alekhya eluri

Drama

3.5  

alekhya eluri

Drama

ప్రియ సఖి...

ప్రియ సఖి...

3 mins
11.9K


అలై పొంగెరా...కన్నా...


మానస మలై పొంగెరా...


ఆనంద మోహన వేణుగానమిది...


అలై పొంగెరా కన్నా...


అని ఐసీయూ లో ఉన్న ఒక నర్స్ మొబైల్ రింగ్ అయ్యింది...


అప్పటి వరకు చలనం లేని ఒక పేషెంట్ కి ఆ పాట విన్న వెంటనే స్పృహ వచ్చింది...


అప్పుడే..రౌండ్స్ కి వచ్చిన జూనియర్ డాక్టర్ అది చూసి వాళ్ళ సీనియర్ కి ఇన్ఫోర్మ్ చేద్దామని పరుగున వెళ్ళాడు...


అప్పటి వరకు ఐసీయూ బయట పడిగాపులు పడిన ఆ పేషెంట్ తల్లిదండ్రులు కంగారు పడ్డారు...విషయం ఏమిటి అని నర్స్ ని అడిగితే...మీ అబ్బాయి కి స్పృహ వచ్చింది అని చెప్పింది...


అంతే...పరుగున లోపలికి వెళ్ళి వాళ్ళ బిడ్డని దూరం నుంచే చూసి కంటికి కనపడని ఆ దేవుడికి చేతులెత్తి నమస్కరిస్తున్నారు...


ఇంతలో డాక్టర్ రావడం చెక్ చేయడం...ఆ పేషెంట్ నీ పేరు ఏంటి అని అడిగారు...


నా పేరు...


హ..మీ పేరే...


ఆర్య ...ఆర్య నందన్...


గుడ్...


మీరు ఇక్కడికి ఎలా వచ్చారో తెలుసా...


హ..అది..అది...అంటూ గుర్తుచేసుకుని...ఒక్కసారిగా రాధి..రాధిక అంటూ కేకలు వేస్తూ...డాక్టర్ డాక్టర్...ఇపుడు తను ఎలా ఉంది...చెప్పండి డాక్టర్ నా ప్రాణము ఎలా ఉంది...అంటూ అరుస్తున్నాడు...


రిలాక్స్...ఆర్య...ఫస్ట్ మీరు కూల్ గా ఉండండి..


ప్లీస్..డాక్టర్ తను ఎలా ఉందో చెప్పండి అని కన్నీళ్లతో వేడుకుంటున్నాడు...


మీకు బాధకలిగిన ఆర్య..నిజం చెప్పక తప్పదు...


ఏమైంది డాక్టర్ అని అడిగాడు భయంగా...


మీరు ఒక సంవత్సరం నుంచి కోమాలో ఉన్నారు...నిజం చెప్పాలంటే మీరు బ్రతకడమే ఒక అద్భుతం..అలాంటిది మీ వైఫ్ అంటూ ఆగిపోతే...


నో..నో..నో...ప్లీస్..దయ చేసి తను లేదు...అని చెప్పకండి అంటూ ఏడుస్తున్నాడు ఆర్య...


మనకి నచ్చడం లేదు అని అమృతాన్ని కూడా విషం అనుకుంటాం...అదే ప్రేమ కి ఉన్న పవర్..అలాంటిది మీ ప్రేమ మీ దగ్గర లేదు అని చెబుతుంటే మీరు నమ్మను అంటే మేమేమి చేయలేము...మిమల్ని కౌన్సెలింగ్ కి పంపించడం తప్పించి...


రాధి...రాధి...నన్ను వదిలి వెళ్లిపోయావురా అంటూ తన గుండె పగిలేలా ఏడుస్తున్నాడు ఆర్య...


టేక్ కేర్ ఆర్య...అని బయటకు వచ్చి..తనని కాసేపు డిస్టర్బ్ చేయకండి...కానీ ఒక కంట కనిపెడుతూ ఉండండి...అని ఆర్య పేరెంట్స్ కి చెప్పి వెళ్లిపోయారు...


తల్లిని కౌగిలించుకుని బావురుమన్నాడు ఆర్య...ఎంతకీ కంట్రోల్ అవకపోతుంటే ఆర్య తండ్రికి భయం వేసి అసలే చచ్చి బ్రతికాము రా నీకోసం...నువ్వు ఏ అఘాయిత్యానికి పునుకోను అని మాట ఇవ్వు...


ఆర్య విరక్తిగా నవ్వుతూ...చచ్చిన శవం ఎన్ని సార్లు చస్తుందేలే నాన్న అన్నాడు...


ఆర్య మనసు అర్థం అయ్యి మౌనంగా ఉన్నారు...


హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక రాధిక ని సమాధి చేసిన చోటు కెళ్ళి నన్ను ఎందుకు వదిలేసి వెళ్లిపోయావు...నువ్వు లేకపోతే నేను ఎలా బ్రతుకుతున్నాను అనుకున్నావు అంటూ అక్కడే ఉండిపోయాడు...


అర్ధరాత్రి అయినా కొడుకు ఇంటికి రాలేదు అని తెలిసి ఆర్య నాన్న గారు ఆర్య ని వెతుకుంటు తిరిగి రాధిక సమాధి దగ్గరికి వెళితే అక్కడ ఉన్నాడు ఆర్య...


కొడుక్కి నచ్చచెప్పి తీసుకువచ్చారు...


రోజు రాధిక సమాధి దగ్గరకు వెళ్లి రాధిక జ్ఞాపకాలతో గడపడం ఆర్య దిన చర్య అయిపోయింది...


తల్లిదండ్రులు ఎంతో నచ్చ చెప్పాక తండ్రి బిసినెస్ జాయిన్ అయ్యాడు ఆర్య...


ఒకనాడు బిసినెస్ టూర్ కి వెళ్ళినపుడు అక్కడ స్టే చేసిన హోటల్లో బిజినెస్ డీల్ మాట్లాడుతు ఉండగా మళ్లి అదే పాట వినపడింది...


అలై పొంగెరా...కన్నా...


మానస మలై పొంగెరా...


ఆనంద మోహన వేణుగానమిది...


అలై పొంగెరా కన్నా...


వెంటనే పరుగున వెతుకుంటు వెళ్ళాడు...


అక్కడ ఒక అమ్మాయి పాట పడుతుంది...చారిటీ ప్రోగ్రాం కోసం అక్కడ కచేరి ఏర్పాటు చేసారు....


ఆ అమ్మాయిని చూడంగానే షాక్ అయ్యి..అలానే తననే చూస్తున్నాడు...
రాధి..నా రాధిక అంటూ...తడబడిన అడుగులతో ఆ అమ్మాయి వైపు వెళ్ళాడు...


ఇంతలో...అమ్మా ఆరాధన..అంటూ ఆ అమ్మాయి తల్లి తనని పిలిస్తే ఆ అమ్మాయి వెళ్ళింది...


ఆరాధనా నా..అని అనుకుని తనని ఫాలో అయ్యి తన వివరాలు కనుకున్నాడు...


తను ఒక క్లాసికల్ సింగర్ అని తెలిసి ఆశ్చర్యపోయాడు...రాధికి ,యీ అమ్మాయికి రూపమే కాదు అభిరుచి కూడా ఒకటేనా...అనుకుంటూ...కళ్ల ముందు లేని తన రాధికను ఆరాధనలో చూసుకుంటూ తనని ఫాలో చేస్తూ...ఎప్పటికపుడు తన కచేరీలు జరిగినప్పుడల్లా గిఫ్ట్స్ పంపిస్తూ...ఆనందంగా ఉండేవాడు...


తన మీద అజ్ఞాతంగా ఆరాధన చూపిస్తున్న వ్యక్తి ఎవరా అని ఆరాధనకి తెలుసుకోవాలని పించింది..కానీ ఎలా తెలుసుకోవాలో

తెలియక ఊరుకుంది..


ఒకనాడు కచేరి అటెండ్ చేయడానికి వెళ్తూ ఆరాధనకి ఆక్సిడెంట్ అయ్యి కచేరి క్యాన్సల్ అయ్యింది అని తెలిసి పరుగున వెళ్ళాడు చూడడానికి...అక్కడ ఆరాధనని అలా చూసి చాలా బాధ కలిగింది...ప్రమాదం లేదు అని తెలిసి ఊపిరి తీసుకున్నాడు...అయినా ఆగలేక అక్కడే ఉన్నాడు..ఎవరూ లేని సమయం చూసి తనని నుదిటిమీద ముద్దు పెట్టుకుని వెనుదిరిగి వెళ్తుంటే చేయి పట్టుకుని ఆపింది ఆరాధన...


ఇంత జరిగితే కానీ రారు అన్నమాట..అంది నవ్వుతూ...


అది..అది...


పరవాలేదు లెండి...నేనేం అనుకోను...


ఆర్య ఆశ్చర్యంగా చూస్తూ..నేను మీకు ముందే తెలుసా...


అంటే...మీరు నన్ను ఫాలో చేయడం తెలిసి మీ నాన్న గారు నా దగ్గరికి వచ్చి మీ గతం చెప్పి మిమ్మల్ని పెళ్లి చేసుకోమన్నారు...


నేను ..నా రాధి స్థానం ఎవరికి ఇవ్వలేను...


నాకో డౌబ్ట్..మీరు గొప్ప ప్రేమికుడిలా ఉండాలనుకుంటున్నారా..లేక గొప్ప భర్తగా ఉండాలనుకుంటున్నార...


రెండూ నూ...


అయితే....ఒక పని చేయండి...ప్రేమికుడిలా రాధిక ని ప్రేమించండి...నన్ను భర్తగా ప్రేమించండి...


అది జరగని పని...


మరి నన్ను ఎందుకు ఫాలో చేసారు...


నా రాధిలా ఉన్నావని మాత్రమే...


ఓహ్...అయితే..చూపులే కాని...అంతకు మించి ఏమి లేదు అంటారు...


అంతే...


అయితే..నేను వేరొకరిని పెళ్లి చేసుకోవచ్చా...


నిరభ్యంతరంగా...


థాంక్ యూ...ఇక మీరు వెళ్లొచ్చు...అని కళ్ళు మూసుకుంది...కొన్ని రోజుల తరువాత...


కళ్యాణ మండపం కోలాహలంగా ఉంది...


ఇప్పుడన్నా పెళ్లి కొడుకుని చూడు తల్లి అంది ఆరాధన తల్లి...


ఏం అక్కర్లేదులెమ్మ...నీ నిర్ణయం మీద నాకు నమ్మకం ఉంది...


నీ ఇష్టం తల్లి అంటూ ఆరాధన నుదుటిమీద ముద్దు పెట్టుకుంది...


పెళ్లి తంతులు మొదలు అయ్యాయి...


వరుడు వచ్చి పెళ్లి పీటల మీద కూర్చున్నాడు..


అయినా చూడలేదు ఆరాధన...


సుముహర్తం సమయం అయ్యింది..జీలకర్రబెల్లం.పెట్టుకుని చూసుకోమన్నారు...


కళ్ళెత్తి చూసిన ఆరాధన కళ్ళు ప్రేమతో నిండాయి...


ఆర్య నవ్వుతూ తన వైపు చూస్తుంటే సిగ్గు నేనున్నాను ఇక్కడే అని పలకరిస్తే తలదించుకుంది...
పంచభూతల సాక్షిగా మరో సారి ఆరాధనతో తన జీవితాన్ని ముడివేసుకున్నాడు ఆర్య...


ఇద్దరూ..సంతోషంగా జీవితాన్ని గడిపారు...


*****


ప్రేమించిన వాళ్ళు దూరం అయినంత మాత్రాన జీవితం ఆగిపోదు...సంతోషాలు పలకరించే మలుపులో విలువకట్టలేని ప్రేమ మనకి ఎదురువచ్చి పలకరిస్తుంది...


Rate this content
Log in

Similar telugu story from Drama