స్నేహ బంధం
స్నేహ బంధం
ఒక అమ్మాయి, అబ్బాయి ల మధ్య స్నేహం ఎప్పటికీ స్నేహం కాలేదు అనే మూర్ఖపు వాదన ఉంది.
స్నేహానికి తన, పర, ఆడ, మగ, ధనిక, బీద బేధాలు ఉండవు. ఎల్లలు లేనిది స్వచ్ఛమైన స్నేహం...
లక్ష్మి, వాసు ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు... వారి స్నేహం పసి పాప బోసి నవ్వుల అంత స్వచ్చమైనది. కానీ వారి స్నేహం చూసి ప్రపంచానికి కళ్ళు కుట్టినట్లు ఉంది, వారి స్నేహం మీద తప్పుడు ప్రచారం చేయటం మొదలు పెట్టారు.
కానీ ఇద్దరూ అవేమీ పట్టించుకోకుండా అంతే స్నేహంగా ఉండేవారు. లక్ష్మి కి పెళ్ళి కుదిరింది, వాసు గురించి అంతా చెప్పింది లక్ష్మి తనని చేసుకోబోయే వాడికి. అన్ని అర్థం చేసుకున్నాను అన్నాడు అతను.
కొన్నాళ్ళు బాగానే ఉంది. పెళ్ళి తర్వాత కూడా లక్ష్మి, వాసు ఇంకా స్నేహంగా ఉండేవారు. అది చూసిన లక్ష్మి భర్తకి నచ్చలేదు. వాసు నీ లక్ష్మి కి దూరం గా ఉండమని చెప్పాడు.
మా స్నేహం ఎప్పటిదో, ఇప్పుడు మేము ఎందుకు దూరంగా ఉండాలి అని అడిగింది లక్ష్మి. ఇద్దరు స్నేహితులుగా ఉండటానికి కుదరదు అన్నాడు లక్ష్మి భర్త. తన వల్ల లక్ష్మి కి ఇబ
్బంది రాకూడదు అని దూరంగా వెళ్ళిపోయాడు వాసు.
వాసు వెళ్లిపోయిన తర్వాత కూడా లక్ష్మి కి తన భర్త నుంచి బాధలు తప్పలేదు, ఏదోఒక సూటిపోటి మాటలు అంటూ ఉండేవాడు. భర్త అయిన కూడా భార్యని అర్థం చేసుకోకుండా అనరాని మాటలు అనేవాడు.
ఈ విషయం తెలుసుకున్న వాసు, లక్ష్మి భర్తకి సర్ది చెప్పటానికి వచ్చాడు. వాసు ఎంత నచ్చచెప్పినా వినలేదు, సరికదా అతను కూడా వాసుకి, లక్ష్మి కి అక్రమ సంబంధం ఉంది అన్నాడు.
ఇక తట్టుకోలేక లక్ష్మి తన భర్త చెంప పగిలేలా కొట్టి, మా బంధాన్ని నువ్వు అర్థం చేసుకోలేవు. నీలాంటి మూర్ఖులకు స్నేహం విలువ తెలియదు అని చెప్పి వెళ్ళిపోయింది.
అప్పటి నుంచి లక్ష్మి కి ఒక తోడుగా, నీడగా, అండగా, అన్న గా, తండ్రి గా, స్నేహితుడు గా లక్ష్మి ని సాకుతూ ఉన్నాడు వాసు.
వారి బంధం పవిత్రమైనది, ఏ స్వార్థం లేనిది. లోకం ఏమనుకున్నా సరే ఒకరికి ఒకరి తోడుగా ఉండాలి అనుకున్నారు వాసు, లక్ష్మి లు... లక్ష్మి కి జీవిత భాగస్వామి లా కాకపోయినా, తన మంచి చెడులలో తోడుగా, నీడగా ఉంటున్నాడు వాసు.
అదే అసలైన బంధం.....స్నేహబంధం