ranganadh sudarshanam

Drama

4.8  

ranganadh sudarshanam

Drama

అమ్మ మనసు

అమ్మ మనసు

4 mins
2.2K


ఏవండి..ఏవండి..అని పిలుస్తున్న సౌజన్య పిలుపుతో..


బద్ధకంగా ఆవలిoతలతో, ఒళ్ళువిరుచుకుంటు.. 


ఏంటే.. పొద్దున్నే నీ గోల ప్రశాoతంగా పడుకోనియ్యవు.. అంటూ లేస్తూ..కసురుకున్నట్లు అన్నాడు శ్రీధర్.


వొళ్ళంతా ఒకటే నొప్పులు...జ్వరంగా 

ఉందoడి, లేచి నిలబడితే కళ్ళు తిరుగుతున్నాయి.. అమ్మా.. అమ్మా..అంటూ మూలుగుతూ చెప్పింది సౌజన్య.


రాత్రి బాగానే వున్నావు కదే...అన్నాడు శ్రీధర్.


అవునండీ... మధ్యరాత్రినుండి కాస్తా ఆనీజీగానే ఉంది..పడుకుంటే అదే తగ్గి పోతుందిలే అనుకోని అలాగే పడుకున్నానండి ..కానీ పొద్దున్నే ఇలా అవుతుందనుకోలేదండి అంది బాదగా.


సరే లేచి కాస్తా ఓపిక తెచ్చుకొని రెడీ అవ్వు..పిల్లలను కూడా లేపు,ఈలోగా నేను బైటికి వెళ్లి టిఫిన్ తెస్తాను అన్నాడు శ్రీధర్.


ఓపిక తెచ్చుకొని బ్రష్ చేసుకొని.. వేడి వేడి కాఫీ త్రాగగానే ప్రాణం లేచి వచ్చినట్లైంది..

పడుకున్న..పిల్లలు అద్విక,ఆద్య లను కూడా నిద్రలేపి రెడి అయ్యింది సౌజన్య. 


ఈలోగా శ్రీధర్.. టిఫిన్లు తెచ్చాడు.


అందరూ తినేసి..డోర్ లాక్ చేసి హాస్పిటల్ కు బైలు దేరారు.


శ్రీధర్ కు అమ్మ గుర్తుకొచ్చింది.


సౌజి..అదే అమ్మ వుండి ఉంటే..ఇంత ఇబ్బంది ఉండేది కాదు కదా..


అమ్మ పిల్లలను చూసుకునేది..ఇలా చీటికీ మాటికి పిల్లలను స్కూల్ మాన్పించాల్సిన అవసరం..ఇంటికి తాళం పెట్టాల్సిన అవసరం ఉండేది కాదు కదా అన్నాడు బాధగా.


సౌజన్య ముభావంగా ఉండిపోయింది.


పిల్లలిద్దరూ..నానమ్మ జ్ఞాపకాలు తలుచుకుంటూ.. నానమ్మ నాకు రోజు స్కూలుకు వెళ్ళేటప్పుడు చాక్లెట్ ఇచ్చేది..అని అద్విక అంటే..


అవును నానమ్మ నాకు కూడా చాక్లెట్ ఇచ్చేది, నైట్ కాగానే బోలెడన్ని స్టోరీస్ చెప్పేది అంది ఆద్య.


 ఇద్దరు అలా నానమ్మ గురించిన కబుర్లు చెప్పుకుంటున్నారు.


డాడీ.. నానమ్మ ఎప్పుడొస్తుంది, ఫోన్ చేయొచ్చుగా డాడీ అంది ఆద్య.


చాల్లే నోరముస్తారా...లొడ లొడా ఒకటే వాగుడు తల పగిలిపోతుంది అంది సౌజన్య విసుగ్గా.


అత్తయ్యకు చిన్న బాబు ఉన్నాడుగా నానా,అందుకే అత్తయ్యకు ఇబ్బంది కావొద్దని నానమ్మ వెళ్ళింది, త్వరలోనే వస్తుంది నానా అన్నాడు శ్రీధర్.


ఈలోగా హాస్పిటల్ రాగానే అందరూ దిగి హాస్పిటల్ లోకి వెళ్లారు.


డాక్టర్ అన్ని పరీక్షలు చేసి, టైఫాడ్ ఫివర్ అని పదిహేనురోజులు రెగ్యులరుగా మెడిసిన్ వాడితే తగ్గి పోతుందని..కేర్ ఫుల్ గా ఉండాలని,

ప్రిస్క్రిప్షన్ రాసి మెడిసిన్ వాడమన్నాడు.


అలాగే త్రి డేస్ కు ఒకసారి బ్లడ్ చెక్ఆప్,జనరల్ చెకప్ కు హాస్పిటలకు వచ్చి పోవాలని చెప్పాడు డాక్టర్.

******


చేసేది లేక పిల్లలను,సౌజన్యను చూసుకోవడానికని శ్రీధర్ ఆఫీసు కు వెళ్లి 

ఒక వారం రోజులు లీవ్ పెట్టి వచ్చాడు.


ఆరోజు పిల్లలు స్కూల్ నుండి రాగానే..బైటికి వెళ్లి పిల్లలకు సౌజన్యకు అవకోడా జ్యూస్ తెచ్చాడు శ్రీధర్.


హాయ్..డాడీ మాకు జ్యూస్ తెచ్చాడోచ్..అంటూ పిల్ల లిద్దరు ఆనందంతో గంతులు వేసారు.


అరేయ్ పెద్దోడా ఇది నీకు.. అరేయ్ చిన్నోడు ఇది నీకు అంటూ చెరో జ్యూస్ గ్లాస్ పిల్లలకు అందించాడు శ్రీధర్.


మరో గ్లాస్ లో జ్యూస్ పోసి సౌజి..టాబ్ లెట్ వేసుకొని ఈ జ్యూస్ తాగు అన్నాడు.


ఇంతలో ఆద్య డాడీ మమ్మీ కి అలా జ్యూస్ ఇవ్వొద్దు ..ఇలా ఇవ్వు అంటూ..జ్యూస్ గ్లాస్ తీసుకొని అందులో సగం జ్యూస్ వేరే గ్లాసులో పోసి, అందులో సగం నీళ్లు పోసి అమ్మకు ఈ జ్యూస్ ఇవ్వoడి డాడీ, మమ్మి ఇది త్రాగితే త్వరగా జ్వరం తగ్గిపోతుంది అంది.


ఆద్య చెపుతుంటే శ్రీధర్ ఆశ్ఛర్య పోయాడు ఎందుకు నానా అలా చేస్తున్నావు, అలా నీళ్లు కలపొద్దు నానా అన్నాడు వారిస్తున్నట్లు.


లేదు డాడీ నానమ్మ కు నువ్వు జ్యూస్ తెచ్చినప్పుడల్లా మమ్మీ ఇలాగే చేసేది..ఎప్పుడు సగం నీళ్లు కలిపి ఇచ్చేది..జ్వరం వచ్చినవాళ్లకు ఇలా నీళ్లు కలిపి ఇస్తేనే త్వరగా తగ్గిపోతుందని మమ్మి చెప్పింది అంది..


 కావాలంటే మమ్మీని కూడా అడుగు డాడీ అంది ఆద్య అమాయకంగా.


శ్రీధర్ కు విషయం అర్ధం అయింది, కోపం కట్టలు తెచ్చుకుంది..కానీ పిల్లల ముందు బాగుండదని తనను తాను తమాయిoచుకున్నాడు.


కోపంగా సౌజన్య వైపు చూసాడు.


సౌజన్య తల దించుకుంది.


సౌజన్యకు కొంత జ్వరం తగ్గింది...


ఆ రోజు అన్నం వండాక అందరూ తినడానికి ఏర్పాట్లు చేస్తున్నాడు శ్రీధర్.


ఇంతలో బైటినుండి వచ్చిన అద్విక.. డాడీ మమ్మీకి అన్నం అలా పెట్టకూడదు..నువ్వుండు అంటూ వేడిగా ఉన్న అన్నం గిన్నెలో పొద్దున మిగిలిన చద్దన్నం పెట్టిoది ..


డాడీ దీనిని కొంచం వేడిచేసి.. అప్పుడు ఈ అన్నం మమ్మీ కి పెట్టండి అంది.


ఇలా చల్లటి అన్నం వేడిచేసి అమ్మ ఎప్పుడు నానమ్మకు పెట్టేది, ఇలా చేస్తే...నానమ్మకు త్వరగా బలం వచ్చి, జ్వరం తగ్గిపోతుందని అమ్మ చెప్పేది అంది.


శ్రీధర్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి.


నన్ను ప్రాణంలా పెంచిన అమ్మకు ఇంత అన్యాయం జరుగుతుంటే నా కళ్ళు మూసుకపోయాయా..

అయ్యో అమ్మా ..ఎంతపని జరిగింది అంటూ చాలా బాధపడ్డాడు...


ఇంత జరుగుతున్నా.. ఏనాడు అమ్మ ఒక్క మాట కూడా సౌజన్య గురించి చెడుగా చెప్పలేదు.ఎప్పుడు తన ముఖం పైన చిరునవ్వు కూడ చెదరనియ్య లేదు, పైగా తన కోడలు తనను బాగా చూసుకుంటుందని అందరికి గొప్పగా చెప్పుకునేది అమ్మ.


అమ్మ రూపం కళ్ళ ముందు కదిలింది,తనలో తాను బాధగా..అమ్మా..అమ్మా..నన్ను క్షమించమ్మ అంటూ..వేదన చెందాడు శ్రీధర్.

***

సౌజన్యకు పూర్తిగా జ్వరం తగ్గిపోయింది పిల్లలిద్దరూ స్కూల్ కు వెళ్లారు.


శ్రీధర్ సౌజన్య..దగ్గరకు వెళ్ళాడు..ఏం.. సౌజన్య దేవతలాంటి నా తల్లికి నువ్విచ్చిన గౌరవము ఇదేనా,నువ్వింత దుర్మార్గురాలివైన... అమ్మ నీగురించి ఏనాడు పల్లెత్తు మాటనలేదు తెలుసా..

అసలిలా ప్రవర్తించడానికి నీ మనసు ఎలా ఒప్పుకుంది..అంటూ చెంప చెళ్లు మనిపించాడు.


నీకు తెలుసా... అమ్మ నాకెప్పుడూ వేడి వేడిగా ఉన్న అన్నం కూరలు పెట్టి.. తాను చద్దన్నం..చద్ది కూరలు తినేది.. నాన్న చిన్నప్పుడే పోయినా నాకే కష్టం తెలియకుండా గారబంగా పెంచి ప్రయోజకుణ్ణి చేసింది.


నువ్వింత చేసినా....ఈ విషయం నాకు తెలిస్తే బహుశా మనమధ్య గోడవలొస్తాయని ఏమి చెప్పకుండా దాచి పెట్టి ఉంటుంది అమ్మ.


సిగ్గనిపించడం లేదా..నువ్వు చేసిన ఈ పని వల్ల అభం శుభం తెలియని ఆ పసి మనసులలో కూడా విషబీజాలు నాటావు కదే ...దుర్మార్గురాల అన్నాడు శ్రీధర్..


రేపు వాళ్ళు పెద్దయ్యాక .. వాళ్ళ అత్తగారిని ,.నిన్ను.. నన్ను కూడా అలాగే చూసే గొప్ప సంస్కారాన్ని వాళ్లకు నేర్పించావు..ఏం పాపం చేసేనే నేను ...నీలాంటిది నాకు భార్యగా లభించింది. ఛీ.ఛీ...నా మీద నాకే కోపం వస్తుంది. 


నీ ముఖం చూడాలంటే అసహ్యంగా ఉంది అన్నాడు శ్రీధర్.


సౌజన్య పశ్చత్తాపంతో తలదించుకొని రోధిస్తుంది.


ఏడుస్తూ నన్ను క్షమించండి అంటూ..శ్రీధర్ పాదాలపై వాలిపోయింది.


కన్నతల్లిలా ఆదరించిన అత్తమ్మను చాలా బాధపెట్టానండి... ఇదంతా మా అమ్మ వల్ల జరిగిందండి..నా బుద్దికూడా గడ్డితిన్నది,నన్ను క్షమించండి...క్షమించండి..ప్లీజ్ అంటూ పాదాలను గట్టిగా పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చింది...సౌజన్య పశ్చత్తాపంతో...


అప్పుడే గుమ్మంలో అడుగుపెట్టిన తల్లిని చూసి..అమ్మా.. నువ్వా, మాటమాత్రమైన చెప్పకుండా వచ్చావేంటే ..అంటూ ఆశ్చర్యoగా అడిగాడు శ్రీధర్.


ఏం లేదురా, నిన్న పక్కింటి రాణి పిన్ని ఫోన్ చేసిందిరా... కోడలుకు ఆరోగ్యం బాగా లేదని చెప్పింది..కాలు నిలవలేదురా..అందుకే ఉన్న పళనా బయలుదేరి వచ్చాను అంది అమ్మ.


అత్తమ్మ నన్ను క్షమించండి నేనెంత మూర్ఖంగా ప్రవర్తించినా..నాకు జ్వరం అని తెలియగానే వచ్చారు అంటూ..గట్టిగా వాటేసుకుని ఏడ్చింది సౌజన్య.


పిచ్చిపిల్ల మీరంతా ఎవరే, మీకోసం కాకుంటే ఎవరికోసం వస్తానే.. అంది అమ్మ.


అత్తమ్మ..నేను మీకు చాలా అన్యాయం చేసాను నన్ను ఆ దేవుసు కూడా క్షమించడు,నన్ను మన్నించంచoడి అత్తమ్మా.. అంటూ పాదాలకు నమస్కరించింది..సౌజన్య.


అంతా విన్నానమ్మా... ఇప్పటికైనా అర్థం చెజుకున్నావు, ఆది చాలు,పశ్చాత్తాపానికి మించిన శిక్షలేదు..అంది అమ్మ.


లేదమ్మ అది ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు,దాని ముఖం చూస్తే పాపం తగులుతుంది అన్నాడు కోపంగా శ్రీధర్.


వద్దు నానా అలా అనొద్దు.. చిన్న పిల్లారా తెలియక చేసిందిలే..ఆమ్మ చెపుతుందిగా ఇక వదిలేయ్..మళ్ళీ ఈ విషయం మాట్లాడవో నామీద ఒట్టే అంది అమ్మ.


అత్తమ్మా...మీ మంచి మనసు తెలుసుకోలేక పోయాను.. నన్ను క్షమించండి అత్తమ్మా అంటూ గట్టిగా చుట్టేసుకొని బోరుమని ఏడ్చింది సౌజన్య.


చాల్లేమ్మా... పిల్లలు వచ్చే వేళయింది.. ఇదంతా వాళ్లకు తెలియకూడదు, పద పిల్లలకు వేడి వేడి గా పకోడీ చేద్దాం అంటూ ఇంట్లోకి దారి తీసింది అమ్మ.


పరిస్థితులేవైనా అమ్మ ఎప్పుడు పిల్లల మంచే కోరుకుంటుంది.


అమ్మ మనసంటే ఇదేనేమో ...అని మనసులో అనుకున్నాడు శ్రీధర్.


             ..సమాప్తం....Rate this content
Log in

Similar telugu story from Drama