Chinnarao Savara

Drama

4.4  

Chinnarao Savara

Drama

కొడుకులు @ T20

కొడుకులు @ T20

10 mins
2.1K


  అరుణోదయ శోబిత సూర్య కిరణాలు భూమిని తాకుతున్న వేళ కీటకాలు కీచు శబ్దాలు తగ్గుతున్న వేళ ఒక రైల్వే స్టేషన్ సమీపంలో సాంబయ్య ఏదురుగా వస్తున్నరైలు వైపు పరుగు తీస్తు రైలు క్రింద పడి ఆత్మహత్య చేసుకున్న దృశ్యాన్ని చూస్తున్న తన తోటి స్నేహితుడు రామయ్య నిర్గంతపోయి సోమ్మసిల్లిపోయాడు .కొంత సమయానికి తెలివి తెచ్చుకున్న రామయ్య గబాలున లేచి చిన్న భిన్నమైపోయిన సాంబయ్య పార్దివ దేహాన్ని చూసి గుండెలు బాదుకుంటూ కేకలు వేస్తూ పరుగు పరుగున స్టేషన్ మాస్టర్ దగ్గరికి వెళ్లి సమాచారం అందించాడు .సాంబయ్య భార్య సావిత్రి ,పిల్లలు ,ఊరు వారు సంఘటన స్థలంనకు చేరుకొని కన్నీరు మున్నీరుగా విలపించారు .

                                కొన్ని రోజుల తర్వాత తన మరణదృవపత్రం ,పించన్ కు సంబందించిన దస్త్రాల కోసం సంబందిత ఆఫీసర్ ని కలవడానికి వెళ్ళిన సావిత్రి అక్కడే ఉన్న రామయ్య ను చూసి ఏడుస్తూ ”అన్నయ్య బాగున్నారా !మీ పిల్లలు బాగున్నారా! అని యోగ క్షేమాలు అడిగింది .చెల్లమ్మ !అందరం బాగానే ఉన్నాం .నా కూతురుకి మంచి సంబందం వచ్చింది .నా కొడుకు హైదరాబాద్ లో కోచింగ్ తీసుకుంటున్నాడు అన్నాడు రామయ్య .మరుసటి రోజు యదవిదిగా రామయ్య ఉద్యోగానికి వెళ్లి ఎండ తీవ్రత ఏక్కువగా ఉన్నందున రైల్వే ట్రాక్ ప్రక్కన గల చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటుండగా ఇంతలో పెద్ద శబ్బం తో ఫలక్ నామా ఎక్షెప్రెస్ వేగంగా రావటంతో ట్రాక్ పైన ఉన్న దుమ్ము ధూళీ లతో పాటు ఒక కాగితం రామయ్య ముఖం పైన పడింది .రామయ్య తులుక్కుపది తన ముఖం పైన కాగితాన్ని తీసి చూడగా “హలో భావ నేను నీ సాంబయ్యను ఎలా ఉన్నావ్ !బాగున్నావా !”ఈ కాగితం నిన్ను చేరుకుంటుందో ,ఇంకా ఎవరినయిన చేరుకుంటుందో నాకు తెలియదు గాని ,ఎందుకో నా మనసు నిన్ను చేరుకుంటుందని వ్రాసుకున్నవిన్నపములు.భావ నేను నిన్ను నీ చెల్లిని ఒంటరి చేసి విడిచి వెళ్ళిపోతున్నాను .నేను నా జీవితంలో మీ ఇద్దరికి అన్యాయం చేశాను.అందుకు నిన్ను క్షమాపణలు అడగడానికి కూడా అనర్హుడును .ఈ సువిశాల సుందర సౌందర్య విశ్వంలో కోటాను కోట్ల పాలపుంతలు ,ఈ పాలపుంతలలో ఓ చిన్న పాలపుంతలో ఓ చిన్న సౌర కుంటుంబం లో ఓ చిన్న భూగ్రహం ,ఈ చిన్న భూగ్రహం లో నేల ,నింగి ,నీరులలో కోటాను కోట్ల జీవరాశులు నివాసముంటున్నాయి .ఇన్ని కోట్ల జీవరాశులలో ఏ ఒక్క జీవి కూడా తనకు తానుగా బలవంతంగా చనిపోలేదు ,ఒక మనిషి తప్ప .నన్ను సమీపిస్త్తున్నఈ రైలు క్రింద అనేక జీవులు ప్రమాదవశాత్తు చనిపోతున్నాయి,కాని మనిషి గా నేను మాత్రం చనిపోవాలని బలవంతంగా చనిపోతున్నాను .నేను నా కొడుకులు చదువులు కోసం మన స్టేషన్ మాస్టర్ దగ్గర 5 లక్షలు అప్పుగా తీసుకొని అప్పులు పాలయ్యాను .ఆ అప్పులు నేను చేనిపోయిన తరవాత వచ్చిన సొమ్ముతో తీర్చేమని సావిత్రికి చెప్పు భావ .ఇదే నా చివరి కోరిక, మరో జన్మ అనేది ఉంటే నీకు భావ పుట్టలన్నది నా కోరిక అని ముగించాడు సాంబయ్య .సాంబయ్య మరణ వాంగ్మూలం చదివిన రామయ్య కన్నీళ్ళు తుడుసుకుంటూ స్టేషన్ మాస్టర్ ని కలిసి జరిగిన విషయమంత చెప్పాడు .స్టేషన్ మాస్టర్ షాక్ గురవుతూ”సాంబయ్య ఎంత తెలివి తక్కువ పనిచేసాడో కదా “నా ఉద్యోగంలో చాలా స్టేషన్ లో చాలా మందిని చూసాను కాని మీవాడు లాంటివాడును చూడలేదు ,చూస్తనని కూడా అనుకోలేదు .ఎందుకో తెలిదు గాని సాంబయ్య నా మనస్సుకు చాలా దగ్గిర వాడిగా అనిపించాడు.అందుకే అతనికి 5లక్షలు అప్పుగా కాదు అబిమానం తో ఇచ్చాను .నాకు ఆ డబ్బులు అక్కరలేదుఅని అన్నారు .స్టేషన్ మాస్టర్ దగ్గర సెలవు తీసుకొని వెంటనే రామయ్య సావిత్రి కి ఫోన్ చేసి మరుసటి రోజు ఉదయంకి స్టేషన్ కు రమ్మనాడు .

                   సావిత్రి మరుసటిరోజు ఉదయం రైల్వే స్టేషన్ కు చేరుకొని అక్కడ ఉన్న రామయ్యను కలిసి అన్నయ్య ! ఉన్న ఫలంగా రమ్మన్నావ్ ఎందుకన్నయ్యా అంది .ఏమి లేదమ్మా !భావ ఎందుకు చనిపోయారో ఏమైనా తెలిసిందా ?లేదన్నయ్యా !ఇంకేమి తెలిలేదు అంది సావిత్రి .లేదమ్మా !భావ చావు విషయం లో రహస్యాలు నాకు చెప్పకుండా దాస్తున్నావ్ కాని నాకు కొన్ని విషయాలు తెలిశాయి .నీకు నేను తోడ పుట్టని వాడుననేగా చెప్పట్లేదు అంటూ కన్నీరు పెట్టుకున్నాడు రామయ్య.అన్నయ్య !నన్ను క్షమించు,నువ్వు నాకు తోడ పుట్టిన అన్నయ్య కంటే ఎక్కువ .ఏమి జరిగిందో చేబుతా విను అన్నయ్య .మీ భావ గారు (సాంబయ్య )గత నెల డిసెంబర్ 31 న ఉద్యోగ విరమణ చేస్తారనగా 29 న తేదిన నాటికి ఇంటికి వచ్చేమని హైదరాబాదులో ఉన్న ఇద్దరు పిల్లలకు ఫోన్ ద్వారా తెలియజేసాం .మా ఇద్దరు కొడుకులు 29 తేది సాయంత్రానికి ఇంటికి చేరుకున్నారు .అ రోజు రాత్రి 9 .00 గంటలకు బోజనాలు చేసిన తరవాత అప్పటి వరకు మమ్ములుగా ఉన్న మావారు కంట తడిపెట్టుకొని నా జీవితం 60.50 రూ ; జీతంతో ప్రారంభమయి ఈ రోజు 45780.00రూ ;కు చేరువైంది .ఈ నా ప్రయాణంలో ఎన్నో ఒడుదోడుకులు చూసా ,అందిరి నోట మంచి పేరు తెచ్చుకొని ఇక్కడికి వరకు వచ్చాను .ఇంకో రెండు రోజులలో నా ఉద్యోగ విరమణ అంటే చాలా బాధ గాను భయం గాను ఉంది అని అన్నారు .నాన్న మీరు ఎప్పుడు నీతి –నిమ్మకాయలు అంటు డబ్బులు ఏమి సంపాదించలేకపోయారు .తమ్ముడు నేను బాగానే చదువుకున్నాం కానీ ఏమి లాభం గత 5 సంవత్సరాలు నుండి హైదరాబాదు లో ఇద్దరం కోచింగ్ తీసుకుంటున్నాం కాని ఏ ఉద్యోగం రావట్లేదు సరికదా చదవటానికి మాలో ఓపిక కూడా నశించింది అని అన్న పెద్దోడుని చూసి అవును అన్నయ్య !నేను చాలా ఉద్యోగాలకు ఇంటర్వ్యూ కు వెళ్లాను కాని ఎవరు ఉద్యోగం ఇవ్వకపోగా నీలో స్కిల్ లేదని ఎగతాళి చేసి పొమ్మన్నారు అని చిన్నోడు అన్నాడు .మీ ప్రయత్నాలు మీరు చేస్తున్నారు ఉద్యోగం రాకపోతే అక్కడితో జీవితం అయిపోలేదు క్రొత్త త్రోవలు వెతుక్కోవాలి .ఉద్యోగం అంటే ఒక్క గవర్నమెంట్ లేదా సాఫ్ట్ వేర్ ఉద్యోగమో కాదు.ఉద్యోగం అంటే పని ,అ పనిని ఎవరు అంకిత భావంతో ,నిబద్ధతతో,మంచి విలువలతోచేస్తారో వాళ్ళు విజయవంతంగా జీవితంలో ముందుకు వెళ్తారు.కాబట్టి మీరు బాధ పడకండి మనకి 5 ఎకరాల పండించే భూమి ఉంది .పెద్దోడా !నువ్వు అగ్రికల్చరల్ B.SC చేసావ్ కాబట్టి నువ్వు పొలం సాగు పైన నీ తెలివితేటలు ఉపయోగించి మంచి పంటలు పండించు మంచిగా స్తిరపడగలవు.ఇక పోతే చిన్నోడా !నువ్వు M.B.A పాస్ అయ్యావ్ కాబట్టి నా రిటైర్మెంట్ కు వచ్చే సొమ్ము నుండి నీకో 15 లక్షలు ఇస్తాను పట్నంలో వ్యాపారం పెట్టుకొని బ్రతుకు అని మా వారు అన్నారు.నాన్న ! ఈ రోజులలో వ్యవసాయం ,వ్యాపారం అంటే ఎవరు పట్టించుకోరు .గవర్నమెంట్ ఉద్యోగం ఉంటేన సమాజంలో స్టేటస్ గా ఉంటుంది అన్న పెద్దోడును చూసి అందుకేగా మీ ఇద్దరికీ ఇంత డబ్బులు ఖర్చు పెట్టి హైదరాబాద్ లో కోచింగ్ కి పంపించం ,మీరు గవర్నమెంట్ ఉద్యోగాలు సంపాదించేవరకు మీము డబ్బులు పంపిస్తునే ఉంటాం అని నేను అన్నాను .

                 అబ్బే ! మా వాళ్ళ అయ్యే పని కాదమ్మా !అంటూ నా కొడుకులు ఇద్దరు వాళ్ళ నాన్న వైపు చూస్తూ నాన్న!మీరు మీ జీవితంలో చాలా విజయాలు సాదించి ఓ విజయవంతమయిన భర్తగా ,తండ్రిగా ,ఉద్యోగిగా పేరు తెచ్చుకున్నారు .ఇక మీరు సాదించడానికి ఏముంది .ఈ రోజు తమ్ముడు నేను రైలులో వస్తున్నప్పుడు మీ రిటైర్మెంట్ విషయం పై చర్చించుకున్నాం .మనం ఉద్యోగాలు సంపాదించలేకపోయాం గవర్నమెంట్ ఉద్యోగం లేకపోతే మనల్ని సమాజం గుర్తించదు .మన నాన్న ఈ నెల 31 వ తేది న రిటైర్ కాబోతున్నారు .నాన్న రిటైర్మెంట్ కు ముందు చనిపోతే మనలో ఒకరికి గవర్నమెంట్ ఉద్యోగం ,మరొకరికి అమ్మకి నాన్న చనిపోవడం వలన వచ్చిన పెన్షన్ డబ్బులు వస్తాయి .మన ఇద్దరి లైఫ్ లు షటిలైపోతాయి అని ఇద్దరం అనుకున్నాం అని పెద్దోడు అన్నాడు .అవును నాన్న మా ఇద్దరం దీనిపై చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నామ్ అని చిన్నోడు అన్నాడు .మా ఇద్దరు కొడుకులు నుండి ఇలాంటి మాటలు వింటామని కలలో కూడా అనుకోలేదు,వినగానే నా బుర్ర బద్ధలయినట్లుగా అయింది గట్టిగా అరిచాను .మీరా! నా కొడుకులు చీ! నా కడుపున చేడపుట్టారు.మృగ వాంఛ కలిగిన మీరు మనుషులుగా బ్రతకడానికి కూడా వీల్లేదు అంటూ మా ఇద్దరు కొడుకులను పట్టుకొని అడుగుతుండగా ,మావారు నా చేయి పట్టుకొని నన్ను బెడ్ రూంలోకి తీసుకొనిపోయి సావిత్రి ! “మనం పిల్లలని కనగలం వారి ఆలోచనలను కాదు “ వారిని వదిలే మనకు ఏమి రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది .ఆ రోజు రాత్రి ఎవరికీ నిద్రలు లేవు.సమయం రాత్రి 1.00 అవుతుంది ఎవరో మా పేరాటు లో మాట్లాడుతున్నట్లుగా ఉందని కిటికీ తెరిచి చూసా మా ఇద్దరు కొడుకులు మాట్లాడుకుంటున్నారు .అన్నయ్య!నాన్న చనిపోతరంటావా !ఇంకా రెండు రోజులే సమయం ఉంది ,నాకు చాల టెన్షన్ గా ఉంది .తమ్ముడు నువ్వేమి టెన్షన్ పడకు నాన్న తనకు తానూగా చనిపోతే మంచిది ,ఒకవేళ చనిపోకపోతే రేపు రాత్రి ఇదే టైం కి బండ రాయితో కొట్టి చంపేద్దాం అన్న పెద్దోడు మాటలను విన్న నేను కుప్పకులిపోయాను. మావారు నీళ్ళును నా ముఖం పై జల్లి లేపారు . .ఏమయ్యా ! నువ్వు కూడా విన్నావా!నువ్వు వట్టి వెర్రి బాగులోడివి ,చిన్న మనసేమి చేసుకోక నీకు నేనున్నాను ,నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు నిన్ను కాపాడుకుంటా ,నువ్వేమి త్యాగాలు చేయకు ప్రశాంతంగా ఉండండి .నేను రేపు ఈ విషయం మా అన్నయ్యకు చెప్పి ఈ సమస్య నుండి బయటపడే మార్గం తెలుసుకుంటా అని మా వారికి దైర్యం చెప్పాను .ఇంతలో వేకువు జాము 4 గంటలయింది మా వారు యధావిదిగా లేచి కాలకృత్యాలు తీర్చుకొని ,దేవుడికి  ధీపం పెట్టి క్యారేజ్ పట్టుకొని ఉద్యోగానికి బయలుదేరి ‘సావిత్రి నువ్వు జాగ్రత్త ‘అంటూ వెళ్తున్న మా వారిని చూసి నా మనసులో ఎదో కీడు శంకిస్తున్న ఇంత ఘోరం జరుగుతుందని ఉహించాలేకపోయాను తర్వాత జరిగినదంతా నీకు తెలిసిందే కాదన్నయ్య .

      సావిత్రి చెప్పినదంతా విన్న రామయ్య ఆశ్చర్యపోయి చెల్లమ్మ! ఎంటమ్మ ఇంత ఘోరం ,ఇంత మోసం ఇంత జరిగిన ఎవరికీ చెప్పవా .నేను వెంటనే పోలీస్ స్టేషన్ వెళ్లి ఆ ఇద్దరు నరరూపరాక్షసులపైన కేసులు పెడతా అంటూ ఆవేశంగా లేచాడు .అన్నయ్య ! వద్దు నా మాట విను “తన పిల్లలకు వెలుగును ఇవ్వడానికి మృత్యువు అనే చీకటిలోనికి వెళ్ళిపోయినా నా భర్త త్యాగానికి మనం ఇచ్చే విలువ ఇదేనా “, కాలం అన్నింటికీ సమాదానం చెబుతుంది అన్నయ్య ఇక నేను వెళ్లి వస్తాను ఈ విషయాలు ఎవరికీ చెప్పకు అని చేతిలో ఒట్టు వేయించుకొని వెళ్లి పోయింది సావిత్రి .ఇలా 5 సంవత్సరాలు గడిచాఒక రోజు సావిత్రి తల పైన కట్టెలు మూటతో నడుస్తూ ఊరి చివరిలో పడిపోయింది .తన చెల్లి పడిపోయిన విషయం తెలుసుకున్న సావిత్రి తోడ పుట్టిన అన్న శివయ్య పరుగు పరుగున సంఘటన స్థలాన్ని చేరుకొని చెల్లి తలను నిమురుతూ అమ్మ!సావిత్రి ఏమయిందమ్మఇలా పడిపోయావు .అన్నయ్య! నాకు బి.పి ,షుగర్ లు ఉన్నాయి కదా ,మందులు అయిపోయాయి అందుకే తల కొంచెం తిరిగి పడిపోయాను .మందులు కొనుక్కోవడానికి డబ్బులు లేక కూలి పనికి వెళ్ళాను ఇంతలో ఇలా జరిగింది .అమ్మ! సావిత్రి ఎందుకమ్మా నీకు ఈ బాధలు మన ఇంటికి వచ్చమంటే ఎందుకు మొహమాటం,నిన్ను నా కంటికి రెప్పల కాపాడుకుంటాను వచ్చే చెల్లి అన్నాడు శివయ్య .అన్నయ్య !ఆడ పిల్ల కన్నవారి ఇంటి నుండి అత్త వారి ఇంటిలో కాలు పెట్టి క్షణం నుండి ఏ అమావాస్యకో ,పున్నానికో కన్నవారి ఇంటికి వెళ్తే అందంగా ఉంటుంది .ఆడ పిల్లగా ఈ భూమి మీదకు వచ్చిన క్షణం నుండి కష్టాలు -కన్నీళ్ళు మా నీడ వలె తోడుంటాయి .చెల్లి మీద నీకున్న అపేక్షతో నువ్వు రమ్మనుటున్నావ్ కాని నేను రాలేను అర్ధం చేసికో అన్నయ్య.

                      అమ్మ!సావిత్రి మీది త్యాగాల కుటుంబం,మీయంత ఓపిక త్యాగం నాకు లేవు .మీ ఆయన ప్రాణ త్యాగం చేసి మీ పెద్ద కొడుకుకు ఉద్యోగం ఇప్పించాడు ,నువ్వు నీకు వస్తున్న పెన్షన్ సొమ్ముకు సంబందిచిన ATM CARD 5 ఏకరాల భూమిని చిన్న కొడుకుకు త్యాగం చేసావ్ .త్యాగానికి అయిన ఓ హద్దుంటుంది అది మీతి మిరితే నీలా అవుతుంది.ఇది కలి కాలం అర్ధం చేసికో చెల్లి అని శివయ్య అన్నాడు.అన్నయ్య! కాలం ఏదైనా ,యుగం ఏదైనా తల్లి తనం ఒక్కటే “కన్న ప్రేగుతో కూడిన అమ్మ తనం అందిరికి అర్ధం కాదు “.తల్లిదండ్రులుగా మేము మా పిల్లలకు ఇచ్చే ప్రతివి ప్రేమతో ,వాత్సల్యంతో ఇచ్చేవే కాని వాటిలో త్యాగాలు ఉండవు .అమ్మ! సావిత్రి నీ పిల్లలు నీ మంచి తనాన్ని గుర్తించరు, ఏది ఏమైనా నేను ఈ విషయం పంచాయతిలో పెట్టి తీరుతాను అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటూ వెళ్లి పోయాడు శివయ్య .

               శివయ్య అనుకున్నట్లుగానే మరుసటి రోజు తన మేనల్లులను ,వాళ్ళ భార్య పిల్లలను పంచాయతి మీటింగ్ కు రప్పించగలిగాడు .సర్పంచ్ గారు ముందుగా మాట్లాడుతూ అయ్యా! శివయ్య ఏంటి నీ తగువు చెప్పు అని అన్నారు .అయ్యా !సర్పంచ్ గారు మీ ముందు ఉన్న వీరిద్దరు నా మేనల్లులు ,ఈమె నా చెల్లి పేరు సావిత్రి .నా భావను చంపి తండ్రి చనిపోయిన కోటలో ఉద్యోగం సంపాదించాడు నా పెద్ద మేనల్లుడు .ఇకపోతే వీడు నా చిన్న మేనల్లుడు తల్లిని బ్లాక్ మెయిల్ చేసి నా చెల్లికి వస్తున్నా పెన్షన్ డబ్బులకు సంబందించిన ATM CARD ,5 ఏకరాల పోలంను తీసుకున్నాడు .ఈ ఇద్దరు నీచులు నా చెల్లికి చిల్లి గవ్వయిన ఇవ్వకుండా ఎవరి మానాన వాళ్ళు ఏమి పట్టనట్టుగా ఉన్నారు .నా చెల్లులు కూలి పనులు చేస్తూ బ్రతుకుతుంది .మా ఇంటికి వచ్చేమంటే తనకు ఆత్మాబిమానం అడ్డువస్తుంది .మొన్నటికి మొన్న నా చెల్లి B.P మాత్రలు లేకపోవడం వలన కళ్ళు తిరిగి పడిపోయింది .ఇటువంటి పరిస్థితిలో ఎటువంటి ఆధారం లేని నా చెల్లికి ఒక పరిష్కారం చూపించగలరని తమకు విన్నవించుకుంటున్నాను .

                   సర్పంచ్ గారు శివయ్య చెప్పినదంతా విని ,శివయ్య పెద్ద మేనల్లుడు వైపు చూసి ఏమయ్యా !మీ అమ్మను ఏమిచేయ్యలనుకుంటున్నావ్ అని అడుగుగా ,సర్పంచ్ గారు మా అమ్మకి నేనొక్కడనే కోడుకును కాను మా తమ్ముడు కూడా ఉన్నాడు వాడ్ని కూడా అడగండి అని బదులించాడు .సరి సరే మీ ఇద్దరు మీ అమ్మను ఏమిచేయ్యలనుకుంటున్నారు చెప్పండి ?అని సర్పంచ్ గారు అన్నారు .శివయ్య కలుగజేసుకొని సర్పంచ్ గారు ఈ నీచులు ఏమి చేబుతార్ సర్ మీరే ఓ మంచి నిర్ణయం తీసుకోని తీర్పుచెప్పండి .సర్పంచ్ గారు కొంచెం ఆలోచించి ,మీ అమ్మను మీఇద్దరు ఒక్కొక్కరు 6 నెలలు చొప్పున్న పోషిస్తూ ఆమె కష్టా సుఖాలు చూడవలసిందిగా తీర్పుఇచ్చారు. సర్పంచ్ గారు ఇచ్చిన తీర్పునకు వేరే దారి లేక ముభావంగా తలలు ఊపారు .ఆ మరుసటి రోజు ఉదయం నుండి మొదటి 6 నెలలు పెద్ద కొడుకు వద్ద ఉండి ఎన్నో ఛిత్కారాలు,అవమానాలతో గడిచిపింది సావిత్రి .ఒప్పందం ప్రకారం తర్వాత 6 నెలలకు గాను తన తల్లిని తీసుకొని వెళ్ళడానికి చిన్న కోడుకు కోడలు వచ్చి హైదరాబాద్ కి రైలు లో తీసుకోనివెళ్లారు .

                  ఒక రోజు ఉదయం అమ్మ! లత నాకు తల కొంచెం నొప్పిగా ఉంది నాకు కొంచెం టీ ఇవ్వమ్మా అని చిన్న కోడలను అడిగింది సావిత్రి . హ!టీ ఇవ్వక చస్తానా!ముధరస్తుపుడి చంపుకు తింటుంది .ఏ నుయ్యో!గొయ్యో!చూసుకో ,మాకేందికిల టార్చర్ పెడుతున్నావ్ అంటూ టీ ని సరాసరి సావిత్రమ్మ ముఖం పైన కొట్టింది .పాపం ముసలిది టీ వేడికి విలవిలలాడిపోయింది.ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చిన సావిత్రమ్మ చిన్న కొడుకుతో సావిత్రమ్మ మనవడు నాన్న ! ఈ రోజు అమ్మ పాపం నాన్నమ్మని తిడుతు ముఖం పైన టీ కొట్టింది ,పాపం నాన్నమ్మ ఏడ్చింది .అమ్మ! మన అమ్మమ్మను చూస్తున్నట్లుగా మన నాన్నమ్మని ఎందుకు చూడదో అర్ధం కావట్లేదు నాన్న అంటున్నా తన కోడుకును లత బర బర మని బెడ్ రూమ్ లోకి ఈడ్చుకొని వెళ్ళిపోయింది .లత ఏమైంది అనీ తన పెళ్ళానికి అడుగుగా ,లత జరిగిన విషయమంత తన భర్తకి తెలియజేసింది .ఒకే లత మన ప్లాన్ అమలుజేసే సమయం వచ్చింది .నువ్వు నిర్భయంగా పడుకో అని పెళ్ళానికి భరోసా ఇచ్చాడు సావిత్రమ్మ చిన్న కోడుకు .

                 ఆ మరుసటి రోజు ఉదయం చిన్నకొడుకు సావిత్రమ్మ దగ్గరికి టీ పట్టుకొని వెళ్లి అమ్మ! నిన్న మీ కోడలు చేసిన పనికి నన్ను క్షమించు ! అంటూ, అమ్మ ఇక్కడ ఒక మహిమ గల దేవాలయం ఉంది ,నిన్ను ఆ దేవాలయంనకు తీసుకొని వస్తానని చాలా రోజులు క్రితం మ్రొక్కుకున్న,వెళ్దాం రా అమ్మ అని ఒప్పించి చిన్న కోడుకు సావిత్రమ్మ ని కారులో దేవాలయం నకు తీసుకోని వెళ్ళాడు .అమ్మ! నువ్వు ఇక్కడే మెట్ల పైన ఉండు నేను లోపలికి వెళ్లి పూజ కోసం పంతులు గారిని కలిసివస్తాను అని చిన్నకొడుకు వెళ్ళాడు .ఉదయమై వెళ్లిన తన కొడుకు రాకపోయే సరికి 75 సంవత్సరల వయస్సు ఉన్న సావిత్రమ్మ భయపడి కొంచెం ఓపిక తెచ్చుకొని గుడి లోపల ,గుడి చుట్టూ వెతికింది కానీ చిన్న కొడుకు జాడ కనిపించలేదు.తన కోసం తన కొడుకు మెట్లపైన వెతుకుతాడేమో అని సావిత్రమ్మ గుడి మెట్లపై ఉండిపోయింది .రాత్రి 9 గంటలు కావస్తుంది కాని కోడుకు జాడ తెలియపోవడం తో ఎటు వేళ్ళలో ఏమిచెయ్యాలో తెలిక ఆ మెట్ల పైన కూర్చొని బిక్కు బిక్కుమంటూ బేల చూపులతో కుప్పకులిపోయింది సావిత్రమ్మ .ఆ మరుసటి ఉదయం మెట్ల పైన పది ఉన్న సావిత్రమ్మ ముఖం పైన అక్కడ ఉన్న ముష్టి వారు నీళ్ళు చల్లి లేపారు .ఏమ్మా! ఎవరు నువ్వు ?ఎందుకిక్కడ పడుకున్నావ్ ?అంటూ ముష్టి వారు సావిత్రమ్మకు అడుగుతున్నారు .అసలు ఏమిజరిగిందో ఏమిటిజరుగుంతుందో తెలిక అంత గందరగోళంగా ఉంది సావిత్రమ్మకు ,ఇంతలో ఒక ఆయన 500/ రూ; సావిత్రమ్మ ముందు వేచి చక చక వెళ్ళిపోతున్న వాడ్ని చూసి సావిత్రమ్మ ఆశ్చర్యపోయింది .ఆ డబ్బులు వేసే వాడు తన చిన్న కొడుకే అని గ్రహించిన సావిత్రమ్మకు తన కొడుకు బ్రతెకే ఉన్నడనే ఆనందం ఒక వైపు అయితే తన కొడుకు తనను ఒంటరిని చేసి వేల్లిపోతున్నందుకు బాధ మరో వైపు .తన కొడుకు తనని వదులించికోవడానికే ఇదంతా చేసాడని తేలుసుకొని గుండెలు బాదుకుంటూ రోదించింది సావిత్రమ్మ .సావిత్రమ్మ ముందు ఉన్న 500 /రూ; ప్రక్కనున్న ముస్తిది గభాలున లాక్కొని “ఏ తల్లి కన్న బిడ్డో గాని మన ముష్టి వాళ్లకే 500/ రూ; ఇచ్చాడంటే తన కన్న తల్లిని మహారాణిలా చూసుకుంటాడు కదా “అని అంది .అయ్యో!దేవుడా నేను ఈ వయస్సులో ఇంక్కెన్ని ఘోరాలు చూడాలి నన్ను నీ దగ్గరికి తీసుకోని వెళ్ళు స్వామీ అంటూ రోదించింది సావిత్రమ్మ .ఏయ్ నువ్వు ఏడ్చినంత మాత్రాన నీకు నేను 500/రూ ; ఇవ్వను అంది ముష్టిది .సావిత్రమ్మకు కదలడానికి ఓపిక లేక ,ఎటువెళ్ళలో తెలియక ఆ గుడి మెట్ల పైన ముష్టి వాళ్ళతో ముష్టి అడుక్కుంటూ ఉండిపోయింది .ఇలా వారం రోజులు ఎండలో ఎండుతూ ,చలిలో ముద్దవవుతూ ,ఒక రోజు ఉదయం గుడి మెట్ల పైన సావిత్రమ్మ చనిపోయంది .మునిసిపాలిటి వాళ్ళు సావిత్రమ్మ చనిపోయినట్లు సంబందిత కుటుంబ సభ్యులు తీసుకోని వెళ్ళ వలసినది గా వార్తాపత్రికలలో ,సామాజిక మాధ్యమాలలో ప్రకటన ఇచ్చారు .మునిసిపాలిటి వాళ్ళు ప్రకటన ఇచ్చి 24 గంటలయన ఎవరు స్పందించకపోయే సరికి అనాధ శవం గా భావించి మునిసిపాలిటి వాళ్ళే దహన సంస్కరణలు చేపట్టారు . తననుకని పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించిన తండ్రిని చంపి ఉద్యోగం సంపాదించిన పెద్ద కొడుకు ఒకరు అయితే తన సర్వస్వాన్ని తన కోడుకులే తుడిసేసరని తెలిసి కూడా ఏమి అనని మాతృ మూర్తిని ,గుడి మెట్ల పైన అడుక్కున్నేటట్లుగా చేసి చంపేసిన చిన్నకోడుకు ఇంకొకరు . ఈ భూమి మీదకు మనం ఎవరి వలన వచ్చాం ,ఎంత కాలం ఉంటాం ,మన పిల్లలు మనల్నికూడా ఇలాగే అనుకరిస్తారు కదా అన్న ఆలోచన మనుషులలో రానంతవరకు ఇటువంటివి జరుగుతూనేవుంటాయి .ఇక వీళ్ళద్దరికి కాలమే వాళ్ళ పిల్లల రూపంలో సమాధానం చెబుతుందని ఆశిద్దాం..


          Rate this content
Log in

More telugu story from Chinnarao Savara

Similar telugu story from Drama