బామ్మ మాట
బామ్మ మాట


ఓ పెద్ద అడవి. నాలుగు దిక్కులలో పెద్ద పెద్ద చెట్లు అంతా చీకటి మయం. సోము తన తండ్రితో ఇంకా ఎంత దూరం నడవలు నాన్న అంటూ ఒక చెట్టుఅది కింద కూర్చున్నాడు. వెంటనే తండ్రి వెంకటరమణ కొద్దిగా నడిస్తే ఇంకో రెండు కిలోమీటర్లే రా పద నడు మళ్ళీ పులి, సింహం వచ్చే వేళ అని భయ పెట్టాడు తండ్రి పో నాన్న ప్రతి వారం ఇలానే చెప్పి నడిపిస్తున్నావ్ కాని మనం ఎందుకు ఈ అడివికి వస్తున్నామో మాత్రం చెప్పవు. అంటూ నడవటం మొదలు పెట్టాడు.
అలా నడుస్తూ ఓ గంట తరువాత తండ్రి కొడుకులిద్దరూఇంటికి చేరారు. ఇంతలో తల్లి శాంతం ఏమిరా బడుద్దాయ్ ఇంట్లో ఉండరా అంటే మీ నాన్న తో వెళ్ళావ్, ఏంటి చేసావ్ అక్కడ అని అడిగింది తల్లి.
అదేంటోనమ్మ అడవికి వెళ్ళటం అంటే సరదా కాని నాన్న ప్రతి వారం అడవికి ఎందుకు వెళుతున్నారు అని అడిగాడు.అక్కడేమైనా లంకబిందెలు దాస్తున్నారా అని అడిగాడు.అదేమీ లేదు నువ్వు రా అంటూ వాళ్ళమ్మ సర్ది చెప్పి పంపేసింది.
రాత్రి భోజనాలు అయ్యాక సోము వాళ్ళ నాన్నమ్మతో కధ చెప్పు బామ్మ అన్నాడు అప్పుడామే కలసి ఉంటే కలదు సుఖం అని కధ చెప్పడం మొదలు పెట్టింది
ఒక ఊరిలో ఒక అందమైన అమ్మాయి, అ అమ్మాయి స్వాతి చదువుకునే కాలంలో ఎవరితోనూ మాట్లడదు, చక్కగా చదువుతుంది అన్ని ఆటలు ఆడుతుంది కాని ఎవరితోనూ స్నేహంగా మాట్లడదు. ఒక రోజు తన ప్రక్కన కూర్చునే అమ్మాయి తనను pen అడిగింది, కాని స్వాతి పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయింది. మరుసటి రోజు పరీక్ష స్వాతి ఇంటి నుండి బయలుదేరి నప్పటికే చాలా సమయం అయ్యింది బడి కీ చేరే టప్పుడు పరీక్ష ప్రారంభించేసారు లోపలకు వచ్చి పరీక్ష పేపరు తీసి చదువుతూ పెన్ తియ్యడానికి బ్యాగ్ తీసి చూస్తే అందులో పెన్ లేదు, గాబరా పడింది అ సమయంలో తన ప్రక్కన ఎప్పుడు కుర్చీనే పద్దు ఇదిగో పెన్ నువ్వు పరీక్ష రాయు అంటూ ఇచ్చింది స్వాతి కీ ఆశ్చ్యంగా అనిపించింది నేనండగకుండానే పెన్ ఇచ్చింది తను ఎంత మంచి అమ్మాయి నేను అ రోజీ పెన్ అసలు పట్టించెకోలేదు, కాని అది మనసులో పెట్టుకోకుండా ఇప్పుడు నాకు సహాయం చేసింది అంటూ కంటి నిండా నీళ్లతో తనకి ధన్యవాదములు చెప్పింది అప్పుడు తనతో అందరితోనూ కలిసి మెలసి ఉండాలి అని చెపుతూ తరగతి నుండి వెళ్ళిపోయింది.