కాకుల డైటింగ్
కాకుల డైటింగ్


మిట్ట మధ్యాహ్నము
ఎండ మండిపోతోంది ,చెట్టు కొమ్మపై కూర్చున్న ఒక కాకి ,చుట్టపు చూపుగా వచ్చిన రెండవ కాకితో మాట్లాడుతుంది.
ఏంటే ఈ మధ్య బొద్దుగా ,ముద్దుగా తయారయ్యావు ఏంటి విశేషం అంది.
ఏం లేదే, ఈమధ్య నాన్ వెజ్ తిండి ఎక్కువై, ఒళ్ళు చేశాను,కాస్త గ్లామర్ పెరిగింది అంతే....కానీ బాబోయ్.. ఈ నాన్ వెజ్ తినలేక విసుగు వస్తుందే తల్లి ఏం ననుషులో ఏమో ! ఎలా తింటున్నారో రా...... దేవుడా అంది.
ఏంటే అంతగా నాన్ వెజ్ మీద మొహం ఎలా మొత్తిo దే... అమ్మా ,ఈ మధ్య మీ ఏరియాలో లో ఫంక్షన్లు గట్రా జాస్తి గా తగిలాయా ఏంటి అంది.
లేదే, ఈమధ్య జనాలు బరువు తగ్గే కొత్త డైటింగ్ ఒకటి మొదలుపెట్టారు.
దా నిలో భాగంగా రోజు కేవలం మటన్ చికెన్ గుడ్లు మాత్రమే తింటున్నారు. దీంతో మన పండగ పండుతోంది అంది.
నీ బొంద, అవన్నీ తిన్న వాళ్లు బరువు తగ్గుతుoటే , నువ్వేంటే దున్న కొక్కూ లా తయారయ్యావు మరి.... అంది.
అబ్బా అది కాదే ,నీకు అర్థం కాలేదు, ఈ నాన్ వెజ్ తో పాటు రోజు కొబ్బరి నూనె, నిమ్మ కాయ రసం,వగైరా, వగైరా..... కూడా తాగుతున్నారు.అందుకే బరువు తగ్గుతున్నారట...
నిజంగా ఒట్టే.... జనాలు వేలం వెర్రిలా ఈ డైట్ తిని బరువు తగ్గే స్థున్నారే తల్లి అంది.
అంతే కాదు ఈ డైట్ చేసే వాళ్లు వాకింగులు, ఎక్సర్సైజు లు గట్రా....వంటి శారీరక శ్రమ కూడా లేకుండా నే బరువులు తగ్గు తున్నారే తల్లి అంది.
మరి నాకేమో కొబ్బరి నూనె గట్రా అన్ని దొరకవు కదా ఏం చేస్తా, వాళ్లు బరువు తగ్గుతుంటే నాకేమో పెరిగి చస్తుంది.ఈ వొళ్ళు ఎలా తగ్గుతుందో ఏమో.. భగవంతుడా, అంటూ బాధపడింది.
సరే నా సంగతి అలా ఉంచు నువ్వేంటి రివటలా, సన్నగా తయారయ్యావు తిండి దొరకట్లేదా, తిన్న తిండి వంట పట్టట్లేదా ఏంటి సంగతి ,.
ఆ బుగ్గలు ఏంటే, మరి లొట్టలు పడి అప్పుడే ముసలి దానిలా కనపడుతున్నావు అంది.
అబ్బా, ఏం చెప్పమంటావు తల్లి, నీదో బాధ, నాదో బాధ, ఈమధ్య మా ప్రాంతంలో వరి అన్నం తినటం మానేశారు, ఏ ఇంట్లో చూసిన ఆరోగ్యానికి మంచిదని, కొర్రలు ,అరికలు, సామలు తింటున్నారు. పండగలకు,పబ్బాలకు కూడా వరి అన్నం దొరకట్లేదo టే నమ్ము . నాకేమో రైస్ బాగా అలవాటాయే....
ఈ కొర్రలు వగైరా, అబ్బబ్బా ముద్దదిగట్లేదే బాబు, అదీకాక ......ఎంత తిన్నా కడుపు నిండటం అటుంచి, అవి తిన్న దగ్గరనుండి కడుపు నిండుగా ఉండి,మళ్లీ ఆకలి వేయడం లేదే తల్లి,అందుకే ఇలా అయ్యాను అంది చుట్టపు కాకితో. నాకేమో మా వాళ్లు పెళ్లి చూపులంటున్నారు..ఈ అవతారం చూస్తే ఆవచ్చేవాడేమంటాడో అని బెంగగా వుందే తల్లి...అంది.
నాకు ఒక ఆలోచన వచ్చిందే, మన ఇద్దరి సమస్యలు తీరాలంటే,మనo ఒక పని చేద్దామే, మనిద్దరం పక్షానికి ఒకసారి మన ఏరయాలు మార్చుకుందాం, ఈ రెండు డైట్లు మనల్ని బ్యాలెన్స్ చేస్తాయి , దీంతో నీ బాద.. నా బాద తీరుతుంది అంది .
ఈ ఐడియా ఏదో చాలా బాగుందే, ఈ విషయాన్ని ఈ రోజే ఒక డైట్ మీటింగ్ అరేంజ్ చేసి మన కాకి మిత్రులందరికీ తెలియజేద్దాం ,ఏమంటావు అంది.
బాగు బాగు ,కానీ ఈ మనుషులేoటే..ఎవరో అయిల్ పుల్లింగ్ అంటే ఎగబడ్డారు,నీళ్లు తాగండ్రా... అంటే బావులు ఎండిపోయేదాక తాగేశారు.... ఇంకెవరో...పచ్చి కూరగాయాలంటే..అది చేశారు కనీసం మనగురించి ఆలోచించారా.. ఇలా వాళ్ళ ఇష్టానుసారం చేస్తే మన ఆరోగ్యాల సంగతేoటీ, సంకనాకి పోవా....
అయినా .. పని కి తగ్గ తిండి లేదా తిండికి తగ్గ పని ఉంటే ఈ బాధలు ఏవి ఉండవని ఈ మనుషులు ఎప్పుడు తెలుసుకుంటారో ఏమో, అని నిట్టూర్పు విడిచింది..
రెండు కాకులు కవ్, కావ్ మంటు ఎగిరి పోయాయి. అంటే మనకు టాటా, బై బై అని చెప్పినట్లు. అంతే........
.........................సమాప్తం.................