Dr.R.N.SHEELA KUMAR

Romance

4  

Dr.R.N.SHEELA KUMAR

Romance

ప్రేమించే మనసు

ప్రేమించే మనసు

2 mins
455


అవి పాఠశాలలో చదివే రోజులు. అందరు కలిసి మెలిసి సరదాగా గడిపే రోజులు అవి. ఇంటర్ మీడియట్ అయ్యి కాలేజీ లో చేరినప్పుడు ఎవరికీ వారు విడిపోయారు. శాంతి తన మిత్రులందరిని విడిచి క్రొత్తగా ఇంజినీరింగ్ కళాశాలలో మొదటి రోజు. భయం తోనే వెళ్ళింది.

  క్లాస్ రూమ్ లో అందరు వచ్చేరు తమ తమ పేర్లు చెప్పి తమ పరిచయం చేసుకున్నారు. శాంతి ఒక అబ్బాయిని చూసి ఇతనిని ఎక్కడో చూసాను అనుకుంది. ఆ అబ్బాయిలు పేరు శుషాంత్. అందరితోనూ మాట్లాడే తను నాతో ఏం పరిచయం చేసుకోలేదు అని ఆలోచిస్తూ ఉండే సమయానికి ప్రొఫసెర్ వచ్చేరు. అందరు లేచి నిలుచున్నారు. ప్రొఫసెర్ విజయ్ అందరిని కూర్చోమని చెప్పి ఒకొక్కరిని తమ పరిచయం చేసుకోమన్నారు శుషాంత్ అప్పుడు తన పేరు, ఊరు, స్కూల్ చెప్పిన వెంటనే శాంతి ఒకే ఊరు కానీ వేరే వేరే స్కూల్ అని అనుకుంటూ తన పరిచయాన్ని తెలిపింది.

మూడు నెలలు అయిపోయాయి శాంతి కి తెలియకుండానే శుషాంత్ ఆమెను వెంబడిస్తూనే వున్నాడు. ఇలా మొదటి సంవత్సరం అయ్యింది ఇద్దరు పోటాపోటిగా చదివే వాళ్ళు అవ్వటం వలన అందరికి వీళ్ళు నచ్చేరు కాలేజీ లో ఏ కార్యక్రమం అయిన వీళ్ళే చెయ్యాలి. పరిచయం ప్రేమ గా మారింది.

అప్పుడు శుషాంత్ అడిగాడు నిజంగానే నేను నీకు గుర్తు లేనా అని. శాంతికి మొదట అర్ధం కాలేదు. ఇప్పుడే కదా మన పరిచయం అయ్యింది అని అడిగింది. వెంటనే తన చిన్నప్పటి ఫోటో చూపించాడు. శాంతి ఆశ్చర్యం తో రాజా అని పిలిచింది. శుషాంత్ సంతోషానికి ఎల్లయే లేదు. నువ్వు నన్ను మరిచిపోయావేమో అనుకున్న శాంతి అని ఆమెను కౌగలించుకొని ధన్యవాదములు చెప్పాడు

శాంతి అసలు మూడవ తరగతి అయిన తరవాత నీకు ఏమయ్యిందో తెలియక ఎన్ని రోజులు వేదన పడ్డానో తెలుసా. మా అన్నయ్య ఎక్కడ ఉన్న సంతోషం గా ఉంటాడు నువ్వు ఏడవకు అనేవాడు. కాలం ఇలా కలిసి వసస్థాదని నేను అసలు ఊహించలేదు.

కాలం కాదు శాంతి నువ్వు 10పాస్ అయ్యిన వెంటనే నేను నిన్ను చూసాను నువ్వు గుర్తు పట్టలేదు అప్పటి నుండి నిన్ను నేను చూస్తూనే వున్నాను. ఇప్పుడు కూడా నాకు గవర్నమెంట్ కాలేజీ లో సీటు వచ్చింది నీ కోసమే ఇక్కడ జాయిన్ అయ్యాను అంటూ తన చేతిని పట్టుకొని చెప్పాడు. ఇద్దరు నాలుగేళ్ళ తమ పాయనాన్ని సాగించి ఇంజెనీరింగ్ ముగించి ఉద్యోగం వచ్చిన రెండేళ్లలో వివాహం చేసుకున్నారు

ఎంతటి వారికైనా ఓ ప్రేమ ప్రేమించే మనసు ఉంటాయి 


Rate this content
Log in

Similar telugu story from Romance