Krishna Kowndinya

Drama

4.9  

Krishna Kowndinya

Drama

గౌరవం

గౌరవం

5 mins
629


న్యూస్ లోని వార్త విన్న వెంటనే చంటి ఎగిరి గంతేసాడు. "అమ్మయ్యా!" అని ప్రశాతంగా ఊపిరి పీల్చుకున్నాడు. తొమ్మిదో తరగతి చదువుతున్న చంటి కి పరీక్ష సమయంలో స్కూల్ సెలవు అని నిర్దారించేసరికి, వాడి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. గంతులు వేసుకుంటూ వంటింట్లోకి వెళ్లి "అమ్మా ! ఈ రోజు నాకు బిరియాని కావాలి " అని ఆర్డర్ వేసాడు.ఆవిడ నవ్వుతూ సరే అన్నారు.

              ***

"మీరు సిస్టమ్స్ ఇంటికి తీసుకెళ్లండి, మీకు కావాల్సిన ఇంటర్నెట్ మేము ప్రొవైడ్ చేస్తాము. జాగ్రత్తగా ఇంట్లోంచే పని చేయండి. బి సేఫ్ టేక్ కేర్" ఎంప్లోయస్ అందరిని ఉద్దేశించి, కంపెనీ సి ఈ ఓ ప్రకటించారు. 

అందరి మొహాలు వెలిగిపోయింది,కొత్తగా వచ్చిన కరోనా వైరస్ వల్ల ప్రతి వాళ్లు ఆఫీస్ కి వచ్చి పని చేయాలంటే భయపడుతున్నారు.వర్క్ ఫ్రొమ్ హోమ్ అని యాజమాన్యం చెప్పే సరికి అందరూ రిలాక్స్ అయ్యేరు. ఆఫీస్ లోంచి అందరూ వాళ్ళ వాళ్ళ సిస్టమ్స్ తీసుకుని బయటపడుతున్నారు. సురేష్ కూడా సిస్టమ్స్ ప్యాక్ చేసుకుని, లాకర్ లోంచి లంచ్ బాక్స్, సెల్ ఫోన్ తీసుకున్నాడు. సైలెంట్ లో వున్న ఫోన్ చెక్ చేసుకున్నాడు, కూతురు స్వాతి నుండి మూడు మిస్డ్ కాల్ కనబడింది. వెంటనే కూతురుకి కాల్ చేసాడు. 

              ***

స్వాతి బ్యాగులన్నీ బస్ వెనకాల ఎక్కించి, హ్యాండ్ బ్యాగ్ తో బస్ ఎక్కేసింది. ఏసీ బస్ మొత్తం నిండిపోయి వుంది. హైదరాబాద్ నుండి బయలుదేరి రేపటి కల్లా వైజాగ్ చేరుకుంటుంది. బస్ మెల్లగా బయలుదేరుతోంది, బయట కనిపిస్తున్న చిన్న వినాయకుడి విగ్రహాన్ని దండం పెట్టుకుంది స్వాతి. కొన్ని క్షణాల్లో ఫోన్ మోగింది, ఫోన్లో నాన్న పేరు చూడగానే ఆమె సంతృప్తిగా నవ్వుకుంది. 

"ఆ!! నాన్న ఫోన్ ఎత్తలేదేందుకు?... ఓ మీటింగ్.. ఆ! సర్లే నేను బస్ ఎక్కేసాను. రేపు పొద్దున్న వచ్చేస్తాను. జాగ్రత్త బాయ్ నాన్న." 

ఫోన్ కట్ చేసి, హ్యాండ్ బ్యాగ్ లో తను పార్సెల్ చేయించుకున్న టిఫిన్ తినేసి.. కాసేపు సెల్ చూసుకుని నిద్రలోకి జారుకుంది.

              ***

"అక్క వచ్చేసింది..!!" అని ఉత్సాహంగా స్వాతిని వెళ్లి చుట్టుకున్నాడు చంటి. సురేష్ కూతురు దగ్గర వున్న బ్యాగులు తీసుకుని పక్కన పెడుతూ "లక్ష్మీ! స్వాతి వచ్చింది.. మరి తనకి నచ్చిన వన్నీ రెడీ గా ఉన్నాయా?" అని కేకేసాడు.

"ముందు తనని రిఫ్రెష్ అవమనండి.. అందరం కలిసి బ్రేక్ ఫాస్ట్ చేద్దాం" వంటింట్లోంచి జవాబు ఇచ్చింది లక్ష్మీ. 

స్వాతి రిఫ్రెష్ అయ్యాక అందరూ కలిసి ఆ రోజు కబుర్లు చెప్పుకుంటూ హాయిగా గడిపారు.ఆ మరుసటి రోజు నుండి లాక్ డౌన్ ప్రకటించారు.

             ***

"అమ్మా !! నేను మంచి నీళ్లు అడిగాను.. ఎం చేస్తున్నావు.. వినబలేదా?" పబ్ జీ ఆడుతు చిరాకు పడ్డాడు చంటి. 

"నేను లేనప్పుడు నా రూమ్ ఎందుకు సర్దేవు అమ్మా! మొత్తం అన్ని వెతుకోవాల్సి వస్తోంది"

మండిపడింది స్వాతి.  

"లక్ష్మీ !! పిల్లలు పిలుస్తూ ఉంటే ఏంటి బదులు చెప్పవు,ఎం చేస్తున్నావు అసలు?" కోపంగా అరిచాడు సురేష్. 

తను ఎం బదులు చెప్పక పోవడంతో తనని వెతుక్కుంటూ వంటింట్లో కి వెళ్ళాడు. ఆమె అక్కడ లేదు... 

"నాన్న అమ్మ బెడ్ రూమ్ లో ఉంది నీరసంగా పడుకుంది" అంటూ పిల్లలు పిలిచారు. 

సురేష్ బెడ్ రూంకి వెళ్లి చూసే సరికి పిల్లలు అమ్మ పక్కన కూర్చుని వున్నారు. 

"ఏంటి! ఇప్పుడు పడుకున్నావు.. " చిరాకు పడుతూ అడిగాడు సురేష్. 

"అమ్మ కి ఈ రోజు ఓపిక లేదట నాన్న, రెస్ట్ తీసుకుంటుంది ట. " చంటి బదులిచ్చాడు 

"కాస్త ఓపిక తెచ్చుకుని ఎదో సింపుల్ గా చేయలేవా? "

"లేదండి ! బాడీ పెయిన్స్ గా వుంది. ఈ రోజు మీరే కాస్త మేనేజ్ చేసుకోండి... "

"అబ్బా! వర్క్ అంతా చాలా వుంది. నువ్వు ఇప్పుడు చెప్తే ఎలా?"

"పోన్లే! నాన్న మేము కూడా వున్నాము కద నీకు హెల్ప్ చేస్తాం" అని స్వాతి అనడంతో కాస్త చిరాకు పడుతూనే ఒప్పుకున్నాడు సురేష్.

ఇక ఆ రోజు అందరూ కలిసి వంట చేసుకోవడం, గిన్నెలు తోమడం, బట్టలు ఉతికి ఆరేయడం. ఇంటి పని మొత్తం షేర్ చేసుకుని చేసినప్పడికి అలవాటు లేని పనుల వల్ల ముగ్గురూ ఆ రోజు నీరసంగా పడుకుండి పోయారు 

             ***

మరునాడు కొంచెం ఆలస్యం గా నిద్ర లేచాడు..సురేష్. పక్కన తిరిగి చూస్తే లక్ష్మి పక్కన లేదు.. తను లేచేసింది అనుకుని "అమ్మయ్యా" అనుకున్నాడు. బద్ధకంగా నడుచుకుంటూ వెళ్లి బ్రష్ చేసుకుని, కాలకృత్యాలు ముగించుకుని. కాఫీ అడగడానికి వంటింట్లోకి వెళ్ళాడు. లక్ష్మి అక్కడ లేదు.. పిల్లల గదిలో వెళ్లి చూసాడు, పిల్లలు నిద్రపోతున్నారు, అక్కడా కనిపించలేదు.. బాల్కనీ లో వెళ్లి చూసినా లేదు... సురేష్ కి కొంచెం కంగారు వచ్చింది. మళ్ళీ ఒక సారి ఇల్లంతా వెతికాడు..కనిపించలేదు. లక్ష్మి కి కాల్ చేసాడు... ఫోన్ రింగ్ అవుతోంది.. వాళ్ళ బెడ్ రూమ్ నుంచే..బెడ్ మీద రింగ్ అవుతున్న లక్ష్మి ఫోన్ తీసుకుని కట్ చేసాడు. ఎక్కడికి వెళ్ళిదా? అని ఆలోచిస్తూ ఉండగా, అతని దృష్టిలో బెడ్ లాంప్ కింద వున్న పేపర్ కనిపించింది. మెల్లగా దాన్ని తీసాడు... అందులో వున్న చేతి రాత బట్టి లక్ష్మి రాసింది అని గ్రహించాడు. కొంచెం ఆశ్చర్య పడుతూ లెటర్ చదవడం ప్రారంభించాడు.


ప్రియమైన చిన్నూ కి, 

ఇలా నిన్ను పిలిచి ఎన్ని రోజులు అయిందో..? అసలు ఇలా ఉత్తరం రాసే ఎన్ని సంవత్సరాలు గడిచిందో ? పెళ్లయిన కొత్తలో మీరు చాలా సార్లు క్యాంపు కి వెళ్లే వారు, మనం కలిసి వుండే సమయం ఎక్కువ దొరికేది కాదు, కానీ అప్పుడు మనం ఫోన్లో కంటే ఉత్తరాల్లోనే ఎక్కువ మాట్లాడుకునే వాళ్ళం. మీరు రాసిన ఆ ఉత్తరాలను చదువుతూ.. అందులోని మీ ముత్యాల్లాంటి అక్షరాలను తముడుతూ ఉంటే మీరు నా పక్కనే వుండి మాట్లాడుతున్నారనే మధురమైన భావన కలిగించేది. ఆ సమయంలో మనం దూరంగా ఉన్నప్పటికీ ఈ అక్షరాలు మన మనసుల్ని మాత్రం ఒక్కటి గానే ఉంచింది.

అప్పుడు మన ఎడబాటు కూడా వలపుబాట గా అనిపించేది. 

రోజులు గడిచిన తర్వాత మీకు క్యాంపులకి వెళ్లే పని తగ్గింది, మనం కలిసి వుండే సమయం ఎక్కువ దొరికింది. ఇద్దరం చాలా చక్కగా కలిసి అన్ని చేస్కునే వాళ్ళం. మనకి పిల్లలు పుట్టి, వాళ్ళు పెద్ద అవుతున్న కొద్ది.. మన మధ్య మానసిక దూరం ఎక్కువ అయింది.

ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మనల్ని మనం మరిచిపోయి, కేవలం అవసరం కోసం, బ్రతకడం కోసం, జీవిస్తూ ఉంటే. జీవితం నిస్తారంగా, నిర్జీవంగా గడిచిపోతోంది. ఇప్పుడు మనం పక్క పక్కనే వున్నా మన మధ్య మాటలు లేవు, నేను చేసే పనికి గుర్తింపు లేవు, మనం రాసుకునే అక్షరాలు అస్సలు లేవు. ఇన్ని రోజుల తర్వాత ఈ లాక్ డౌన్ వల్ల మనం అందరం కలిసి ఉంటాం, ముఖ్యంగా మనం ఇద్దరం ప్రశాంతంగా గడుపుదాం అనుకున్నా కానీ లాక్ డౌన్ అయ్యి ఇన్ని రోజులు అయినా కేవలం ఒక యంత్రంలా పని చేస్తూ, అవసరం కోసం మాట్లాడుతూ ఉంటే చాలా బాధగా వుంది.

నేను చేస్తున్న పనికి కనీసం గుర్తింపు ఇవ్వకుండా నన్ను పని చేసే మనిషి లాగే పరిగణిస్తున్నపుడు చాలా కోపం కూడా వచ్చింది..మరి మీరే ఇలా చూస్తే పిల్లలు ఎలా చూస్తారు నన్ను.. ఒక్క సారి ఆలోచించారా? సాధారణ రోజుల్లో అయితే బిజీ గా వుంటారు.కాని ఈ లాక్ డౌన్ లో కూడా ఇలాగే మెకానికల్ గా బ్రతికేస్తుంటే చాలా బాధేసింది 

అందుకే నిన్న కావాలనే నేను పడుకున్నాను మిమ్మల్నే అన్ని చేయమన్నాను.. నిన్న మీరు ముగ్గురు కలిసి చేయడానికే చాలా కష్ట పడ్డారు. మరి నేను ఒక్కదాన్నే ఇవన్నీ రోజు చేస్తాను నాకు ఎంత కష్టంగా ఉంటుందో ఆలోచించారా? 

ప్రేమ అంటే కేవలం మాటల్లోనో, బర్త్ డే సెలెబ్రేషన్స్ లోనో చెప్పడం కాదు. కలిసి చేసుకోవడం లో ఎవరు ఎంత పని చేసిన గుర్తించి చెప్పడంలో, సాటి మనిషికి మర్యాద ఇవ్వడంలో కూడా ఉంటుంది. ఇవ్వన్నీ మీకు తేలిక కాదు తెలుసండి, కాకపోతే నన్ను గ్రాంటెడ్ గా తీసుకుని పట్టించుకోలేదు అంతే.. మీకు ఒక సారి ఇవ్వన్నీ గుర్తు చేద్దాం అని ఇలా మన పద్దతిలో రాసి చెప్పాను. ఈ లాక్ డౌన్ నుంచి మళ్ళీ మనం కలిసి చక్కగా ఉండడం, మనల్ని ప్రేమించే వాళ్ళకి మనకంటే చిన్న వాళ్ళకి కూడా మర్యాద ఇవ్వడం, ఏ చిన్న మంచి పని చేసిన కూడా గుర్తించడం చేద్దాం. ఒక విధంగా ఈ లాక్ డౌన్ కి కూడా థాంక్స్ చెప్పాలి నా మనసులో ఎప్పడి నుండో నలుగుతున్న ఆలోచనల్ని బయటపెట్టగలిగే అవకాశం, సమయం ఇచ్చింది. మీరు నేను చెప్పింది అర్ధం చేసుకుంటారాని ఆసిస్తూ...

ఎప్పటికి మిమల్ని ప్రేమించే 

                      మీ 

                     చిన్నూ 

ఉత్తరం చదివి పూర్తి చేసే సరికి సురేష్ కళ్ళల్లో నీళ్లు తిరిగింది.క్షణం పాటు అలా స్థాణువులా నిలుచుండిపోయాడు. కొంత సేపటికి తేరుకుని హాల్లోకి వచ్చాడు. అప్పుడు లక్ష్మీ నవ్వుతూ కనిపించింది అమాంతం వెళ్లి హత్తుకున్నాడు.  

"ఐ యామ్ సారీ. నిజంగా సారీ" 

"ఇక ఎప్పుడు ఇలా చేయను" అని ప్రాధేయపూర్వకంగా అడిగాడు.

లక్ష్మి అనునయంగా అతని తల రాస్తూ " ఎం పర్లేదు! మీకు ఒక సారి గుర్తు చేద్దాం అనే ఇలా చేశాను అంతే.. మిమల్ని భాద పెట్టి ఉంటే సారీ" అంది.

లక్ష్మి కి కొంచెం దూరంలో ఎదురుగా నిలుచున్న స్వాతి వైపు చూసి నవ్వింది. స్వాతి కూడా చిన్నగా కన్ను కొట్టి బొటన వేలు పైకి చూపించింది.

తన కూతురు చెప్పిన చిన్న ప్లాన్ తో మళ్ళీ తన గౌరవాన్ని, ప్రేమని కూడా దక్కించుకుంది లక్ష్మి.

              ***



Rate this content
Log in

More telugu story from Krishna Kowndinya

Similar telugu story from Drama