alekhya eluri

Drama Romance

4.0  

alekhya eluri

Drama Romance

శ్రీవారికి ప్రేమ లేఖ...

శ్రీవారికి ప్రేమ లేఖ...

4 mins
2.3K


మురారి - రుక్మిణి ల ప్రేమ లేఖ....


హలో...హలో....ఏమండీ...నా మాట మీకు వినిపిస్తుందా??? అంటూ గట్టిగా తన ఫోన్ లో అరుస్తూ తన భర్త అయిన మురారిని అడిగింది...


హ...వినిపిస్తుంది ..కానీ నువ్వు అలా అరవకు...చిరాగ్గా...అన్నాడు మురారి రుక్మిణితో....


అయ్యో..అది కాదండి....నాకు మీ మాట సరిగా వినపడడం లేదు...అందుకే అలా అరవాల్సి వచ్చింది అంది సంజాయిషీగా...


హ్మ్...చెప్పు...ఎందుకు ఫోన్ చేశావ్...


అది మీతో మాట్లాడలనిపించింది...వారం రోజులైంది కదా మీతో మాట్లాడి...ఎలా ఉన్నారో అని చేసాను....


చూడు..నేను అసలే కొత్త ప్రాజెక్ట్ వర్క్ వల్ల ఆఫీస్ లో చాలా బిజీగా ఉన్నాను...అందుకే చేయలేదు...యీ మాత్రం దానికి నువ్వు ఫోన్ చేయాలా...అంతగా నా క్షేమం తెలుసుకోవాలంటే ఒక మెసెజ్ చేయలేవా....ఎందుకు నా వర్క్ బిజీ లో ఉండగా డిస్టర్బ్ చేస్తున్నావు..అయినా రోజుకి 24 గంటలు నీతో మాట్లాడలా అన్నాడు విసుగ్గా....


ఒక నిమిషం చివుక్కుమంది మనసులో రుక్మిణికి...కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి...


మాటలు వెతుక్కుంటూ ఏమి లేదు అండి ఉంటాను..సారి అని ఫోన్ పెట్టేయబోయింది..


హేయ్...ఆగు...ఎందుకు ఫోన్ చేసావో చెప్పు...మళ్ళీ దానికోసం మళ్ళీ నాకు చేయకు...నేను ఫ్రీగా ఉన్నప్పుడు చేస్తాను...అన్నాడు...


అంటే నేను మీకు ఒక లెటర్ రాసాను..అది మీకు అందిందో లేదో తెలుసుకుందామని చేసాను అంది...


దానికి వెటకారంగా నవ్వుతూ...ఏంటి ...ఈ రోజుల్లో లెటర్ రాసావ...వింతగా ఉంది...అయినా యీ టెక్నాలజీ ఇంత అభివృద్ధి చెందాక ఇంకా లెటర్స్ లోనే బ్రతుకుతున్నవా...అన్నాడు...


బాధ కలిగినా ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా ఉంది...


సరే ..సరే ఇపుడు నీ నీళ్ళకుండకి చిల్లు పెట్టకు తల్లి...హ...నిన్నే వచ్చింది...అన్నాడు..


ఆ మాట వినగానే తన బాధ ని మర్చిపోయి సంతోషంగా ఓహ్..వచ్చిందా...మీరు చదివారా...మీకు నచ్చిందా అంటూ ప్రశ్నలు వేసింది...


ఓ..ఒ..ఆగు...ఇంకా లేదు ...చదివాక చెబుతాను అంటూ కాల్ కట్ చేసాడు....


మురారి ప్రవర్తనకి బాధపడిన ఎపుడోకపుడు తన లెటర్ చదువుతాడు అన్న ఆశతో...మురారిని తలుచుకుని నవ్వుకుంది...


రోజులు గడుస్తున్నా మురారి నుంచి జవాబు రాలేదు...


నిరాశ కలిగింది...బాధ కలిగినా కూడా నవ్వుతూ తన వాళ్ళ దగ్గర నడుచుకుంటుంది...రుక్మిణి...


మూడు రోజుల తరువాత...


మురారి చాలా టెన్షన్ గా ఉన్నాడు...తన ప్రొజెక్ర్ కంప్లీట్ అయ్యే స్టేజ్ లో ఉండగా సడెన్ గా సాఫ్ట్వేర్ క్రాష్ అయ్యి డేటా అంతా పోయింది...

తన ఇన్ని రోజుల శ్రమ వృధా అయ్యింది...


డెడ్లైన్ దగ్గర అవ్వడం వల్ల ప్రాజెక్ట్ మళ్ళీ చేయడానికి కుదరదని మొత్తం తప్పు అంతా మురారీదే అని మానేజర్ తనని ఒక వారం లో సంజాయిషీ ఇమ్మని మెమో ఇచ్చారు...


ఇంటికి వచ్చిన దగ్గర నుండి అసహనంగా ఉన్నాడు...ఏమి చేయాలో అర్థం కాలేదు...కాసేపు పడుకుందామని ఎక్కడ తప్పు జరిగిందా అని ఆలోచిస్తూనే నిద్రపోయాడు...


బాగా రెస్ట్ తీసుకుని లేచాక అసలు ప్రాబ్లెమ్ ఎక్కడ వచ్చిందో ఎలా పరిష్కరించుకోవాలో అని తన బోర్డ్ పై ప్లాన్ చేసుకున్నాడు...ఆ టైం లో తనకి గుర్తుకు వచ్చింది ..నా దగ్గర డేటా ఇంకో కాపీ పెన్ డ్రైవ్ లో ఉండాలిగా అని....అంతే...ఆలోచన వచ్చినది ఆలస్యం మొత్తం ఇల్లు పీకి పందిరేశాడు...పెన్ డ్రైవ్ కోసం...


ఎంత వెతికిన ఎక్కడ కనపడలేదు...


అలా వెతుక్కుంటూ వంట గదికి వచ్చాడు...అక్కడ ఏం పెడతాను అనుకుంటూ..ఎందుకన్నా మంచిది అని అక్కడ కూడా వెతుకులాట మొదలు పెట్టాడు...


ఆ వెతుకులాటలో కనపడింది...రుక్మిణి రాసిన లెటర్...పక్కన పెట్టేసాడు...మళ్ళీ వెతకాలని...అంతలో రుక్మిణి మోము గుర్తుకు వచ్చి మళ్ళీ లెటర్ అందుకున్నాడు...


లెటర్ తీసుకువచ్చి సోఫాలో కూర్చుని చదవడం మొదలు పెట్టాడు...



ప్రియాతి ప్రియమైన శ్రీవారికి...


ఇక్కడ నేను క్షేమము... అక్కడ మీరు కూడా క్షేమం అని తలుస్తున్నాను...


ఆషాడ మాసం కొత్త జంటలకు ఎడబాటను...అంతులేని విరహాలను కలిగిస్తుంది అంటే నమ్మలేకపోయాను...అనుభవంలోకి వచ్చాక కానీ అర్థం కాలేదు...నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను...ఇక్కడ ఉన్నా అన్న మాటే కానీ నా మనసు అక్కడే మీ చుట్టూ తిరుగుతుంది..రోజంతా మీ తలపులతో సావాసం చేస్తున్నాను... ఇక్కడ నా చుట్టూ నా వాళ్ళు ఇంత మంది ఉన్నా ఎందుకో కొంచెం ఇబ్బందిగా ఉంది...


ఎందుకా అని నా మనసుని చాలా సార్లు ప్రశ్నించుకున్నాను...అపుడే నాకు ఒక కొత్త విషయం తెలిసింది...నేను పూర్తిగా మీ దాన్ని అయ్యాను కాబట్టే...నా కన్న వాళ్ళ దగ్గర కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నాను...


యీ ఫీలింగ్ ఏంటో కొత్తగా ఉంది..కానీ చాలా బాగుంది...


నిన్న అమ్మ జున్ను చేసింది...కొమ్ముల గేది ఈనింది అని...మీరే గుర్తుకువచ్చారు...మీకు జున్ను చాలా ఇష్టంగా....మన పెళ్లి అయిన కొత్తలో మీకు ఇష్టం అని అత్తయ్య గారు చెప్పారు...అది ఉంటే మీరు చిన్న పిల్లాడిలా తింటూ...అన్నం తినను అని మారం చేసేవారని...ఇప్పటికి ఆ అలవాటు ఉంది అని చెప్పి ఆవిడ నవ్వారు...


మిమల్ని అలా బెట్టు చేస్తుంటే చూడాలని చాలా ఆశపడ్డా..కానీ కుదరలేదు...


ఇప్పుడు అవకాశం వస్తే నా పక్కన మీరు లేరు...


మీకు పెయింటింగ్ వేయడం ...మొక్కల మధ్యలో కాలక్షేపం చేయడం...అందులో మీరు సంపంగి పూలని బాగా ఇష్ట పడతారు అని మావయ్య గారు చెప్పారు...


ఎందుకో నాకు తెలియకుండానే మీ ఇష్టాలు నా ఇష్టాలుగా మారిపోయాయి..నేను కూడా వాటిని ఇష్టపడడం మొదలు పెట్టాను....ఇంకా ఏదో చెప్పాలని మీతో నా ఊహల ఊసులు పంచుకోవాలని ఉంది....కానీ ఏంటో మాటలు కరువు అవుతున్నాయి...


ఇది అని చెప్పలేని భావం నా మనసుని పట్టి కుదుపుతోంది...


పెళ్లి అయిన వెంటనే భార్యాభర్తల మధ్య అంతులేని అనుబంధం ఏర్పడుతుంది...ఒకరి మీద ఒకరికి తెలియకుండానే ప్రేమతో కూడిన అధికారం వస్తుంది..అంటే నమ్మలేకపోయా...


కానీ మీరు పని ఒత్తిడి లో కనీసం భోజనం చేయక కంటి నిండా నిదుర పోనప్పుడు మిమల్ని జాగ్రత్త చేయాలని ఎంతో అనుకునేదాన్ని..కానీ ఏదో తెలియని భయం నన్ను మీ దగ్గరికి రానివ్వకుండా అడ్డు పడింది...


నాకు మీతో అల్లరి చేస్తూ...మీతో తప్పు చేసినపుడు తిట్లు తింటూ....ఆడుతూ పాడుతూ... డాబా పైన చుక్కుల తివాచీ కింద నిదురించాలని... మీ ప్రేమామృతాన్ని ఆస్వాదిస్తూ మీతో కలిసి ఒకటిగా మన జీవిత ప్రయాణాన్ని కొనసాగించాలని ఉంది...


ఇంకో విషయం కూడా చెప్పాలనుకుంటున్న నాకు మీ నుంచి కావాల్సింది ఒకటే... మీతో ఉండే సమయం చాలు...అంతకు మించి ఏమి లేదు....


కానీ నాకు ఒక చిన్న కోరిక ఉంది...నాకు మీతో పాటు పారిజాత పుష్పాల వానలో తడవాలని ఉంది...


మరొక మాట కూడా చెప్పాలనుకుంటున్న నాకు మీ ప్రేమ మాత్రమే ముఖ్యం...మణులు..మణిక్యాలు...భూములు కాదు...


మీ రాకకై ..మీ ప్రేమకై ఎదురుచూస్తూ...


ఇట్లు...


మీ


రుక్మిణి...


లెటర్ చదివిన మురారి కళ్ళలో నీళ్ళు ఆగడం లేదు...


ఇన్ని రోజులు తన ఇల్లాలిని ..తన మనసుని ఎంత కష్టపెట్టాడో అర్థమై టైమ్ ఎంత అయినది చూడకుండా రుక్మిణికి కాల్ చేసాడు...


నిద్రలో ఉన్న రుక్మిణి చూసుకోకుండానే లిఫ్ట్ చేసింది...


హలో అంది మత్తుగా...


హలో నేను అన్నాడు....మురారి...


ఏ పిలుపు కోసం తన మనసు ఎదురు చూసిందో..అదే విని ఆశ్చర్యపోయి టైం చూసుకుని ఒకింత కంగారుగా ...మీరు బాగానే ఉన్నారా...ఎపుడు లేనిది యీ టైం లో చేసారు...అని అడిగింది...


ఇన్ని రోజులు తరువాత చేసినా కూడా గొడవపడకుండా తనతో మాట్లాడుతున్న రుక్మిణి ని భాధపెట్టిన తన మూర్ఖత్వాన్ని..నిర్లక్ష్యాన్ని తిట్టుకుంటూ ...అంతా క్షేమమే అంటూ...తన లెటర్ చదివా అని నచ్చింది అని..నీ లాంటి ఇల్లాలు దొరకడం తన భాగ్యం అని చెప్పాడు...అలా మాట్లాడుకుంటూ తెలియకుండానే అలా నిదురపోయారు...


తరువాతి రోజు నిద్ర లేచిన మురారి మనసులో ఒకరకమైన భద్రతా భావం కలిగింది...


రుక్మిణి లెటర్ ముద్దు పెట్టుకుని దాన్ని ఇంట్లో ఉన్న తన పర్సనల్ ఫైల్ లో పెడుతుండగా కనపడింది తన పెన్ డ్రైవ్..అంతే ఆనందంగా గంతులేసి చక చకా రెడి అయ్యి ఆఫీస్ కి వెళ్లి మేనేజెర్ వచ్చే టైం కి ప్రాజెక్ట్ అంత మళ్ళీ రెడి చేసి అప్పగించాడు...


అలా తన సామర్ధ్యాన్ని మళ్ళీ నిరూపించుకున్నాడు...


ఆ తరువాత రుక్మిణి కోసం వాళ్ళ ఊరు బయలుదేరాడు...


ఎంతన్న ఆషాడం కదా కొత్త అల్లుడుకి అత్తవారింట ఎంట్రీ లేదు...


ఇక తప్పక వాళ్ళ పొలం దగ్గరకు రమ్మని మని అడిగాడు...రుక్మిణిని...


మురారి అక్కడ రుక్మిణి కోసం ఎదురు చూస్తున్నాడు...


తన కోసం కారియర్ లో భోజనం తీసుకువస్తున్న రుక్మిణిని చూస్తూ నాయుడోరి ఎంకిలా ఎంత అందంగా ఉన్నవే నా పెళ్ళామా..అని అనుకున్నాడు...


రుక్మిణి రాగానే చేతిలో ఉన్న కారియర్ పక్కన పెట్టి తనని ఎత్తుకుని భుజంపై వేసుకుని మంచే ఎక్కాడు...


ఎన్నో రోజుల విరహం తరువాత ...స్వచ్ఛమైన ప్రేమని రుచి చూసిన మురారి ఆగలేక రుక్మిణిని తమకంతో ఆక్రమించబోయాడు..


రుక్మిణి మురారిని వారించింది...


పెద్దవాళ్ళు మనల్ని దూరం పెట్టింది...ఇది కూడదు అనే కదా...మరి మనం ఆ తప్పు చెయ్యొచ్చా...అని అడిగింది...


ఆ ఒక్కమాటతో తన మనసు అర్థమై అలిగాడు మురారి...


అలిగిన మురారి మోము అరచేతులలోకి తీసుకుని దానికి తప్పు...దీనికి ఒప్పు అని తన పెదవులతో మురారి కి అధర సంతకం చేసింది....


ఆ సంతకం అయ్యాక ఒకరి కౌగిలిలో మరొకరు కరుగుతూ బోలెడు ఊసులు చెప్పుకున్నారు...


తరువాత మురారి భోజనం చేస్తూ రుక్మిణికి తినిపించాడు...


కాసేపు మాట్లాడుకున్నాక రుక్మిణి దగ్గర సెలవు తీసుకుని తనని విడువలేక విడువలేక విడిచి వెళ్ళాడు....


ఇద్దరూ శ్రావణమాసం రాకకై ఆనందంగా ఎదురుచూశారు...



********


థాంక్ యూ...


మీ


అలేఖ్య.ఏలూరి."లేఖ్య"


Rate this content
Log in

Similar telugu story from Drama