STORYMIRROR

Dr.R.N.SHEELA KUMAR

Romance

3  

Dr.R.N.SHEELA KUMAR

Romance

మదిలో మాట

మదిలో మాట

1 min
180

అది ఓ నిశి రాత్రి. కలయో నిజమో అనే సందేహం శృతి కి కల్గింది. అవును ఆమె కలలో ఓ యువకుడు. అతి సుందరమైన ఆ యువకుని మదిలో తన ప్రియుని గా ఊహించి ఊహ గానం లో ఉందామే. ఆ క్షణం ఆమె లో కలిగిన ఆ ఆనందం చెప్పలేనిది.

ఉద్యానవనంలో పూవుల హరివిల్లు లా ఆమె మనసు ఉవ్విల్లూరు తున్న ఆ భావం వివరించ లేనిది. కల అని తెలియని ఆమె మరుసటి ఉదయం కళాశాల ఆవరణలో తొలిసారి గా ఆ కలల రాజుని చూసి చిరునవ్వు తో అతని ముందు నిలుచొని సేద తీర్చుకొంటున్న సమయాన అతడు తన పేరు సుమన్ అని చెపుతూ షేక్ hand ఇస్తూ వెంటనే I love you అని చెప్పేసాడు.

   అంతే ఆమె మనసు ఏంతో సంతోషంతో అతనితో ఆమె కలను చెప్పింది.. వెంటనే అతడు తనకు కలలో నువ్వే వచ్చావని చెప్పి తన స్నేహితులకు పరిచయం చేసాడు. అందరు కలిసిమెలిసి సరదాగా గడిపేరు..

  

సుమన్ ఇంజినీరింగ్ ముగించుకొని తన ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్లగా శృతి ఉన్న ఊరిలోనే I. T. కంపెనీ లో పనిచేస్తుంది. రెండేళ్ల తరువాత సుమన్, శృతి ల వివాహం జరిగింది. అందరు సంతోషంగా ఉన్నారు.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Romance