ఈ పాపం భరించలేను
ఈ పాపం భరించలేను


కొత్తగా గా పొరుగింట్లో అద్దెకు దిగిన.. వాణి.. శేఖర్ల ఎనిమిది సంవత్సరాల పాప శ్రీజ ముద్దుగా బొద్దుగా ముచ్చటగా ఉంటుంది.
తెల్లగా మల్లెపువ్వులా..
అమాయకమైన కళ్ళుతో,నవ్వితే సొట్టలుపడే పాల బుగ్గలతో..అమాయకపు అందాలతో, కాళ్లకు గజ్జల పట్టీలతో నట్టింట్లో తిరిగి లక్ష్మిదేవిలా ఇల్లంతా ఘల్లు ఘల్లున తిరుగుతూ సందడిచేస్తుంది.
ఆంటీ అంకుల్ అంటూ...ఆప్యాయంగా పిలుస్తూ...మా పిల్లలతోపాటే స్కూలుకు వెళ్లివస్తుంది.
తల్లిదండ్రులిద్దరు ఉద్యోగస్తులు కావడం,సమవయస్కులైన మా పాప బాబులతో స్నేహం కుదరటంతో..ఎక్కువ సమయం మా ఇంట్లోనే పిల్లలతో ఆడుకుంటూ గడిపేస్తుంది.
మా వారు ప్రకాష్ దగ్గర కూడా పాప కు చనువెక్కువే,మా పిల్లలతో పాటు చాక్లెట్లు,బిస్కెట్లు..బేకరీ ఐటమ్స్ తెచ్చి ఇస్తుంటారు వారు.
శేఖర్ వాణి.. కూడా మా పిల్లలను...వారి పాపతో సమానంగా చూసేవారు..అలా పిల్ల కారణంగా మా రేండు కుటుంబాల మద్య మoచి స్నేహం కుదిరింది.
అప్పుడప్పుడు అందరం పిల్లలతో కలిసి సినిమాలకు షికార్లకు వెళుతుండేవారము.
వీలైనప్పుడల్లా...కిట్టిపార్టీలు, వీకెండ్ పార్టీలూ జరుపుకుంటూ వుండేవాళ్ళము.
ఆరోజు పిల్లలకు సెలవు కావడంతో అంత కలిసి అడుకుంటున్నారు.
వాణి శేఖర్ ఇద్దరు ...పాపను నాకప్పగించి ఆఫీసుకు వెళ్లిపోయారు.
బాబాయికి ఆరోగ్యం బాగాలేదని ఫోన్ రావడంతో పిల్లలను ప్రకాశకు అప్పగించి నేను హాస్పిటలకు వెళ్ళాను.
సాయంత్రం వాణి.. వాదినా ...పూజొ దినా అంటూ ఇంట్లోకి వచ్చింది.
ఎంటొదినా ..ఇలా వచ్చావు అంటూ బైటికి వచ్చాను.
పాప ఇంటికి రాలేదోదినా...తీసుకెళదామని వచ్చాను అంది.
ఇక్కడే ఎక్కడో ఆడుతుంటుంది వాదినా తీసుకెళ్లు అన్నాను.
ఎక్కడా లేదొదినా....పిల్లలికూడా చాలా సేపటినుంది చూడలేదంటున్నారు...ఇంట్లోనే వుందేమో.. చూస్తాను వదిన అంటూ తిరిగి వెళ్ళిపోయింది.
కొద్దిసేపట్లోనే పాప మిస్సయ్యిందని కన్ఫామ్ కావడంతో అంతా తలొదిక్కు వెళ్లి వెతకడం మొదలు పెట్టారు.
బస్తిలో ఉన్న వారు శేఖర్,ప్రకాశ్ తలొదిక్కు వెతికారు కానీ పాప జాడ తెలియలేదు.
వాణి పాపను తలుచుకొని కుమిలి కుమిలి ఏడుస్తుంది.
అంత కలిసివెళ్లి స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
పోలీలులు కూడా అంతా గాలిస్తున్నారు..కానీ పాప ఆచూకీ దొరకలేదు.
వెతికి వెతికి అలసిపోయి అంతా ఆదమరచి పడుకున్నారు.
అప్పుడులేచాడా మానవమృగం.. పైకి మనిషిలా ముసుగేసుకున్న రాక్షసుడు మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ చీకట్లను దాటుకుంటూ చిదిమిన పసిమొగ్గను మళ్ళీ చిదమటానికో..నలిపేసిన పాపాన్ని కడిగేయడానికో.. కర్కశంగా చీకటి గది తలుపులు తీసాడు.
పాప రెక్కలు విరిచి కట్టిన కుర్చీలోనే స్పృహ తప్పి
పోయి ఉంది..రక్తపు మరకలతో..నలిగిన పువ్వులా దీనంగా ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లినట్లుంది.
లేలేత పసిబుగ్గల అభం శుభం తెలియని పసితనం, అందరిని నమ్మే అమాయకత్వం..ఆకలిచూపులు,మృగా తృష్ణ అంటే ఏమిటో తెలియని బేలతనపు బాల్యం.
కాని వాడు అన్నితెలిసిన కామాందుడు, కర్కషుడు, తల్లి ,చెల్లి ..అనే వివక్షలేని మృగాలతో కూడా పోల్చలేని విషపురుగు.
తన బిడ్డలాంటి వయసున్న పాపలో వాడికి ఆడతనం కనిపించింది..పసి పిల్లలతో కామ వాంఛ తీర్చుకోవాలనుకొనే వాడి రాక్షస ప్రవృత్తి రక్తపు కూడుకు మరిగిన జంతువుకన్నా హేయమైన,నీచమైనది.
మెల్లగా పాప దగ్గరికి నడిచాడు...ముందే సిద్ధం చేసుకున్న పదునైన కత్తిని బైటికి తీసాడు.
పాపను చంపి ముక్కలుగా కోసి వెంట తెచ్చిన సంచిలో వేసి రైలు పట్టాలపై పారెయ్యాలనుకున్నాడు...
పాప నోటికి అతికించిన ప్లాస్టార్ కారణంగా బలవంతంగా మూలుగుతూ తల్లికడుపులో బిడ్డలా కదిలింది.
రాక్షసుడు కత్తి తీసి
నమ్మిన అమాయకత్వాన్ని..
పసిహృదయపు మమకారాన్ని..
బంగారు భవిష్యత్తు ఉన్న బాల్యాన్ని..
రేపటి తరపు అనావాలును...
లేకుండా చేయాలను కున్నాడు.
అంతే దిక్కులు పిక్కటిల్లేలా అరిచాడు..తలపై పడ్డ గునపపు దెబ్బకు దిమ్మరపోయాడు,ఒకేసారి టన్నుల బరువు తలపై పడ్డట్లనిపించింది ..రక్తం దారాలుగా చిమ్మింది.కళ్ళు బైర్లు కమ్మి..వెనకకు తిరిగాడు..అంతే మరో దెబ్బ.. మరో దెబ్బ ..తెరుకోకుండా దెబ్బ మీద దెబ్బ పడింది.
వదిలేద్దామ...ఇంకెంత మంది పసిమొగ్గలను కాలరాస్తాడోనాన్న వూహే భయకంపితం చేసింది.
ఛండిలా ప్రచండ తాండవమాడి.. ఆ ముష్కరుణ్ణి చీల్చి చండాడలనుకుంది.
శార్దూల శూలదారియై అపరభద్రకాళిలా
మారి వాడితలను తెగనరకాలనుకుంది..
కానీ అంత చిన్న శిక్షలు వాడికి సరిపోవనుకుంది..ఒక్క దెబ్బకు ప్రాణం పోతే
ప్రాణం విలువ మానం విలువ వాడికెల తెలుస్తుంది అనుకుంది.
జీవితాంతం వాడి బ్రతుకుతూ చావాలి...పశ్చతాపంతో వాడు రగిలి బూడిద కావాలి..జీవితం లో ఇక వాడి ముఖం చూడొద్దనుకుంది.
అంతే శివంగిలా పాపను విడిపించి...గది బైటకు తీసుక వచ్చింది పూజ.
వెంటనే కర్తవ్యాన్ని నిర్వహించింది.
ఎట్టి పరిస్థితిలో... కాoప్రమైజ్ కావొద్దనుకుంది, ఇప్పుడు జాలి చూపిస్తే రేపు నా బిడ్డ మరోబిడ్డకు ఈ పరిస్థితి వస్తే...అందుకే గుండె దిటవు చేసుకొని పోలీసులకు ఫోన్ చేసింది.
రక్తపు మడుగులో స్పృహ తప్పిపడి ఉన్న ప్రకాశను పోలీసులు అరెస్ట్ చేశారు.
కొందరు ఎంత పొగరు,ఎంత అహం కాకపోతే భర్తను బైటేసుకుంటుందా... అన్నారు.
గుట్టుగా సర్దుకుపోవాల్సిoది పోయి రోడ్డున పడి ఏం సాధిస్తుందో..ఇప్పుడా పిల్లగతేo కాను అనుకున్నారు మరి కొందరు.
ఇంకొందరు మంచిపని చేసింది అలాంటి వాడు ఉన్న ఒకటే లేకున్నా ఒకటే అనుకున్నారు.
ఎవరేమనుకున్నా..తాను మాత్రం స్థిరంగా ఆలోచించింది..బైటివారినుండి తన పిల్లలను కాపాడుకోగలనేమో, కానీ ఇంట్లో వున్న రాక్షసుడి నుండి కాపుడుకోడం కష్టం అనుకుంది.
తన పిల్లలపైన ఆ రాక్షసుడి నీడైనా పడకుండా పెంచాలనుకుంది..కష్టాన్ని నమ్ముకున్న తనకు పిల్లలను పెంచుకోవడం ఏమంత కష్టం కాదనుకుంది. అవసరమైతే పదిళ్ళల్లో పాచి పని చేసైనా సరే పిల్లలను ప్రయోజకులను చేయాలనుకుంది.
అందరికి దూరంగా..పిల్లతో భవిష్యత్తే లక్ష్యంగా .. వారికి మంచి భవిష్యత్ ఇవ్వడం కోసం కొత్త జీవితం లోకి అడుగుముందుకేసింది... పూజ.
....సమాప్తం....