ఫేస్బుక్
ఫేస్బుక్
ఫేస్బుక్ వల్ల మనకు స్టేటస్ లభించింది. బుర్రలో ఏముంటే అది రాయడానికి వీలు కలిగింది. మనం రాసింది ఇష్టమైన వారు లైకులు కొడతారు. కొండొకచో అభిప్రాయం చెబుతారు. నచ్చని వారు వారి చిత్తం వచ్చినట్లు అభిప్రాయం రాస్తారు.
మన వ్యక్తిగత జీవితంలో భాగమైన ఫేస్బుక్ మనకి కాలక్షేపం బఠానీలు. మన "ప్రతిభావ్యుత్పన్నతలు" ప్రకటించే మాధ్యమం.
పత్రికలు ఈయని వీలు ఈ మాధ్యమం రచయితలకు, ఇతర కళాకారులకు, పండితులకు, మేధావులకు, సామాన్య ప్రజలకు ఇస్తోంది. అందరం మన ఇష్టం వచ్చినట్టు ఈ మాధ్యమాన్ని ఉపయోగించు కుంటున్నాం.
మన జీవితాలతో మమేకం అయిపోయిన ఫేస్బుక్ మనకు ఒక విధంగా వ్యసనంగా మారింది. అయినా అది చేసే మంచి అది చేస్తోంది.
దీని యాజమాన్యం నష్టాల్లో కూరుకుపోతే తప్ప ఈ రోజూ వారీ వినోదం మనకు అందుతూనే ఉంటుంది.