ఎక్సస్ట్రా ప్లేయర్
ఎక్సస్ట్రా ప్లేయర్


పేరులో ఉన్నట్టేనండోయ్ ఈ కధలో ఓ చిన్నారి విలపించే విలాప గాదె ఈ ఎక్సస్ట్రా ప్లేయర్. ఒక ఉమ్మడి కుటుంబం అందులో ముగ్గురు అన్నదమ్ములు ఒక చిట్టీ చెల్లి. చెల్లంటే ముగ్గురు అన్నయ్యలకి ప్రాణం. అందుకే ఇల్లరికం అల్లుడుని తెచ్చుకొని జీతం లేని ఓ పనివాడిలా ఉంచుకునేవారు. పద్దన్నయ్య వదిన బ్రతికున్నంత వరకు ఆ ఇంటిలో ఏ లోటు లేకుండా నిత్య సంతర్పణ జరుగుతూనే ఉండేది. కొన్ని సంవత్సరాల తరువాత చెల్లెలికి నలుగురు ఆడపిల్లలు ఒక మొగ శిశువు జన్మించారు. ఇంతమంది పిల్లలకి అన్నీ సమాకూర్చాలనే తపనతో చెల్లి తన భర్తతో కలిసి వేరే ఊళ్ళో హోటల్ పెట్టి చాలా డబ్బు సంపాదించేరు. అది చూసి ఓర్వలేని బంధువులు రాబందులయి వాళ్ళని దోచేసారు. ఇదిలా ఉండగా పెద్దమ్మాయిని తన అన్నయ్యకే ఇచ్చి పెళ్లి చేసారు. అది కూడా చాలా బ్రహ్మాండంగా అప్పట్లోనే 70 తులాల బంగారం పెట్టి పెళ్లి చేసారు. అలానే మిగిలిన ఆడపిల్లలకి కూడా 70-80 తులాల బంగారం వరకు పెట్టి పెళ్లి చేసారు.
అందరు ఒకే ఊరిలో వుండే వారు వేరే వేరే ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ ముగ్గురన్నదమ్ములు చాలా అన్యోన్యం గా వున్నారని ఊరిలో అనుకునే వారు. హటాత్తుగా పెద్ద అన్నయ్య వదిన చనిపోయారు వాళ్ళకి ఒకే ఒక కొడుకు. ఈ పల్లెటూరిలో ఉంటే పిల్లవాడు చెడిపోతాడు అని వాళ్ళ మావయ్య పట్టణం లో చదివిస్తాను మీరు డబ్బులు పంపిస్తే చాలు అని చెప్పడంతో ఆఖరివాడు తన భార్య నగలు అమ్మి అన్నయ్య కొడుకును పట్టణపు చదువులు చదివిస్తాడు.
ఇదిలా ఉండగా మిగిలిన ఇద్దరు తమ్ముళ్ళకి ఒకే లా సంతానం జలుగుతుంది ఒక్కొక్కళ్లకి ఇద్దరు ఆడపిల్లలు ఒక మొగ పిల్లవాడు. కుటంబం లో ఆఖరి అమ్మాఏ మన కధలో ఎక్సస్ట్రా ప్లేయరండి. అన్నదమ్ముల పిల్లలు చెల్లెల పిల్లలు అందరూ కలిపి ఓ10 మంది వుంటారు. అందువలన ఈ అఖరు అమ్మాయిని ఎవరు అంతగా పట్టించుకొనేవారు కాదు. అందరికి పెళ్లిళ్లు చేసేటప్పుడు కూడా మిగిలిన ఆడపిల్లలందరికి మంచి సంబంధాలు చేసి అక్కరుదానికి ఏదో ఒక సంబంధం కుదిర్చి పెళ్లిచేసేసి చేతులు కడిగేసుకున్నారు.
పాపం పెళ్ళైయ్యిన దగ్గరనుండి అత్తగారిపోరుతో తనను పట్టించుకోని మగాడుతోనూ రాజీ పడుతూనే కాలం గడిపింది. పుట్టింటిలోని తను ఒక ఎక్సస్ట్రా ప్లేయర్ గానే బ్రతికింది మెట్టినింటా తను ఒక ఎక్సస్ట్రా ప్లేయరే. ఇప్పుడు తన కూతురు పెళ్ళీడుకోచ్చింది. తన లాగా తన కూతురు జీవితం కాకూడదు అని మ్రోక్కని దేవుళ్ళు లేరు చేయని ఉపవాసాలు లేవు. ఇన్ని చేసి ఆ తల్లి ఆ ఇంట ఓ ఎక్సస్ట్రా ప్లేయరే. ఎంతటి రాజీ బ్రతుకంటే తండ్రి తన బిడ్డ పెళ్లి నువ్వు బ్రతికున్నంత వరకు జరగదు అని తన భార్యను అనే స్థితిలో ఉందండి మన ఈ కధానాయకి . ఇదండి ఓ ఎక్సస్ట్రా ప్లేయర్ కద.