి పేరు మాత్రం వచ్చింది. ఏం చేసుకోను ఈ పేరుతో. ఛ. నాకేదీ ఉపయోగం లేకుండా పోయింది అనుకున్నాడు వినోద్.


సరిగ్గా అప్పుడే పరమేశం వచ్చాడు. తాను ఇన్సూరెన్స్ ఏజెంట్ అనీ, వినోద్ వాళ్ళ నాన్నగారు సింగిల్ ప్రీమియం చెల్లించి పది లక్షలకు పాలసీ తీసుకున్నారని చెప్పాడు. 


వినోద్ మారు మాట్లాడకుండా క్లైమ్ ఫారం మీద సంతకం చేశాడు. నామినీగా తన పేరు పెట్టినందుకు నాన్న ఫోటోని మరుసటి రోజు తుడిచి కొత్త దండ వేశాడు.


అమ్మకు విషయం చెప్పి ఆ ఇన్సూరెన్స్ డబ్బులు రాగానే కారు కొనాలని అనుకుంటున్నట్టు చెప్పాడు.


మీ నాన్నగారు తన పిల్లలు కార్లో తిరగాలి అనుకునేవారు. అలానే కానివ్వు బాబూ అని తన అంగీకారం తెలిపింది.


సరిగ్గా పదిహేను రోజుల తరువాత డబ్బులు అందాయి. మంచి రోజు చూసుకుని వినోద్ కారు కొనడం జరిగింది.


కొత్త కారు తీసుకుని ఆఫీసుకు బయలుదేరాడు వినోద్. కొత్త కారు కొన్నందుకు స్వీటు ప్యాకెట్ కూడా తీసుకుని కారులో పెట్టుకున్నాడు.


తన వీధి మలుపు దగ్గర కనిపించాడు గోవర్థన్. ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నాడు. సడెన్ గా వినోద్ కి కొత్త కారు చాలా అసౌకర్యంగా అనిపించింది. ఏసీ వేసినా సరే ఉక్కపోతగా ఉన్నట్టు అనిపించింది.Rate this content
Log in

Similar telugu story from Abstract