ranganadh sudarshanam

Drama

5.0  

ranganadh sudarshanam

Drama

పెళ్ళోపదేశం

పెళ్ళోపదేశం

4 mins
1.3K


...పెళ్ళోపదేశం...

.............................

ఏవండోయో...మిమ్మల్నే అబ్బా..కాస్థయినా చురుకు లేకుంటే ఎలాగండి..

ఆ బెజవాడ సంబంధం వాళ్ళు ...మన సంబంధం ఖాయం చేసామని కబురు చేశారని,పిన్నిగారు ఫోన్ చేసి చెప్పారు..

అంది సూర్యకాంతం అరిచినట్లుగా..

ఆ ..ఆ.. వినపడిందే...కేబుల్ టీవీ వాణ్ణి రిచార్జి చేయమని.. డబ్బులిచ్చాను,ఇవ్వాళ సీరియల్ మిస్సవదులే..,

నువ్వేమి దిగులుపడకు..

అయిపోతుందిలే..

అన్నాడు ..సుందరామయ్యా.

అబ్బ.. బ్బా..చెవిటి మేళo మీరును,చెప్ప లేక చస్తున్నానురా దేవుడా..తలుపు పెట్టి చెపితే కొలుపు పెట్టి ఆడిగినట్లుంది మీ వాలకం..

అది కాదండి...ఆ బెజవాడ సంబంధం ఖాయం అయ్యిందట అంది... సూర్య కాంతం.

ఆ..ఆ..వినపడిందోయ్.....

అబ్బా...ఇన్నాళ్లకు నీ నోటినుండి ఒక శుభ వార్త విన్నానోయి.. కాంతం అన్నాడు సుందరామయ్యా సంతోషంగా.

చాల్లేoడి...సంబడం, శుభం పలకరా పెళ్లి కొడకా అంటే..పెళ్లి కూతురు ముండేది అన్నాడట అలా ఉంది మీ మాట.. అంది నిట్టూర్చుతూ..

సరే గాని పంతులు గారికి కబురు పెట్టండి..మంచి రోజు చూసి.. నిశ్చయ తాంబూళాలకు ఏర్పాటు చేసుకుందాము అంది సూర్య కాంతం.

ఆ..ఆ..అలాగే..సాయంత్రం వచ్చేటప్పుడు లీటరు పాలు తెమ్మనేగా..అలాగే తెస్తాను లేవోయ్ అన్నాడు సుందరరామయ్య..

అయ్యా మహానుభావా ఆ చెవిటి మిషన్ కాస్త చెవిలో పెట్టుకోండి మహా ప్రభో.. అరవలేక చస్తున్నా..అంది కసురుకుంటున్నట్లు సూర్యకాంతం.

ఆ..ఆ.. ఇప్పుడు చెప్పఁవోయ్...

అదేనండి పంతులు గారిని అడిగి ముహూర్తం పెట్టండి అన్నాను.

అలాగే..చేద్దాం. ఇంతకు మన వరాలేమంటుంది ఆడిగావా..అన్నాడు సుందరామయ్య.

ఆ..చిన్న పిల్ల దాని మొఖం దానికేం తెలుస్తుంది, మనమెంతoటే అంతా..అంది కాంతం.

సరే శుభస్య శీగ్రo.... అలాగే కానిద్దాం..అంటూ బైటికి నడిచాడు సుందరరామయ్యా.

అమ్మా..వరలక్ష్మి.. విన్నవా అంతా...

కలిసొచ్చే రోజొస్తే నడిచొచ్చే కొడుకొస్తాడంటే ఇదే నే తల్లి..

బంగారం లాంటి సంబంధం...

అదృష్ట వంతురాలివి తల్లి..

అని అమ్మాయి తలపై చేతులు పెట్టి మెటికలు విరిసింది కాంతం.

అమ్మా..మరేమో..మరేమో...

చెప్పవే... పిచ్చితల్లి

చల్లకొచ్చి ముంత దాచడమెందుకు ..చెప్పమ్మా..అంది కాంతం

అమ్మా.. మొన్న పెళ్లి చూపులకు వచ్చిన పెళ్లి కొడుకు కు పళ్ళు వంకరగా ఉన్నాయి, నాకు నచ్చ లేదే..అంది వరలక్ష్మి.

అయ్యోరామా....అదేంటమ్మా పుసుక్కున అంత మాటన్నావు, నవ్వితేనేగా... పళ్ళు బైటికి కనిపించేవి, నిన్ను పెళ్లి చేసుకున్నాక జీవితంలో ఇంకా నవ్వుతాడoటావా.. ...అలా ఎన్నటికీ జరగదు ఆ నమ్మకం నాకుంది... ఏంకాదులేమ్మా ..వదిలేయి అంది కాంతం.

మరి..పెళ్లి కొడుకు కు తల మీద జుట్టే సరిగా లేదు బట్టతలే... ఎలాగమ్మా.. అంది వరలక్ష్మి

చాల్లే సంబడం...పిచ్చి కుదిరింది రొకలి తెచ్చి తలకు చుట్టమన్నాడట వెనుకటికెవరో...అలా ఉంది నీ వరుస...

బట్ట తలట.. బట్ట తల

జుట్టు వున్నా...అది ఎప్పటికైనా మన చేతిలో రాలాల్సిందేనే..

మీ నానకు కూడా ముందు తల జుట్టు వత్తుగా వుండేది...

ఇప్పుడు చూడు జుట్టేమైన మిగిలిందా..

ఎలాగూ పొయేదేగా...

పోయే జుట్టు ఉంటే ఎంత లేకుంటే ఎంత చెప్పు..

ఇది అంతేనే..నువ్వేం.. బాదపడకు తల్లి అంది కాంతం..

మరి... అమ్మా..

ఆ అబ్బాయికి అమ్మ నాన్న ఒకచెల్లి తమ్ముడు నానమ్మ ఇంటి నిండా సంతలా ఉన్నారు కదే..అంది వరలక్ష్మి.

ఓసి పిచ్చి మొఖమా.. ఎవరుంటే నీకెంటే.... పెళ్ళైన రెండు రోజుల్లో...నా అనుభవాన్నంతా రంగరించి కొంప కొల్లేరు చేసి ఇంటిని రెండుముక్కలుచేసి నిన్ను బైట కాపురం పెట్టిస్తానుగా..ఆ పూచి నాది నన్ను నమ్ము అంది కాంతం.

మరి అమ్మా...అబ్బాయి వట్టి అమాయకంగా.... మరీ మెతకలా వున్నాడు..కదే అంది వరలక్ష్మి.

వెతకబోయిన ...తీగ కాలికి తగిలి నట్లు..

వెతికి వెతికి ఏరి కోరి ఈ సంభందం తెచ్చింది అందుకేనే పిచ్చి తల్లి ...మీ నానలా..తానా అంటే తందాన అంటూ గంగిరెద్దుల ఉండాలనే కదమ్మా.. ఇంత కష్టపడి సంబంధం వెదికింది అంది కాంతం.

అమ్మా...పెళ్లంటే నాకు భయమేస్తుందమ్మా..అంది వర లక్ష్మి.

ఓసి మోద్దా ..నీకెందుకే  భయం,.. పెళ్లంటే భయపడాల్సింది , బాదపడాల్సింది నిన్ను చేసుకున్న తరువాత పెళ్లికొడు కైతేను.. మీ నానను చూడటం లేదా..

భర్తoటే ...భరించేవాడే...తల్లి అంది కాంతం.

అమ్మ పెళ్ళైతే..పొద్దు పొద్దున్నే.. లేవడాలు, వంటా వార్పు..అంట్లు బట్టలు ఈ పనులన్నీ ఎలాగే నాకు భయమేస్తుందే...అంది వరాలు.

పిచ్చి తల్లి ఇవన్నీ కొద్ది రోజులేనే, మెల్లగా ఇంటి పెత్తనం అంతా నీ చేతికే వస్తుంది నాలాగా..

తరువాత ఆ పనులన్ని ..చాక చక్యoగా భర్తకు నేర్పించి నేర్పుగా ఎలా చేయించాలో, ఆ వైనం నేను చెపుతానుగా , నానను చూడటం లేదు... అలా అన్నమాట. ఆ తరువాత మన పని హాయిగా...టీవీలో సీరియళ్లు చూడటం ,ముచ్చట్లు పెట్టడం షాపింగులు చేయడం అంతేనే....

నన్ను చూడటం లేదా..అంది కాంతం.

అమ్మా... పెళ్లిలో అమ్మాయి అబ్బాయి వెనకాల నడవాలటగా...ఎందుకే అంది..వరం.

అవునమ్మా..అదే..ఆ అబ్బాయికి ఇక జీవితంలో చివరిసారి గా నడిచే  ముందు నడక, ఇక జీవితాంతం ఉండాల్సింది,నడవాల్సింది నీ వెనకాలేగా..అందు కే కాస్త ఓపిక పడితే చాలు తల్లి....అంది కాంతం.

అమ్మా...పెళ్లిలో అబ్బాయి పొగరుగా తల ఎత్తుకొని నవ్వుకుంటూ ఉంటాడు ..అమ్మాయేమో తల దించుకొని సిగ్గుపడుతుంది.. ఎందుకే అంది వరలక్ష్మి.

ఓహ్...అదా పెళ్లి చేసుకున్నాక అబ్బాయికి ఇక జీవితంలో తలెత్తుకోవటం,నవ్వడం జరగదని..తెలియదుగా.. అందుకే ...మనమే ఆ చాన్స్ అబ్బాయికి ఇస్తామన్నమాట,ధమాకా ఆఫర్లాగా.. అండి కాంతం.

అమ్మా.. పెళ్లిలో అమ్మాయిలు అబ్బాయి కాళ్ళు పట్టాలటగా....అంది వరం.

అవునమ్మా..నువ్వు ముందు ఎలా కాళ్ళు పట్టాలో అబ్బాయికి చూపిస్తావన్నమాట అదే ట్రైనింగలా..ఆ తరువాత ఆ అబ్బాయి జీవితాoతం చేయాల్సింది అదేపనేగా అంది కాంతం.

మరి అమ్మా... ఉంగరాలటలో..ఎప్పుడు అబ్బయిలే. గెలుస్తారెందుకే..అంది వరం.

అవునమ్మా.నువ్వు ఆటలో ఎలా ఓడిపోవాలో అబ్బాయికి చక్కగా నేర్పిస్తావన్న మాట అదే రెహార్సల్ లాగా...జన్మలో ఇక ఏ ఆటోలో నీతో పోటీ పడి గెలవడు గాక గెలవడు ఇది నా గ్యారెంటీ తల్లి అంది కాంతం.

మరేమో...అమ్మా... అబ్బాయి..అమ్మాయికి నక్షత్రాన్ని చూపిస్తాడెoదుకే..అంది వరం.

అవునమ్మా..అది అరుంధతి అని మన ఆడ నక్షత్రమే అంటే మనమే నన్నమాట ...ఇక జీవితాంతం ఎటు చూసినా అది పగలైనా రాత్రైనా మనం అబ్బాయికి పట్టపగలే చుక్కలు చూపిస్తాముగా ...అందుకన్నమాట అంది కాంతం.

అమ్మా..పిల్లలను కనడం వాళ్ళను..పెంచడo అబ్బ..చిరాకమ్మా..అంది వరం.

నీ మోఖం...టీవీ లో సీరయల్ పెట్టుకున్నామంటే చాలు,ఇక కన్నామో లేదో తెలియకుండానే డెలివరీ అయిపోతుంది...ఆ తరువాత బాధ్యతంత...మీ ఆయనో, వాళ్ళమ్మో..లేదా పనిమనిషో చూసుకుంటారే..ఇంత మాత్రానికి భయమెందుకు..తల్లి అంది కాంతం.

అమ్మా... మొగుళ్లు తాగొచ్చి పెళ్లాలను కొడతారటగా..అంది వరం.

ఎంత ధైర్యమే..మన చేతిలో అప్పడాల కర్ర,వంటి oట్లో గిన్నెలు చెoబులు.. చూస్తూ ఊరుకుంటాయా, మనిoట్లో సొట్టలుపడ్డ గిన్నెలు చెంబులు చూడలేదా...అవన్నీ అనుభవాలన్న మాట,,ఆ డోస్ చాల లేదనుకో.. గృహ హింస,వరకట్న వేధింపుల చట్టాలు అన్ని మన చుట్టాలేగా.. వాటి కింద కేసులు పెట్టి,ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాపించి తాట తియ్యము...ఇక మన మహిళా సంఘాలు ఊరుకుంటాయనుకున్నావా..మనకు కష్టమొస్తే చాలు కాకి తో కబురు పంపకున్నా వాలిపోతాయి ఏకి ..ఏకి..వదిలి పెట్టవు....,నీకేం భయం లేదమ్మా.. ఆ సంగతి నా కొదిలేయి అంది కాంతం.

అమ్మా...అదిగో నాన్నా వస్తున్నారే....ఇంకా వంటకూడా చెయ్యలేదు తిడతాడేమోనే ..భయమేస్తుందమ్మా..ఎలాగే..అంది వరం.

ఆహా..హా...భయమా...నాకా..

నువ్వు చూస్తూవుండు...మీ నాన్నతో ఎలా వంట చేయిస్తానో..అంది వరం...

అమ్మ..దేవుడా...రాముడా తలా పగిలిపోతుంది రా నాయనా....ఒకటే తల నొప్పి అమ్మా.. అమ్మా..

ఏవండి..పాపిష్టి దాన్ని మొగుడికి ఒక ముద్ద అన్నం వండలేకపోయాను..ఎలా రా దేవుడా దేవుడి లాంటి మనిషికి అన్యాయం చేస్తున్నాను..

మా ఆయన బంగారం ..పల్లెత్తి మాటనడమ్మా..మాయదారి నొప్పి..ఇవ్వాళే రావాలా...చక్కగా వడియాల పులుసు,ముద్దపప్పు,గుత్తి వంకాయ కూర వండి పెట్టాలనుకున్నానమ్మా ..నా దేవుడికి...హమ్మ..నాయనా ఏంచేద్దునురా దేవుడా...అంటూ..నటనతో జీవించింది కాంతం.

అమ్మోయ్... నువ్వు సూపర్...నిజంగానేనే నాన మారు మాట్లాడకుండా వంట మొదలు పెట్టాడు అంది వరం.

అదేనమ్మా కిటుకు తలకు గుడ్డకట్టుకొని మూలగటం..రాకున్నా ఏడ్వటం... ముక్కు చీదటం,అలక పాన్పులు ఎక్కడం..ఇవి నేర్చుకుంటే చాలమ్మా మనం మహా రాణులమే. ఎంతటి మొగవాడైనా కుక్కపిల్లలా మన వెనుక తోక ఊపుకుంటూ తిరగాల్సిందే అంది కాంతం.

ఏవండి కాస్తా ఆ బట్టలు కూడా ఆరేయ్యండి..నా కసలే.. నడుము నొప్పి..పాపిష్టి దాన్ని ఎవరైనా చూస్తే మొగుడితో పని చెయిస్తుందని ఆడిపోసుకుంటారు, ..నా బాధ మీకు తప్ప ఎవరికి తెలుస్తుంది చెప్పండి..అయ్యో...అమ్మా..హా.. అబ్బా ..ఏవండి..మీరు మరీనూ..సిగ్గు లేకపోతే సరి ..ఆ లంగా పక్కన లుంగీ అరేయకండి నా కసలే.. సిగ్గు, ఎవరైనా చూస్తే బుగ్గలు నొక్కుకోరు,రోజు రోజు కు చిలిపితనం పెరుగుతుంది మీకు..అంది కాంతం.

అమ్మా..

మరి త్వరగా నా పెళ్లి చేయ్యావే...ఇవన్ని విన్నాక ఎగిరి గంతెయ్యాలని ఉంది అంది వరలక్ష్మి సంతోషంగా..

నా బంగారం అచ్చం నా పోలికే ..అండి కాంతం.

....

సుందరరామయ్యగారు..మంచి మనిషి...ఆఫీసులో చాలా సిన్సియర్.. అనే పేరున్న తెలివైన వ్యక్తి.

కానీ సూర్యకాంతం తన అక్క కూతురు...చిన్నప్పుడు సుందర రామయ్య అక్క దగ్గరే పెరిగి ప్రయోజకుడయ్యాడు....అక్క కోరిక మేరకు సూర్యకాంతాన్ని పెళ్లి చేసుకున్నాడు.

సూర్యకాంతానికి పుట్టుకతోనే...హార్ట్లో చిన్న రంద్రంఉందని..తనను ఉద్వేగానికి లోను కానివ్వకుండా.. గాజుబొమ్మలా పెంచుకోవాలని డాక్టర్లు చెప్పారు..

ఆ విషయం ..సుందరరామయ్యకు చెప్పి సూర్యకాంతాన్ని సుందర రామయ్య చేతిలో పెట్టి కను మూసింది వారి అక్క..

కాంతానికి తన జబ్బు సంగతి తెలయకపోవడం...

అక్క కు ఇచ్చిన మాటను నిలబెట్టు కోవడం కోసం ...

సుందర రామయ్య...అన్ని భరిస్తూ...

కాంతాన్ని కంటి పాపలా చూసుకుంటున్నాడు.. భార్య ఏది చెప్పినా సరేననడం..ఆమె చెప్పిన పనులన్నీ చేయడంతో భార్య దృష్టిలో చులకన అయినాడు... 

కానీ...అక్క కిచ్చిన మాట కోసం..కాంతం ఆరోగ్యం కోసం అన్నీ ..తెలిసినా ఏమి తెలియనట్లు..గరళ కంఠునిలా ..భార్యను భరిస్తున్న ... మనసున్న..మంచి మనిషి సుందర రామయ్య.

కానీ కాంతం ఇదంతా తన ఘనతేనని.. పగటి కలలు కంటూ..బిడ్డకు కూడా అవే చెపుతుంది..కానీ జీవితంలో ఇవన్ని సాధ్యం కానివని ...వరాలుకైనా త్వరలో తప్పక తెలియ వస్తుంది.

పెళ్లంటే..ఇద్దరు వ్యక్తులను,రెండు కుటుంబాలను ఏకం చేసే ఒక పవిత్ర బంధం...సంసారం అంటే భార్య భర్తల ప్రేమ, అనురాగం అన్యోన్యత.. ఒకరి కోసం ఒకరు చేసే త్యాగం, ఒకరి ఇష్టాలు మరొకరు తెలుసుకొని గౌరవిస్తూ..సాగించే ప్రయాణం అంతే కాని ఒకరి లోపాలను మరొకరు వెతుక్కుంటూ .. ఒకరి నొకరు....కించ పరుచుకోవటం...కానే కాదు కదా..

...సమాప్తం....Rate this content
Log in

Similar telugu story from Drama