ఒద్దిక లేని జీవితాలు
ఒద్దిక లేని జీవితాలు
రామాయణాలు, మహాభారతాలు చదివి జీవితాన్ని ఒద్దికగా జీవించే రోజులు పోయాయి. చక్కదిద్దుకునే ఇంగితం, ఆసక్తి, వివేకం సన్నగిల్లాయి.
మహాభాగవతం చదివి భక్తి శ్రద్ధలతో భగవంతుని ప్రార్థించడం ఆగిపోయింది.
భగవద్గీత అర్థం చేసుకుని జీవితానికి ఉపయోగకరంగా వాడుకోవడం లేదు.
ప్రాథమిక, మాధ్యమిక విద్యాభ్యాసం వేళల్లో పంచతంత్రం, హితోపదేశం, జాతక కథలు, మహా పురుషుల చరిత్రలు చదవడం పాఠశాలలో లేదు.
మనుషులు మానసికంగా బలవంతులు కావడానికి ఇవన్నీ ఉపయోగించాయి, ఉపయోగిస్తాయి అని ఆధునిక విద్యావేత్తలకు, మేధావులకు, విద్యా ప్రణాళికలు రచించే వారికి, తల్లిదండ్రులకు తెలియదు.
ఇంతలా బలహీన పడిన సంఘం, సంఘంలోని మనుషులు మానసికంగా చిన్న చిన్న విషయాలకి కూడా కృంగి పోవడం ఆశ్చర్యాన్ని కలిగించదు.
మనుషులు తమ ఇంట్లో వారిని, ఆత్మీయులను నిర్లక్ష్యం చేసికొని, వీధిలో, వీ
ధిలో వారికోసం జీవించడం నాగరికతగా, సంస్కృతిగా మార్చుకున్న ఈ వేళ మానసిక దౌర్బల్యం అధికాధికమవడం సహజం. సామాన్యం.
ఈ అజ్ఞానం నుంచి బయట పడడానికి ఏ మేధావులు ఏ ప్రయత్నాలు చేయడం లేదు.
వేయి మంది సైకాలజిస్ట్ ల పెట్టు అమ్మని లేకుండా చేసికొని మనుషులు బావుకునేది ఏమిటో అర్థం కాదు. ఎందరు సైకాలజిస్ట్ లు అమ్మ సాటి రారు.
కాని దురదృష్టవశాత్తు ఏ అమ్మాయి అమ్మగా ఉండడానికి సిద్ధంగా లేదు. ఈ పరిస్థితి సంఘానికి అస్సలు మంచిది కాదు.
తల్లిదండ్రులు జీవితం పట్ల సరియైన అవగాహన లేనివారుగా తయారయ్యారు. సరియైన పెంపకం లేదు, సరియైన చదువు లేదు. మనిషిని తీర్చిదిద్దే ఈ రెండూ లేక మనుషులు సాధించేది గుండు సున్నా అని ఇంకా తెలియకపోతే మనుషుల దురదృష్టం.
మానవ ప్రగతి, సుఖశాంతులు, సంతోషాలు హుళక్కి అవుతాయనీ, ఎంత డబ్బు సంపాదించినా సుఖశాంతులు, సంతోషం ఉండవనీ అందరూ తెలుసు కోవాలి. తెలుసుకుంటారా??!!.