Varanasi Ramabrahmam

Abstract

5  

Varanasi Ramabrahmam

Abstract

రచన-రచయితలు

రచన-రచయితలు

1 min
35.3K


రచనలు-రచయితలు


డా. వారణాసి రామబ్రహ్మం


ఏ రంగంలోనైనా‌ రచించడం మనసుని సానబెడుతుంది. ఆ రచనా కార్యక్రమమే ధ్యానం అవుతుంది. రాసే విషయాన్ని బట్టి ధ్యానమగ్నత మారదు. సాహితీ సృష్టి చేయడమే, రచనలు రచించడమే సాధన. తపస్సు.


రచనలు చేయడం సహజగుణం. అది సాధారణంగా అలవాటు, వ్యసనాలుగా మారుతుంది. సాహిత్య సృష్టి విధము, పథము మనిషిని ఋషిని చేస్తుంది.


మనకు - నానృషిః కురుతే కావ్యం - అనే నానుడి ఉంది. అది మహా కావ్యాల విషయంలో ఏమో. ముందే ఋషి అయితే తప్ప రచనకు పూనుకోకూడదు అనేది ఇప్పటి రచయితలకు, రచనలకు వర్తించదేమో.


ఎప్పుడైనా రచయిత దార్శనికుడు. సమాజానికి మార్గదర్శి. మంచినైనా, చెడునైనా తమ రచనల ద్వారా సంఘంలో వ్యాపింప చేసే శక్తియుక్తులు రచయితలకు ఉంటాయి. ఎప్పడూ ప్రభావితం చేసే వారి రాతలే మన రాతలను నిర్దేశిస్తాయి. మారుస్తాయి. అతలాకుతలం చేస్తాయి.


నీరు పల్లానికి ప్రవహించడం ఎంత సహజమో, స్పందించడం, ఆ స్పందనను రచనగా మార్చడం రచయిత, కవులకు అంత సహజం.

అక్షరాలను నేర్చిన ప్రతివాడూ సాహితీ సృష్టి చేయలేడు. నిపుణుడైన కంసాలి బంగారాన్ని అందమైన వస్తువులుగా మలచినట్టు, స్పందనను, అక్షరాలను మిళితం చేసి రచయిత, కవి మనకు తమ సృష్టిని ఆస్వాదనీయం చేస్తారు. మనం రకరకాల రస స్థితులు అనుభవించేలా రాస్తారు.


రచయితలు, కవులు కళాకారులు మాత్రమే కాదు, ఇందాక అనుకున్నట్లు సంఘానికి మార్గదర్శకులు. మార్గ నిర్దేశకులు. రచయితలు దివ్యాంశ సంభూతులు.


Rate this content
Log in

Similar telugu story from Abstract